శ్రీ మేధా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం

మీరు జన్మించిన తేది, సమయం, ప్రదేశం ఈ మూడు సమాచారములు మాకు తెలియచేసినచో మీ వ్రుత్తి,వ్యాపార,ఆరోగ్య,ఆర్ధిక పరిస్తితులు, దాంపత్యం, విద్య, ఉద్యోగ, వివాహ, కుటుంబవ్యవహారాలు, సంతానం, రాజకీయ వ్యవహారాలు,ప్రేమ వ్యవహారములు,కుజ దోషం, కాలసర్ప దోషం మరియు వివాహ, ఉపనయన, గృహప్రవేస, జప, హోమ, వ్రత, అన్నప్రసన, నామకరణం లకు ముహూర్తములు పెట్టబడును. P.V.RADHAKRISHNA CELL :+91 9966455872, Mail us : parakrijaya@gmail.com

5, మే 2018, శనివారం

నక్షత్రాలు జాతకుని స్వభావాలు

మీ నక్షత్రంభనక్షత్రాలు జాతకుని స్వభావాలు తెలుపుతాయి :

నక్షత్రాల సంఖ్య 27. ఈ ఇరవై ఏడు నక్షత్రాలు ఒక్కొక్క రాశిలో రెండున్నర నక్షత్రాలుగా ఉంటాయి. ఈ నక్షత్రాలు జాతకుని స్వభావాలు తెలుపుతాయి. 

1** అశ్విని : ఈ నక్షత్రంలో పుట్టిన జాతకులు సంచార స్వభావం కలవారిగా ఉంటారు. చపలత్వం ఈ జాతకుల స్వభావము.

2** భరణి : ఈ నక్షత్రంలో పుట్టిన జాతకులు స్వార్థ ప్రవృత్తి కలిగినవారిగా ఉంటారు. వీరు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడంలో విఫలమౌతుంటారు, కాబట్టి ఎల్లప్పుడు ఇతరులపై ఆధారపడి, ఇతరుల నిర్ణయాలను తమ నిర్ణయాలుగా భావిస్తుంటారు. 

3** కృత్తిక : కృత్తిక నక్షత్రంలో పుట్టినవారు అమితమైన సాహసాన్ని ప్రదర్శిస్తుంటారు. ఇతరుల వస్తువులు తమవిగా ఆక్రమించుకుంటుంటారు. ముఖ్యంగా వీరు అహంకార స్వభావులై ఉంటారు. ఈ జాతకులకు నిప్పు, వాహనాలు, ఆయుధాలంటే ఎక్కువగా భయపడుతుంటారు.

4** రోహిణి : రోహిణి నక్షత్రంలో పుట్టినవారు ప్రశాంతవదనంతో, కళాప్రియులుగా ఉంటారు. వీరు మనసులో ఏదీ దాచుకోరు. ఉన్నతమైన భావాలు కలిగిన వారిగా ఉంటారు. 

5** మృగశిర : ఈ జాతకులు భోగలాలసులు. వీరికి అమితమైన తెలివి ఉన్నాకూడా తగిన సందర్భంలో తమ తెలివిని ప్రదర్శించరు. 

6** ఆరుద్ర : ఆరుద్ర నక్షత్ర జాతకులు కోపోద్రిక్తులుగా ఉంటారు. నిర్ణయాలు తీసుకునే సందర్భంలో అవునా, కాదా అన్నట్టు వీరి నిర్ణయాలుంటాయని, ఎవ్వరినికూడా వీరు నమ్మరు. 

7** పునర్వసు : ఈజాతకులు ఆదర్శవాదులుగాను, ఇతరులకు సహాయ సహకారాలందించేవారిగాను ఉంటారు. ముఖ్యంగా వీరు శాంతచిత్త స్వభావులు. ఆధ్యాత్మికం అంటే వీరికి అమితమైన ఇష్టం.

8** పుష్యమి : పుష్యమి నక్షత్రంలో పుట్టినవారు సన్మార్గులై ఉంటారు . వీరు బుద్ధిమంతులుగాను, ఇతరులకు దానం చేసే స్వభావులై ఉంటారు. వీరికి సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. 

9** ఆశ్లేష : ఆశ్లేష నక్షత్ర జాతకులు మంకుపట్టు స్వభావులై ఉంటారు. వీరిలో ఆత్మన్యూనతాభావం ఎక్కువగా ఉంటుంది. స్వయంగా కష్టాలను కొని తెచ్చుకుంటారు. 

10** మఖ : ఈ జాతకులు స్వాభిమానిగా ఉంటారు. గొప్ప గొప్ప కోరికలుంటాయి. సహజంగా నేతృత్వం వహించే లక్షణాలుంటాయి.

11** పుబ్బ: వీరు కళలపట్ల ఎక్కువ మక్కువ చూపుతుంటారు. రతిక్రీడలంటే అమితమైన ఇష్టం ఈ జాతకులుకు.

12** ఉత్తర: ఇతరులతో వీరు ఆచితూచి వ్యవహరిస్తుంటారు. కష్టపడి పనిచేసే స్వభావం కలవారై ఉంటారు ఈ జాతకులు. 

13** హస్త : హస్త నక్షత్రం జాతకులు కల్పనా జగత్తులో విహరిస్తుంటారు. వీరు శుఖ వంతమైన జీవితాన్ని గడుపుతుంటారు. సత్ప్రవర్తన కలిగి ఉంటారు. 

14** చిత్త : చిత్త నక్షత్ర జాతకులు చదువు పట్ల ఎక్కువ శ్రద్ధ కనపరుస్తారు. కొత్త కొత్త ఫ్యాషన్‌లంటే అమితమైన ఇష్టం. ఎదుటివారిని ఆకర్షించే గుణం వీరిలో ఉంటుంది. ప్రధానంగా భిన్న లింగ వ్యక్తులతో ఎక్కువగా మసలుతుంటారు. 

15** స్వాతి : ఈ జాతకులు అందరిని సమానంగా చూస్తుంటారు. వీరి మనసును అదుపులో ఉంచుకుంటారు. కష్టాలను ఓర్చుకునే స్వభావులై ఉంటారు. 

16** విశాఖ : వీరు స్వార్థపరులుగాను, జగమొండిగా వ్యవహరిస్తారు. తాము అనుకునింది చేయాలని ఈ జాతకులు భావిస్తుంటారు. ఏదో ఒక విధంగా తమదే పై చేయిలా అనిపించుకుంటుంటారు. 

17** అనూరాధ : ఈ జాతకులకు తమ కుటుంబమంటే అమితమైన ప్రేమ. వీరికి శృంగారంమంటే చాలా ఇష్టం. మృదుస్వభావి, అలంకార ప్రియులుగాకూడా ఉంటారు .

18** జ్యేష్ఠ : జ్యేష్ఠ నక్షత్ర జాతకుల స్వభావం స్వచ్ఛమైనదిగానూ, ఎల్లప్పుడూ సంతోషంగా తమ జీవితాన్ని గడుపుతుంటారు. కాని వీరు శత్రువులను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోను వదలరు. దొంగచాటుగా శత్రువులపై దాడికి దిగుతుంటారు. 

19** మూల : ఈ జాతకుల ప్రారంభపు జీవితం కష్టతరంగాను, కుటుంబంనుంచి చీదరింపులను ఎదుర్కోక తప్పదు. కళలంటే అమితమైన ఇష్టం. వీరు కళాకారులుగా రాణిస్తారు.

