శ్రీ మేధా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం

మీరు జన్మించిన తేది, సమయం, ప్రదేశం ఈ మూడు సమాచారములు మాకు తెలియచేసినచో మీ వ్రుత్తి,వ్యాపార,ఆరోగ్య,ఆర్ధిక పరిస్తితులు, దాంపత్యం, విద్య, ఉద్యోగ, వివాహ, కుటుంబవ్యవహారాలు, సంతానం, రాజకీయ వ్యవహారాలు,ప్రేమ వ్యవహారములు,కుజ దోషం, కాలసర్ప దోషం మరియు వివాహ, ఉపనయన, గృహప్రవేస, జప, హోమ, వ్రత, అన్నప్రసన, నామకరణం లకు ముహూర్తములు పెట్టబడును. P.V.RADHAKRISHNA CELL :+91 9966455872, Mail us : parakrijaya@gmail.com

14, సెప్టెంబర్ 2012, శుక్రవారం

గ్రహముల ద్వాదశ భావాశ్రయ ఫలము - రవి

 సూర్య:-

రవి లగ్నమందున్న ఫలము :

రవి లగ్నగతుడయిన అట్టి జాతకుడు అల్పకేశయుతుడు, చిరుపలుకులకే అలసత్వము నొందినవాడు, క్రోధి - ప్రచండస్వభావి - పొడగరి - గర్వి - అల్పదృష్టికలవాడు - ఉద్రేకి - కౄరహృధయుడు - నిర్గుణుడు అగును. అది కర్ణాటక లగ్నమయి అందు రవియున్న కనులయందు పూవులు కలవాడు, మేషము లగ్నమయి అందు రవియున్న నేత్రవ్యాధి పీడితుడు; రవి సింహమందుండి సింహలగ్నమయిన రేచీకటి కలవాడు; తులాలగ్నమయి అందు రవియున్న దారిద్ర్యపీడితుడూ, సంతాననష్టము పొందువాడూ అగును.

రవి ద్వితీయ, తృతీయ, చతుర్థములలో యున్న ఫలములు :

రవి ద్వితీయమునయున్న విద్యాహీనుడు, వినయములేనివాడు, నిర్ధనుడు, దుర్వచనప్రియుడు అగును. రవి తృతీయమునయున్న బలవంతుడు, ధైర్యవంతుడు, ధనవంతుడు, ఉదారుడూ అగును. కానీ, ఆప్తులయందు ద్వేషస్వభావియగును. రవి చతుర్థమునయున్న అట్టిజాతకుడు సుఖహీనుడు, బంధువులు లేనివాడు, క్షేత్రహీనుడు, స్నేహహీనుడు, గృహములేనివాడు అగును. ప్రభుత్వ ఉద్యోగి అగును. పిత్రార్జితమంతయా ఖర్చు పెట్టును.

రవి పంచమ, షష్ట, సప్తమ, అష్టమలయందున్న ఫలము :

రవి పంచమముయందున్న సుఖ, పుత్రహీనుడు, మరియూ అల్పాయుష్మంతుడు, జ్ఞాని, అరణ్యప్రదేశములయందు తిరుగువాడు అగును. రవి ఆరవయింటనున్న జాతకుడు రాజు, ఖ్యాతివంతుడు, ధనవంతుడు, విజయవంతుడు అగును. రవి యెనిమిదవ భావమున యున్న జాతకుడు తన ఆస్తిని పోగొట్టుకొనును. మిత్రనష్టము, అల్పాయుష్మంతుడు దృష్టిలోపము కలవాడగునో - అంధుడగునో యుండును.

