శ్రీ మేధా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం

మీరు జన్మించిన తేది, సమయం, ప్రదేశం ఈ మూడు సమాచారములు మాకు తెలియచేసినచో మీ వ్రుత్తి,వ్యాపార,ఆరోగ్య,ఆర్ధిక పరిస్తితులు, దాంపత్యం, విద్య, ఉద్యోగ, వివాహ, కుటుంబవ్యవహారాలు, సంతానం, రాజకీయ వ్యవహారాలు,ప్రేమ వ్యవహారములు,కుజ దోషం, కాలసర్ప దోషం మరియు వివాహ, ఉపనయన, గృహప్రవేస, జప, హోమ, వ్రత, అన్నప్రసన, నామకరణం లకు ముహూర్తములు పెట్టబడును. P.V.RADHAKRISHNA CELL :+91 9966455872, Mail us : parakrijaya@gmail.com

8, అక్టోబర్ 2013, మంగళవారం

వృశ్చిక లగ్న -ద్వాదశ గ్రహములు - వాటి ఫలితాలు

సూర్యుడు :-  వృశ్చిక లగ్నంలో దశమాధిపతి కారకాధిపతి అయిన సూర్యుడు ఉన్న వ్యక్తి ఆత్మ బల సంపన్నుడు, బుద్ధి కుశలత కలిగిన వాడు, మహత్వకాంక్ష కలిగిస్తుంది. దశమాధిపతి అయిన సూర్యుడు లగ్నంలో ఉండి ప్రభుత్వ ఉద్యోగావకాశాలను కలిగిస్తాడు. తండ్రితో చక్కని ఆత్మీయమైన సంబంధాలు ఉంటాయి. కర్మాధిపతి సూర్యుని దృష్టి కారణంగా  వృశ్చిక లగ్నానికి సప్తమ భావం  అయిన వృషభ రాశి ప్రభావితమవడం వలన శృంగార, సౌందర్య రంగాలకు చెందిన వ్యాపారం వీరికి లాభిస్తుంది. అయినా జీవిత భాగస్వామితో కొంత అశాంతి ఉంటుంది కాని తల్లితో సత్సంబంధాలు ఉంటాయి.

చంద్రుడు:- వృశ్చిక లగ్నంలో చంద్రుడు భాగ్యాధి పతి మరియు త్రికోణాధిపతి కనుక శుభ ఫలితాన్ని ఇస్తాడు. చంద్రుడు లగ్నంలోమిత్ర స్థానంలో ఉండి కొంత బలం కలిగి ఉంటాడు. ఇలాంటి స్థితి ఉన్న వ్యక్తి సౌందర్యవంతుడు, ఆకర్షణీయమైన వ్యక్తిత్వం కలవాడుగా ఉంటాడు. ఇతరులను ప్రభావితం చేయగలిగి ధార్మిక చింతన కలిగి ఉంటాడు. తీర్ధాటన అందు ఆసక్తి కలిగి ఉంటారు. దయ, కరుణ గుణములు కలిగి ఉంటారు. భాగ్యస్థానాధిపతి బలం కారణంగా వీరు కార్య సిద్ధి, గౌరవ మర్యాదలు లభించగలవు. సప్తమ భావం మీద చంద్రుని దృష్టి కారణంగా సౌందర్యమూ, సుగుణము కలిగి అనుకూలమైన జీవిత భాగస్వామి లభించ గలదు. ఆరోగ్య పరంగా నడుము నొప్పి, పిత్త సంబంధిత వ్యాధులు రావచ్చు.

కుజుడు:- వృశ్చిక లగ్నంలో కుజుడు వృశ్చిక లగ్నానికి లగ్నాధిపతిగా శుభుడు కాని షష్టమ స్థానాధి పతి కనుక కొంత బలహీనుడు. అయినా శుభ ఫలితాలే అధికం. లగ్నంలో రాజ్యంలో ఉన్న గ్రహం దీర్ఘాయుష్షును ప్రసాదిస్తుంది. వీరికి శరీర మరియు మానసిక బలములు అధికం, తల్లి నుండి వీరికి సంపద లభిస్తుంది, లగ్నస్థ కుజుడు చతుర్ధ, అష్టమ, మరియు సప్తమ భాలను చూస్తాడు కనుక భూమి, భవనములు, వాహన సౌఖ్యము బలహీన పడుతుంది. తల్లితో అభిప్రాయ బేధములు ఉంటాయి. జీవిత భాగస్వామికి కష్టాలు  వైవాహిక జీవితంలో కష్టములు కలుగుతాయి.

