శ్రీ మేధా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం

మీరు జన్మించిన తేది, సమయం, ప్రదేశం ఈ మూడు సమాచారములు మాకు తెలియచేసినచో మీ వ్రుత్తి,వ్యాపార,ఆరోగ్య,ఆర్ధిక పరిస్తితులు, దాంపత్యం, విద్య, ఉద్యోగ, వివాహ, కుటుంబవ్యవహారాలు, సంతానం, రాజకీయ వ్యవహారాలు,ప్రేమ వ్యవహారములు,కుజ దోషం, కాలసర్ప దోషం మరియు వివాహ, ఉపనయన, గృహప్రవేస, జప, హోమ, వ్రత, అన్నప్రసన, నామకరణం లకు ముహూర్తములు పెట్టబడును. P.V.RADHAKRISHNA CELL :+91 9966455872, Mail us : parakrijaya@gmail.com

31, ఆగస్టు 2014, ఆదివారం

రాశ్యాభి వర్ణనము

ఉచ్ఛ నీచ రాశులు

  1. సూర్యునకు ఉచ్ఛ రాశి మేషము. అలాగే నీచరాశి దానికి ఏడవ స్థానంలో ఉన్న తులారాశి.
  2. చంద్రుడికి ఉచ్ఛ రాశి వృషభము. నీచరాశి దానికి ఏడవ స్థానంలో ఉన్న వృశ్చికము.
  3. కుజుడికి ఉచ్ఛ రాశి మకరము. నీచ రాశి దానికి ఏడవ స్థానంలో ఉన్న కటకము.
  4. బుధుడికి ఉచ్ఛరాశి కన్య. నీచ రాశి దానికి ఏడవ స్థానం ఉన్న మీనము.
  5. గురువుకు ఉచ్ఛ రాశి కటకము. నీచ రాశి దానికి ఏడవ స్థానంలో ఉన్న మకరము.
  6. శుక్రుడికి ఉచ్ఛ రాశి మీనము. నీచ రాశి దానికి ఏడవ స్థానంలో ఉన్న కన్య.
  7. శనికి ఉచ్ఛ రాశి తుల. నీచ రాశి దానికి ఏడవ స్థానంలో ఉన్న మేషము.
పురుష రాశులు :- మేషము, మిధునము, సింహము, తుల, ధనస్సు, కుంభము.
స్త్రీరాశులు :- వృషభము, కటకము, కన్య, వృశ్చికము, మకరము, మీనము.

ఎరుపు వర్ణ రాశులు :- మేషము, సింహము, ధనస్సు.
నలుపు :- మకరము, కన్య, మిధునము.
పసుపు :- వృశ్చికము, కుంభము, మీనము.
తెలుపు :- వృషభము, కటకము, తుల.

బ్రాహ్మణ జాతి :- వృషభము, తులా, వృశ్చికము, మీనము.
క్షత్రియ జాతి :- మేషము, సింహము, ధనస్సు.
వైశ్యజాతి :- ముధునము, కుంభము.
శూద్రజాతి :- కటకము, కన్య, మకరములు.రాశులు 

దిక్కులు :-
తూర్పు దిక్కు :- మేషం, వృషభం, మిధునములు.
దక్షిణం దిక్కు :- కటకం, సింహం, కన్య.
ఉత్తర దిక్కు :- తులా, వృశ్చికం, ధనస్సులు.
పడమర దిక్కు :- మకరం, కుంభం, మీనం.

చరరాశులు:- మేషము, కటకము, తులా, మకరములు.
సమరాశూలను ఓజ రాశులు అంటారు.