రవి భాగ్య, రాజ్య, లాభ, వ్యయ క్షేత్రముల యందున్న ఫలము :

భాగ్యమున రవియున్న తండ్రిలేనివాడు, బంధుమిత్రపుత్రవంతుడు, దేవబ్రాహ్మణ భక్తి కలవాడూ అగును. రాజ్యకేంద్రమున రవియున్న జాతకుడు పుత్రవంతుడు, వాహనయుతుడు, కీర్తియశస్సు, భాగ్యమూకలవాడు, రాజూ అగును. రవి లాభస్థానమునయున్న జాతకుడు బహుధనవంతుడు, చిరంజీవి యగును. రాజు అగును. మరియూ విగశోకవంతుడు అగును. ద్వాదశమున రవియున్న పితృద్వేషి దోషదృష్టి కలవాడు, నిర్ధనుడు, అపుత్రవంతుడు అగును.

10, సెప్టెంబర్ 2012, సోమవారం

నవగ్రహచార ఫలములు - కేతువు

కేతు గ్రహము

కేతు గ్రహ లక్షణాలు :
కేతువు పురుషగ్రహము. చిత్రమైన రంగును రత్నములలో వైఢూర్యము (పిల్లికన్నురాయి) ను సూచించును. మ్లేచ్ఛజాతికి చెందిన తమోగుణ ప్రధానమైన గ్రహము. ఈ గ్రహము సంఖ్య 4. అంతర్వేది ప్రాంతమును సూచించును.
కేతువు అశ్వని, మఖ, మూల, నక్షత్రములకు అధిపతి. కేతుగ్రహదశ 7 సంవత్సరాలు. రవి, చంద్ర, కుజ, గురులు, ఇతనికి మిత్రులు.. బుద, శుక్ర, శని, రాహువులు శత్రువులు. బుద, గురులు సములు.
కేతు గ్రహ కారకత్వములు :
కేతువు తాత (తల్లికి తండ్రి), దైవోపాసన, వేదాంతము, తపస్సు, మోక్షము, మంత్రశాస్త్రము, భక్తి, నదీస్నానం, మౌనవ్రతం, పుణ్యక్షేత్ర దర్శనం, మోసము, పరులసొమ్ముతో ఆనందం, పరుల వాహనములు వాడుకొనుట, దత్తత, రాయి, ఆకలి లేకపోవుటను సూచించును. స్ఫోటకము, రక్తపోటు, చెముడు, నత్తి, దురదలు, గాస్, ఎసిడిటి, వికారములను సూచించును. కోడి, గ్రద్దలను సూచించును. స్నేహము, వైద్యము, జ్వరము, వ్రణములను సూచింఛును.
కేతువు సూచించు విద్యలు :
కేతువు ఏ గ్రహంతో సంబంధం కలిగివుంటే ఆ గ్రహానికి సంబంధించిన విద్యలను సూచించును.
కేతువు సూచించు వ్యాధులు :
కేతువు ఏ గ్రహంతో కలిస్తే ఆ గ్రహముకు సంబంధించిన అవయవము చెడిపోవునట్లు చేస్తాడు. రోగ నిర్ధారణ కానీయడు. దానివలన సరియైన చికిత్స చేయుటకు అవకాశం ఉండదు. ఇతను మృత్యుకారకుడు. అధికంగా భయపడుట, మతిస్థిమితం లేకపోవుట, రక్తపోటు, ఎలర్జీని సూచించును.
కేతువు సూచించు వృత్తి వ్యాపారాలు :
కేతువు ఏదో ఒక సంస్థకు చెందిన ఎగ్జిక్యూటివ్ లను సూచించును.
కేతువు, కుజునిచే సూచించు వృత్తులను సూచించును.
కేతువునకు మిత్రులు: బుధ శుక్ర శని రాహు
కేతువునకు శత్రువులు: సూర్య చంద్ర మంగళ
కేతువునకు సములు: గురు 


