శ్రీ మేధా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం

మీరు జన్మించిన తేది, సమయం, ప్రదేశం ఈ మూడు సమాచారములు మాకు తెలియచేసినచో మీ వ్రుత్తి,వ్యాపార,ఆరోగ్య,ఆర్ధిక పరిస్తితులు, దాంపత్యం, విద్య, ఉద్యోగ, వివాహ, కుటుంబవ్యవహారాలు, సంతానం, రాజకీయ వ్యవహారాలు,ప్రేమ వ్యవహారములు,కుజ దోషం, కాలసర్ప దోషం మరియు వివాహ, ఉపనయన, గృహప్రవేస, జప, హోమ, వ్రత, అన్నప్రసన, నామకరణం లకు ముహూర్తములు పెట్టబడును. P.V.RADHAKRISHNA CELL :+91 9966455872, Mail us : parakrijaya@gmail.com

4, సెప్టెంబర్ 2012, మంగళవారం

నవగ్రహచార ఫలములు - గురుడు

గురు గ్రహము

గురుడు లక్షణములు :
గురుడు పురుష గ్రహము. ఇతను రుచులలో తీపిని, రంగులలో పసుపుపచ్చను సూచించును. ఇతను బ్రాహ్మణజాతికి చెందినవాడు. అధిదేవత బ్రహ్మ. గురుడు 30 సంవత్సరముల వయస్సు కలవారిని సూచించును. ఇతను స్థూలకాయులు, కపిల వర్ణపు వెంట్రుకలు,కండ్లు కలవారిని సూచించును. ఇతను కఫతత్త్వము కలవాడు. హేమంత ఋతువును సూచించును. ఆకాశతత్త్వము కలిగి ఈశాన్యదిశను సూచించును. లోహములలో బంగారమును, రత్నములలో పుష్యరాగమును సూచించును. ఈ గ్రహసంఖ్య 3. లగ్నములో దిగ్బలమును పొందును.
గోదావరి నుండి వింధ్యపర్వతం వరకు ఇతని దేశంగా జాతకపారిజాతం తెలుపుతున్నది. గురుడు పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర నక్షత్రములకు అధిపతి. శరీరావయవములలో కాలేయము, గాల్ బ్లాడర్, పేంక్రియాస్ లను సూచించును. గురుడు ధనస్సు, మీనరాశులకు అధిపతి. ఇతనికి ఉచ్ఛరాశి కర్కాటకం. నీచరాశి మకరం. కర్కాటకంలో 5వ డిగ్రీ పరమనీచ. ఇతనికి రవి, చంద్ర, కుజులు స్నేహితులు. బుధ, శుక్రులు శత్రువులు శని సముడు. గురుగ్రహదశ 16 సంవత్సరములు.
గురుడు ప్రభావం :
లావుకు తగ్గ పొడవును కలిగి మంచి ఆకారము కలిగినవారై వుంటారు. వీరికి ఆహారము, వస్త్రము, సౌఖ్యములకు కొదువ వుండదు. సంప్రదాయముల పట్ల నమ్మకము, దైవభక్తి వుంటాయి. పండితులు, చట్టము, ధర్మము అంటే గౌరవము. విద్యా సంస్థలతో సంబంధము కలిగియుంటారు. కంఠధ్వని చక్కగా వుంటుంది. విశాలమైన కనులు, నుదురు కలిగి యుంటారు.
అజీర్ణవ్యాధులు, శరీరము బరువుపెరుగుట వంటి అనారోగ్యములు కలుగవచ్చును.
దేవాలయములు, L.I.C బ్యాంకు, వంటి సంస్థలలో రాణిస్తారు. న్యాయశాస్త్రంలో ప్రవీణులు కాగలరు.
గురు కారకత్వములు :