20** పూర్వాషాఢ : పూర్వాషాఢ నక్షత్ర జాతకులు శాంతస్వభావులుగా ఉంటారు. 

21** ఉత్తరాషాఢ : ఈ జాతకులు వినయ స్వభావులై ఉంటారు. వీరిలో ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉంటుంది. అందరినీ కలుపుకుపోయే తత్వం వీరిది. 

22** శ్రవణం : వీరు సన్మార్గులై, పరోపకారిగాను ఉంటారు. 

23** ధనిష్ట : ధనిష్ట నక్షత్ర జాతకుల వ్యవహారం కటువుగా వుంటుంది. కోపం వీరి సొత్తులాగా ఉంటుంది. వీరు నిత్యం అహంకార పూరితులై ఉంటారు. 

24** శతభిష : ఈ నక్షత్రంలో పుట్టిన జాతకులు రసిక ప్రియులై ఉంటారు. వీరికి రతిక్రీడలంటే ఎక్కువ మక్కువ. వీరు వ్యసనపరులై ఉంటారు. వీరి సమయానుసారం వ్యవహరించరు. ఏదైనా పని చేయాలనుకుంటే వీరికి ఇష్టం వచ్చినప్పుడే చేస్తుంటారు. 

25** పూర్వాభాద్ర : ఈ జాతకులు బుద్ధిమంతులై, పరిశోధనాత్మకమైన దృక్పథం కలిగినవారిగా ఉంటారు. వీరు తమకు అందిన పనిని సమయానుసారం సమర్థవంతంగా నిర్వహిస్తుంటారు. 

26** ఉత్తరాభాద్ర : ఉత్తరాభాద్ర నక్షత్రంలో పుట్టిన వారు ఇతరులను ఆకర్షించే స్వభావం కలిగినవారై ఉంటారు. వీరి మాటల్లో చతురత కొట్టొచ్చినట్లు కనపడుతుంది. ఇతరులను ప్రభావితం చేసే గుణం వీరిలో ఉంటుంది. 

27** రేవతి : రేవతి నక్షత్ర జాతకులు సత్యవాదులై ఉంటారు. ఎల్లప్పుడూ ప్రజల బాగు కొరకు శ్రమిస్తుంటారు. వివేకవంతులుగాను ఉంటారు.

4, మే 2018, శుక్రవారం

రాహువు

రాహువు కలిగించే అనారోగ్యాలు
రాహువు వాయుతత్వ కారకుడు కావడం వల్ల మనవ శరీరంలోని సమస్త వాయు  సంబంద రోగాలను కల్గిస్తాడు. నొప్పి ఎక్కడుందో అక్కడ రాహువు ఉంటాడు. కడుపు, నాభి, మర్మాంగాల నొప్పులకు ప్రతీక. ఉచ్చ్వాస నిశ్వాసల్లోని గమన సిలత్వాన్ని కంట్రోలు చేసే శక్తీ రాహువుది. ఉరఃపంజర సంబంధ రోగాలను కలిగిస్తాడు. శుక్ర రాహువుల కలయికతో చర్మ సౌంధర్యాన్ని దెబ్బ తీస్తాడు. సమస్తమైన అంటు వ్యాధులకు రాహువు అధిపతి. టైఫాయిడ్, మలేరియా, మసూచి, ఇన్ ఫ్లూ,అనేక రకాల వైరస్ జ్వరాలకు రాహువు పెట్టింది పేరు. కన్య రాశిలో వుంటే అన్ని రకాల పురుగులను కడుపులో పెంచుతాడు. శరీరంలోని రోగనిరోధక శక్తిని తగ్గించి.. బ్యాక్టిరియాను ఆహ్వ
నించడంలో రాహువు మొదటి వాడు. రాహువు స్టితి బట్టి పక్షవాతం, కీళ్ళవాతం, నడుము నొప్పి కలుగుతాయి

రాహు గ్రహ నివారణోపాయలు

మానవుని ఇంత ప్రభావం చూపే రాహు గ్రహ నివారణోపాయలు ఇప్పుడు తెలుసుకుందాం. రాహువుకు అధిదేవత పృద్వీ అని కొందరు, గౌ గోవులని కొందరు చెబుతారు. ప్రత్యదిదేవత సర్పములు, అధిప్రత్యది దేవతా సహితంగా పునశ్చరణ చేసి దార పోయుట వలన నివారణ కలుగును. రాహువుకు అధిష్టాన దేవత దుర్గా దేవి సప్తాసతి పారాయణం కానీ మంత్రం జపం కానీ, కవచం కానీ పునఃశ్చరణ చేయుట వలన నివారణ పొందవచ్చును. చిన్నమాస్తాదేవిని విధి విధానంగా పూజించడం వల్ల రాహు గ్రహం దుష్పరిమనాలను నివారించవచ్చును.

రాహు గ్రహ దోష నివారణకు శనివారం నాడు ప్రారంభించి వరుసగా 18 రోజుల పాటు పారుతున్న నీటిలోకి రోజుకోక కొబ్బరికాయ దార పోయుట వల్ల నివారణ కలుగును. పడుకొనే ముందు గదిలో నెమలి పించాన్ని కనపడేటట్లు పెట్టి, తెల్ల వారు జామున లేవగానే చూచుట వల్ల రాహు గ్రహ పీడ నివారణ కలుగును

రాహు దోషం తొలగాలంటే దీపారాధన కూడా చేయాలి. రాహు యంత్రాన్ని పుష్పాలతో అర్చించాలి. నల్ల దుస్తులు ధరించాలి. ఇంకా మినపప్పును దానం చేసి వేప నూనెతో దీపారాధన చేయడం ద్వారా రాహు దోషం తొలగిపోతుందని శాస్త్రం చెబుతోంది.  రాహు భగవానునికి ఏదైనా ఒకరోజు అభిషేకం చేయించాలి. నలుపు వస్త్రాలు, గోమేధికం, బ్లూ లోటస్‌తో పూజ చేయించాలి. రాహు స్తుతి చేసి గరికతో యాగం నిర్వహించి.. మినపప్పు, మినపప్పు పొడి, అన్నం అగ్నికి ఆహుతి ఇవ్వండి. తర్వాత దీపారాధన చేయాలి.