7, సెప్టెంబర్ 2012, శుక్రవారం

నవగ్రహచార ఫలములు - రాహువు

రాహు గ్రహము

రాహు గ్రహలక్షణాలు :
రాహువు స్త్రీ గ్రహము. ఇది నలుపురంగును, రత్నములలో గోమేధికమును సూచించును. అధిదేవత గౌరి. ఇది నైరుతి దిక్కును సూచించును.ఈ గ్రహసంఖ్య 2. పొడవైన వారిని, ముసలివారిని సూచించును. ఇతను తమోగుణ ప్రధానుడు బర్భరాదేశమును సూచించును.
రాహువు ఆరుద్ర, స్వాతి, శతభిషం నక్షత్రములకు అధిపతి. రాహుగ్రహదశ 18 సంవత్సరాలు. బుద, శుక్ర, శని ఇతనికి స్నేహితులు. రవి, కుజ, చంద్ర, గురువులు శత్రువులు, బుధ, గురులు సములు.
రాహు గ్రహ కారకత్వములు :
రాహువు పితామహుడు (తాత) , వృద్ధాప్యము, శ్వాస, భాష, అసత్యము, భ్రమ, వాయువు, విచారము, మరకతము, జూదరి, కఫము, సంధ్యాసమయము, రాజ్యము, బయటప్రదేశం, గొడుగు పల్లకి, అపరిశుభ్రము, నులిపురుగులు, గుల్మరోగము, విమర్శ, అంటరానితనము, జూదము, గార్డీ విద్య, పాములు, విషము, విశముతో కూడిన మందులు, పుట్టలు, నాగపూజ, ఎడమచెతితో వ్రాయుట, నీచ స్త్రీ సాంగత్యము, స్మశానము, దొంగతనము, భూతములు, వైద్య శాస్త్రమును సూహించును. నల్లులు, దోమలు, కీటకములు, గుడ్లగూబలును సూచించును. చర్మవ్యాధులు, గుండె నెప్పి, గుండె దడను సూచించును.
రాహువు సూచించు విద్యలు :
రాహువు ఏ గ్రహంతో సంబంధం కలిగి ఉంటే ఆ గ్రహానికి సంబంధించిన విద్యలను సూచించును.
రాహువు సూచించు వ్యాధులు :
రాహువు ఏ గ్రహంతో కలిస్తే ఆ గ్రహానికి సంబంధించిన అవయవము చెడిపోవ్టకు సహాయం చేస్తాడు. ఆయా గ్రహాల రోగాలను కలిగించుటకు ప్రయత్నిస్తాడు. విషాహారం తినుట, పాముకాటు, తేలుకాటు, కుష్ఠు, కాన్సర్ ను కలిగిస్తాడు.
రాహువు సూచించు వృత్తి వ్యాపారాలు :
రాహువు జైళ్ళు, క్రిమినల్ కోర్టులో ఉద్యోగస్థులును, ఎలక్ట్రిసిటీ, మోటారు, నిప్పు, గ్యాస్, ఇనుములకు సంబంధించిన పనులు చేయువారిని సూచించును. రాహువు, శనిచే సూచించబడు వృత్తులను సూచించును.
రాహువునకు మిత్రులు : బుధ శుక్ర శని కేతు
రాహువునకు శత్రువులు : సూర్య చంద్ర మంగళ
రాహువునకు సములు : గురు

