శ్రీ మేధా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం

మీరు జన్మించిన తేది, సమయం, ప్రదేశం ఈ మూడు సమాచారములు మాకు తెలియచేసినచో మీ వ్రుత్తి,వ్యాపార,ఆరోగ్య,ఆర్ధిక పరిస్తితులు, దాంపత్యం, విద్య, ఉద్యోగ, వివాహ, కుటుంబవ్యవహారాలు, సంతానం, రాజకీయ వ్యవహారాలు,ప్రేమ వ్యవహారములు,కుజ దోషం, కాలసర్ప దోషం మరియు వివాహ, ఉపనయన, గృహప్రవేస, జప, హోమ, వ్రత, అన్నప్రసన, నామకరణం లకు ముహూర్తములు పెట్టబడును. P.V.RADHAKRISHNA CELL :+91 9966455872, Mail us : parakrijaya@gmail.com

30, నవంబర్ 2013, శనివారం

శని రత్నధారణ



                                
        


నీలము 

నీలాకాశంలో నీలి రంగు వెలుగొందే శని గ్రహానికి నీలరత్నమంటే ప్రీతి. అందున మహానీలము స్వచ్ఛమైన శనిగ్రహ వర్ణమే కలిగియుండుట వలన ఈ గ్రహ రత్నములకు రెండిటికి స్పర్శగుణం ప్రధానము వాయుత్వము కలిగి యుండుట వలన మహా నీల మాదిరిగా గల నీల రత్నములు శని గ్రహ సంబంధించిన రత్నములుగా పేర్కొన బడినవి. ఈ రత్నము స్త్రీ జాతికి సంభంధించినవి శరీరమునందలి పంచ ప్రాణములలో ఉదానమను ప్రాణము యొక్క లక్షణములు కలిగియున్నది. త్రిదోషములందలి వాత దోషమును తొలగించి ఆరోగ్యము నొసంగుటలో ఈ రత్నము చాలా గొప్పది. శరీరంలో జగన్మాత కాలరాత్రి యనబడే శక్తిరూపముతో అధిసించియున్న అనాహత చక్రమునందలి పసుపు, ఎరుపు, నలుపు రంగులు కాలసిన కాంతి కిరణాలు నీల రత్నానికి దగ్గర సంభంధం కలవు. అనాహత కాంతులు తమ సహజ శక్తిని కోల్పోయినప్పుడు శరీరంలో సంభవించే అలజడి అనారోగ్యాలకు నీలధారణచాలా మంచిది. నీల రత్నములోని కాంతి కిరణాలు చర్మరంద్రాల గుండా పయనించి శరీరాంతర్భాగాలలో వ్యాపించి యున్న అనాహత కాంతి కిరణాలు దీప్తిని కలిగించడం ద్వారా ఆ సంభంధమైన బాధలు అంతరించగలవు. పుష్యమి, అనూరాధ, ఉత్తరాభాధ్ర అను నక్షత్రములందు జన్మించిన వారు ఏసమయమునందైనను నీలమును ధరించవచ్చును, మిగిలిన నక్షత్రములలో ఉత్తర, ఉత్తరాషాడ, కృత్తిక నక్షత్రముల వారు తప్ప మిగిలిన అందరూ వారి వారి జన్మ జాతక గ్రహస్థితి ననుసరించి శని గ్రహం బలహీనిడై దోషప్రదునిగా నున్నప్పుడు నీల రత్నమును ధరించిన అశుభములు తొలగిపోయి శుభఫలితాలను పొంది సుఖించగలరు.
జన్మ సమయంలో ఏ ర్పడిన గ్రహములయొక్క స్థితి ననుసరించి శని గ్రహము లగ్నము నుండి 6-8-12 స్థానములందుండుట, ఆ స్థానాధిపత్యములు కలుగుట మరియు ఆ స్థానాధిపతుల యొక్క కలయిక , వీక్షణమునొందియుండుట దోషప్రదము, సప్తమ స్థానంలో బలవంతుడైన శని గ్రహము ఉన్నప్పుడు వివాహ కార్యమునకు కనేకాటంకములు కలిగి కల్యాణము కానేరదు.