30, ఆగస్టు 2014, శనివారం

న్యూమారాలజీ (సంఖ్యాశాస్త్రము)


ఈ సంఖ్యాశాస్త్రము సర్వజనసమ్మతమ్తెనది. శాస్త్రజ్ఞులు, పండితులు తమ అమేయమేధాసంపత్తితో మనందరికీ ఈ శాస్త్రమును అందించబడటం జరిగినది సాధారణాంగా అంకేలు తోమ్మిది. అవి వరుసగా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9.
సంఖ్యాశాస్త్రములో వీటినే ప్రమాణాముగా తీసుకున్నారు. ఈ సంఖ్యలే ప్రపంచములోని ప్రతి వ్యక్తి యొక్క జీవితముప్తే తమ తమ ప్రభావాన్ని చూపుతాయి. వారి యొక్క భవితను సూచించేవి కూడ ఈ సంఖ్యలే.
ఈ సంఖ్యశాస్త్రము మనిషియొక్క గుణగణాలను, విద్యావిధానము, జీవితస్థిరత్వము. ఆర్థిక స్తోమత, జీవిత ఏదుగుదల, వ్యక్తుల యొక్క పరస్పర సహాకారము, ఏయే ఏయే రంగాలలో వ్యక్తులకు అనుకూల ఫలితాలు ఉంటాయో సంఖ్యశాస్త్రము వివరలను తేలుపుతుంది. సానుకూల ఫలితాలను అందించడము మరియు దోషలకు చక్కని నివారణ ఉపాయములను సూచిస్తుంది.
వ్యక్తి యొక్క పేరు సానుకూలతలు మార్పులు, చిన్నపాటి సవరణాల ద్వారా అనుకూల ఫలితాలు ఈ సంఖ్యశాస్త్రము వివరాలను అందించబడుతుంది.
తెలుగు అక్షరమాల
అ----క--ట--ప--య-------------౦1
ఆ--ఎ--ఖ--ఠ--ప--ర-----------02
ఇ--ఏ--గ--డ--బ--ల------------౦౩
ఈ--ఐ--ఘ--ఢ--భ--వ----------04
ఉ--ఒ--జ--ణ--మ--శ------------05
ఊ--ఓ--చ--త--ష---------------06
ఋ--ఔ--ఛ--థ--స-------------07
ఋ---జ--ద--హ-----------------08
ఝ--ధ--క్ష-------------------09
అదృష్టసంఖ్య:-౦1 
ఏ సంవత్సరంలోన్తెన 01,10,19,28 తేదీలలో జన్మించిన స్త్రీ,పురుషులందరు ఒకటవ నెంబరు వ్యక్తులవుతారు. దీనికీ అధిపతి సూర్యుడు. కావున రవి గ్రహ వ్యక్తులుగా పరిగణిఓఅపబడతారు. అమంచిచురుకుధనము, మాటలచాతుర్యము, దృఢనిర్ణయాలు, పట్టుదల కలిగిఉంటారు. వీరికిఅధికారదహం ఏక్కువ ఏంతటివారిన్తెనస్నేహం చేసుకుంటారు. వీరు అనుకున్నపనిని సాధించేతత్వం ఉంటుంది. ఉన్నతమ్తెనఆలోచనలతో ఉన్నతంగా ఆలోచించేతత్వం కలిగి ఉంటారు.
అదృష్టసంఖ్య:-౦2
 ఏ సంవత్సరంలోన్తెన 02,11,20,26 తేదీలలో జన్మించిన స్త్రీ,పురుషులందరు రేండవ నెంబరు వ్యకులుగా పరిగణించబడతారు. వీరికి చంద్రడు అధిపతి వీరు ప్రేమస్వరూపపులుగా,చంచలస్వభావులుగా ఉంటారు. ప్రతి వ్యవహారానికి ఇతరులప్తె ఆధారపడతారు. వీరుస్వతహాగా మంచి నీతి-నీజాయితీ పరులుగా ఉంటారు. వీరు మంచి ఊహాశక్తి గలవారుగా ఉంటారు. వివిధ లలిత కళలయందు ప్రవీణ్యాం ఉంటుంది. ధ్తేర్యంలేక పిరికివార్తెఏపనిచేయలేరు. వీరు నిర్మొహమాటంగా మాట్లాడతారు. మంచిసృజనాత్మకతంగా ఆలోచనాలు చేస్తారు. మంచి ఓర్పుకలిగి ఉంటారు. చక్కని చిరునవ్వుతో వ్యవహారాలను చక్కబేట్టాగలరు.