6, సెప్టెంబర్ 2012, గురువారం

నవగ్రహచార ఫలములు - శని

శని గ్రహము

శని లక్షణాలు :
శని నపుంసక గ్రహం. ఇతను రుచులలో వగరును, రంగులలో నలుపును, నీలమును సూచించును. ఇతను శూద్ర జాతికి చెందినవాడు. అదిదేవత యముడు. ముసలివారిని సూచించును. సన్నని, పొడుగైన వారిని సూచించును. ఇతను వాత తత్త్వమును సూచించును. వాయు తత్త్వము కలిగి పడమర దిక్కును సూచించును. శని శిశిర ఋతువును సూచించును. లోహములలో ఇనుము, ఉక్కును, రత్నములలో నీలమును సూచించును. ఈ గ్రహసంఖ్య 8. సప్తమ భావంలో దిగ్బలము పొందును. ఇతను తమోగుణ ప్రదానుడు. గంగానది నుండి హిమాలయముల వరకు ఇతనిదేశంగా జాతక పారిజాతము సూచించును.
శని పుష్యమి, అనూరాద, ఉత్తరాభాద్ర నక్షత్రములకు అధిపతి. శరీరావయవములలో ఎముకలు, క్లోమము, విసర్జనావయవములను సూచించును. శని మకరం, కుంభం రాశులకు అధిపతి. ఇతనికి ఉచ్ఛరాశి తుల. నీచరాశి మేషం. తులలో 20వ డిగ్రీ ఇతనికి పరమోచ్ఛ. మేషం లో 20 వ డిగ్రీలో పరమనీచ. ఇతనికి బుధ, శుక్రులు స్నేహితులు, రవి, చంద్ర, కుజులు శత్రువులు. గురుడు సముడు.
శని ప్రభావం :
సన్నగా, పొడవుగా ఉంటారు. కన్నులు గుంటలు పడి వుండవచ్చు. అనుమానం ఎక్కువ. ఒంటరితనాన్ని కోరుకుంటారు. ఆకలి తక్కువగా ఉంటుంది. మూఢాచారపరులు కష్టజీవులు. దీర్ఘకోపము, దీర్ఘాలోచన ఎక్కువ. నడక, ఆలోచన మందంగా వుంటాయి.
వాతము, అజీర్ణము, శ్వాసకోశవ్యాధులు ఉండవచ్చును.
కార్మికశాఖ, ఆరోగ్యశాఖ, పరిసోధనాశాఖ, మారిటోరియంలలో రాణిస్తారు.
శని కారకత్వములు :
శని ఆయుః కారకుడు. ఆటంకములు, వ్యాధులు, కష్టములు, విరోధము, బాధలు, దుఃఖము, నౌకరీ, దురాచారము, మూర్ఖత్వము, బంధనము, జూదము, కారాగారము, మద్యపానము, అమ్గవైకల్యము, మూర్చరోగము, బ్లాక్ మార్కెట్, అన్యాయంతో ధనార్జన, జీవహింస, అవమానము, రాజదండన, బద్దకము, క్షుద్రశక్తులు, అప్పులు, మృత్యుదేవతారాధన, బంధువులచే తిరస్కారములను సూచించును. అందవిహీనులు, చండాలురు, నపుంసకులు, అక్రమసంతానము, సేవకులు, నీచులు, వంటవారు, పురాతన భవనములు, పురాతన వస్తువులు, పురాతన వస్తుశాఖ, సొరంగాలు, గుహలు, చలిప్రదేశములు, నువ్వుల నూనె, గానుగ, నూనె దుకాణములను సూచించును. నువ్వులు, ఉల్లి, వేరుశనగ, బంగాళాదుంపలు, రాగులు, జొన్నలు, మినుములు, దున్నపోతు, గాడిద, ఒంటె, కోడి, బొగ్గు, తారు, నల్లమందు, కిరోసిన్, ఎముకలు, వెంట్రుకలు, దంతములను సూచించును. కలప, తోలు పరిశ్రమలను సూచించును.
ఆలస్యము, పొదుపు, దుఃఖము, ఆటంకములు, దురదృష్టము, సరిహద్దులు, దహనకార్యక్రమములు, అపవాదు, పదవీవిరమణ, నిర్మాణము, శాస్త్రీయ దృక్పదం కలవారు, ఒంటరితనం, పురాతత్వశాస్త్రం, గనులు, బ్రిడ్జి, ధ్వని, చర్మము, ఆనకట్టలు, పిరికివారు, ఎముకలు రాళ్ళు, రాగి, మంచు, ఆస్తి, ఆపద, అనుమానము, అననుకూలత, ఆందోళన, సిరామిక్స్, వినయము, మట్టిని సూచించును.