23, మార్చి 2018, శుక్రవారం

విళంబి నామ సంవత్సర ఫలితాలు

అశ్విని నక్షత్రం 1,2,3,4 పాదములు , భరణి నక్షత్రం 1,2,3,4 పాదములు , కృత్తిక నక్షత్రం 1వ పాదములో జన్మించినవారు మేష రాశికి చెందును. శ్రీ విళంబి నామ సంవత్సరంలో మేష రాశి వారికి  ఆదాయం - 02 వ్యయం - 14  రాజపూజ్యం - 05 అవమానం - 07 మేష రాశి వారికి శ్రీ విళంబి నామ సంవత్సరం మిశ్రమ ఫలితాలను కలుగచేయును. ఉద్యోగ అన్వేషణలో ఉన్నవారు కష్టంతో ఉద్యోగమును పొందును.విదేశీ ఉద్యోగం ప్రయత్నాలు చేయువారికి సంవత్సర ప్రారంభం లో అంత అనుకూలంగా పరిస్థితులు ఉండవు. వ్యాపార రంగంలోనివారికి ప్రారంభ మాసములలో అధిక వ్యయం, ధన సమస్యలు ఏర్పడి ద్వితీయ భాగంలో తగ్గును. సంతాన ప్రయత్నములు చేయువారికి ప్రయత్న ఆటంకములు ఎదురగును. బాగా ఎదిగిన సంతానం స్థిరత్వం విషయంలో సమస్యలు. నూతన ప్రయత్నాలకు శ్రమానంతర విజయం ఏర్పడును. అశ్రద్ధ వలన ఆరోగ్య సమస్యలు తీవ్రమగును. ఈ సంవత్సరం కోర్టు వ్యవహారాలలో విజయం లభించుట కష్టం. విద్యార్ధులకు ఆశించిన విద్య లభించును. చక్కటి పురోగతి ఏర్పడును. ఉద్యోగ జీవనంలోని వారికి ఆశించిన స్థాన చలనములు లభించును. వస్త్ర వ్యాపారములు, కందెన వ్యాపారములు చేయువారికి నష్టములు. రాజకీయ రంగం వారికి పదవీ లాభం. వ్యవసాయదారులకు రెండు పంటలు సామాన్యంగా ఫలించును. మేష రాశి వారికి శ్రీ విళంబి నామ సంవత్సరంలో గురు గ్రహం వలన 10 - అక్టోబర్ - 2018 వరకూ చక్కటి అనుకూలమైన ఫలితాలు ఏర్పడును. వివాహ ప్రయత్నములు చేయువారికి ఆశించిన సంబంధములు ఏర్పరచును.11-అక్టోబర్ -2018 నుండి మధ్య మధ్య ధనలాభాములను , మధ్య మధ్య ధన నష్టములను కలుగచేయును. మేష రాశి వారికి శ్రీ విళంబి నామ సంవత్సరంలో శని గ్రహం సంవత్సరం అంతా అనుకూలమైన ఫలితాలను కలుగచేయును. నల్లని వస్తువులు, నల్లని ధాన్యములు వలన లాభములు కలుగచేయును. పితృ వర్గం వారితో వైరములు, అపోహలు ఏర్పడును. మేషరాశి వారికి శ్రీ విళంబి నామ సంవత్సరంలో రాహు - కేతువుల వలన మంచి ఫలితాలు ఏర్పడవు. వాహన ప్రమాదములను, గాయములను కలుగచేయును. శరీర శౌఖ్యం వుండదు. అనేక చిక్కులు ఏర్పరచును. రాహు - కేతువులకు శాంతి జపములు జరిపించుకోనుట మంచిది. 💐💐💐💐💐💐💐💐💐💐💐💐 మీ జన్మ నక్షత్రం కృత్తిక 2,3,4 పాదములు, రోహిణి 1,2,3,4 పాదములు, మృగశిర 1,2 పాదములలో ఒకటి ఐయిన మీది వృషభ రాశి. శ్రీ విళంబి నామ సంవత్సరంలో వృషభ రాశి వార్కి ఆదాయం - 11 వ్యయం - 05 రాజపూజ్యం - 01 అవమానం - 03. వృషభ రాశి వారికి శ్రీ విళంబి నామ సంవత్సరంలో ధనాదాయం ప్రధమార్ధంలో అధికంగా ఉండును. ద్వితియార్ధంలో ఆదాయంలో హెచ్చుతగ్గులు ఏర్పడును. అనుకోనివిధానంలో వాయిదా పడుతున్న పనులు ఈ సంవత్సరం పూర్తి అగును.నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నములు ఫలించును. కానీ ప్రభుత్వ ఉద్యోగం ఆశించువారికి కొద్దిపాటి నిరాశ. సొంత గృహ ప్రయత్నాలు ఫలించును. రాజకీయ రంగంలోనివారికి లౌఖ్యం అవసరం. పట్టుదల వలన గౌరవ భంగం. జూన్, జూలై, ఆగష్టు మాసాలలో వివాదాలు, పోలీస్ కేసులు వలన చికాకులు. విద్యార్ధులకు సామాన్య ఫలితాలు. వ్యాపార వ్యవసాయ రంగం వారికి మధ్యమ ఫలితాలు. వృషభ రాశికి చెందిన స్త్రీలు ఈ సంవత్సరం సంపత్ గౌరీ వ్రతము ఆచరించడం మంచిది. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం గురు గ్రహం 10-అక్టోబర్-2018 వరకూ చెడు ఫలితాలను కలుగచేయును. అనవసర శత్రుత్వములను , అపవాదులను , ఆరోగ్య సమస్యలను, ఆర్ధిక ఇబ్బందులను కలుగచేయును. 11-అక్టోబర్-2018 తదుపరి కొంచెం శాంతించును. అనుకూలమైన ఫలితాలను కలుగచేయును. అవివాహితుల వివాహ ప్రయత్నములను ఫలవంతం చేయును. కానీ శరీర ధారుడ్యం తగ్గును. శ్రీ విళంబ నామ సంవత్సరంలో శని గ్రహం సంవత్సరం అంతా మిశ్రమ ఫలితాలను ఏర్పరచును. కష్టార్జితం అంతా వృధాగా మిత్రులకు, బంధువులకు వినియోగించవలసిన పరిస్టితులు ఏర్పరచును. నల్లని వాహనముల విషయంలో జాగ్రత్త అవసరం. కుటుంబ పరమైన వ్యయం అధికం అగును. వృషభ రాశి వారు ఈ సంవత్సరంలో రాహువు వలన సోదర సంబంధ సమస్యలను లేదా తగాదాలను లేదా సోదర వర్గ నష్టములను పొందు సూచన. స్వ విషయాలలో అనుకూలమైన ఫలితాలను ఏర్పరుచును. వృషభ రాశి వారు ఈ సంవత్సరం భాత్రు వర్గం వారికి అప్పులు ఇచ్చుట, వారి కొరకు హామీలు ఉండుట, భాగస్వామ్య వ్యాపారాలు చేయుట మంచిది కాదు. కేతు గ్రహం ఈ రాశి వారికి వైవాహిక జీవనంలో సమస్యలను, జీవిత భాగస్వామికి అనారోగ్యమును ఏర్పరచును. విడాకులు ఆశిస్తున్న వారికి ఈ సంవత్సరం విడాకులు , కళత్ర నష్టం ఏర్పడును. ఆర్ధికంగా మిశ్రమ ఫలితాలు కలుగచేయును. ??💐💐💐💐💐💐💐💐💐💐💐 మృగశిర 3 , 4 పాదములు , ఆరుద్ర 1,2,3,4 పాదములు, పునర్వసు 1,2,3 పాదములలో జన్మించిన వారు మిధున రాశికి చెందును.శ్రీ విళంబ నామ సంవత్సరంలో మిధునరాశి వారికి ఆదాయం - 14 వ్యయం - 02 రాజపూజ్యం - 04 అవమానం - 03 శ్రీ విళంబి నామ సంవత్సరంలో మిధున రాశి వారు కొద్దిపాటి అసంతృప్తిని ఎదుర్కొందురు. ఆశించిన విజయాలు పూర్తిగా నెరవేరుట కష్టం.ధనాదాయంలో హెచ్చుతగ్గులు ఏర్పడుచుండును. మీ మీ సొంత జాతకంలోని గ్రహ బలాలపై ఈ సంవత్సరం ఆదాయం ఆధారపడును.ధనవ్యయం అధికమగును. సంవత్సరం మధ్య భాగం నుండి కొంత అనుకూలత ప్రారంభం అగును. చేపట్టిన నూతన పనులు లాభించును. దూర ప్రాంత నివాశ ప్రయత్నాలు , ఉద్యోగ అన్వేషణ ఫలించును.వివాహ ప్రయత్నములు ఈ సంవత్సరం కష్టం మీద ఫలించును. ఉద్యోగ జీవులకు సామాన్య ఫలితాలు. వ్యాపార రంగంలోని వారికి అంత అనుకూలత లేదు.