అదృష్టసంఖ్య:-౦౩
ఏ సంవత్సరంలోన్తెన 03,12,21,30 తేదీలలో జన్మించిన స్త్రీ,పురుషులందరు ౩వ నెంబరుకు గురుడు అధిపతి. వీరు ప్రతి రంగంలో రాణిస్తారు. స్వయం కృషితో ప్తెకివచ్చి ఉన్నత శిఖరాలను అందుకోగలరు. ఇతరులప్తె అజామాయిషి చెలాయించగలుగుతారు. వీరు మిక్కిలి ఆత్మాభిమానం కలవారు. ఏలాంటి సమాస్యల్తెనా పరిష్కరించగలుగుతారు. ద్తెవభక్తి, మంచి తేలివితేటలు కలిగి ఉంటారు. వీరుస్వేచ్చజీవులుగా ఉండగలుగుతారు. వీరు ఊహశక్తితో ఏలాంటి పనిని అయిన చక్కబేట్టగలరు.
అదృష్టసంఖ్య:-౦4
ఏ సంవత్సరంలోన్తెన 04.13,22,31 తేదీలలో జన్మించిన స్త్రీ,పురుషులందరు నాల్గవ నెంబరుకు రాహువు అధిపతి నాల్గవ సంఖ్య వ్యక్తులు ఏక్కడవున్న ప్రత్యేకంగా ఉంటారు. వీరి మనస్తతత్వం ఆలోచనలు అన్నీ సామాన్యులకంటే అతీతంగాను విభీన్నంగా ఉంటాయి. వీరు చక్కని వాక్పటిమ గలవారుగా వుంటాయి.
విపరీతమ్తెనకొంగ్రొత్త ఆలోచనలు చేస్తారు. ఆచార-వ్యవహారాలప్తె మక్కువ తక్కువ. వీరు స్వతింత్రించి నిర్ణయాలను తీసుకుంటారు. శక్తికి మించిన ఆలోచనలు,పనులు చేపడతారు. జాలీ,దయ, కరుణా మున్నగు మంచి లక్షణాలు ఏక్కువగా ఉంటాయి.
అదృష్టసంఖ్య:-౦5
ఏ సంవత్సరంలోన్తెన 05,14,25,తేదీలలో జన్మించిన స్త్రీ,పురుషులందరు ఐదవనెంబరుకు అధిపతి బుధుడు. వీరు సామాన్యంగా పోట్టిగా బలీష్టంగా ఉంటారు. స్వేచ్ఛ-స్వతంత్ర్య భావాలు కలిగిన వ్యక్తులుగా పరిగణింపబడతారు. ఏవరితోన్తెనా ఇట్టేస్నేహంచేయగలరు.వ్యాపారదక్షత,కఠినపరిశ్రమ,అఖండమ్తెనఊహాశక్తి, వ్యవహారాదక్షత మున్నగు లక్షణాలు కలిగి ఉంటారు. ఉత్సాహము, నేర్పు,చక్కని హాస్యచతురత ఉండును. కుటుంభజీవితముపట్ల మొజు అధికము. డబ్బు కోసం ఏపని అయిన చేస్తారు. అంకితభావం. ఇతరులను ఉత్తేజితులను చేయగలరు.
అదృష్టసంఖ్య:-౦6
