శ్రీ మేధా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం

మీరు జన్మించిన తేది, సమయం, ప్రదేశం ఈ మూడు సమాచారములు మాకు తెలియచేసినచో మీ వ్రుత్తి,వ్యాపార,ఆరోగ్య,ఆర్ధిక పరిస్తితులు, దాంపత్యం, విద్య, ఉద్యోగ, వివాహ, కుటుంబవ్యవహారాలు, సంతానం, రాజకీయ వ్యవహారాలు,ప్రేమ వ్యవహారములు,కుజ దోషం, కాలసర్ప దోషం మరియు వివాహ, ఉపనయన, గృహప్రవేస, జప, హోమ, వ్రత, అన్నప్రసన, నామకరణం లకు ముహూర్తములు పెట్టబడును. P.V.RADHAKRISHNA CELL :+91 9966455872, Mail us : parakrijaya@gmail.com

31, ఆగస్టు 2012, శుక్రవారం

నవగ్రహచార ఫలములు -రవి

                    సూర్యుడు లేక రవి గ్రహము

రవి గ్రహ లక్షణాలు :
రవి పురుషగ్రహము ఇది రుచులలో కారమును, రంగులలో రక్తవర్ణమును సూచిస్తుంది. పొడుగైనవారిని, గోధుమరంగు జుట్టు కలవారిని, ఎర్రటి కనులు, పెద్దదయిన గుండ్రని ముఖము కలవారిని సూచిస్తుంది. ఇది క్షత్రియ జాతికి చెందినది. అధిదేవత అగ్ని. 50 సంవత్సరముల వయస్సుగల వారిని సూచించును. ఈ గ్రహము పిత్తము ప్రకృతిగా కలది. గ్రీష్మఋతువును సూచిస్తుంది. అగ్నితత్త్వము కలిగి తూర్పుదిక్కుకు అధిపతిగా ఉంటుంది. ఇది లోహములలో రాగిని, రత్నములలో మాణిక్యము (కెంపు) ను సూచిస్తుంది. ఈ గ్రహ సంఖ్య 1. దశమభావంలో దిగ్బలం కలుగును.
రవి కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాఢ నక్షత్రములకు అధిపతి. ఇది శరీరావయవములలో గుండె, రక్తము, పురుషుల కుడికన్ను, స్త్రీల యెడమకన్నును సూచించును. రవి సింహరాశికి అధిపతి. సింహంలో మొదటి 20 డిగ్రీలు దీనికి మూలత్రికోణము. ఇతనికి ఉచ్చరాశి మేషము. నీచరాశి తుల. మేషంలో 10వ డిగ్రీ ఇతనికి పరమోచ్చ. అలాగే తులలో 10వ డిగ్రీ ఇతనికి పరమనీచ. ఇతనికి చంద్ర, కుజ, గురులు స్నేహితులు. శని, శుక్రులు శత్రువులు. బుధుడు సముడు.
రవి ప్రభావం :
రవి ప్రభావితులకు ఆత్మాభిమానం, చురుకుదనం ఎక్కువ. ఇతరులను ఆకర్షించు గుణము కలిగియుంటారు. సంఘంలో పలుకుబడి వుంటుంది. విశాలహృదయులు. ఆవేశం ఎక్కువ. పొగడ్తలకు లొంగిపోతారు. సంపాదిస్తారు కానీ అశ్రద్ద వలన ఎక్కువ ఖర్చు చేస్తారు. నడివయస్సులో కంటి జబ్బులు రావచ్చు. ఆపత్కాలమున సరియైన ఆలోచనలు వస్తాయి. గుండెజబ్బు, వడదెబ్బ వలన ప్రమాదం కలుగవచ్చును.
రవి కారకత్వములు :
