శ్రీ మేధా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం

మీరు జన్మించిన తేది, సమయం, ప్రదేశం ఈ మూడు సమాచారములు మాకు తెలియచేసినచో మీ వ్రుత్తి,వ్యాపార,ఆరోగ్య,ఆర్ధిక పరిస్తితులు, దాంపత్యం, విద్య, ఉద్యోగ, వివాహ, కుటుంబవ్యవహారాలు, సంతానం, రాజకీయ వ్యవహారాలు,ప్రేమ వ్యవహారములు,కుజ దోషం, కాలసర్ప దోషం మరియు వివాహ, ఉపనయన, గృహప్రవేస, జప, హోమ, వ్రత, అన్నప్రసన, నామకరణం లకు ముహూర్తములు పెట్టబడును. P.V.RADHAKRISHNA CELL :+91 9966455872, Mail us : parakrijaya@gmail.com

1, డిసెంబర్ 2013, ఆదివారం

రాహువు రత్నధారణ


                                   

     


గోమేధికము 

భూగోళానికి అనుసంధానమై నియమిత దూరాలలో పరిభ్రమించే గ్రహగోళాలు ఏడే ఐనా వాటి మధ్యలో ఛాయాగ్రాహకులుగా ప్రశిద్ధినొందిన రాహు-కేతువులనే గ్రహాలున్నట్లు పాశ్చాత్య ఖగోళ శాస్త్రవేత్తలు నిర్ణయించారు. అట్టి ఛాయాగ్రహమైన రాహువునకు, గోమేధికమునకు చాలా దగ్గర సంభంధములున్నవి. ఒక సిద్దాంతము ప్రకారం భూగోళము యొక్క కుడి ఎడమ భాగాలే రాహువు కేతువులని ప్రతీతి. అందువల్లనే భూమి యొక్క ఏ వైపు భాగం సూర్య చంద్రులకు అడ్డుగా వస్తుందో ఆ గ్రహ సంభంధిత గ్రహణం సంప్రాప్తిస్తున్నదని నవీన సిద్దాంతము. అట్టి గ్రహనకాలం పరమ పవిత్రమైనదిగా భారతీయుల నమ్మకం ఎప్పటికీ మార్పు లేనటువంటి భూమి యొక్క కుడి ఎడమల దూరం 180-0` డిగ్రీలైతే రాహువు కేతువు మధ్యగల దూరం కూడా 180-0’ డిగ్రీలే! భూమి యొక్క ఆగ్నేయ నైఋతీ భాగాలను కలిపే దక్షిణ దిక్కు రాహువైతే ఈశాన్య వాయువ్య భాగాలను కలిపే ఉత్తరదిక్కు కేతువనేది కొందరి సిద్దాంతము. రాహుగ్రహాని కదిదేవత గోమాతగా వేదములందు తెలుపబడినది. అట్టిగోమాత యొక్క మూత్రము వంటి రంగు కల్గిన గోమేధికము రాహు సంభంధమనుటలో నిస్సందేహము లేదు. కావున రాహుగ్రహ ప్రీతికరమైన గోమేధికమును ధరించుట వలన జాతక గోచారములందలి రాహు దోషాలు నివారింపబడి సకల శ్రేయోభివృద్ధి జరుగ గలదు.
ఆర్ద్ర, స్వాతి, శతభిషం జన్మనక్షత్రాలవారు ఏ సమయమునందైనను గోమేధికమురత్నమును ధరించవచ్చును. మిగిలిన నక్షత్రములవారు మాత్రం తమ జన్మ సమయమునందలి గ్రహస్థితి ననుసరించిబలవంతుడైన రాహువు దుష్టస్థానములందున్న దశాంతర్దశ కాలమునందు మాత్రమే గోమేధికము ధరించుట ఉత్తమము. ఎవరికైనను వారి జన్మ జాతక ములందు రాహువు గ్రహము షడ్భలములు అషటకవర్గ బిందుబలము కలిగి జన్మలగ్నము నుండి 6-8-12 స్థానములందున్నను, ఆ అధిపతితోకూడుట చూడబడుట, తటస్థించినను, ఆ స్థానమునందు ఇతర పాపగ్రహ దృగ్యోగవేధా సంభంధము కలిగినను రాహువు బహుదోషప్రదుడుమరియు 2-5-7 స్తానములందు పాప గ్రహ సంభంధము కలిగి రాహువున్నను, గురు సంభంధమును కలిగి ధనుర్మీన రాశులయందున్నను, గురు సంభంధమును కలిగి రాహువు వున్నను, శని కుజుల సంభంధము కలిగి జన్మలగ్నమునందున్నను, అధిక దోషప్రదుడై అపకారముల నొనర్చును, చంద్రుడు బలహీనుడై యుండగా బలవంతుడైన రాహువు నవమస్థానము నందుండిన (శుభ దృష్టి లేక )బాలారిష్టములు కలుగ చేయ గలడు.