గురుడు ధనకారకుడు, జ్యేష్ట సోదరుడు, పుత్రులు, సంతానం, ముత్తాత, విశేష బంధువులు, మంత్రి, యజ్ఞము, గౌరవము, దైవభక్తి, వేదములు, శాస్త్రములు, వేదాంతము, దానధర్మములు, బుద్ది, సత్యము, ఆచారము కలిగియుండుట, బంగారము, వైఢూర్యము సంస్కృత భాష, శబ్దములను సూచించును. బ్యాంకులు, ఖజానాలు, న్యాయస్థానములు, న్యాయమూర్తులు, దేవాలయములు, విద్యాలయములు, అధ్యాపకులు, బోధకులు, మతాధికారులు, మతసంస్థలు, ఆర్థికవ్యవహారములను సూచించును. కాలేయము, కాలేయమునకు సంబంధించిన వ్యాధులు, కాన్సర్ వ్యాధులను సూచించును. నెయ్యి, నూనె, క్రొవ్వు, వెన్న, శనగలు, దబ్బకాయలు, పనసకాయలను సూచించును. పావురము, హంసలు, గుర్రములు, ఏనుగులను సూచించును.
పుస్తకములు, కళాశాలలు, వైద్యులు, లాయర్లు, బిషప్ లు, చర్చి, పదవి, కరుణ, సంతోషము, పెట్టుబడి, అభివృద్ధి, ఐశ్వర్యము, పూజారులు, ఉపాసన, విదేశీయులు, భవిష్యత్తు, బహుమతులు, ఆచారాలు, బ్యాంకులు, ధనుర్విద్య, రేసులు, టైటిల్స్, వేదాంతము, చెల్లింపులు, నిజాయితీ, క్రమబద్దము ఉన్మాదములను సూచించును.
గురుడు సూచించు విద్యలు :
గురుడు బోధించేవారిని అనగా ఉపాధ్యాయులనుండి ప్రొఫెసర్ల వరకు సూచించును. బ్యాంకులు, ఆర్థికశస్త్రము, ధనము, బంగారము, సంస్కృతభాష, పురాణాలు, నోట్లముద్రణ వేదాంతములను సూచించును.
గురుడు సూచించు వ్యాధులు :
మధుమేహవ్యాధి, కాలేయము, గాల్ బ్లాడర్ కు సంబంధించిన వ్యాధులు, బోదకాలు, శరీరంలో నీరు చేరుట, నిస్సంతానం, కాన్సర్ లను గురువు సూచించును. గురుడు చంద్రునితో కలసి గర్భాశయముకు సంబంధించిన ఇబ్బందులు, గర్భాశయ కాన్సర్ శుక్రునితో కలసి మధుమేహవ్యాధి, విచిత్రమైన సెక్సు కోరికలు, అసహజంగా పెరిగే శరీరాంగములను సూచించును. రవితో కలసి లుకేమియా, విపరీతంగా కొలొస్టరాల్ ఏర్పడుట, మూత్రపిండముల వ్యాధి, లివర్ కు సంబంధించిన వ్యాధులు, పచ్చకామెర్లు, కఫంచేయుట, అతిమూత్రవ్యాధిని సూచించును. విపరీతమైన ఆకలి, అజీర్ణము, అతికాయములను కూడ గురుడు సూచించును.
గురుడు సూచించు వృత్తి వ్యాపారాలు :
న్యాయవాదులు, న్యాయమూర్తులు, బోధకులు, ఉపాధ్యాయులు, సామాజిక రచయితలు, మతప్రవక్తలు, పురోహితులు, ప్రభుత్వోద్యోగులలో ఉన్నత స్థానంలో పేరు పొందువారు, మతప్రచారకులు, రవి లేదా చంద్రులతో కూడిన రాజకీయాలు, బ్యాంకు వ్యవహారములు, అధ్యక్షులు, మేయరు, కౌన్సిలర్, పార్లమెంటు మెంబరు, మేనేజరు, మేనేజింగ్ డైరెక్టర్ లను సూచించును. బుధునితో కలసి విదేశీభాషలు, ఎగుమతులు, దిగుమతులు, సివిల్ ఇంజినీరింగ్ లను సూచించును.
గురువు నకు మిత్రులు: సూర్య చంద్ర మంగళ
గురువు నకు శత్రువులు : బుధ శుక్ర
గురువు నకు సములు: శని రాహు కేతు