పోటీదారులు పెరుగును. యువకులకు వాహన సంబంధ ప్రమాదాలు లేదా సమస్యలు. జాగ్రత్త అవసరం. పెద్ద వయస్సు వారికి మూత్ర సంబంధ సమస్యలు, ధన వ్యయ సూచన. కాళారంగంలోనివారికి మంచి గుర్తింపు. వైద్య రంగంలోనివారికి అనుకూలమైన కాలం.వ్యవసాయ దారులకు మిశ్రమ పంటలు కలసి వచ్చును. విద్యార్ధులకు జయం. మిధున రాశి వారు శ్రీ విళంబి నామ సంవత్సరంలో గురు గ్రహం వలన సంవత్సరం అంతా కొద్దిపాటి అనుకూలమైన ఫలితాలనే పొందుదురు. భూ సంబంధ లేదా గృహ సంబంధ వ్యాపారములు చేయువారికి విశేష లాభం. సంతాన ప్రయత్నములు చేయువారికి చక్కటి పుత్ర సంతాన సూచన.11 - అక్టోబర్ -2018 తదుపరి జీవిత భాగస్వామికి మధ్య మధ్య ఆరోగ్య సమస్యలు. శ్రీ విళంబి నామ సంవత్సరంలో మిధున రాశి వారు శని గ్రహం వలన వైవాహిక జీవనంలో అపసవ్యతలు ఎదుర్కొనుటకు సూచనలు అధికం. జీవిత భాగస్వామితో తగాదాలు లేదా అవిధేయత ఏర్పడును.పునర్భూ వివాహ ప్రయత్నాలు మాత్రం చక్కగా ఫలించును. ప్రేమ వ్యవహారములలో ఉన్నవారు కష్టాలు ఎదుర్కొండురు. ఆర్ధికంగా శని పెద్దగ ఇబ్బందులు కలుగచేయాడు. శ్రీ విళంబి నామ సంవత్సరంలో మిధున రాశి వారికి రాహువు కలసిరాడు. ఆర్ధిక సమస్యలు, ఋణములు కలుగచేయును. ఆరోగ్య భంగములు, ప్రమాదాలు ఏర్పరచును. కేతువు ఈ రాశి వారికి పూర్వీకుల సంబంధమైన స్థిరాస్తిని పొందుటకు సహకరించును. 💐💐💐💐💐💐💐💐💐💐💐💐 పునర్వసు నక్షత్ర 4 వ పాదం , పుష్యమి నక్షత్ర 1,2,3,4 పాదములు, ఆశ్లేషా నక్షత్ర 1,2,3,4 వ పాదములలో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందును.శ్రీ విళంబి నామ సంవత్సరంలో కర్కాటక రాశి వారి ఆదాయం - 08 వ్యయం - 02 రాజపూజ్యం - 07 అవమానం - 03 శ్రీ విళంబి నామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ధనాదాయం బాగుండును. నూతన ప్రయత్నాలు లభించును. వ్యాపార - వ్యవహారాలు అనుకూలించును. ఆలోచనలను కార్యారుపంలోనికి తీసుకోనిరాగలరు. ఈ సంవత్సరం కర్కాటక రాశికి చెందిన అన్ని వర్గములవారికి మంచి ఫలితాలు ఏర్పడును. శ్రీ విళంబి నామ సంవత్సరంలో గురువు కర్కాటక రాశి వారికి సంవత్సరం అంతా అనుకూలమై ఉండును. విద్యార్ధులకు అతి చక్కటి ఆశించిన విద్య లభించును. భూసంబంధ వ్యాపారం లేదా వ్యవసాయం చేయువారికి మంచి లాభాలు కలుగును. వాహన యోగమును ఏర్పరచును. సంతాన ప్రయత్నములు చేయువారికి 11-అక్టోబర్ - 2018 తదుపరి చక్కటి సంతాన ప్రాప్తిని కలుగచేయును. శని వలన శ్రీ విళంబి నామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి అంత మంచి జరుగదు. సంవత్సరంలో చిన్న చిన్న తగాదాలను , ఆరోగ్య సమస్యలను ఏర్పరచును. ఈ సంవత్సరం రాహువు మంచి ఫలితాలను కలుగాచేయడు. ఇతరులతో పరుషంగా మాట్లాడునట్టు, దయా దాక్షిన్యాలను మరచి ప్రవర్తించునట్టు చేయును. కేతువు సంతాన సంబంధ విషయాలలో ఇబ్బందులను ఏర్పరచువాడు అగును. ఈ సంవత్సరం కర్కాటక రాశి వారు సర్ప దోష నివారణ పూజ జరిపించుకోనుట మంచిది. 💐💐💐💐💐💐💐💐💐💐💐💐 మఘ 1,2,3,4 పాదములు , పుబ్బ 1,2,3,4, పాదములు , ఉత్తర 1వ పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందును.శ్రీ విళంబ నామ సంవత్సరంలో సింహ రాశి వారి ఆదాయం - 11 వ్యయం - 11 రాజపూజ్యం - 03 అవమానం - 06 శ్రీ విళంబి నామ సంవత్సరం సింహ రాశి వారికి అంత అనుకూలంగా వుండదు. తలపెట్టిన ప్రయత్నాలు విజయవంతము అగుట కష్టం. వ్యాపార వ్యవహారాలు సామాన్యంగా ఉండును. నూతన వ్యాపారములు లాభించవు. వివాహ ప్రయత్నాలు అనుకూలమైన ఫలితాలను ఇచ్చును. అవసరములకు ధనం సర్దుబాటు జరుగుటలో ఇబ్బందులు ఏర్పడును. ఆర్ధికంగా ఋణములు చేయుదురు. మాటగౌరవంతో వ్యవహారాలు కొనసాగును. ఉద్యోగ జీవనం వారికి సామాన్య ఫలితాలు. పదోన్నతులకు అనువైన సమయం కాదు. విద్యార్ధులు శ్రమించవలెను. వ్యవసాయం మిశ్రమ ఫలితాలు కలిగించును. సంతాన ప్రయత్నాలు చేయువారికి దైవ ఆశీస్సులు అవసరం. సింహ రాశి వారికి శ్రీ విళంబి నామ సంవత్సరంలో గురు గ్రహం వలన 10-అక్టోబర్-౨౦౧౮ వరకూ అనుకూలమైన ఫలితాలు పొందలేరు. సోదర సోదరీ వర్గం వలన సమస్యలు ఎదుర్కొందురు. 11-అక్టోబర్-2018 తదుపరి భూ లేదా గృహసంబంధ భాగ్యం పొందేదురు. దంపతుల సంతాన ప్రయత్నాలు ఫలించుట కష్టం. శనికి శాంతులు అవసరం. రాహు - కేతువులు ఇరువురు సింహరాశి వారికి అనుకూల ఫలితాలు ఇవ్వరు. పిత్రార్జితం లేదా వారసత్వ సంపద వ్యయమగు పరిస్థితులు కలుగచేయును. 💐💐💐💐💐💐💐💐💐💐💐💐 ఉత్తర 2,3,4 పాదములు, హస్త 1,2,3,4 పాదములు , చిత్త 1,2 పాదములలో జన్మించిన వారు కన్యా రాశికి చెందును.శ్రీ విళంబి నామ సంవత్సరంలో కన్యా రాశి వారి ఆదాయం - 14 వ్యయం - 02 రాజపూజ్యం - 06 అవమానం - 06కన్యా రాశి వారికి శ్రీ విళంబి నామ సంవత్సరంలో మిశ్రమ ఫలితాలు ప్రాప్తించును.ఉద్యోగ, వ్యాపార , వృత్తి జీవనముల వారికి మంచి ఫలితాలు ఏర్పడును. అవివాహితుల వివాహ ప్రయత్నములు చివరి సమయంలో సమస్యలను ఏర్పరచు సూచన. సంతాన ప్రయత్నములు చేయువారు నిరాశ చెందుటకు అవకాశములు కనిపించుచున్నవి. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు విజయవంతమగును. నూతన వ్యాపారములు, భాగస్వామ్య వ్యాపారములు ఈ సంవత్సరం ప్రారంభించకుండా ఉండుట మంచిది. సొంత ఇంటి కొరకు ప్రయత్నములు చేయుటకు, స్థిరాస్తులు కొనుటకు ఈ సంవత్సరం కలసివచ్చును. వ్యవసాయదారులకు రెండు పంటలు ఫలించును. విద్యార్ధులకు సామాన్య ఫలితాలు. శ్రీ విళంబి నామ సంవత్సరంలో కన్యారాసి వారికి గురువు 10-అక్టోబర్-2018 వరకూ ఆర్ధికంగా కలసివచ్చును. కానీ ఆరోగ్యములక సమస్యలను, చికాకులను కలుగచేయును. ఆరోగ్య విషయంగా చాలా జాగ్రత్త అవసరం. 