ఏ సంవత్సరంలోన్తెన 06,15,24,తేదీలలో జన్మించిన స్త్రీ,పురుషులందరు ఈ నెంబరుకు అధిపతి శుక్రుడు వీరికి అందం, అలంకారప్రాయమ్తెన వస్తువుంటే విపరీతమ్తెనా మొజు, వీరికి ఇతరులను ఆకర్షించే శక్తిని కలిగి ఉంటారు. సంఘములో మంచి జనాదరణ కలిగి ఉండును. వీరు ఏదోఓక కళలో నిష్ణాతులుగా ఉంటారు. వీరు ధనాన్ని అధికంగా ఖర్చుపేట్టే స్వభావాన్ని కలిగిఉంటారు, నిష్కల్మషమ్తెన మనస్సును కలిగి ఉంటారు. వీరికి స్నేహతులు అధికము. హాస్యచతురత, విశాలహృదయం, ఆచారవ్యవహారాలను, కట్టుబాట్లను గౌరవిస్తారు. వీరుప్రకృతి సౌందర్యారాధకులుగా ఉంటారు.
అదృష్టసంఖ్య:-౦7
ఏసంవత్సరంలోన్తెన 07,16,25,తేదీలలో జన్మించిన స్త్రీ,పురుషులందరు ౭వ సంఖ్యకు అధిపతి కేతువు. వీరు మిక్కిలి స్వతంత్రులు, స్వశక్తి మీదనే పూర్తిగా నమ్మకము గలవారు. ఓటమిని అంగీకరించలేరు. ఏక్కువగా చదవి విశేషపరిజ్ఞానాన్ని సంపాదించగలరు. సోంతంగా ఏద్తెనా పనిని ప్రారంభించి పూరి చేయుటకు ప్రయత్నీస్తారు. వీరు కళల పట్ల మంచి అభిరుచిని కలిగి ఉంటారు. వీరు కష్టలను తట్టుకోలేరు. ఎగుమతి-దిగుమతి వ్యాపారాలయందు మంచి నేర్పు సాధించగలరు.
అదృష్టసంఖ్య:-౦8
ఏ సంవత్సరంలోన్తెన 08,17,26,తేదీలలో జన్మించిన స్త్రీ,పురుషులందరు ఈ సంఖ్యకు అధిపతి శని ఏనిమిదవ సంఖ్యకలిగిన వ్యక్తులు క్రమశిక్షణ, నిదానము, నిలకడ, దృఢత్వము, వినయ-విధేయతలు మున్నగు లక్షణాలతో ఉందురు. వీరికి శాస్త్రీయ సంగీతం అంటే మోజు అధికము. ఎక్కువ మంది ఓంటరితనాన్ని గడుపుతారు. శక్తియుక్తులు,తేలివి-తేటలతో సమాజాన్ని విస్మయపరుస్తారు. వీరికి పని పట్ల ఏక్కువ శ్రద్దను కలిగి ఉంటారు. విశ్లేషణ, నాస్తికత, సృజనాత్మకత, ఉత్పాదకత అధికారములను కలిగియుందురు.
అదృష్టసంఖ్య:-౦9
 ఏ సంవత్సరంలోన్తెన -9,18,27,తేదీలలో జన్మించిన స్త్రీ,పురుషులందరు ఈ సంఖ్యకు అధిపతి వీరు చాలా స్వతంత్రభావాలు కలిగిన వ్యక్తులు. పనిలోను, ప్రవర్తనలోను వీరి యెక్క స్వతంత్ర విశదమగును. వీరు తమ భావాలను నిర్మొహమాటంగా వ్యక్తికరించే స్వభావులు. కాని వీరి హృదాయం చాలా సున్నితమ్తెనది. నియమనిభంధనలంటే ఇష్టం ఉండదు. వీరు ఆపజయాన్ని ఏరుగని జాతకులు. ప్రతికూల సమయాలలో పనులను చక్కబెట్టకోగలరు. స్నేహితులకోసం ఏంతటి త్యాగాలక్తెనా సిద్దపడతారు. వీరి పద్దతంతా విజయమో, వీరస్వర్గమో అన్నట్లుఉంటుంది.
వ్యక్తులకు సంభంధించిన అదృష్టసంఖ్యలకు,ఆర్దికము,వ్యాపారాభివృద్ధి, ఆరోగ్యము,విద్య, అదృష్ట సంవత్సరాలు,అదృష్టతేదీలు అనుకూల సమయములకు సంభందించిన పూర్తి సమాచారము కోసం, సందేహాలు, సలహాల కోసం వ్యక్తిగతంగా సంప్రదించగలరు.