3, సెప్టెంబర్ 2012, సోమవారం

నవగ్రహచార ఫలములు - బుధుడు

బుధ గ్రహము

బుధు ని లక్షణాలు :
బుధుడు నపుంసక గ్రహము. ఇతను రుచుల మిశ్రమమును తెలియజేయును. రంగుఅలలో ఆకుపచ్చరంగును సూచించును. ఇతను వైశ్యజాతికి చెందినవాడు. అధిదేవత విష్ణువు. గుండ్ర్ని ఆకారం కలిగి, పొడవైన వారిని సూచించును. 20 సంవత్సరాలా వయసు వారిని సూచించును. ఇతను వాత, కఫ, పిత్తముల మిశ్రమ తత్త్వము కల్వాడు. హరదృతువును సూచించును. పృధ్వీతత్త్వము కలిగి ఉత్తరదిక్కును సూచించును. లోహములలో కంచు, ఇత్తడి ( మిశ్రమలోహములను ) సూచించును. రత్నములలో మరకతను ( పచ్చ ) ను సూచించును. సంఖ్య 5 . లగ్నములో దిగ్బలమును పొందు రజోగుణప్రధానమైన గ్రహము. వింధ్యపర్వతం నుండి గంగానది వరకు ఇతనిదేశంగా జాతక పారిజాతం చెపుతున్నది.
బుధుడు ఆశ్రేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రములకు అధిపతి శరీరావయవములలో మెదడు, చర్మము, నరములను సూచించును. బుధుడు మిధునము, కన్యారాశులకు అధిపతి. కన్యలో 15వడిగ్రీ నుండి 20వ డిగ్రీవరకు మూల త్రికోణము. ఇతనికి ఉచ్చరాశి కన్య. నీచరాశి మీనం. కన్యలో 15వ డిగ్రీ ఇతనికి పరమోచ్చ. అలాగే మీనంలో 15వడిగ్రీ ఇతనికి పరమనీచ. ఇతనికి రవి, శుక్రులు స్నేహితులు. చంద్రుడు శత్రువు. కుజ, గురు, శని సములు. బుధగ్రహదశ 17 సంవత్సరాలు.
బుధు ని ప్రభావం :
ఎల్లప్పుడు సంతోషంగా వుంటారు. వీరి పెదవులపై చిరునవ్వు మెదులుతూ వుంటుంది. పొట్టిగా వుంటారు. చురుకైనవారు. వృద్ధాప్యంలో కూడా యువకుల వలె వుంటారు. నాటకరచయితలు, నటులు, విషయజ్ఞానం ఎక్కువగానే వుంటుంది. దీర్ఘాలోచనా పరులు, సందేహపరులు.
తలనొప్పి, నరముల వ్యాధులు, అలసరువంటి వ్యాధులు రావచ్చు.
రేడియో, టి.వి., పత్రికారంగం, ప్రచురణరంగం, టెలిఫోన్ రంగాలలో రాణిస్తారు.
బుధు ని కారకత్వములు :
బుధుడు వాక్ కారకుడు, మేనమామ, మేనల్లుడు, మేనకోడలు మాతమహుడు, ఉపన్యాసములో నైపుణ్యం, లలితకళలు, గణితశాస్త్రం, వ్యాపార శాస్త్రం, అర్ధశాస్త్రం, జ్యోతిష్యం, ఖగోళశాస్త్రం, వాణిజ్యం, వ్యాకరణము, వివిదరకాల భాషలు, శిల్పి, మంత్రం, తంత్రం, వివేకం, పుస్తక ప్రచురణ, గ్రంథాలయం, విష్ణుభక్తి, విష్ణాలయం, వైష్ణవభక్తులు, మధ్యవర్తిత్వం, వైద్యులను సూచించును. నాభి, నరము, నాలుక, స్వరపేటిక, చర్మములను సూచించును. నరముల బలహీనత, మూర్ఛ, చెముడు, మెదడుకు సంబంధించిన వ్యాధులను సూచించును. అన్నిరకముల ఆకుకూరలు, కూరగాయలను సూచించును. ఉపాధ్యాయులు, ఉపన్యాసకులు, న్యాయవాదులు, యాంకరులను సూచించును.