శని సూచించు విద్యలు :
శని ఖనిజములు, బొగ్గుగనులు, పురాతన వస్తుసేకరణ, గనులు, భూగర్భ శాస్త్రము, జ్యోతిష్యము, ఇంగ్లీషుభాష, ఫ్రిజ్ ల తయారీ, ఆర్థోపెడిక్స్ లను సూచించును.
శని సూచించు వ్యాధులు :
వాత సంబంధమైన జబ్బులను శని కలిగిస్తాడు. కీళ్ళవాతం, పక్షవాతం, అవయవాలు బలహీనపడి పనిచేయకపోవటం, నొప్పులను సూచించును. కిడ్ని, లివరు ఇతర ప్రాంతాలలో రాళ్ళు ఏర్పడుట, బ్రోంకైటీస్, క్షయ, దగ్గు, ఆస్తమా, న్యుమోనియా వంటి ఊపిరితిత్తులకు సంబంధించిన వాధులను సూచించును. ఎముకలు ఇరిగిపోవుట, ఎముకల జాయింట్లు అరిగిపోవుట, ఎముకల కాన్సర్ వంటి ఎముకలకు సంబంధించిన వ్యాధులను, వెంట్రుకలు తెల్లబడడం, రాలిపోవడం, గోళ్ళు పుచ్చిపోవటం లను శని సూచించును. అజీర్ణము, అంధత్వం, కోమా, నడవలేనిస్థితి, ఏ పనిని చేయలేని స్థితి, డ్రగ్స్ కు బానిసకావటం, ఫ్రిజిడిటీ, నపుంసకత్వములను సూచించును. చంద్రునితో కలసి కంటిలో కాటరాక్ట్ (శుక్లాలు) ను, మతిభరమణం, గర్భాశయ వ్యాధులు, ప్రసవం సక్రామంగా జరగకపోవడం, పిచ్చి, మూర్ఛ, సన్నిపాత జ్వరం, గుండె నొప్పి, తలనొప్పి, కండరాల నొప్పి, అతిదాహం, నీరసం, బద్దకం, శరీరావయవములు మొద్దుబారటం లేదా చచ్చుబడటం వంటివాటిని సూచించును. గురునితో కలసి జీర్ణక్రియ సరిగా లేకపోవుట, కాలేయ వ్యాధులను, రవితో కలసి రక్తం చెడిపోవుట, కుడికంటికి సంబంధించిన వ్యాధులను, బుధునితో కలసి నత్తి, మాటలు రాకపోవటం, నాలుకమొద్దుబారటం, మెదడు మొద్దుబారటం, చెవికి సంబంధించిన రోగాలు, చెవుడు, కుజునితో కలసి కండరాల నొప్పి, కండరాలా జబ్బులను, శుక్రునితో కలసి గొంతునొప్పి, టాన్సిల్స్ వాయుట, అమీబియాస్, విరోచనాలు, పైల్సు పిస్టులా మొదలగు రోగాలను, రాహువుతో కలసి విషప్రయోగం, వైరస్ వలన కలిగే వ్యాధులు, కేతువుతో కలసి అధికరక్తపోటును సూచించును.
శని రోగకారకుడు, మరణ కారకుడు. శని ఏ జబ్బునైనా త్వరగా తగ్గనీయదు.
శని సూచించు వృత్తి వ్యాపారాలు :
జైలర్, పోలీస్, వాచ్ మన్, ప్లంబర్, పాకీ పని చేయు వారు, విధులను ఊడ్చేవారు, కూలీలు, మేస్త్రీ, తాపీమేస్త్రీ, తోటమాలి, రైతులను సూచించును.
లోహాలు, తోలు, కలప లకు సంబంధించిన డీలరులను సూచించును. చంద్రునితో కలసి సివిల్ ఇంజనీర్లు, బిల్డర్స్, సర్వేయర్లు, ఎక్సరే టెక్నీషియన్ లను సూచించును. అవితో కలసి ప్రభుత్వ సంస్థలలో స్థానిక సంస్థలలో పనిచేయు వారిని ,గురునితో కలసి రియల్ ఎస్టేట్ వ్యాపారస్థులు, గనుల యజమానులు, సైంటిఫిక్ ఏబొరేటరీలలో పనిచేయువారు, బ్యాంకు సిబ్బంది, ప్రచారం చేయువారిని, బుదునితో కలసి నవలారచయితలు, కలపను కోయువారు, శాస్త్రవేత్తలు, ఉపాధ్యాయులు, సెన్సార్ చేయువారు, రహస్య పరిశోధక సంస్థలలో పనిచేయువారలను సూచించును.
శనికి మిత్రులు: బుధ శుక్ర రాహు కేతు
శనికి శత్రువు: సూర్య చంద్ర మంగళ
శనికి సములు: గురు