రాహువునకు జాతకమునందలి అశుభ దశాంతర్దశలు ప్రప్తించినప్పుడు, గోచారమునందు రాహువు సంచారము దోషయుక్తమైన కాలమునందు వివిధ రూపములలో కష్టనష్టములు, ఈతి బాధలు, దారున పరిస్థితులు తటస్థించి దుఃఖప్రదముగా నుండగలదు. మరియు దుష్టగ్రహమైన రాహుగ్రహ ఫలికాలంలో కుటుంబకలహాలు, అజన విరోధములు, ఆస్తినష్టము విద్యాభంగము, వ్యాపార నష్టము, కోర్టు చిక్కులు, రోగచోరఋణబాధలు, వృత్తి ప్రతికూలత, ఆర్థిక, సామాజిక బాధలు, దెయ్యములు, ప్రయోగాదిగాగల దుష్టగ్రహ బాధలు ఆహారమునందయిష్టత ఆత్మహత్యను గూర్చి ఆలోచించుట, ఉన్మాదము, మతిబ్రమ మొదలగు మానసిక వ్యాధులే గాక కీళ్ళవాతాలు నులి పురుగులు జేరుట, కడుపులో ఏలిక పాములు విరోచనాలు (అతిసారం) లివరు, పశికర్లు, గర్భకోశంలో వాపు, కాన్సర్, కడుపునొప్పి, మలబద్దకము మెదడుకు సంభంధించిన అనేక వ్యాధులు రహస్యముగా ఆచరించే చెడుపనులు, దుష్టుల స్నేహం వలన ఆపదవలు మొదలగు అనేక కష్ట నష్టములు దుఃఖబాధలు సంభవింపగలవు.
గోమేధికము వలన కలిగే శుభయోగాలు :
ఇది రాహుగ్రహానికి సంభంధించిన రత్నమగుట వలన రాహుగ్రహ దోషములన్నింటినీ పరిహరింప జేయుటమే గాక కుటుంబసౌఖ్యము జనానుకూలత, విధ్యాభివృద్ది, కృషిలో విజయము , ఆర్ధికపుష్టి, వృత్తిలాభము, సమాజంలో గౌరవము, ఆరోగ్యము, స్త్రీమూలక ధనప్రాప్తి, ఆకస్మిక ద్రవ్య లాభము, వారసత్వపు ఆస్తిసంక్రమించుట, ఋణబాధలు తీరిపోవుట, సన్మిత్రలాభము, బందువుల ఆదరణ కల్గుట, మాతామహ వర్గీయుల ద్వారా ఉపకారము, రాజకీయ, కోర్టు వ్యవహారములందు పరిష్కారము, గంగా స్నానఫలము, దైవభక్తి స్థిరబుద్ది, సన్మానమార్గము ధనాభివృద్ది, ఆకస్మిక ప్రమాదములనుంచి, దుష్టగ్రహ పీడల నుంచి రక్షణ, శతృనాశనము, మిత్రవర్గముల వారి సహాయ సంపత్తి లభించుట, గండములు తోలగిపోవుట, దీర్ఘవ్యాధుల నుండి విముక్తి, సంపూర్ణారోగ్యము, భూగృహక్షేత్ర సంపద కలుగుట, అఖండకీర్తి, జయము క్షేమము, ఉల్లాసము కలుగగలవు.
గోమేధికము ధరించే పద్దతి : దోషములు లేని ఉత్తమ లక్షణములు గల గోమేధికము బంగారం లేక పంచలొహముల ఉంగరమునందు బిగించిధరించిన యెడల అభీష్టము చేకూరగలదు. వెండి గోమేధికమును బిగించుటకు పనికిరాదు. ఈ రత్నమును బిగించు ఉంగరముపైభాగముపై చేట ఆకారముగా పీఠము నేర్పటుగావించి అడుగుభాగం మ్కాత్రం రంద్రమునుంచి గోమేధికమును పీఠము మద్యభాగములో బిగించి శుద్ది గావించి ధరించవలెను. రాహుగ్రహస్తమైన సూర్య లేక చంద్ర గ్రహణములు సంభవించిన కాలమునందుగానీ, ఆదివారము పుష్యమీహస్తా నక్షత్ర యుక్తమైనపుడు కానీ, సప్తమీ ఆదివారము వచ్చినప్పుడుగానీ అదే విధంగా అమావాస్య ఆదివారమ్నాడుగానీ మకర సంక్రాంతి పుణ్యకలమునందుగానీ సూర్యుని హోరా జరిగే సమయమునందుగానీ శాస్త్రీయంగా తయారు చేయబడిన ఉంగరము నందు గోమేధికమును బిగించాలి. ఆ తదుపరి ఉంగరమును ఒక దినము కాకరాకు పసరయందు మరుసటిరోజు గోమూత్రము నందు మూడవదినము ఆవుపాల యందు నిద్ర గావింపజేసిన పరిశుద్దము కాగలదు. అటుపిమ్మట పంచామృత స్నానముగావింపజేసి శాస్త్రోక్తకముగా షోడశోపచార పూజలు గావింపజేసి శుభముహుర్తమునందు వ్రేలికి ధరించుట శాస్త్రీయ సమ్మతము ధరించెడి వారికి తారాబలం చంద్రబలములు కలిగియున్న శుభతిధులు కలిగియున్నప్పుడు వర్జ్య దుర్ముహుర్తాలు లేని కాలంలో మృగశిర, ఉత్తర, చిత్త, శతభిషం, ఉత్తరాభాద్ర నక్షత్రములయందు వృషభ, మిధున, సింహం కుంభలగ్నములు జరుగు సమయములందు పూజించిన ఉంగరమును ధరించవలెను ధరింపబోవు సమయమునకు ముందు ఉంగరమును కుడిహస్తము నందుంచుకొని దక్షిణ ముఖముగా తిరిగి నిలబడి గురువుని, గణపతిని ధ్యానించి "ఓం భ్రీం ఐం హ్రీం శ్రీం తమోగ్రహాయ స్వాహా" అను మంత్రమును 108 పర్యాయాలు జపించి ఉంగరమును ముమ్మరు కనుల కద్దుకొని కుడిచేతి ఉంగరపు(అనామిక) వ్రేలికి ధరించాలి. స్త్రీలు ఎడమ వ్రేలికి ధరించుట ఆచారము గలదు. నవరత్నములను గాక ఇతర రత్నములు చేయించుఉంగరములో గోమేధికముతో బాటుగా ముత్యాలను, వైడూర్యములు జేర్చి ఉంగరమును ధరించకూడదు.