పాపగ్రహములతోకూడి బలవంతుడైన శని గ్రహమునకు కోణాదిపత్యము కలిగి కేంద్రములందున్నను షష్ఠాధిపత్యముకలిగి 2-4-7-10 స్థానములందున్నను, అష్టమాధి పత్యము కలిగి 3-5-9 స్థానములందున్నను , వ్యయాధిపత్యము కలిగి 1-2-5-9-10 స్థానములందున్నను దోషప్రదుడు అట్టి సమయములలో ఆ శనిగ్రహము వక్రగమనము నందుండిన దోషమధికముగా నుందుగలదు. గోచారమునందుండి 3-6-11 స్థానములు దప్ప మిగిలిన అన్ని స్థానములు శని గ్రహానికి దోష స్థానములనే చెప్పబడ్డాయి.
జాతక, గోచారములందు స్థానాది షడ్బలములు, అష్టకవర్గ బిందుబలము కలిగిన శనిగ్రహము పాపసంభంధము అధికముగా కలిగి దుష్ఠస్థాన స్థితుడై వ్యతిరేకముగా నున్నప్పుడు, మిక్కిలి కష్టములు సంప్రాప్తించగలవు. తెలియబడని వ్యాధులు, భూత పిశాచ బాధలు, చోరాగ్నిభీతి, అవమానములు అపకీర్తి, కార్య విఘ్నము, మగోలిచారము, రాజదండన, బంధన దరిద్రము, హీనజీవితము, ఆపదలు గండములు, దీర్ఘవ్యధులు వాత ప్రకోపము, కళత్ర, పుత్ర, బంధునష్టము, మాతా పితారుల మరణము, ఋణబాధలు, దాస్యము, మొదలగు ఫలితములేగాక, మరణము కూడా సంభవించగల అవకాశములున్నవి. ఇట్టి చెడు కాలములందు ఉత్తమమైన జాతికి చెందిన ఇంద్రనీలము, మహా నీలము, నీలమణి అను రత్నములు ధరించిన యెడల శనిగ్రహ దోషములంతరించి ఆయుర్భాగ్య సంపదలు కలుగగలవు.
నీలము వల్ల కలిగే శుభయోగాలు :-
నీలమణి, మహామణి, ఇంద్రనీలము మొదలగా గల నీలరత్నములను ధరించుట వలన శరీరమునందు ఓజశ్శక్తి అభివృద్ధి జెందటమే కాకుండా నూతనోత్సాహము ధైర్యము, కార్యదక్షత కలుగగలవు. నీలము ధరించిన వ్యాపార, ఉద్యోగ, వ్యవసాయాది వృత్తులలో అనుకూలత కలిగి పురోభివృద్ది నుండగలదు. ఆదాయాభివృద్ది, ధనలాభము, సంఘమునుండి గౌరవ మర్యాదలు పెరుగుట, వివాహాది ఆటంకములు తొలగి పెండ్లి కాగలదు. మానసిక వ్యాధులు నివారింపబడి చిత్త స్థిరత్వము లభించగలదు. శనిగ్రహ దోషముచే కలుగు అనేక దుష్ఫలితాలనుంచి రక్షణ కలుగగలదు.పిత్తకోశమునందలి దోషములు, వాత ప్రకోపములవలన జనించు రోగములు, కీళ్ళ నొప్పులు, పక్షవాతము, నరముల దుర్భలత్వము, అజీర్ణ వ్యాధుల నుండి కాళ్ళు, కాళ్ళ పిక్కలకు సంబంధించిన రోగములు, త్రాగుడు, వ్యభిచారమువలన కలుగు బాధలు, ఊపిరి తిత్తుల వ్యాధులు, మందబుద్ది మొదలగు అనేక విధములైన రుగ్మతలు సమూలంగా నశింపబడి ఆరోగ్యవంతులుగాకాగలరు.యింకా బాలారిష్టములు, దృష్టిదోషములు, తాంత్రిక కృత్రిమ క్షుద్రగ్రహబాధ లంతరించగలవు. జీవితమునందు సంభవించిన పలువిధములైన గండములు తొలగిపోగలవు. అపమృత్యు దోషములంతరించి ఆయుర్దాయాభివృద్ధి కలుగగలదు.నీలము ఆధ్యాత్మికాభివృద్ధికి దోహదపడగలదు. నీలధారన వలన చిత్తచాంచల్యము తొలగి ఏకాగ్రత లభించగలదు. ఆధ్యాత్మిక జీవన ప్రగతి ఆరోహనక్రమంలో దిన దినాభివృద్ది నొందగలరని బౌద్దుల నమ్మిక. అందువల్లనే వారు జాతి నీలముకంత ప్రాధాన్యత నిచ్చుచుండెదరు. ముఖ్యముగా దరిద్ర బాధలు కష్టనష్టములు మానశిక చికాకులు రూపుమాపి సంతోషము సుఖసౌఖ్యములు, ధనధాన్యములు భాగ్యసంపదలు స్థిరమైన జీవనములు సిద్ధించగలవు.