తెలివైనవారు, పండితులు, చరిత్రకారులు, గుమాస్తాలు, పెయింటర్లు, ఎడిటర్లు, రాయబారులు, విద్య, ఖాతాలు, దస్తూరి, వ్యాసములు, నవలలు, కల్పితాలు సామెతలు, చిన్నపుస్తకములు, ధృవీకరణపత్రాలు, వదంతులు, ప్రకటనలు, సత్యములు, యువకులు, వ్యాపారము, కేబుల్స్, డైరీలు, సైకిళ్ళు, గుర్రపుబండ్లు, చేతులు, కేటలాగు, పదనిఘంటువులు, వాహనములను సూచించును.
బుధుడు సుచించు విద్యలు :
బుధుడు గణీతము, ఎకౌంట్లు, డిజైన్లు, ప్లానులు గీయుట, చిత్రలేఖనము, పుస్తకప్రచురణ, పుస్తకముల వ్యాపారం, రచన, తర్కములను సూచిమ్చును. శుక్రునితో కలసి సినిమా వ్యాపారం, జీవశాస్త్రం, రసాయనశాస్త్రం, వృక్షశాస్త్రం, ఖగోళశాస్త్రం, జ్యోతిష్యశాస్త్రం, జర్నలిజంలను సూచించును. గురునితో కలసి ఉపాధ్యాయులు, ప్రొఫెసర్లు, బోధకులను సూచించును.
బుధుడు సూచించు వ్యాధులు :
మూగతనము, చెముడు, చర్మవ్యాధులు, మెదడుకు సంబంధించిన వ్యాధులు, పోలియో, నరముల బలహీనత, నత్తి, మాటలు ఆలస్యంగా రావటం, మూర్ఛ, ఫిట్సులను సూచించును. బుధుడు చంద్రునితో కలసి తరచుగా స్పృహకోల్పోవుట, హిస్టీరియా, మానసికవ్యాధి, అధికముగా మాట్లాడుట, కోమాలను సూచించును. బుధ్డు గురునితో కలసి మెదడువాపు వ్యాధి, శనితో కలసి అకస్మాత్తుగా నిద్రపోవుట, కుజునితో కలసి బ్రెయిన్ కాన్సర్ అధికంగా ఆలోచించుట, నరాలు చిట్లిపోవుటను సూచించును. రాహువుతో కలసి విషప్రయోగం, మెదడు చెడిపొవుటను, కేతువుతో కలసి హింసించు స్వభావంను సూచించును.
బుధుడు సూచించు వృత్తి వ్యాపారాలు :
ఎడిటర్స్, ఉపాధ్యాయులు, టైపిస్టు, స్టెనోగ్రాఫర్, శిల్పి, రాయబారి, మధ్యవర్తి, ఇన్సూరెన్స్ ఏజెంట్, జ్యోతిష్యుడు, రైల్వేఉద్యోగి, తంతితపాలాశాఖలోని ఉద్యోగస్థులు, కవి, రచయిత, కాషియర్స్, ఆడిటర్, బ్యాంకు, ట్రెజరీ, రెవెన్యూ శాఖలలో ఉద్యోగస్థులు, ఆదాయశాఖ, వాణిజ్యశాఖ, ఇంజనీరింగ్ శాఖ, న్యాయశాఖలలో ఉద్యోగస్థులను సూచించును. ఫింగర్ ప్రింట్ లను పరిశీలించువారు, ఎకౌంటెంట్లు, జర్నలిస్టులను సూచించును. శుక్రునితో చూడబడుతుంటే సంగీతం, రేడియో, ఆభరణాలు, దుస్తుల తయారీలను సూచించును.
బుధునికి మిత్రులు: సూర్య శుక్ర
బుధునికి శత్రువు: చంద్ర
బుధునికి సములు: మంగళ గురు శని రాహు కేతు

