శ్రీ మేధా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం

మీరు జన్మించిన తేది, సమయం, ప్రదేశం ఈ మూడు సమాచారములు మాకు తెలియచేసినచో మీ వ్రుత్తి,వ్యాపార,ఆరోగ్య,ఆర్ధిక పరిస్తితులు, దాంపత్యం, విద్య, ఉద్యోగ, వివాహ, కుటుంబవ్యవహారాలు, సంతానం, రాజకీయ వ్యవహారాలు,ప్రేమ వ్యవహారములు,కుజ దోషం, కాలసర్ప దోషం మరియు వివాహ, ఉపనయన, గృహప్రవేస, జప, హోమ, వ్రత, అన్నప్రసన, నామకరణం లకు ముహూర్తములు పెట్టబడును. P.V.RADHAKRISHNA CELL :+91 9966455872, Mail us : parakrijaya@gmail.com

12, అక్టోబర్ 2013, శనివారం

మీన లగ్న -ద్వాదశ గ్రహములు - వాటి ఫలితాలు

మీనలగ్నానికి అధిపతి గురువు. మీనలగ్నానికి  చంద్రుడు, కుజుడు, గురువు కారక గ్రహములు.  కనుక శుభఫలితం ఇస్తాయి.  శుక్రుడు, సూర్యుడు, శని అకారక గ్రహములు.  అశుభఫలితాలు ఇస్తారు.  మీన లగ్నంలో ర్యాది గ్రహములు ఉన్నప్పుడు కలుగు ఫలితములు దిగువున ఉన్నాయి.

సూర్యుడు :- మీన లగ్నానికి సూర్యుడు షష్టాధిపతిగా అకారక గ్రహం ఔతాడు. లగ్నంలో సూర్యుడు ఉన్న కారణంగా పరిశ్రమించే గుణం, సంపూర్ణ ఆరోగ్యం కలిగి ఉంటారు.శత్రువులకు భపడని స్వభావం, ఆత్మవిశ్వాసం, కార్యము నందు మనసు నిలిపి శ్రమించుట వీరి లక్షణాలు.  వైవాహిక జీవితంలో ఓడిదుడుకులు ఉంటాయి. సూర్యుడి సంపూర్ణ దృష్టి కారణంగా వ్యాపారం చేయాలన్న కోరిక ఉన్నా  ఉద్యోగములో సాఫల్యత లభిస్తుంది.


 చంద్రుడు :- మీన లగ్నంలో చంద్రుడు పంచమాధిపతి అయిన చంద్రుడు లగ్నంలో ఉన్న కారణంగా వ్యక్తి జీవితం శుభప్రదం , సుఖప్రదంగా ఉంటుంది. చంద్రుడు లగ్నంలో ఉన్న కారణంగా సౌందర్యవంతుడుగా, ఆకర్షణీయంగా ఉంటాడు. ఆకర్షణీయమైన మాటలు కలిగి ప్రభావశాలిగా ఉంటాడు. మధుర భాషణ, ఆత్మ విశ్వాసం వీరి సొత్తు.తల్లితో స్నేహభావం, తల్లి సహకారం ఉంటాయి. చంద్రుడు పూర్ణ దృష్టితో బుధుడి రాశి అయిన కన్యను చూస్తున్న కారణంగా జీవిత భాస్వామి , సంతాన సుఖం సంతోషం కలుగుతాయి.


కుజుడు :- మీన లగ్నానికి కుజుడు రెండవ మరియి నవమాధిపతి ఔతాడు. మీనలగ్నస్థ కుజుని కారణంగా వ్యక్తి పరాక్ర వంతుడు, శక్తి శాలిగా ఉంటాడు. మొరటుతనం, ఆధ్యాత్మికతలో ఆసక్తి వీరి స్వంతం. ఇతరులకు సహాయపడే గుణం ఉంటుంది. ధనం కలిగి ఉంటారు. ధనమును వెచ్చించుటలో కడు జాగరూకత వహిస్తారు. లగ్నస్థ కుజుడు నాలుగు, ఏడు, ఎనిమిది స్థానముల మీద దృష్టి సారించడం వలన మిత్రులు భాగస్వాముల వలన లాభపడతారు. తల్లి , తల్లితో సమానులతో స్నేహం సహకారం లభిస్తుంది.


బుధుడు :- మీనలగ్నానికి బుధుడు చతుర్ధ, మరియు సప్తమాధిపతి ఔతాడు. పరుల దూషణకు గురి ఔతారు. పరిశ్రమించే గుణం కలిగి ఉండుట బుద్ధి కుశలతతో ధనం సంపాదించుట వీరి గుణం. పితృ సంపద అంతగా లాభం లేకున్నా స్త్రీకారణంగా వచ్చే సంపద విశేషంగా లాభించగలదు. మీన లగ్నం నుండి స్వస్థానాన్ని చూస్తున్న బుధుడి కారణంగా అనుకూలమైన జీవిత భాగస్వామి లభించి వారి నుండి సహాయ సకారాలు అందుకుంటారు.  వివాహ జీవితం సుఖమయంగా ఉంటుంది.