11-అక్టోబర్-2018 నుండి ఆర్ధికంగా కూడా అంతగా కలసిరాడు. జాతకంలో గురుబలం లేని చిన్న పిల్లలకు బాలారిష్టములు ఏర్పరచును. కన్యా రాశి వార్కి శ్రీ విళంబి నామ సంవత్సరంలో శని యోగించడు. సంతానంతో గొడవలు, కుటుంభ జీవనంలో సమస్యలు, విద్యార్ధులకు ఆటంకాలు, వారసత్వ సంబంధ విషయాలలో చిక్కులు, కొద్దిపాటి పిత్రార్జిత వ్యయమును లేదా నష్టమును కలుగచేయును. కన్యా రాశి వారికి ఈ 2018 - 2019 సంవత్సరంలో రాహువు వలన అంతగా సమస్యలు ఏర్పడవు. రాహువు అధికంగా ప్రయానములను కలుగచేయును. పుణ్యక్షేత్ర దర్శనములు ఏర్పరచును.కేతువు కూడా అనుకూలమైన ఫలితాలు కలుగచేయును. భూసంబంధ వ్యాపారములు చేయువారికి , కంట్రాక్టు పనులు చేయువారికి అనుకూలమైన ఫలితాలు ఇచ్చును. 💐💐💐💐💐💐💐💐💐💐💐💐 చిత్త 3,4 పాదములు, స్వాతి 1,2,3,4 పాదములు , విశాఖ 1,2,3 పాదములులో జన్మించినవారు తులా రాశికి చెందును.శ్రీ విళంబి నామ సంవత్సరంలో తులా రాశి వారికి ఆదాయం - 11 వ్యయం - 05 రాజపూజ్యం - 02 అవమానం - 02 తులా రాశి వారికి శ్రీ విళంబి నామ సంవత్సరం ఆర్ధికంగా అనుకూలం. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు ఫలించి చక్కటి స్థిరత్వం లబించును. ఉద్యోగ జీవనంలో ఆశించిన పదోన్నతులు ఏర్పడును. గృహ నిర్మాణం చేయువారికి సమస్యలు. దూర ప్రాంత స్థానచలనం కొరకు ప్రయత్నించు వారికి ఆగష్టు తదుపరి అనుకూలత.విద్యార్ధులకు ఆశించిన ఫలితాలు. న్యాయవాద వృత్తి చేయువారికి కెరీర్ పరంగా ఒడిదుడుకులు. సంతాన ప్రయత్నములకు కేతు గ్రహం వలన సమస్యలు. శ్రీ విళంబి నామ సంవత్సరంలో తులా రాశి వారికి గురువు సంవత్సరం అంతా మంచి ఫలితాలు ఇవ్వడు. రక్త సంబంధ ఆరోగ్య సమస్యలను, తగాదాలను, కోర్టు కేసులలో అపజయాలను, శత్రు వృద్ధిని ఏర్పరచును. వడ్డీ వ్యాపారం చేయువారికి అనగా ఫైనాన్సు రంగం వారికి మంచి లాభాలను కలుగచేయును. శని వలన తులారాశి వారు సామాన్య ఫలితాలు పొందును. అభివృద్ధిని కలిగించడు మరియు తీవ్ర నష్టములు కలుగచేయడు. కనిష్ట సోదరుల వలన మానసిక అశాంతిని , వారితో సమస్యలను ఏర్పరచును. ఈ సంవత్సరం రాహువు వలన తులారాశి వారు మంచి ఫలితాలు పొందును. ప్రయనములందు జయమును, దూర దేశ నివాసము, వీసాల కొరకు ప్రయత్నించువారికి అనుకూల ఫలితాలు కలుగచేయును. కేతువు సంతాన ప్రయత్నములు చేయువారికి ప్రయత్న భంగములు ఏర్పరచును. 💐💐💐💐💐💐💐💐💐💐💐💐 విశాఖ 4 వ పాదము, అనురాధ 1,2,3,4 పాదములు, జ్యేష్ఠ 1,2,3,4 పాదములులో జన్మించినవారు వృచ్చిక రాశికి చెందును.శ్రీ విళంబి నామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఆదాయం - 02 వ్యయం - 14 రాజపూజ్యం - 05 అవమానం - 02 శ్రీ విళంబి నామ సంవత్సరంలో వృచ్చిక రాశి వారు ఏలినాటి శని దశ ప్రభావం వలన సమస్యలను ఎదుర్కొందురు. విదేశీ జీవనం ఆశించు వారికి ప్రయత్నములు ఫలించవు. సంతాన లేమి కల్గిన దంపతుల సంతాన ప్రయత్నాలు దైవ ఆశ్సిస్సులతో ఫలమంతమవ్వాలి. పుణ్య క్షేత్ర సందర్శన చేయుదురు. పట్టుదల లోపించును. వ్యయం అధికంగా ఉండును. నూతన స్నేహాల వలన సమస్యలు. విద్యార్ధులకు అధిక శ్రమ అవసరం. వ్యవసాయదారులకు ఋణాలు. లోహములు, కందెనలు , నువ్వులు వంటి శని ఆధిపత్యం కలిగిన వస్తువులతో వ్యాపారం చేయువారికి లాభాలు. ఈ సంవత్సరం వృచ్చిక రాశి వారు లాటరీలు , గుర్రపు పందాలు, జూదం లలో పాల్గొనకుండా ఉండుట మంచిది. రాజకీయ, క్రీడారంగం, కాళారంగంలోని వారికి మధ్యమ ఫలితాలు. ధన నష్టములు. వృత్తి జీవనంలోనివారికి సామాన్య ఫలితాలు. శ్రీ విళంబి నామ సంవత్సరంలో వృచ్చిక రాశి వారికి గురు గ్రహం వలన 10-అక్టోబర్-2018 వరకూ కొద్దిపాటి ఋణములు ఏర్పడును. కానీ మంచి కార్యక్రమాల కొరకు ధనాన్ని వినియోగించెదరు. 11-అక్టోబర్-2018 నుండి గురువు పూర్తిగా కలసివచ్చును. చక్కటి ఆర్ధిక బలాన్ని ఇచ్చువాడు అగును. నూతన ధనార్జన మార్గాలకు దారి చూపును. ఎరుపు రంగు కలసి వచ్చును.గౌరవ ప్రతిష్టలు ఏర్పరచును. శ్రీ విళంబి నామ సంవత్సరంలో శని వలన మంచి ఫలితాలు ఉండవు. ఏలినాటి శని దశ విచారములు, అనవసర ఖర్చులు,నేత్ర సంబంధ ఆరోగ్య సమస్యలు ప్రసాదించును. శనికి శాంతి అవసరం. ఈ సంవత్సరం వృచ్చిక రాశి వారికి రాహువు భూ సంబంధ సంపదకు సంబందించిన లాభమును చేకుర్చును. గృహ ప్రయత్నాలు అనుకూలం చేయును. కేతువు మాత్రం కలసిరాడు. ప్రయత్న ఆతంకములను, అపజయాలను, దైవ దుషనలను చేయునట్టు చేయును. 💐💐💐💐💐💐💐💐💐💐💐💐 మూల 1,2,3,4 పాదములు, పుర్వాషాడ 1,2,3,4 పాదములు, ఉత్తరాషాడ 1 వ పాదములో జన్మించినవారు ధనుర్ రాశికి చెందును.శ్రీ విళంబ నామ సంవత్సరంలో ధనుర్ రాశి వారికి ఆదాయం - 05 వ్యయం - 05 రాజపూజ్యం - 01 అవమానం - 05 ధనుర్ రాశి వార్కి శ్రీ విళంబి నామ సంవత్సరం మంచి చెడుల మిశ్రమంగా ఉండును. నూతన వ్యాపారాలు, వ్యవహారాలు లాభించును. ఉద్యోగ అన్వేషణ చేయువారికి, వలసదారులకు వారి వారి కోరికలు నెరవేరును. వివాహ ప్రయత్నాలు నిష్పలం. యంత్ర తయారీ పరిశ్రమదారులకు లాభాలు. వస్త్ర రంగ పరిశ్రమదారులకు , చేనేత వర్గం వారికి నష్టములు. ఆరోగ్య పరంగా సుఖ వ్యాదుల వలన సమస్యలు. శ్రీ విళంబి నామ సంవత్సరంలో ధనుర్ రాశి వారు గురు గ్రహం వలన 10-అక్టోబర్-2018 వరకూ మంచి ఫలితాలు పొందును. సక్రమ మార్గంలో విశేష ధనాదాయం ఏర్పడును. ప్రభుత్వా ఉద్యోగులకు అంతగా కలసిరాడు. గౌరవ హాని, అపకీర్తి. బృహస్పతి జాతకులు ధర్మ మార్గంలో నడచునట్లు చేయును. శుభ ఫలితాలు ఏర్పరచును. 