2, సెప్టెంబర్ 2012, ఆదివారం

నవగ్రహచార ఫలములు - కుజుడు

కుజగ్రహము
కుజుని లక్షణాలు : కుజుడు పురుశ గ్రహం. రుచులలో చేదును, రంగులలో ఎరుపురంగును సూచించును. క్షత్రియజాతికి చెందినవాడు. అధిదేవత పృధ్వి. అగ్నితత్త్వము కలిగి, దక్షిణదిక్కును సూచించును. సన్నని నడుము కలిగి వంకీల జుట్టు, కండలు కలిగిన, ఎరుపు రంగు ఛాయ కలిగిన వారిని సూచించును. 16 సంవత్సరముల వయస్సు కలవారిని సూచించును. పిత్తాధిక్యత కలవాడు. గ్రీష్మఋతువును సూచించును. లోహములలో ఇనుము, ఉక్కును, రత్నములలో పగడమును సూచించును. ఈ గ్రహసంఖ్య 6. దశమభావంలో దిగ్బలము పొందును. ఇతను తమోగుణ ప్రథానుడు. లంకాపట్టణము మొదలు కృష్ణానది వరకు ఇతని దేశమని జాతకపారితాజం తెలుపుతున్నది.
కుజుడు మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రములకు అధిపతి శరీరావయవములలో కండరాలు ఎముకలలోని మజ్జ, బాహ్య జననేంధ్రియములు, కణములను సూచించును. కుజుడు మేషం, వృశ్చిక రాశులకు అధిఅప్తి.. ఉచ్ఛరాశి మకరం. నీచరాశి కర్కటకం. మకరరాశిలో 28 వడిగ్రీ ఇతనికి పరమోచ్ఛ. అలాగే కర్కాటకంలో 28వ డిగ్రీ పరమనీచ. రవి, చంద్ర, గురులు ఇతనికి స్నేహితులు. బుదుడు శత్రువు. శుక్ర, శని ఇతనికి సములు.
కుజుని ప్రభావం :
శారీరక ధారుఢ్యము కలిగియుండి పొట్టిగా యుంటారు. త్వరగా ధనాన్ని సంపాదించగలరు. అంతేవేగంగా ధనాన్ని ఖర్చు పెట్టగలరు. బంధుమిత్రులంటే అపారమైన ప్రేమ. వీరు తమ ఆవేశాన్ని అదుపులో వుంచుకోవాలి. పదవి, అధికారం, సేవకులు కలిగియుంటారు. కోరికలు అధికంగా ఉంటాయి. దానధర్మాలు అధికంగా చేస్తారు. యంత్రములు, ఆయుధములు, మొదలగు శాస్త్రములలో ప్రావీణ్యత పొందుతారు. పోలీసు మిలటరీ వంటి శాఖలలో రాణిస్తారు.
కుజుని కారకత్వములు :
కుజుడు శక్తికి కారకుడు. అక్కాచెల్లెళ్ళు, ఆయుధములు, అగ్ని, వంటగది, శస్త్రచికిత్స, భూమి, బ్లడ్ బ్యాంకులు, ప్రేలుడు సామాను, బాంబులు, రసాయనాలు, అన్నిరకాల యంత్రాలను సూచించును. అసత్యము చెప్పుట, పరస్త్రీలతో సంబంధము, మూర్ఖత్వము, కోపము, కఠినముగా మాట్లాడుట, దోపిడీలు కొట్లాటలు, విప్లవములు, కిడ్నాపులు, కాల్పులను సూచించును. సీసము, క్రిరమృగములు, మశూచి, ఆటలమ్మ, అపెండిసైటిస్, హెమరేజ్ మొదలగు వ్యాధులను సూచించును. న్యాయవాదులు, న్యాయమూర్తులు, స్త్రీవ్యామోహులు, మాంత్రికులు, టెర్రరిస్టులను సూచించును. కాఫీ, టీ, పొగాకు, బీడీ, ఆవాలు, అల్లము, శొంఠి, వెల్లుల్లి, జీడిమామిడిని సూచించును.
కండపుష్టి, యుద్ధము, గాయాలు, హింస, అత్యాచారము, కత్తి, క్రూరత్వము, ధైర్యము, సాముగరిడీలు, సైన్యము, కలహాలు, ఆయుధసామాగ్రి, సాహసము, హంతకుడు, తిరుగుబాటుదారులు, ఫిరంగులు, దోపిడీదొంగ, మండుట, వేడిపరికరములు, కాట్లు, జ్వరాలు, పనులు, కోపము, పెళ్ళి, వంట, పాత్రలు, పగలగొట్టుట, పొయ్యి, బాక్సర్, రేడియేషన్, సలహాలు, సర్జన్ లు, ఇంజనీర్లు, ఆడపంది, కంచగాడిద, టార్పెడోలను సూచించును.
కుజుడు సూచించు విద్యలు :
కుజుడు అగ్రికల్చర్ డిగ్రీ, సివిల్ ఇంజనీరింగ్, మిలటరీ ఇంజినీరింగ్, ఎరోనాటికల్ ఇంజనీరింగ్, రసాయనవిద్య, ఆయుదముల తయారీ, అగ్ని మాపకములు, న్యాయవాదులు, విద్యుతుద్పాదన, బ్లాక్ స్మిత్ లను సూచించును.
కుజుడు సూచించు వ్యాధులు :
గాయములు, అబార్షన్, ఋతుక్రమము సరిగా లేకపోవుట, మశూచికం, ఆటలమ్మవ్యాధి, గవద బిళ్ళలు, అపెండిక్స్ వ్యాధి, హెర్నియలను కుజుడు సూచించును. కుజుడు బుధ్నితో కలసి చర్మరోగాలు, శుక్రునితో కలసి కండరములకు సంబంధించిన వ్యాధులు, హైడ్రోసిల్, రక్తనాళములు పగులుట, పైత్యరోగము, వ్రణములు, సెప్టిక్ అగుటను సూచించును. రాహువుతో కలసి విషప్రయోగము, శక్తి క్షీణించుట, ముసలితనము, విషకీటకముల వలన బాధలు, మెదడులో రక్తనాళములు చిట్లుట, తలనెప్పిలను సూచించును.
కుజుడు సూచించు వృత్తి వ్యాపారాలు :
మందులమ్మువారు, కెమిస్టులు, పోలీసు, మిలటరీవ్యక్తులు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్థులు, కసాయివారు, సర్జనులను సూచించును. వంటవారు, ఇనుము, ఉక్కు సంబంధించిన ఫ్యాక్టరీలలో పనిచేయువారు, లోహములతో వస్తువులు తయారు చేయువారిని సూచించును. పొగాకు, లక్క, కల్లు, సారాయి, బ్రాందీ, విస్కీ, కత్తి, గొడ్డలి, తుపాకి, జీడిపప్పు, వేరుశనగ, వక్క, టీ, కాఫీ, అల్లం మొదలగు వాటికి సంబంధించిన వ్యాపారాలను సూచించును. మోటారు, నిప్పు, గ్యాస్ లతో కూడిన వృత్తులను సూచించును. రవితో కూడిన మిలటరీ హాస్పిటల్ లో రవి, బుధులతో కలసి రక్షణశాఖలో ఆడిటర్, శనితో కలసి స్మశానంలో గుంటలు త్రవ్వేవారిని సూచించును.
కుజుని కి మిత్రులు :సూర్య చంద్ర గురు
కుజుని కి శత్రువులు : బుధ
కుజుని కి సములు: శుక్ర శని రాహు కేతు