నీలము ధరించు విధానము : దోషములేని ఉత్తమ మైన జాతినీలము పంచలోహం లేక బంగారమును దిమిడ్చి ధరించడం శ్రేష్టము ఉంగరం యొక్క అడుగుభాగం రంద్రముగా నుంచి పైభాగంలో ధను (విల్లు) ఆకారముగా తీర్చబడిన పీఠము యొక్క మధ్యభాగాన నీలంను బిగించి శుద్ధియెనర్చి షోడశోపచార పూజలు నెరవేర్చిన పిదప శుభముహూర్తములో ధరించాలి పుష్యమీ నక్షత్రముతో కూడి యున్న శనివారము త్రయోదశి తిధియందు గానీ లేక త్రయోదశీ శని వారమందుగానీ చంద్రగ్రహణము సమయమందుగానీ చిత్తా నక్షత్రము 3,4 పాదములందు గానీ శని సంచారం గల కాలంలో పూర్వాషాఢ నక్షత్రం ప్రాప్తించిన శనివారమందుగానీ (శని అస్తంగతుడు కాకయున్నప్పుడు) శనిహోర జరిగే సమయంలో గానీ ఉంగరమునందు నీలరత్నము బిగించి తదుపరి ఒక దినము గోమూత్రమునందు. రెండవదినము పంచగవ్యములందు, మూడవ దినము నల్లనువ్వులయందు ఆ ఉంగరమును అధివాసము చేయించి పంచామృతాలతో శుద్ధోదక స్నానములు చేయించి, శాస్త్రోక్తముగా షోఢశోపచార పూజలు నిర్వహించిన శుద్ది కాగలదు. ధరించెడి వారికి తారాబలం చంద్రబలములు కలిగి మంగళ, శుక్ర, శని వారములయందు శుభతిధులు కలిగియున్నప్పుడు వర్జ్య దుర్ముహుర్తాలు లేని కాలంలో వృషభ, తులా ధను, కుంభ లగ్నములందు తొలుత పూజలు జరుప బడిన ఉంగరమును ధరించవలెను. ధరింపబోవు సమయమునకు ముందు ఉంగరమును కుడిహస్తము నందుంచుకొని పడమర ముఖముగా దిరిగి నిలబడి గురువుని, గణపతిని ధ్యానించి "ఓం హ్రీం ఐం హ్రీం శ్రీం శనైశ్చరాయ నిర్మాంస శుష్క దేహాయ సర్వసిద్దిం దేహి దేహి స్వాహా" అను మంత్రమును గానీ లేక "ఓం శన్నో దేవీ రభిష్టయ అసోభవంతు పీతయే శంయోరభి స్రవంతునః" అనే మంత్రమును గానీ 108 పర్యాయాలు జపించి ఉంగరమును ముమ్మరు కనుల కద్దుకొని కుడిచేతి నడిమివ్రేలికి ధరించాలి కొందరు పెద్దలు ఎడమ చేతి నడిమి వ్రేలికి ధరించవచ్చును అని చెబుతారు కావున వారి ఆచారం ఏ ప్రకారంగా ఉంటే ఆ విధంగా నడిమి వ్రేలికి మాత్రం ధరించాలి. నీల రత్నము ఉంగరపు వ్రేలికి (అనామిక)మాత్రం ధరించకూడదు. నవరత్నములను గాక ఇతర రత్నములు చేయించుఉంగరములో నీలముతో బాటుగా కెంపులను, పచ్చలను జేర్చి ఉంగరమును ధరించకూడదు. కెంపు అవసరము గలిగి నప్పుడు కెంపు నీలము లేదా కాకి నీలమును, పచ్చల అవసరమున్నప్పుడు, మయూర నీలము ధరించిన శ్రేయస్కరముగా నుండగలదు.