గోమేధికం
ఈ రత్నం "రాహు" గ్రహానికి సంబంధించినది. ఇది ఇన్ ఆర్గానిక్ జెమ్ స్టోన్. ఇవి మంచి తేనె రంగులో మెరిసిపోతుంటాయి. మంచి గోమేధికాలకు శ్రీలంక ప్రసిద్ది. బంగారు రంగులలోనూ గోమేధికాలు దొరుకుతాయి. గోమేధికాన్ని ఇంగ్లీషులో 'హెసోనైట్' అంటారు.

“గోమేధిక మణి నిర్మల
గోమూత్ర ఛాయ జాల కొమరై మేనన్
బ్రేమ ధరింపగ నురుజయ
దామంబగు నిఖిల సౌఖ్యదాయక మగుచున్"
తా: గోమేధికము పరిశుభ్రమగు గోమూత్రచ్ఛాయతో విరాజిల్లు చుండును. దీనిని ధరించిన వారలకు మిక్కిలి జయమును, సర్వ సౌభాగ్యములును కలుగుచుండును.

గోమేధికమునకు అధికమగు వేడిమిని తాకినప్పుడు భారము తగ్గిపోవును. బ్రూస్టన్ అనే శాస్త్రవేత్త సూక్ష్మదర్శినితో పరిశీలించి చిన్న చిన్న గుంటలు ఒక విధమైన ద్రవ పదార్ధాల వలన ఏర్పడినవని, ఇవి కాలువలుగా ఏర్పడు కాంతిని ప్రకాశింపజేస్తున్నాయని కనుగొన్నారు.