10-అక్టోబర్-2018 తదుపరి ఇదే బృహస్పతి కలసిరాడు. వ్యవహర చిక్కులను, ఆరోగ్య సమస్యలను ఏర్పరచును. శ్రీ విళంబి నామ సంవత్సరంలో ఏలినాటి శని దశ వలన ధనుర్ రాశి వారు అనుకూలమైన ఫలితాలు తక్కువ స్థాయిలో పొందుదురు. శరీర సౌఖ్యం దూరమగును. సులువుగా పూర్తి కావలసిన పనులు కూడా అధిక శ్రమను కలుగచేయును. ఆర్ధిక పరిస్థితులు అదుపులో ఉండవు. కుటుంభ సభ్యులు మరియు సంతాన ప్రవర్తన మానసిక చికాకులు కలుగచేయును. ధనుర్ రాశి వారికి రాహు - కేతువులు ఇరువురు కలసిరారు. శారీరక సమస్యలు, కష్టములు, మానసిక ఆందోళన కలుగచేయును. 💐💐💐💐💐💐💐💐💐💐💐💐 ఉత్తరాషాడ 2,3,4 పాదములు, శ్రవణం 1,2,3,4 పాదములు, ధనిష్ఠ 1,2, పాదములలో జన్మించినవారు మకర రాశికి చెందును.శ్రీ విళంబి నామ సంవత్సరంలో మకర రాశి వారికి ఆదాయం - 08 వ్యయం - 14 రాజపూజ్యం - 04 అవమానం - 05 మకర రాశి వారికి శ్రీ విళంబి నామ సంవత్సరం మంచి ధనలాభాలను కలుగచేయును. ఆశించిన ధనము సంపాదిన్చుకొండురు. అదేవిధంగా వీరి చేతిపై ఖర్చు కూడా ఉండును. ఉద్యోగ జీవులు, వ్యాపారములు , ప్రొఫెషనల్ వృత్తులు వారు మంచి అభివృద్ధిని పొందును. వివాహ సంబంధాలు కుదురును. స్థానచలన ప్రయత్నాలు ఆటంకములను ఏర్పరచును. నిరుద్యోగులకు ఈ సంవత్సరం కలసివచ్చును. ఆశించిన ఉద్యోగం లభించును. జీవన పోరాటంలో జయం. కుటుంబ జీవనంలో స్త్రీలకు ప్రోత్సాహవంతమైన కాలం. వైవాహిక జీవనంలో సంతోషం. సంతాన భాగ్యం. కోర్టువ్యవహారాలు అనుకూలం కాదు. శ్రీ విళంబి నామ సంవత్సరంలో మకర రాశి వారికి గురు గ్రహం సంవత్సరం అంతా మంచి ఫలితాలు కలుగచేయును. ప్రజా పాలకులకు పేరు ప్రతిష్టలు, విద్యార్ధులకు వున్నత విద్య, చక్కటి ధనార్జన, సంపద భాగ్యములు ఏర్పరచును. చేతివృత్తులు, కుల వృత్తి చేయువారికి అతి చక్కటి కాలం. శ్రీ విళంబి నామ సంవత్సరంలో శని గ్రహం ఏలినాటి శని ప్రభావం వలన జాతకులు ప్రగల్భాలకు పోయి విశేషమైన ధనవ్యయం చేయును. ఆర్ధిక పరంగా ఏలినాటి శని దశ కలసిరాదు. ఈ సంవత్సరం మకర రాశి వారు రాహు గ్రహం వలన శారీరక వ్యాధులను, వివాహ ప్రయత్నాలలో ఆటంకములను, బంధువర్గం వలన నమ్మకద్రోహములను ఎదుర్కొందురు. కేతువు వలన మంత్రం నష్టములు ఉండవు. 💐💐💐💐💐💐💐💐💐💐💐💐 ధనిష్ఠ 3,4 పాదములు, శతభిషం 1,2,3,4 పాదములు, పూర్వాభాద్ర 1,2,3,4 పాదములలో జన్మించినవారు కుంభ రాశికి చెందును.శ్రీ విళంబి నామ సంవత్సరంలో కుంభ రాశి వారికి ఆదాయం - 08 వ్యయం - 14 రాజపూజ్యం - 07 అవమానం - 05 శ్రీ విళంబి నామ సంవత్సరంలో కుంభ రాశి వారు చక్కటి ఫలితాలు పొందుదురు. సంవత్సర ప్రారంభ మాసాలలో ధనం కొద్దిగా వృధా వ్యయం అగును. వ్యాపార వ్యవహారములు , వృత్తి పనులు నిదానంగా ఫలించును. సొంత గృహసంబంధమైన కోరికలు నెరవేరును. వ్యవసాయదారులకు ఆటంకములు. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించును. వివాహ సంబంధాలు సఫలమగును. మాత్రు వర్గీయులకు ఈ సంవత్సరం మంచిది కాదు. శ్రీ విళంబి నామ సంవత్సరంలో కుంభ రాశి వారు గురు గ్రహం వలన సంవత్సరం అంతా మంచి ఫలితాలు పొందును. వారసత్వ సంపద వలన, స్వార్జిత ధనం వలన మంచి భాగ్యం ఏర్పరచుకొండురు. 11-అక్టోబర్-2018 తదుపరి వృత్తి జీవనం చేయువారికి అత్యంత లాభాపూరిత కాలం. మిక్కిలి పేరు ప్రఖ్యాతలు , ధనము సంపాదిన్చుకొండురు. శ్రీ విళంబి నామ సంవత్సరం లో కుంభ రాశి వారు శని గ్రహం వలన కూడా ఆర్ధికంగా అనుకూల ఫలితాలు పొందును. వ్యక్తిగత జీవనంలో అనగా జీవిత భాగస్వామితో సమస్యలు ఏర్పరచును. కుంభ రాశి వారికి ఈ సంవత్సరం రాహువు వలన సమస్యలు, శత్రు వ్రుద్ధి, ఆరోగ్య సమస్యలు ఏర్పడును. కేతువు విద్యార్ధులకు మంచి చేయును. ఆశించిన విద్యావ్రుద్ధిని ప్రసాదించును. జాతకులు ఉన్నత విద్యావంతులు అగును. 💐💐💐💐💐💐💐💐💐💐💐💐 పూర్వాభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర 1,2,3,4 పాదములు, రేవతి 1,2,3,4 పాదములలో జన్మించిన వారు మీన రాశికి చెందును.శ్రీ విళంబి నామ సంవత్సరంలో మీన రాశి వారికి ఆదాయం - 05 వ్యయం - 05 రాజపూజ్యం - 03 అవమానం - 01 మీనరాశి వారికి శ్రీ విళంబి నామ సంవత్సరం అధిక శాతం శుభ ఫలితాలు కలుగచేయును. ముఖ్యంగా ద్వితియార్ధం అధికమైన లాభాలను కలుగచేయును. ఉద్యోగ అన్వేషణలో వున్నవారు చక్కటి ఉద్యోగాన్ని పొందేదురు. సంతానం యొక్క స్థిరత్వంలో సమస్యలు కలుగును. చేపట్టిన ప్రయత్నములు కష్టంతో ప్రారంభం ఇయినా అనుకూలమైన దిశలో పయనించి ఫలవంతంగా ముగియును. శ్రీ విళంబి నామ సంవత్సరం లో మీనరాశి వారు గురుగ్రహం వలన 10-అక్టోబర్-2018 వరకూ అననుకూల ఫలితాలు, 11-అక్టోబర్-2018 తదుపరి అత్యంత చక్కటి ఫలితాలను పొందును. విశేషమైన భూ లేదా గృహ సంపదను కలుగచేయును. వారసత్వం వలన, స్వార్జితం వలన కలసివచ్చును. శ్రీ విళంబి నామ సంవత్సరంలో శని మీనరాసి వారికి సంవత్సరం అంతా మంచి చేయును. విశేష ధనార్జన ఇచ్చువాడు అగును. కానీ ఆర్ధిక విషయాలలో లోభత్వం ప్రదర్శించు పరిస్థితులు కలుగచేయును. మీనా రాశి వారికి రాహు - కేతువులు ఇరువురు ఆర్ధికంగా, ఆరోగ్య పరంగా అనుకూలంగా ఉండును. ఆయుర్భాగ్యములు సంపూర్ణంగా ఇచ్చును. కానీ రాహువు వలన సంతాన సంబంధిత విషయాలలో నష్టం లేదా సంతానం మీ అభీష్టానికి వ్యతిరేకంగా ప్రవర్తించునట్టు చేయును. సంతానం వలన ప్రశాంతత వుండదు.