నీలం
నీలం శనిగ్రహానికి సంబంధించిన రత్నం, దీనిని బ్లూ సఫైర్ అంటారు. ఒక కొరండమ్ అల్యూమినియం తాలూకు క్రిస్టలైజ్డ్ ఆక్సైడ్. ఇందులో ఇనుము, టైటానియం కలవడం వలన దీనికి నీలిరంగు వచ్చి చేరింది. అలాగే సఫైర్ ఇతరత్రా ఖనిజాలు కలిసినప్పుడు నీల రంగు కాకుండా పసుపు, గులాబి, నారింజ, పచ్చ, వయొలెట్ రంగుల్లోనూ కనిపిస్తాయి. వజ్రం తరువాత నీలం మాత్రం కఠినమైనదిగా చెప్పవచ్చును.


గరుడ పురాణోక్త నీల లక్షణాలు చూస్తే, బలాసురుడను రాక్షసుని నీలోత్పల కాంతులగు నేత్రములు సింహళ ద్వీపమందుబడెను. అవి సముద్ర తరంగ ప్రసారితాలై భూముల యందా కరములయ్యెను. ఆ నేత్రముల వలన కేతకీవనపంక్తులవలె సాంద్రములగు ఇంద్ర నీలమణులు ఉత్పన్నములయ్యెను. అందు బలరాముని వస్త్రము, ఖడ్గము, తుమ్మెద, హరిశరీరము, హరునికంఠము బోడశెనగ పుష్పములను బోలిన నీలకాంతి గల రత్నము ఆవిర్భవించెను.

నీలములలోని దోషాలు:
త్రాస: పగుళ్ళు వున్నవి;
భిన్న: కళాహీనముగా వున్నవి;
పటలం: మధ్యకు చీలినట్లుగా ఉన్నవి;
పాషాణగర్భ: లోపల ఇసుక రేణువులు వున్నవి;
మృద్గర్భ: లోపల నల్లని మట్టి వున్నవి;
రక్తబిందువు: ఎర్రటి రక్తపు చుక్కలు వున్నవి;
మలినము: కాంతి లేకుండా వున్నవి.

కెంపులు, నీలాలు రెండు కూడా కొరండమ్, అంటే ఒకే జాతి కెంపు రత్నాలుగా గుర్తించబడ్డాయి. ఐతే కెంపు ఎరుపు రంగులో మాత్రమే లభ్యమవుతుండగా, నీలం అనేక రంగుల్లో దొరుకుతున్నాయి. నీలాలు కెంపులు ఒకేవిధమైన కఠినత్వం, సాంద్రత కలిగి ఉంటాయి. మనదేశంలోని కాశ్మీర్ ప్రాంతంలోనే ఇంద్రనీలాలు ఎక్కువగా దొరుకుతున్నాయి.

హీట్ ట్రీట్ మెంట్ ద్వాటా రంగు పెంచుకున్న నీలాలు జ్యోతిష పరంగా మంచి ఫలితాలను అందించవు. ఎందుకంటే రత్నము వేడి చేస్తున్నప్పుడు దానిలోని అణునిర్మాణక్రమం తప్పిపోతుంది. అందువలన హీట్ ట్రీట్ మెంట్ ద్వారా వచ్చిన ఏ రత్నములైన జ్యోతిషపరంగా వుపయోగించకపోవడం మంచిది.

నీలాలలో రకాలు:
1. ఇంద్రనీలం: తల వెంట్రుకల వంటి నల్లని రంగు.
2. మహానీలం: భూమి మీద పెట్టినప్పుడు ఆ ప్రాంతమంతా నీలంగా కనిపిస్తుంది.
3. నీలమణి: విష్ణుక్రాంత (కృష్ణ) పుష్పాలవలె ప్రకాశించేవి

ఇందులోని మరోరకం: మయూరనీలం, నెమలి కంఠం రంగులో ప్రకాశించేది.