గోమేధికములలో తెలుపు కాంతి గలది బ్రాహ్మణ జాతి, ఎరుపు రంగు కలది క్షత్రియ జాతి, ఆకుపచ్చరంగు గలది వైశ్య జాతి, నలుపు రంగు గలది శూద్రజాతి.

గోమేధికంలో దోషాలు:
మల: కాంతిలేకుండా మలినాలుగా వున్నవి
బిందు: లోపల మచ్చలు వున్నవి
రేఖ: చారల మచ్చలు వున్నవి
త్రాశ: బీటలు వుండి ముక్కలుగా విరిగిపోయి వున్నవి
కాకపదము: కాకి పదము వంటి నల్లని గీతాలు వున్నవి.

భారతదేశంలో ఒరిస్సా, గయా ప్రాంతాలలో ఇవి దొరుకుతున్నాయి. పరిమితం గానేనైనా హిమాలయ ప్రాంతం లోనూ ఇవి లభిస్తాయి. అల్యూమినియం, కాల్షియం, సిలికేట్ లను ఉపయోగించి డూప్లికేట్ రత్నాలను తయారు చేసే కర్మాగారాలలో అత్యధిక పీడనంలో వీటిని తయారు చేస్తున్నారు.

గోమేధికం ఇతర నామాలు:
గోమేధికం, గోమేధము, గోమేదము, గోమేదమణి. గోమేధికాన్ని ధరించడం వలన సంపద, విజయం, సంతోషం, అభివృద్ధి, సంతానం, కీర్తి ఆరోగ్యం, మంచి స్థితి, పొడగ్తలు లభిస్తాయని జ్యోతిష శాస్త్రం చెపుతుంది. గోమేధికం ధరించడం వలన శత్రువులను జయించగలుగుతామని, శత్రుత్వం నాశం అవుతుందని ఎక్కువగా నమ్ముతారు. అందువల్లే పూర్వకాలంలో మహారాజులు యుద్ధరంగానికి వెళ్ళేటప్పుడు గోమేధికం ధరించేవారట.

అల్ట్రావయిలెట్ అనేది అతి చల్లని కలర్. రే జ్వరం, అజీర్ణం, విపరీతమైన వేడి, గ్యాస్ట్రిక్ ట్రబుల్ తదితర అనారోగ్యాలకు ఈ రంగు కిరణాన్ని ఔషధంగా ఉపయోగిస్తారు.

లక్షణాలు:
జాతి - గార్నెట్; రకాలు - గ్రాన్యులర్, గోమేధికం, సావోరైట్; వ్యాపారనామం - సినమన్ స్టోన్, గోమేధికం; దేశీయనామం - గార్నెట్.

రసాయన సమ్మేళనం:
Ca3Al2(SiO4)3 అల్యూమినియం సిలికేట్; స్పటిక ఆకారం - క్యూబిక్; స్పటిక లక్షణం - డొడెకా హైడ్రల్ , వర్ణం -బ్రౌనిష్ ఎల్లో, పసుపు, ఆకుపచ్చ; వర్ణమునకు కారణం - క్రొమియం, వెనేడియం, మాంగనీస్; మెరుపు - విట్రియన్; కఠినత్వము --7.25 ధృడత్వము - గుడ్; సాంద్రత S.G – 3.36 – 3.57, 3.65, 3.57, -3.65 ఏక లేక ద్వికిరణ ప్రసారము (SR/DR)-SR; పగులు -శంకు ఆకారం; అంతర్గతమూలకాలు - చిన్న స్పటికాల గుత్తి, దీని వల్ల ,మనకు వేడి తరంగాలు కనిపిస్తాయి, ఫైబర్స్, నీడిల్స్, స్పటికాలు కనిపిస్తాయి. కాంతి పరావర్తన పట్టిక (R.I)-1.70 – 1.73, 1.74- 1.748, 1.739-1.744; UV light – జడం; సాదృశ్యాలు -స్పినల్ జిర్కాన్, అపటైట్, టుర్ములిన్, ఎమరాల్డ్.








రాహు గ్రహ దోష నివారణ

రాహు గ్రహ దోష నివారణకుగాను రాహుగ్రహమును పూజించుట,దుర్గాదేవిని పూజించుట,గోమేధికమును ధరించుట వలన రాహుగ్రహదోషనివారణ యగును,గోమేధ్కము,గుర్రము,నీలవస్త్రము,కంబళి నూనె, మినుములు, పంచలోహములు, వీటియందేదైన దానము చేయుట వలన కూడా దోష శాంతి కలుగును. గేదె కొమ్ముతో చేసిన పాత్రయందలి ఉదకమున గుగ్గిలము,ఇంగువ,హరిదళము,మనశ్శిలలతో కలిపి ఆ నీటితో స్నానముచేసిఅన్చో రాహుదోషము తొలగును.పంచలోహములతో చేసిన ఉంగరము ధరించుట సాంప్రదాయం.
శుభతిధి గల శనివారము నాడు రాహుమంత్రమగు ఓం-భ్రాం-భ్రీం-భ్రౌం-సః రాహవే నమః అను మంత్రమును 40 రోజులలో 18 వేలు జపము పూర్తి చేసి ,41వ రోజున మినుము చల్లని బట్టలో వేసి దానం చేసినచో రాహుగ్రహ సంభంధమైన దోషం తొలగిపోవును. 



|| రాహుస్తోత్రమ్||

శ్రీ గణేశాయ నమః|
రాహుర్దానవమన్త్రీ చ సింహికాచిత్తవన్దనః|
అర్ధకాయః సదాక్రోధీ చన్ద్రాదిత్యవిమర్దనః|| ౧||
రౌద్రో రుద్రప్రియో దైత్యః స్వర్భానుర్భానుభీతిదః|
గ్రహరాజః సుధాపాయీ రాకాతిథ్యభిలాషుకః|| ౨||
కాలదృష్టిః కాలరూపః శ్రీకణ్ఠహృదయాశ్రయః|
విధున్తుదః సైంహికేయో ఘోరరూపో మహాబలః|| ౩||
గ్రహపీడాకరో దంష్ట్రీ రక్తనేత్రో మహోదరః|
పఞ్చవింశతినామాని స్మృత్వా రాహుం సదా నరః|| ౪||
యః పఠేన్మహతీ పీడా తస్య నశ్యతి కేవలమ్|
ఆరోగ్యం పుత్రమతులాం శ్రియం ధాన్యం పశూంస్తథా|| ౫||
దదాతి రాహుస్తస్మై యః పఠతే స్తోత్రముత్తమమ్|
సతతం పఠతే యస్తు జీవేద్వర్షశతం నరః|| ౬||
|| ఇతి శ్రీస్కన్దపురాణే రాహుస్తోత్రం సమ్పూర్ణమ్||


|| రాహుకవచమ్||

శ్రీగణేశాయ నమః|
ప్రణమామి సదా రాహుం శూర్పాకారం కిరీటినమ్|
సైంహికేయం కరాలాస్యం లోకానామభయప్రదమ్|| ౧||
నీలామ్బరః శిరః పాతు లలాటం లోకవన్దితః|
చక్షుషీ పాతు మే రాహుః శ్రోత్రే త్వర్ధశరిరవాన్|| ౨||
నాసికాం మే ధూమ్రవర్ణః శూలపాణిర్ముఖం మమ|
జిహ్వాం మే సింహికాసూనుః కణ్ఠం మే కఠినాఙ్ఘ్రికః|| ౩||
భుజఙ్గేశో భుజౌ పాతు నీలమాల్యామ్బరః కరౌ|
పాతు వక్షఃస్థలం మన్త్రీ పాతు కుక్షిం విధున్తుదః|| ౪||
కటిం మే వికటః పాతు ఊరూ మే సురపూజితః|
స్వర్భానుర్జానునీ పాతు జఙ్ఘే మే పాతు జాడ్యహా|| ౫||
గుల్ఫౌ గ్రహపతిః పాతు పాదౌ మే భీషణాకృతిః|
సర్వాణ్యఙ్గాని మే పాతు నీలచన్దనభూషణః|| ౬||
రాహోరిదం కవచమృద్ధిదవస్తుదం యో భక్త్యా పఠత్యనుదినం నియతః శుచిః సన్|
ప్రాప్నోతి కీర్తిమతులాం శ్రియమృద్ధిమాయురారోగ్యమాత్మవిజయం చ హి తత్ప్రసాదాత్|| ౭||
|| ఇతి శ్రీమహాభారతే ధృతరాష్ట్రసఞ్జయసంవాదే ద్రోణపర్వణి రాహుకవచం సమ్పూర్ణమ్||

ఈ బ్లాగును సెర్చ్ చేయండి



Related Posts Plugin for WordPress, Blogger...