గురువు :- మీలగ్నానికి గురువు లగ్నాధిపతి మరియు దశమాధిపతి ఔతాడు. లగ్నాధిపతి కనుక రెండు కేంద్రాల ఆధిపత్య దోషం ఉండదు. అందంగా ఆరోగ్యంగా ఉంటారు. దయాస్వభావం వినమ్రత కలిగి అత్యంత భాగ్యవంతుడుగా ఉంటాడు. ధర్మబద్ధత, ఆత్మవిశ్వాసం కలిగి ఉంటాడు. లగ్నస్థ గురువు పంచమ, మరియు సప్తమ, నవమ భావాల మీద గురువు దృష్టి సారించడం వలన సంతానం తండ్రి సహకారం అందుకుంటారు. సుఖమయమైన  వైవాహిక జీవితం అనుభవిస్తారు.


శుక్రుడు :- మీన లగ్నానికి శుక్రుడు తృతీయ అష్టమాధిపతిగా అకారక గ్రహంగా అశుభ ఫలితాన్ని ఇస్తాడు. లగ్నస్థ శుక్రుడి కారణంగా వ్యక్తి అందంగా , ఆకర్షణీయంగా ఉంటాడు. పిత్త వాత ప్రకృతి కలిగిన శరీరం. పనిలో నైపుణ్యం, పరాక్రమం, సాహసం కలిగి ఉంటారు. తల్లి నుండి సంతానం నుండి సహాయ సహకారం తక్కువ. సంతానం వలన కష్టములు కలుగుతాయి. శుక్రుడు పూర్ణ దృష్టితో సప్తమ స్థానాన్ని చూసే కారణంగా వైవాహిక జీవితంలో సాధారణ సుఖం లభిస్తుంది.


శని :- మీన లగ్నానికి శని లాభ వ్యయాధిపతిగా ఉంటాడు. లగ్నంలో శని ఉపస్థితి కారణంగా వ్యక్తి సన్నగా ఉంటాడు. స్వశక్తితో నిర్ణయించుకో లేక ఇతరుల నిర్ణయం మీద ఆధారపడతుంటారు.  శని ప్రభావం కారణంగా నేత్ర రోగస్తుడు అయ్యే అవకాశం ఉంటుంది.  వీరు స్వతంత్ర్య నిర్ణయం చేయ లేక ఇతరుల నిర్ణయం మీద ఆధారపడతాడు. షేర్లు, పందెం, లాటరీలు లాభిస్తాయి. అకస్మాత్తుగా ధనం లభిస్తుంది. లగ్నస్థ శని దృష్టి మూడవ స్థానమైన వృషభం , సప్తమ స్థానమైన కన్య మీద, దశమ స్థానమైన ధనస్సు మీద దృష్టి సారిస్తుంటాడు. మిత్రుల సహకారం లభించదు. జీవిత భాగస్వామి వలన హాని వైవాహిక జీవితంలో కష్టాలు ఉంటాయి.


రాహువు :- మీన లగ్నస్థ రాహువు వ్యక్తికి కండలు తిరిగిన శరీరం, చక్కని ఆరోగ్యం ఇస్తాడు. చతురత, సమయస్పూర్తి కలిగి ఉంటారు. వారి స్వార్ధం కొరకు  ఇతరులతో  మిత్రుత్వం  వహిస్తారు. సాహసముతో సమయస్పూత్రితో తమ కార్యములను సాధించుకుంటారు. లగ్నస్థ రాహువు పూర్ణ దృష్టితో సప్తమ స్థానం మీద దృష్టిని సారించడం వలన సంతాన విషయంలో కష్టాలు, జీవిత భాగ స్వామికి అనారోగ్యం, గృహస్థ జీవితంలో కష్టాలు కలుగుతాయి.


కేతువు :- మీన లగ్నస్థ కేతువు వ్యక్తికి అనారోగ్యం కలిగిస్తాడు. నడుము నొప్పి వాత రోగములు కలుగుతాయి. ఆత్మవిశ్వాసం తక్కువైన కారణంగా స్వయంగా నిర్ణయించుకో లేరు. కార్య సిద్ధి కొరకు సామాజిక నియమాలను అధిగమిస్తారు. కేతువు సప్తమ దృష్టి కారణంగా జీవిత భాగస్వామికి కష్టాలు ప్రాప్తించే అవకాశం ఉంటుంది. వివాహేతర సంబంధాల కారణంగా వైవాహిక జీవితంలో కలతలు ఉంటాయి. ఆర్ధిక స్థితి సాధారణంగానే ఉంటుంది.

ఈ బ్లాగును సెర్చ్ చేయండి



Related Posts Plugin for WordPress, Blogger...