1, సెప్టెంబర్ 2012, శనివారం

నవగ్రహచార ఫలములు-చంద్రుడు

చంద్ర గ్రహము

చంద్ర గ్రహ లక్షణాలు :
చంద్రుడు స్త్రీగ్రహము. రుచులలో ఉప్పును, రంగులలో తెలుపు రంగును సూచించును. వైశ్యజాతికి చెందినవాడు. అధిదేవత వరుణుడు. పొట్టిగా ఉండి, స్థూలశరీరం కలవారిని సూచించును. 70 సంవత్సరముల వయసు కలవారిని సూచించును. జలతత్త్వము కలిగి వాయువ్యదిశను సూచించును. వాత, శ్లేష్మ ప్రకృతి కలదు. చంద్రుడు వర్శఋతువును సూచించును. లోహములలో వెండిని, రత్నములలో ముత్యమును సూచించును. ఈ గ్రహసంఖ్య 7. చతుర్దభావంలో దిగ్బలము పొందును. ఇతను సత్వగుణప్రధానుడు. శుక్ల పక్షదశమి నుండి బహుళ పక్షపంచమి వరకు పూర్ణచంద్రుడని, బహుళపక్షచంద్రునినుండి అమావాస్య వరకు క్షీణచంద్రుడని, శుక్లపక్ష పాడ్యమి నుండి నవమి వరకు మధ్యమ కారకత్వములు. చంద్రుడని జాతక పారిజాతం తెలుపుతున్నది.
చంద్రుడు రోహిణి, హస్త, శ్రవణం నక్షత్రములకు అధిపతి. శరీరావయవములలో మగవారి ఎడమకన్ను, స్త్రీల కుడికన్ను, స్తనములు, గర్భసంచి, లింపులను సూచించును. చంద్రుడు కర్కాటకరాశికి అధిపతి. వృషభం లో 3వ డిగ్రీ నుండి 27 వ డిగ్రీ వరకు మూలత్రికోణం. ఇతనికి ఉచ్ఛరాశి వృషభం. నీచరాశి వృశ్చికం. వృషభంలో 3వడిగ్రీ ఇతనికి పరమోచ్ఛ. అలాగే వృశ్చికంలో 3వడిగ్రీ పరమనీచ. బుధ, రవి ఇతనికి స్నేహితులు. మిగిలినవారు సములు. చంద్రునికి శత్రువులు లేరు.
చంద్ర గ్రహ ప్రభావం :
చంద్రుని ప్రభావం కలిగినవారు చిన్నవయసులోనే శ్లేష్మవ్యాధులతో బాధపడుతారు. వీరికి నీటిగండం వున్నది. వీరు కొంతకాలం ధైర్యముగా, సంతోషంగా, ఉత్సాహంగా ఉంటారు.మరికొంతకాలం పిరికితనంతో, నిరాశతో నీరసంగా ఉంటారు. స్నేహితులు, అభిప్రాయాలు తరచుగా మారుచుండును. వివాహం తరువాత పెద్ద పొట్ట కలిగి ఉంటారు. కొంతకాలం దనవంతులుగా కొంతకాలం దరిద్రులుగా జీవిస్తారు. భోజనప్రియులు. స్వతంత్రించి ఏ పనిని చేయలేరు. నీటిపారుదలన, పబ్లిక్ వర్క్స్, వస్త్రములు, బియ్యము వ్యాపారము పానీయాల వ్యాపారములో రాణించగలరు. పాండురోగము, మధుమేహము, శ్వాసకోశవ్యాధులు,క్షయ కలుగవచ్చును.
చంద్రుడు మనస్సుకు కారకుడు. తల్లి, స్త్రీ, పూలు, నీరు, నీరుగల ప్రాంతములు అనగా సముద్రము, నది, నీటిగుంట మొదలగునవి, ముఖము, ఎడమకన్ను, పొట్ట, మహిళాసంఘములు, స్త్రీ సంక్షేమశాఖ, నౌకావ్యాపారము, ఓడరేవులు, వంతెనలు, ప్రాజెక్టులు, చేపల పెంపకం, వెండి, ముత్యము, చలిజ్వరము, రక్తహీనత, అతిమూత్రము, స్త్రీలకు వచ్చు వ్యాదులు, శ్వాసకోశ సంభందమైన వ్యాధులు, వరిబీజము, డయారియా, క్యాన్సర్ మొదలైన వ్యాధులను సూచించును. చెఱకు, తేనె, పాలు, పెరుగు, భోజనము, జొన్న, గోధుమలు, చేపలు, పంచదార, నెయ్యి, అరటిపండ్లు, దోసకాయలు, తమలపాకులు, గుమ్మడి, కేబేజీ, కాలీ ప్లవర్, కర్బూజా ఫలము, కుక్కగొడుగులు తాబేలు, బాతు, గుడ్లగూబ, గబ్బిలము, పిల్లి, నీటి గుర్రం, తిమింగలము, షార్క్ చేపలు, కర్పూరము, నికెలు, జర్మన్ సిల్వర్ సూచించును. సంగీతం, కవిత్వం, నాట్యం మొదలగు లలిత కళలు, పూలతోటలు, స్విమ్మింగ్ పూల్, వ్యవసాయం, వర్షం, వరద, వ్యాపారులను సూచించును.
పొత్తికడుపు, గుడ్లు, క్షీరదాలు, చేపలు, ఆవులు, పుట్టగొడుగులు, కాఫీవ్యాపారం, కుటుంబం, ఉతికే నీరు, చెట్లు, కోళ్ళ పరిశ్రమ, జీర్ణము, తరగతి, జున్ను, పొలములు, పంటలు, వంట, హోటళ్ళు, కాలువలు, బీరు, బ్రాందీ వంటి మత్తుపానీయాలు, సీసాలు, తూములు, డైరీ, అలవాట్లు, కోళ్ళ పరిశ్రమ, ముత్యాలు, అజీర్ణము, జీర్ణము, జున్ను, చదువు, చెట్లు, స్త్రీలు, ఎండదెబ్బ, సముద్రయానం, నౌకాయానములను సూచించును.
చంద్రుడు సూచించు విద్యలు :
చంద్రుడు చరిత్ర, మనస్తత్వశాస్త్రము, నీటిసరఫరా, నావికాశికషణా, కవిత్వమును సూచించును. చంద్రుడు శుక్రునితో కలసి పాలపరిశ్రమ, కుజ, శుక్రులతో కలసి పశువైద్యము, పౌరశాస్త్రము, మంత్రసానికి సంబందించిన విషయములను సూచించును.
చంద్రుడు సూచించు వ్యాధులు :
మానసిక ఆందోళన, ఎడమకంటికి సంబందించిన వ్యాధులు, పిచ్చి, గర్భాశయవ్యాధులను చంద్రుడు శుక్రునితో కలసి షుగర్ వ్యాధి ( మధుమేహము ) కుజునితో కలసి గర్భాశయం తీసివేయుటను సూచించును. గురునితో కలసి కడుపుకు సంబంధించిన వ్యాధులు, రొమ్ము క్యాన్సర్, శనిత్ కలసి అమీబియాస్ , దగ్గు, జలుబు, ఆస్త్మా, డిసెంట్రీ, ఋతుక్రమముకు సంబంధించిన వ్యాధులు, గర్భాశయ క్యాన్సర్, డ్రగ్ ఎడిక్ట్, బుధునితో కలసి మానసికరోగాలు, రాహువుతో కలసి మతి చాంచల్యం, ఇతరులను చంపాలనే ఆలోఛన, కేతువుతో కలసి బాలారిష్ట శిశుమరణాలు, ఊపిరితిత్తులలో జలుబు, శ్వాసకోశ సంబందమైన ఇబ్బందులు చంద్రుడు సూచించును.
చంద్రుడు సూచించు వృత్తి, వ్యాపారాలు :
నావికులు, మంత్రసానులు, నర్సులు, చేపలు పట్టువారు, హోటల్ కీపర్స్ మట్టితో బొమ్మలు చేయువారు, కుమ్మరులను సూచించును. బత్తాయి, అరటి, తాటిచెట్టు, కర్బూజాపండు, చెరకు, పాలు, పెరుగు, నెయ్యి, పంచదార, తమలపాకులు, కర్పూరము, చేపలు, వెండి, పండిన ఆహారముకు సంబంధించిన వ్యాపారములను సూచించును. చంద్రుడు కుజునితో సంబంధముంటే బాయిలర్ లతో వ్యాపారం, శనితో సంబంధముంటే శంఖువు వంటి సముద్ర గర్భంలోని వస్తువులతో వ్యాపారం, గురు, బుధులతో కలసి ఆడిటర్స్ ను, సేల్స్ మన్ లను వీధిలో వస్తువులను అమ్మువారిని సూచించును.
చంద్రునకు మిత్రులు: సూర్య బుధ
చంద్రునకు శత్రువులు
చంద్రునకు సములు: మంగళ గురు శుక్ర శని రాహు కేతు