  శ్రీ మేథా దక్షిణామూర్తి జ్యోతిషనిలయం - పి.వి.రాధాకృష్ణ - సెల్ : 9966455872

23, ఆగస్టు 2014, శనివారం

గృహ నిర్మాణ గ్రామార్వణము


మనకు వాస్తు శాస్త్ర పండితులు గ్రామార్వణము గురించి చెప్పియున్నారు . గ్రామార్వణము గురించి ఈ విధముగా చెప్పితిరి .

ఏ గ్రామము నందు గృహము నిర్మించుటకు స్థలము కొనదలచినారో ఆ గ్రామము యొక్క నక్షత్రము కనుగొనాలి
( గ్రామము పేరులో ఉన్న మొదటి అక్షరమును బట్టి నక్షత్రము తెలుయును .) 
ఆ గ్రామనక్షత్రమునుండి  స్థలము కొనదలచిన వ్యక్తీ యొక్క నక్షత్రము వరకు లెక్కించగా వచ్చు సంఖ్యను బట్టి ఫలితములు తెలుసుకోవచ్చు . దీనినే నరాకార చక్రమందురు . నరాకార చక్రమునందున్న నక్షత్రముల ఫలితములు ఈ విధముగా ఉన్నాయి

శ్లోకం  :  శిరః పంచార్ధ లాభం , ముఖేత్రీ అర్ధ నాశనం , బాణరో
ధన దాన్యంచ పాదయో షట్ దరిద్రః  ప్రుష్టేకం ప్రాణ సందేహం
చతుర్నాభి శుభావహం,నేత్రే ద్వి ప్రీతి లాభంచ ,
సవ్యహస్తేన సంపదా , వామ హస్తనే దరిద్రః

తాత్పర్యము ; శిరస్సు నందు 5 నక్షత్రములు ధన లాభము కలుగజేయును , .ముఖము నందు ౩ నక్షత్రములు ధన నష్టమును , .గర్భమునందు 5 నక్షత్రములు ధన, ధాన్య సమృద్ధిని , పాదముల యందు 6 నక్షత్రములు దరిద్రమును  కల్గించును, పృష్టం నందు 1 నక్షత్రము ప్రాణ నష్టము సూచించును .నాభి యందు 4 నక్షత్రములు శుభమును ,  నేత్రముల యందు 2 నక్షత్రములు ప్రీతిని కలుగ జేయును, కుడి చేతి యందు 1 నక్షతము సంపదను , ఎడమ చేతియందు 1 నక్షత్రము దరిద్రమును అనుభవింప చేయును .

ఉదా : వినయ్  అను వ్యక్తీ గాంధీనగర్ అను గ్రామములో గృహ స్థలము కొనాలని అనుకొన్నాడు . ఇది అతనికి అనుకూలమా ?  గాంధీనగర్ నక్షత్రము ధనిష్ఠ అవుతుంది . వినయ్ నక్షత్రము రోహిణి . నవతార చక్రము ప్రకారము లెక్క వేయగా 9 వ నక్షత్రము కావున శుభ ప్రదము .