నీలాలు దొరికే ప్రదేశం:
ఆస్ట్రేలియా, మయన్మార్, కాశ్మీర్, శ్రీలంక, థాయ్ లాండ్, వియత్నాం, ఆఫ్గనిస్థాన్, పాకిస్థాన్, కంబోడియా గనుల్లో దొరుకుతాయి. ఈ దేశాలన్నింటిలో శ్రీలంక, ఆస్ట్రేలియాలలో దొరుకే నీలాలు 'డీప్ బ్లూ' కలర్ కలిగి వుండి, నాణ్యమైన నీలాలను అందిస్తున్నాయి.

నీలాలకు గల ఇతర నామాలు:
అశ్మ సారము, ఇంద్రనీలమణి, ఇంద్రము, ఔషదము, గల్వర్కము, జర్ ఘరము, తృణమణి నీలమణి, మాసారము, సుసారము అనే పేర్లున్నాయి.

జ్యోతిష పరంగా అనుకూలమైన వారు ధరించినపుడు, ఆ రత్నం వలన సంపద, కీర్తి, పేరు ప్రఖ్యాతులు, ఆరోగ్యం, సంతోషం, అభివృద్ధి, మానసిక ప్రశాంతత, మంచి సంతానం, ధరించిన వారికి అందిస్తుంది. మరియు దొంగల బయం నుండి, ప్రమాదాల నుండి ప్రయాణాలలో యాక్సిడెంట్స్ నుండి. అగ్నిప్రమాదాలనుండి రక్షణ కవచంలా ఉంటుంది. నీలం ధరించడం వలన రక్తశుద్ది జరగడమే కాకూడ, తలనొప్పి, వాంతులు, కళ్ళుతిరగడం తదితర అనారోగ్యాలు రాకుండా వుంటాయి. గుండె జబ్బులనుండి కాపాడుతుంది.

లక్షణాలు:
జాతి - కొరండమ్; రకాలు - బ్లూసఫైర్; వ్యాపారనామం - బ్లూ సఫైర్; దేశీయనామం - నీలం, శని, బ్లూసఫైర్, నీలి.

 రసాయన సమ్మేళనం:
Al2O3 అల్యూమినియం ఆక్సైడ్; స్పటిక ఆకారం - ట్రైగోనల్; స్పటిక లక్షణం - ప్రిస్ మ్యాటిక్, వర్ణం -నీలం, వర్ణమునకు కారణం - ఐరన్ మరియు టైటానియం; మెరుపు - విట్రియన్; కఠినత్వము -9 ధృడత్వము - గుడ్; సాంద్రత S.G – 3.99 నుండి 4.00; ఏక లేక ద్వికిరణ ప్రసారము (SR/DR)-DR; పగులు - కొంకాయిడల్ నుండి అసమానము; అంతర్గత మూలకాలు - స్పటికాలు, ద్రవ తెరలు, ఫెదర్స్, జోనల్ నిర్మాణాలు, సిల్క్; కాంతి పరావర్తన పట్టిక (R.I)-1.760 – 1.768 నుండి 1.770-1.779; UV light – జడం; సాదృశ్యాలు -స్పినల్ అక్వామెర్రైన్, కోబాల్ట్, గ్లాస్, టుర్ములిన్, ప్లాస్టిక్, కైనైట్, జోయిసైట్, కృత్రిమ సఫైర్, బోనిటోయిట్.










శనిగ్రహ దోష నివారణ

శని గ్రహ దోష నివారణకు శనిగ్రహ పూజలు,ఈశ్వర పూజ,తైలాభిషేకము,నీలమణి ధరించుట, నువ్వులు దానము చేయుట వలన గ్రహ దోష నివారణ కలుగును. నీలము, నూనె , నువ్వులు, గేదె, ఇనుము ,నల్లని ఆవులందు ఏదో ఒకటి దానము చేయవలెను. ఇనుప పాత్రయందు గల నీటిలో మినుములు, ప్రియంగు ధాన్యము,నీలగంధ,నీలపుష్పములు వేసి ఆ నీటితో స్నానము చేసిన శనిగ్రహ దోషము నివారణయగును.
శుభతిధి గల శనివారము నుండి ఓం-ఖ్రాం-ఖ్రీం-ఖ్రౌం-సః శనయేనమః అను మంత్రము 40 రోజులలో 19వేలు జపము చేసి ,41వ రోజున నువ్వులు నల్లని బట్టలో వేసి శని గ్రహ దోష నివారణ యగును. 