31, ఆగస్టు 2012, శుక్రవారం

నవగ్రహచార ఫలములు -రవి

                    సూర్యుడు లేక రవి గ్రహము

రవి గ్రహ లక్షణాలు :
రవి పురుషగ్రహము ఇది రుచులలో కారమును, రంగులలో రక్తవర్ణమును సూచిస్తుంది. పొడుగైనవారిని, గోధుమరంగు జుట్టు కలవారిని, ఎర్రటి కనులు, పెద్దదయిన గుండ్రని ముఖము కలవారిని సూచిస్తుంది. ఇది క్షత్రియ జాతికి చెందినది. అధిదేవత అగ్ని. 50 సంవత్సరముల వయస్సుగల వారిని సూచించును. ఈ గ్రహము పిత్తము ప్రకృతిగా కలది. గ్రీష్మఋతువును సూచిస్తుంది. అగ్నితత్త్వము కలిగి తూర్పుదిక్కుకు అధిపతిగా ఉంటుంది. ఇది లోహములలో రాగిని, రత్నములలో మాణిక్యము (కెంపు) ను సూచిస్తుంది. ఈ గ్రహ సంఖ్య 1. దశమభావంలో దిగ్బలం కలుగును.
రవి కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాఢ నక్షత్రములకు అధిపతి. ఇది శరీరావయవములలో గుండె, రక్తము, పురుషుల కుడికన్ను, స్త్రీల యెడమకన్నును సూచించును. రవి సింహరాశికి అధిపతి. సింహంలో మొదటి 20 డిగ్రీలు దీనికి మూలత్రికోణము. ఇతనికి ఉచ్చరాశి మేషము. నీచరాశి తుల. మేషంలో 10వ డిగ్రీ ఇతనికి పరమోచ్చ. అలాగే తులలో 10వ డిగ్రీ ఇతనికి పరమనీచ. ఇతనికి చంద్ర, కుజ, గురులు స్నేహితులు. శని, శుక్రులు శత్రువులు. బుధుడు సముడు.
రవి ప్రభావం :
రవి ప్రభావితులకు ఆత్మాభిమానం, చురుకుదనం ఎక్కువ. ఇతరులను ఆకర్షించు గుణము కలిగియుంటారు. సంఘంలో పలుకుబడి వుంటుంది. విశాలహృదయులు. ఆవేశం ఎక్కువ. పొగడ్తలకు లొంగిపోతారు. సంపాదిస్తారు కానీ అశ్రద్ద వలన ఎక్కువ ఖర్చు చేస్తారు. నడివయస్సులో కంటి జబ్బులు రావచ్చు. ఆపత్కాలమున సరియైన ఆలోచనలు వస్తాయి. గుండెజబ్బు, వడదెబ్బ వలన ప్రమాదం కలుగవచ్చును.
రవి కారకత్వములు :
రవి ఆత్మకు కారకుడు. తండ్రి, శక్తి, అగ్ని, ప్రతాపము, ఆకాశము, తూర్పు, రాజ్యము, దేశాధిపత్యము, ముండ్లచెట్టు, మిరియాలు, మిరపకాయలు, బియ్యము, వేరుశనగ, కొబ్బరి, వాము, శివపూజ, శివభక్తులు, శివాలయములు, రక్తచందనం, సింహం, ఎలుగుబంటి, గుర్రము, సర్పము, కాకి, కోకిల, కోడి, హంస, ప్రభుత్వ కార్యాలయాలు, వైద్యులు, రిజర్వుబ్యాంకులను సూచించును. హృదయమునకు సంభందిమ్చిన వ్యాధులు, జ్వరము, మందులను సూచించును.
విమానాలు, విదేశీయులు, అసాధారణ విషయాలు, ఆందోళన, పరోపకారము, ఖగోళశాస్త్రము, అపాయసూచిక, విమానాశ్రయము, విమానచోదకవిద్య, బ్యాటరీ, భూకంపాలు, మార్పులు, విడాకులు, ఎలక్ట్రికల్ సామాను, డైనమో, బహిష్కరించుట, స్వతంత్రము, తుఫాను, రాడార్, విమానయానం, ఎలక్ట్రానిక్స్, రేడియో, టి.వి., పురాతనవస్తువులు, ఎక్సరే, విద్యుత్తు, సాంప్రదాయకరహితం, ఆదునికత, శాస్త్రవేత్తలు, నూతనభావాలు, నూతన కల్పన, ఆటంకములు, హెలికాప్టర్, హోమోసెక్సువల్, అరాఅచకము, కట్టుబాట్లను సూచించును.
రవి సూచించు విద్యలు :
రవి భౌతికశాస్త్రము, వైద్యశాస్త్రము, మేనేజిమెంటు కోర్సులు, రాజకీయ శాస్త్రములను సూచించును. రవి శుక్రునితో కలసి కంటివైద్యము ఉధునితో కలసి నరములు, చెవికి సంభందించిన వైద్యము, శనితో కలసి కార్డియాలజిస్టు, ఆర్థోపెడిక్స్, అనస్తీషియా వైద్యుడు, గురునితో కలసి ఆయుర్వేదము, కుజునితో కలసి సర్జన్ ను సూచించును.
రవి సూచించు వ్యాధులు :
అధికవేడి, జ్వరములు, ఎసిడిటీ, అల్సర్, గుండెజబ్బు, కుడి కంటికి సంభందించిన వ్యాధులు, రక్తముకు సంభందించిన వ్యాధులు, రక్తపోటులను రవి సూచిస్తుంది.
రవి సూచించు వృత్తి, వ్యాపారాలు :
రాగి, బంగారం, మందులు, రసాయనాలు, గోధుమలతో సంభందించిన వృత్తులను, ప్రభుత్వోద్యోగులను, స్థిరమైన వృత్తిని, వైద్యులను, మంత్రులను రవి సూచించును. రవి గురునితో కలసి ఫిజీషియన్ను, కుజునితో కలసి సర్జన్లను, బుధునితో కలసి రోగ నిర్ధారణకు సహాయాన్ని, గురు, శుక్రులతో కలసి మెటర్నిటీలో ప్రత్యేక శిక్షణను సూచించును. శుక్రునితో కలసి 5 లేదా 8వ స్థానంలో ఉంటే కంటివైద్యుడు, శనితో కలసి 1 లేదా 8 వ స్థానంలో ఉంటే డెంటిస్ట్, బుధునితో కలసి 5 లేదా 9వస్థానంలో ఉంటే ఇ.యన్.టి. స్పెషలిస్ట్ ను సూచించును.
రవికి మిత్రులు: చంద్ర మంగళ గురు
రవికి శత్రువు: శుక్ర శని రాహు కేతు
రవికి సములు: బుధ


ఈ బ్లాగును సెర్చ్ చేయండి



Related Posts Plugin for WordPress, Blogger...