ఈ అర్వణము గ్రామములకు చెప్పబడినది కదా . మరి పెద్ద నగరముల యందు నివసించే వారికి ఎలా అని సందేహము కలుగక మానదు . వేల , లక్షల జనాభాతో పట్టణాలు పెరిగి పోతున్నాయి . పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ సంస్థలు పెద్ద వెంచర్స్ వేసి గృహాలను అమ్ముతున్నాయి . వీటికి అర్వణము ఎలా చూడాలి .
మీరు నివసించ బోయే వీధి ని గానీ, రియల్ ఎస్టేట్ సంస్థలలో అయితే ప్రాంతము పేరును బట్టి అర్వణము చేసుకొని వచ్చే ఫలితమును బట్టి గృహ నిర్మాణము చేసుకోవాలి .  .
 

http://bhavisyadarsini.blogspot.in/2014/01/blog-post_5873.html

7, ఆగస్టు 2014, గురువారం

27 నక్షత్రాలకు ప్రీతికరమైన పదార్దాలు ఏమిటి ?



 జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మన జన్మనక్షత్రానికి సంబంధించి కొన్ని పదార్థాలను  దానం ఇవ్వడం  లేదా వినియోగించడం వల్ల మనకు  చాలా మంచిది. 27 నక్షత్రాలకు ప్రీతికరమైనవి ఏంటో తెలుసుకుందాం 
27 నక్షత్రాలకు ప్రీతికరమైన పదార్దాలు:
అశ్విని - బంగాలదుంప , బూడిదగుమ్మడికాయ, వేరుశెనగ
భరణి -  పుట్ట గొడుగులు, జీడిపప్పు 
కృత్తిక - జిలేబి, ఎర్రగడ్డలు స్ట్రాబెర్రి, బాదంపప్పు, బొప్పాయి 
రోహిణి - కొబ్బరి, కోడిగుడ్డు 
మృగశిర - క్యారెట్, హల్వా, ఎందు మిర్చి
ఆరుద్ర - చింతపండు, పులిహోర, అల్లం 
పునర్వసు - నిమ్మకాయ పులిహోర, పైన్ఆపిల్, శెనగపప్పు, జాంపండు, పనసపండు
పుష్యమి - వంకాయ, పిస్తా 
ఆశ్లేష - ఆకుకూర, క్యాబేజి, బీరకాయ, పెసలు, పొట్లకాయ, కాకరకాయ, పచ్చబఠాణీలు
మఖ - చాక్లెట్లు, గోధుమఉప్మా
పూర్వ ఫల్గుని - మొక్క జొన్నలు, పొంగల్
ఉత్తర ఫల్గుని  - నేరేడు, నల్లబెల్లం 
హస్త - వెల్లుల్లి, తెల్ల ఉల్లిపాయలు, ముంజలు
చిత్త - కేసరి, బీట్రూట్, కందిపప్పు 
స్వాతి - కాఫీ, తేనె 
విశాఖ - అరటిపండు, కాలీఫ్లవర్ 
అనురాధ - నల్లద్రాక్ష, సీతాఫలం 
జ్యేష్ఠ - పచ్చిమామిడి, బీన్స్, మున్నక్కాయలు, సొరకాయ,కరివేపాకు 
మూల - సపోటా, చపాతి,బెల్లం 
పూర్వాషాడ - పాలు, పాలపదార్దాలు 
ఉత్తరాషాడ - గెనసుగడ్డలు, ఆపిల్ 
శ్రవణం - ఇడ్లి, చక్కర, తెల్లమినుములు 
ధనిష్ఠ - టమాటో, నారంజ, జాంగ్రి, పుచ్చకాయలు
శతభిషం - దోశ, వడ, బొండా, బజ్జి, చిరుతిండ్లు 
పూర్వాభాద్ర - మామిడిపండు, దోసకాయ
ఉత్తరాభాద్ర - కర్జూరం, గోధుమ, నల్లమినుములు
రేవతి - బెండకాయ, కీరాదోసకాయ, చిక్కుడుకాయలు, కొత్తిమీర

4, ఆగస్టు 2014, సోమవారం

నవగ్రహ దీపాల నోము ఎలా, ఎప్పుడు చేయాలి?