|| శనైశ్చరస్తవరాజః||

శ్రీ గణేశాయ నమః||
నారద ఉవాచ||
ధ్యాత్వా గణపతిం రాజా ధర్మరాజో యుధిష్ఠిరః|
ధీరః శనైశ్చరస్యేమం చకార స్తవముత్తమమ|| ౧||
శిరో మేం భాస్కరిః పాతు భాలం ఛాయాసుతోऽవతు|
కోటరాక్షో దృశౌ పాతు శిఖికణ్ఠనిభః శ్రుతీ|| ౨||
ఘ్రాణం మే భీషణః పాతు ముఖం బలిముఖోऽవతు|
స్కన్ధౌ సంవర్తకః పాతు భుజౌ మే భయదోऽవతు|| ౩||
సౌరిర్మే హృదయం పాతు నాభిం శనైశ్చరోऽవతు|
గ్రహరాజః కటిం పాతు సర్వతో రవినన్దనః|| ౪||
పాదౌ మన్దగతిః పాతు కృష్ణః పాత్వఖిలం వపుః|
రక్షామేతాం పఠేన్నిత్యం సౌరేర్నామబలైర్యుతామ్|| ౫||
సుఖీ పుత్రీ చిరాయుశ్చ స భవేన్నాత్ర సంశయః|
సౌరిః శనైశ్చరః కృష్ణో నీలోత్పలనిభః శనిః|| ౬||
శుష్కోదరో విశాలాక్షో ర్దునిరీక్ష్యో విభీషణః|
శిఖికణ్ఠనిభో నీలశ్ఛాయాహృదయనన్దనః|| ౭||
కాలదృష్టిః కోటరాక్షః స్థూలరోమావలీముఖః|
దీర్ఘో నిర్మాంసగాత్రస్తు శుష్కో ఘోరో భయానకః|| ౮||
నీలాంశుః క్రోధనో రౌద్రో దీర్ఘశ్మశ్రుర్జటాధరః|
మన్దో మన్దగతిః ఖంజో తృప్తః సంవర్తకో యమః|| ౯||orఅతృప్తః
గ్రహరాజః కరాలీ చ సూర్యపుత్రో రవిః శశీ|
కుజో బుధో గురూః కావ్యో భానుజః సింహికాసుతః|| ౧౦||
కేతుర్దేవపతిర్బాహుః కృతాన్తో నై‌ఋతస్తథా|
శశీ మరూత్కుబేరశ్చ ఈశానః సుర ఆత్మభూః|| ౧౧||
విష్ణుర్హరో గణపతిః కుమారః కామ ఈశ్వరః|
కర్తా హర్తా పాలయితా రాజ్యభుగ్ రాజ్యదాయకః|| ౧౨||orరాజ్యేశో
ఛాయాసుతః శ్యామలాఙ్గో ధనహర్తా ధనప్రదః|
క్రూరకర్మవిధాతా చ సర్వకర్మావరోధకః|| ౧౩||
తుష్టో రూష్టః కామరూపః కామదో రవినన్దనః|
గ్రహపీడాహరః శాన్తో నక్షత్రేశో గ్రహేశ్వరః|| ౧౪||
స్థిరాసనః స్థిరగతిర్మహాకాయో మహాబలః|
మహాప్రభో మహాకాలః కాలాత్మా కాలకాలకః|| ౧౫||
ఆదిత్యభయదాతా చ మృత్యురాదిత్యనందనః|
శతభిద్రుక్షదయితా త్రయోదశితిథిప్రియః|| ౧౬||
తిథ్యాత్మా తిథిగణనో నక్షత్రగణనాయకః|orతిథ్యాత్మకస్తిథిగణో
యోగరాశిర్ముహూర్తాత్మా కర్తా దినపతిః ప్రభుః|| ౧౭||
శమీపుష్పప్రియః శ్యామస్త్రైలోక్యాభయదాయకః|
నీలవాసాః క్రియాసిన్ధుర్నీలాఞ్జనచయచ్ఛవిః|| ౧౮||
సర్వరోగహరో దేవః సిద్ధో దేవగణస్తుతః|
అష్టోత్తరశతం నామ్నాం సౌరేశ్ఛాయాసుతస్య యః|| ౧౯||
పఠేన్నిత్యం తస్య పీడా సమస్తా నశ్యతి ధ్రువమ్|
కృత్వా పూజాం పఠేన్మర్త్యో భక్‍తిమాన్యః స్తవం సదా|| ౨౦||
విశేషతః శనిదినే పీడా తస్య వినశ్యతి|
జన్మలగ్నే స్థితిర్వాపి గోచరే క్రూరరాశిగే|| ౨౧||
దశాసు చ గతే సౌరే తదా స్తవమిమం పఠేత్|
పూజయేద్యః శనిం భక్‍త్యా శమీపుష్పాక్షతామ్బరైః|| ౨౨||
విధాయ లోహప్రతిమాం నరో దుఃఖాద్విముచ్యతే|
వాధా యాऽన్యగ్రహాణాం చ యః పఠేత్తస్య నశ్యతి|| ౨౩||
భీతో భయాద్విముచ్యేత బద్ధో ముచ్యేత బన్ధనాత్|
రోగీ రోగాద్విముచ్యేత నరః స్తవమిమం పఠేత్|| ౨౪||
పుత్రవాన్ధనవాన్ శ్రీమాన్ జాయతే నాత్ర సంశయః|| ౨౫||
నారద ఉవాచ||
స్తవం నిశమ్య పార్థస్య ప్రత్యక్షోऽభూచ్ఛనైశ్చరః|
దత్త్వా రాజ్ఞే వరః కామం శనిశ్చాన్తర్దధే తదా|| ౨౬||
|| ఇతి శ్రీ భవిష్యపురాణే శనైశ్చరస్తవరాజః సమ్పూర్ణః||