22, మార్చి 2018, గురువారం

అన్నప్రాశన

అన్న ప్రాశన:

అన్నప్రాశన అంటే పుట్టిన శిశువుకు మొట్టమొదటిసారి అన్నం ముట్టించడం. ఈ సంస్కారం వలన శిశువుకు ఆయువు, ఆరోగ్యం, తేజస్సు వృద్ధి చెందుతాయి.
అన్నప్రాశన చేయు విధానం:
పిల్లలకు ఆరు లేక ఎనిమిది లేక పది మాసములందైనను వర్షాంతమందైనను, శుక్లపక్షమునందు శుక్రుడు ఆకాశమందు పరిశుద్ధుడై ప్రకాశించుచున్నపుడు నవాన్నప్రాశనము చేయవలెనని ఋషులచే చెప్పబడింనది(ముహూర్త దర్పణం). అన్నప్రాశన మగపిల్లలకు సరినెలలలోను, ఆడపిల్లలకు బేసి నెలలలోను చేయుట లోకాచారముగానున్నది. అన్నప్రాశన పూర్వాహ్ణమందు మాత్రమే చేయవలెను. బిడ్డ తల్లిదండ్రులు తూర్పుముఖంగా చాప మీద కూర్చుని బిడ్డను తల్లి ఒడిలో కూర్చోబెట్టుకోవాలి. ముందు విఘ్నేశ్వర పూజ చేయాలి. బంగారు గిన్నెలోగానీ, వెండి గిన్నె లేదా కంచంలోగానీ పాయసం, తేనె, పెరుగుల మిశ్రమాన్ని కలిపి, తండ్రి బంగారు ఉంగరాన్ని పాయసంలో ముంచి దాన్ని బిడ్డకు తినిపించాలి. ఉంగరంతో మూడుసారులి తినిపించాక చేత్తో పెట్టాలి. ఈ విధంగా అన్నప్రాశన కార్యక్రమ జరపాలి.