రవి ఆత్మకు కారకుడు. తండ్రి, శక్తి, అగ్ని, ప్రతాపము, ఆకాశము, తూర్పు, రాజ్యము, దేశాధిపత్యము, ముండ్లచెట్టు, మిరియాలు, మిరపకాయలు, బియ్యము, వేరుశనగ, కొబ్బరి, వాము, శివపూజ, శివభక్తులు, శివాలయములు, రక్తచందనం, సింహం, ఎలుగుబంటి, గుర్రము, సర్పము, కాకి, కోకిల, కోడి, హంస, ప్రభుత్వ కార్యాలయాలు, వైద్యులు, రిజర్వుబ్యాంకులను సూచించును. హృదయమునకు సంభందిమ్చిన వ్యాధులు, జ్వరము, మందులను సూచించును.
విమానాలు, విదేశీయులు, అసాధారణ విషయాలు, ఆందోళన, పరోపకారము, ఖగోళశాస్త్రము, అపాయసూచిక, విమానాశ్రయము, విమానచోదకవిద్య, బ్యాటరీ, భూకంపాలు, మార్పులు, విడాకులు, ఎలక్ట్రికల్ సామాను, డైనమో, బహిష్కరించుట, స్వతంత్రము, తుఫాను, రాడార్, విమానయానం, ఎలక్ట్రానిక్స్, రేడియో, టి.వి., పురాతనవస్తువులు, ఎక్సరే, విద్యుత్తు, సాంప్రదాయకరహితం, ఆదునికత, శాస్త్రవేత్తలు, నూతనభావాలు, నూతన కల్పన, ఆటంకములు, హెలికాప్టర్, హోమోసెక్సువల్, అరాఅచకము, కట్టుబాట్లను సూచించును.
రవి సూచించు విద్యలు :
రవి భౌతికశాస్త్రము, వైద్యశాస్త్రము, మేనేజిమెంటు కోర్సులు, రాజకీయ శాస్త్రములను సూచించును. రవి శుక్రునితో కలసి కంటివైద్యము ఉధునితో కలసి నరములు, చెవికి సంభందించిన వైద్యము, శనితో కలసి కార్డియాలజిస్టు, ఆర్థోపెడిక్స్, అనస్తీషియా వైద్యుడు, గురునితో కలసి ఆయుర్వేదము, కుజునితో కలసి సర్జన్ ను సూచించును.
రవి సూచించు వ్యాధులు :
అధికవేడి, జ్వరములు, ఎసిడిటీ, అల్సర్, గుండెజబ్బు, కుడి కంటికి సంభందించిన వ్యాధులు, రక్తముకు సంభందించిన వ్యాధులు, రక్తపోటులను రవి సూచిస్తుంది.
రవి సూచించు వృత్తి, వ్యాపారాలు :
రాగి, బంగారం, మందులు, రసాయనాలు, గోధుమలతో సంభందించిన వృత్తులను, ప్రభుత్వోద్యోగులను, స్థిరమైన వృత్తిని, వైద్యులను, మంత్రులను రవి సూచించును. రవి గురునితో కలసి ఫిజీషియన్ను, కుజునితో కలసి సర్జన్లను, బుధునితో కలసి రోగ నిర్ధారణకు సహాయాన్ని, గురు, శుక్రులతో కలసి మెటర్నిటీలో ప్రత్యేక శిక్షణను సూచించును. శుక్రునితో కలసి 5 లేదా 8వ స్థానంలో ఉంటే కంటివైద్యుడు, శనితో కలసి 1 లేదా 8 వ స్థానంలో ఉంటే డెంటిస్ట్, బుధునితో కలసి 5 లేదా 9వస్థానంలో ఉంటే ఇ.యన్.టి. స్పెషలిస్ట్ ను సూచించును.
రవికి మిత్రులు: చంద్ర మంగళ గురు
రవికి శత్రువు: శుక్ర శని రాహు కేతు
రవికి సములు: బుధ


ఈ బ్లాగును సెర్చ్ చేయండి



Related Posts Plugin for WordPress, Blogger...