|| శనైశ్చరస్తోత్రమ్‌ ||



శ్రీగణేశాయ నమః||
అస్య శ్రీశనైశ్చరస్తోత్రస్య| దశరథ ఋషిః|
శనైశ్చరో దేవతా| త్రిష్టుప్‌ ఛన్దః||
శనైశ్చరప్రీత్యర్థ జపే వినియోగః|
దశరథ ఉవాచ||
కోణోऽన్తకో రౌద్రయమోऽథ బభ్రుః కృష్ణః శనిః పింగలమన్దసౌరిః|
నిత్యం స్మృతో యో హరతే చ పీడాం తస్మై నమః శ్రీరవినన్దనాయ|| ౧||
సురాసురాః కింపురుషోరగేన్ద్రా గన్ధర్వవిద్యాధరపన్నగాశ్చ|
పీడ్యన్తి సర్వే విషమస్థితేన తస్మై నమః శ్రీరవినన్దనాయ|| ౨||
నరా నరేన్ద్రాః పశవో మృగేన్ద్రా వన్యాశ్చ యే కీటపతంగభృఙ్గాః|
పీడ్యన్తి సర్వే విషమస్థితేన తస్మై నమః శ్రీరవినన్దనాయ|| ౩||
దేశాశ్చ దుర్గాణి వనాని యత్ర సేనానివేశాః పురపత్తనాని|
పీడ్యన్తి సర్వే విషమస్థితేన తస్మై నమః శ్రీరవినన్దనాయ|| ౪||
తిలైర్యవైర్మాషగుడాన్నదానైర్లోహేన నీలామ్బరదానతో వా|
ప్రీణాతి మన్త్రైర్నిజవాసరే చ తస్మై నమః శ్రీరవినన్దనాయ|| ౫||
ప్రయాగకూలే యమునాతటే చ సరస్వతీపుణ్యజలే గుహాయామ్‌|
యో యోగినాం ధ్యానగతోऽపి సూక్ష్మస్తస్మై నమః శ్రీరవినన్దనాయ|| ౬||
అన్యప్రదేశాత్స్వగృహం ప్రవిష్టస్తదీయవారే స నరః సుఖీ స్యాత్‌|
గృహాద్‌ గతో యో న పునః ప్రయాతి తస్మై నమః శ్రీరవినన్దనాయ|| ౭||
స్రష్టా స్వయంభూర్భువనత్రయస్య త్రాతా హరీశో హరతే పినాకీ|
ఏకస్త్రిధా ఋగ్యజుఃసామమూర్తిస్తస్మై నమః శ్రీరవినన్దనాయ|| ౮||
శన్యష్టకం యః ప్రయతః ప్రభాతే నిత్యం సుపుత్రైః పశుబాన్ధవైశ్చ|
పఠేత్తు సౌఖ్యం భువి భోగయుక్తః ప్రాప్నోతి నిర్వాణపదం తదన్తే|| ౯||
కోణస్థః పిఙ్గలో బభ్రుః కృష్ణో రౌద్రోऽన్తకో యమః|
సౌరిః శనైశ్చరో మన్దః పిప్పలాదేన సంస్తుతః|| ౧౦||
ఏతాని దశ నామాని ప్రాతరుత్థాయ యః పఠేత్‌|
శనైశ్చరకృతా పీడా న కదాచిద్భవిష్యతి|| ౧౧||
|| ఇతి శ్రీబ్రహ్మాణ్డపురాణే శ్రీశనైశ్చరస్తోత్రం సంపూర్ణమ్‌||