గురువు:-  వృశ్చిక లగ్నంలో గురువు శుభఫలితాలను ఇస్తాడు. రెండవ మరియు పుత్ర స్థానాలకు అధిపతి కనుక లగ్నంలో ఉండి పరి పూర్ణ ఆత్మ విశ్వాసం, సౌందర్యము ఇస్తాడు. ఉన్నత విద్యలను అభ్యసించుట, వాక్ప్రభావం, బుద్ధి కుశలత కలిగి ఉంటారు. పొదుపు చేసే గుణం కారణంగా సుఖమయ జీవితాన్ని పొందుతారు. గురువు యొక్క పంచమ, సప్తమ మరియు నవమ దృష్టి కారణంగా పుత్ర సంతానం కలిగి ధన సంపద కలిగి అనికూల జీవిత భాగస్వామిని పొంది యోగకారకమైన జీవితాన్ని అనుభవించగలడు.

శుక్రుడు :- వృశ్చిక లగ్నంలో శుక్రుడు సప్తమ మరియు వ్యయాధిపతి అయిన కారణంగా లగ్నంలో ఉన్న ఎడల అశుభ ఫలితాలను ఇస్తాడు. శుక్రుడు ఈ లగ్నానికి అకారక గ్రహం.మానసిక అశాంతి, విలాస వంతుడు, కామప్రదుడు ఔతాడు. లగ్నం నుండి శుక్రుడు స్వరాశి అయిన వృషభమును చూస్తున్నాడు కనుక జీవిత భాగస్వామితో అభిప్రాయబేధములు ఉంటాయి. జీవిత భాగస్వామికి ఆనారోగ్యం కలిగి జీవిత బాగస్వామి నుండి హాని కలిగే అవకాశం ఉంది.  వ్యవసాయము, శృంగార సంబంధిత వ్యాపారం, సుగంధ వ్యాపారం వీరికి లాభాన్ని ఇస్తుంది.

శని :- వృశ్చిక లగ్నానికి శని తృతీయ మరియు చతుర్ధాతి పతిగా అకారక గ్రహం. శని లగ్నంలో ఉన్న అరోగ్య సమస్యలు ఉంటాయి. ప్రభుత్వరంగం నుండి కష్టములు కలుగ గలవు, ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది. శని తృతీయ, దశమ, సప్తమ భావాలను పూర్ణ దృష్టితో చూస్తాడు కనుక స్త్రీలకు అన్నదమ్ముల నుండి, పురుషులకు అక్క చెల్లెళ్ళ నుండి సహాయ సహకారాలు లభిస్తాయి. జీవిత భాగస్వామితో అభిప్రాయ బేధాలు ఉంటాయి. జీవితంలో ఒడి దుడుకులు ఉంటాయి.  స్త్రీలకు సంతానానికి కష్టములు కలిగిస్తాడు.

రాహువు:- వృశ్చిక లగ్నంలో రాహువు శారీరక సమస్యలకు ఆరోగ్యహానికి కారకుడౌతాడు. రాహుదశలో ఆరోగ్య హాని కలిగిస్తాడు. ఆత్మవిశ్వాసం కొరవడును. రాహువుకు పంచమ, సప్తమ, నవమ స్థానాల మీద దృష్టిని సారిస్తాడు కనుకవ్యాపార ఉద్యోగాలలో ఓడిదుడుకులు, జీవిత బాగస్వామితో అభిప్రాయ బేదాలు అకస్మాత్తుగా హాని కలుగ గలదు. వైవాహిక జీవితంలో కష్టాలు ప్రాప్తించ గలవు. సమాజం నుండి ప్రశంశలు పొంద గలడు.

కేతువు:- వృశ్చిక లగ్నంలో కేతువు శారీక బలం, మానసిక శక్తి, దృఢమైన శరీరం  కలిగి ఉంటాడు. సమాజంలో గౌరవ ప్రతిష్టలు ఉంటాయి. తల్లి అభిమానానికి పాత్రుడౌతాడు. తల్లి నుండి సహాయం ఆనుకూల్యం లభిస్తుంది. జీవిత బాగస్వామికి, సంతానముకు  కష్టములు కలుగ గలవు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

parakrijaya@gmail.com

ఈ బ్లాగును సెర్చ్ చేయండి



Related Posts Plugin for WordPress, Blogger...