జీవికా పరీక్ష:
అన్నప్రాశన సమయంలో దైవ సన్నిధిలో నగలు, డబ్బు, పుస్తకము, కలము, ఆయుధము, పూలు మొదలైన వస్తువులు ఉంచి శిశువును వాటి దగ్గర వదులుతారు. శిశువు మొదటిసారిగా ఏ వస్తువు తాకునో ఆ వస్తువుతో సంబంధమైన జీవనోపాధి ఆ శిశువుకు ఉంటుందని భావన. అన్నప్రాశన దైవ సన్నిధిలో చేయాలి. ముందుగా సత్యనారాయణ స్వామి వ్రతం జరిపి ఆ స్వామి సన్నిధిలో అన్నప్రాశన చేయాలి. భార్యా భార్తలు తూర్పు ముఖంగా కూర్చుని, బిడ్డను తల్లి ఒడిలో కూర్చుండబెట్టాలి. వెండితో కానీ, కంచుతో కానీ చేసిన పాత్రలో పాయసముంచి, అందులో కొద్దిగా నెయ్యి, తేనె వేసి ముందుగా తండ్రి మూడు సార్లు బంగారపు ఉంగరంతో పాయసం తీసి శిశువుకు పెట్టాలి. తరువాత తల్లి కూడా అదేవిధంగా పెట్టాలి. తరువాత మేనమామ తదితరులు పెట్టాలి.

చేయవలసిన శుభ ఘడియలు:
తిధులు: విదియ, తదియ, పంచమి, సప్తమి, దశమి, త్రయోదశి మరియు చతుర్దశి.

వారములు: సోమ, బుధ, గురు మరియు శుక్ర

నక్షత్రములు: ఆస్వని, రోహిణి, మృగశిర, పునర్వసు, పుష్యమి, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, అనూరాధ, ఉత్తరాషాడ, శ్రవణం, ధనిష్టం, శతభిషం, ఉత్తరాభాద్ర మరియు రేవతి.

లగ్నములు: వృషభ, మిథున, కర్కాటక, కన్య, తుల, ధనుస్సు మరియు మీన లగ్నాలు. దశమ స్థానంలో ఏ గ్రహాలూ ఉండకూడదు. ముహూర్త సమయాన బుధ, కుజ, శుక్ర గ్రహాలు ఒక వరసలో ఉండకూడదు.

గ్రహదోషములు: లగ్నంలో రవి ఉండకూడదు. అలా ఉంటే ఆ బిడ్డకు కుష్టు రోగము వచ్చే అవకాశం కలదు. క్షీణ చంద్రుడుంటే దరిద్రుడు అవుతాడు. కుజుడుంటే పైత్య రోగి, శని ఉన్నచో వాత రోగి, రాహుకేతువులున్నచో మిక్కిలి దరిద్రుడు అవుతాడు. 

శుభ గ్రహములు: లగ్నంలో పూర్ణ చంద్రుడుంటే అన్నదాత అవుతాడు. బుధుడుంటే విశేష జ్ఞానాంతుడు, గురుడుంటే భోగి, శుక్రుడుంటే దీర్ఘాయువు కలవాడు అవుతాడు. 

అన్నప్రాశన కాలం: 6 నుంచి 12 నెలలలోపు ఎప్పుడైననూ చేయవచ్చు. అయితే శుక్లపక్షంలో శుక్రుడు ఆకాశంలో పరిశుద్ధుడై ప్రకాశిస్తున్నప్పుడు అన్నప్రాశన చేయాలి. మగ పిల్లలకు సరి నెలలలోనూ, ఆడ పిల్లలకు బేసి నెలలలోనూ చేయాలి. దీనిని పూర్ణాహ్వమందు మాత్రమే చేయాలి.

1, ఫిబ్రవరి 2018, గురువారం

పుట్టుమచ్చల/ ఫలితాలు

• తల కుడి భాగము, తల ఎడమ భాగము, రెండు కను బొమ్మల మధ్య, కుడి కనుబొమ్మ మీద, నుదుటున కుడి భాగమున, కుడి కణిత మీద, ఎడమ కణిత మీద, కుడి కంటిమీద, కుడి కనురెప్ప లోపలి భాగములో, ముక్కుకు కుడివైపు, ముక్కుకొన అడుగుభాగమున పుట్టుమచ్చలు ఉంటె శుభఫలితాలను ఇస్తాయి

• నాలుక పైభాగమున కానీ చివరన కానీ పుట్టుమచ్చ ఉంటె వాక్చాతుర్యం ఉంటుంది, కీర్తిప్రతిష్టలు కలుగుతాయి. శాస్త్రప్రవీణ్యం ఉంటుంది

• గడ్డమునకు మధ్య భాగమున గానీ, కుడిభాగమున గానీ పుట్టుమచ్చ ఉంటె సంగీత,సాహిత్యాలలో కీర్తిప్రతిష్టలు సంపాదిస్తారు

• కుడి,ఎడమ చెవి ప్రక్కన పుట్టుమచ్చ ఉంటె పుట్టుకతో ఐశ్వర్యవంతులవుతారు

• రెండు చెవుల పైభాగాన రెండు పుట్టుమచ్చలుంటే ఆగర్భశ్రీమంతులవుతారు

• కంఠమునకు ఏ వైపున పుట్టుమచ్చ ఉన్న బంధువుల ఆస్తులు పొంది శ్రీమంతులవుతారు

• రొమ్మునకు కొంచెం పైభాగములో పుట్టుమచ్చ ఉంటె జీవితాంతం ధనధాన్యాలతో తులతూగుతారు

• రొమ్మునకు కుడి భాగమున పుట్టుమచ్చ ఉంటె ఏదొక రంగంలో శాశ్వత కీర్తినిపొందుతారు

• ముంజేతిమీద పుట్టుమచ్చ ఉంటె వ్యవసాయ రంగంలో అభివృద్ధి చెందుతారు

• మణికట్టు మీద పుట్టుమచ్చ ఉంటె ధనసంపాదనపరులు అవుతారు

• మోచేతిమీద పుట్టుమచ్చ ఉంటె ఐశ్వర్యవంతులు,సకలసుఖాలు అనుభవించేవారు  అవుతారు.

• కుడి చేయి చిటికిన వ్రేలిమీద పుట్టుమచ్చ ఉంటె ధనం బాగా సంపాదిస్తారు

• అరచేయి చితికినవ్రేలిక్రింద పుట్టుమచ్చ ఉంటె ధనం బాగా సంపాదిస్తారు

• కుడి అరచేతిలో ఎడమవైపు పుట్టుమచ్చ ఉంటె అకస్మాత్తుగా ధనప్రాప్తి కలుగుతుంది

• వెన్నుమీద ఉబ్బెత్తుగా పుట్టుమచ్చ ఉంటె రాజకీయనాయకులు అవుతారు

• కుడి తొడమీద పుట్టుమచ్చ ఉంటె పరస్త్రీ వలన ఆస్తి కలుగుతుంది

• కుడి వృషణాలమీద పుట్టుమచ్చ ఉంటె బంధుమిత్రుల్లో కీర్తిని పొందుతారు

• కుడి మోకాళ్లమీద పుట్టుమచ్చ ఉంటె అనుకూలమైన భార్య, సుఖమయ దాంపత్యం అనుభవిస్తారు

ఈ బ్లాగును సెర్చ్ చేయండి



Related Posts Plugin for WordPress, Blogger...