|| శనివజ్రపంజరకవచమ్||


శ్రీ గణేశాయ నమః||
నీలామ్బరో నీలవపుః కిరీటీ గృధ్రస్థితస్త్రాసకరో ధనుష్మాన్|
చతుర్భుజః సూర్యసుతః ప్రసన్నః సదా మమ స్యాద్ వరదః ప్రశాన్తః|| ౧||
బ్రహ్మా ఉవాచ||
శృణుధ్వమృషయః సర్వే శనిపీడాహరం మహత్|
కవచం శనిరాజస్య సౌరేరిదమనుత్తమమ్|| ౨||
కవచం దేవతావాసం వజ్రపంజరసంజ్ఞకమ్|
శనైశ్చరప్రీతికరం సర్వసౌభాగ్యదాయకమ్|| ౩||
ఔమ్ శ్రీశనైశ్చరః పాతు భాలం మే సూర్యనన్దనః|
నేత్రే ఛాయాత్మజః పాతు పాతు కణౌం యమానుజః|| ౪||
నాసాం వైవస్వతః పాతు ముఖం మే భాస్కరః సదా|
స్నిగ్ధకణ్ఠశ్చ మే కణ్ఠం భుజౌ పాతు మహాభుజః|| ౫||
స్కన్ధౌ పాతు శనిశ్చైవ కరౌ పాతు-శుభప్రదః|
వక్షః పాతు యమభ్రాతా కుక్షిం పాత్వసితస్తథా|| ౬||
నాభిం గ్రహపతిః పాతు మన్దః పాతు కటిం తథా|
ఊరూ మమాన్తకః పాతు యమో జానుయుగం తథా|| ౭||
పదౌ మన్దగతిః పాతు సర్వాంగం పాతు పిప్పలః|
అంగోపాంగాని సర్వాణి రక్షేన్ మే సూర్యనన్దనః|| ౮||
ఇత్యేతత్ కవచం దివ్యం పఠేత్ సూర్యసుతస్య యః|
న తస్య జాయతే పీడా ప్రీతో భవతి సూర్యజః|| ౯||
వ్యయ-జన్మ-ద్వితీయస్థో మృత్యుస్థానగతోऽపి వా|
కలత్రస్థో గతో వాऽపి సుప్రీతస్తు సదా శనిః|| ౧౦||
అష్టమస్థే సూర్యసుతే వ్యయే జన్మద్వితీయగే|
కవచం పఠతే నిత్యం న పీడా జాయతే క్వచిత్|| ౧౧||
ఇత్యేతత్కవచం దివ్యం సౌరేర్యన్నిర్మితం పురా|
ద్వాదశాऽష్టమజన్మస్థదోషాన్నాశయతే సదా|
జన్మలగ్నస్థితాన్ దోషాన్ సర్వాన్నాశయతే ప్రభుః|| ౧౨||
|| ఇతి శ్రీ బ్రహ్మాణ్డపురాణే బ్రహ్మ-నారదసంవాదే
శనివజ్రపంజరకవచమ్ సమ్పూర్ణమ్||

ఈ బ్లాగును సెర్చ్ చేయండి



Related Posts Plugin for WordPress, Blogger...