నవగ్రహ దీపాల నోముః-
నవగ్రహ దీపాల నోము ఎలా చేయాలి. నవగ్రహాల అనుగ్రహం కోసం, ఐశ్వర్యం పొందేందుకు కార్తీక పౌర్ణమి రోజున ఈ నోము నోచుకుంటారు.
 


తొమ్మిది ప్రమిదలు, తొమ్మిది ఒత్తుల చొప్పున వెలిగించి, ఒక్కొక్క ప్రమిద వద్ద నవధాన్యాలలో ఒక్కొక్క రకం ధాన్యం కొద్దిగా ఉంచి, ఒక్కొక్క ప్రమిదను (ధాన్యం సహా) ఒక్కొక్క బ్రాహ్మణునికి దానమివ్వాలి.
నవగ్రహ శాంతికి సంబంధించి పూజాది కార్యక్రమాలు చేసేవారు ఆయా ప్రత్యేక వస్తువులతో పూజని నిర్వహించాలి. పూజలో గ్రహ శాంతికి దోష నివారణకు దానాలు చేయాలి. ఇలా చేసిన వారకి దోష నివారణ జరిగి సకల శుభాలు కలుగుతాయి. కోరిన కోర్కెలు నెరవేరతాయి.

 సూర్య గ్రహ పూజ చేసేవారు గోధుమలను దానము చేయాలి. చేతికి కెంపు ఉంగరాన్ని ధరించటం వల్ల రోగాదులు, మానసిక బాధలు తొలగి మనశ్శాంతి కలుగుతుంది.

గురు గ్రహ పూజను నిర్వహించేవారు శనగలను దానం చేయాలి. అదే విధంగా కనక పుష్యరాగం ఉంగరాన్ని ధరించటం వల్ల అధికారం, ధనయోగంతో పాటు కీర్తివంతులవుతారు.

చంద్రుని పూజకు బియ్యాన్ని దానం చేస్తే సరిపోతుంది. ముత్యాన్ని ధరించటం వల్ల నేత్రాలకు సంబంధించిన బాధలకు నివృత్తి కలుగుతుంది. ఇక కుజ గ్రహ పూజలో కందులను దానం చేయాలి. పగడపు ఉంగరాన్ని ధరించటం వల్ల రుణ విముక్తి కలిగి శత్రు బాధ తొలగుతుంది.

 బుధ గ్రహ పూజలో పెసలను దానం చేయాలి. పచ్చల ఉంగరాన్ని ధరించటం వల్ల ధనలాభం కలగటమే కాక వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి కలుగుతుంది.

శుక్రుని పూజలో అలచందల దానము చేయాలి. వజ్రం, పగడము ధరించిటం వల్ల కార్యసిద్ధి కలుగుతుంది. వివాహాది శుభకార్యములకు ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి.

 రాహు పూజకు మినుములను దానం చేయాలి. గోమేధిక ఉంగరాన్ని ధరించటం వల్ల భయాందోళనలు తగ్గుతాయి. ధనప్రాప్తి కలుగుతుంది.

 కేతువు పూజలో ఉలవల దానం చేయాలి. వైఢూర్యం ఉంగరాన్ని ధరించాలి. దీనివల్ల సర్పాది భయాలు తొలగటమే కాక దైవశక్తి పెరుగుతుంది.

 శనిపూజలో నువ్వులను దానం చేయాలి. నీలిరంగు రాయి కలిగిన ఉంగరాన్ని ధరించటం వల్ల ఆరోగ్యవంతులవటమే కాక ఇతరత్రా కష్టాలు తొలగిపోతాయి. ఇంకా ప్రతి శనివారం నవగ్రహాలకు దీపమెలిగించినా ఈతిబాధలుండవు. ఆర్థిక ఇబ్బందులు, అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తికావాలంటే కార్తీక పౌర్ణమిన శివాలయంలో అభిషేకం చేయించాలని పురోహితులు అంటున్నారు.






ఈ బ్లాగును సెర్చ్ చేయండి



Related Posts Plugin for WordPress, Blogger...