5, సెప్టెంబర్ 2012, బుధవారం

నవగ్రహచార ఫలములు - శుక్రుడు

శుక్ర గ్రహము

శుక్ర గ్రహ లక్షణములు :
శుక్రుడు స్త్రీగ్రహం. ఇతను రుచులలో పులుపును, రంగులలో తెలుపు రంగును సూచించును. ఇతను బ్రాహ్మణ జాతికి చెందినవాడు. అధిదేవత ఇంద్రాణి, 7 సంవత్సరముల వయస్సు కలవారిని సూచించును. మనోహరమైన శరీరము, నల్లని వెంట్రుకలు కలవారిని, అందమైన వారిని సూచించును. ఇతను శ్లేష్మ, వాత తత్త్వములను సూచించును. జలతత్త్వము కలిగి ఆగ్నేయదిక్కును సూచించును. రత్నములలో వజ్రమును సూచించును. లోహములలో బంగారమును సూచించును. వసంతఋతువును సూచించును. ఈ గ్రహసంఖ్య 9. చతుర్థభావంలో దిగ్బలము పొందును. రజోగుణప్రధానమైన గ్రహము. కృష్ణానది నుండి గోదావరి వరకు ఇతని దేశంగా జాతక పారిజాతం సూచించును.
శుక్రుడు పుబ్బ, పూర్వాషాడ, భరణి నక్షత్రములకు అధిపతి. శరీరావయవములలో మూత్రపిండములు, అండములు, వీర్యము, సంతానోత్పత్తి వ్యవస్థను సూచించును. శుక్రుడు వృషభము, తుల రాశులకు అధిపతి. తులలో 10వ డిగ్రీ వరకు మూలత్రికోణము. ఇతనికి ఉచ్ఛరాశి మీనం. నీచరాశి కన్య. మీనంలో 27వ డిగ్రీ పరమోచ్ఛ. కన్యలో 27 వ డిగ్రీ పరమనీచ. ఇతనికి బుధశనులు స్నేహితులు. రవి, చంద్రులు శత్రువులు. కుజ, గురులు సములు. శుక్రదశ 20 సంవత్సరాలు.
శుక్రుని ప్రభావం :
అందమైనవారు, శరీరసౌష్టవం కలిగినవారు, సామాన్యంగా వీరికి బట్టతల యుండదు. సంగీతం అంటే ఆసక్తి ఎక్కువ. లలితకళలంటే ప్రీతి. జనాకర్షణ ఎక్కువ వీరికి సౌకుమార్యం చేత జనాకర్షణ ఉంటుంది. స్త్రీలోలత్వమును అదుపులో వుంచుకోవాలి. వీరు నటులు, గాయకులు.
వస్త్రములు, అలంకారసామాగ్రి, పూలు వంటి వాణీజ్యమున రాణిస్తారు. రక్తపోటు , రక్తసంబంధమైన వ్యాధులు సుఖవ్యాధులు కలుగవచ్చు.
శుక్రుని కారకత్వములు :
శుక్రుడు కళత్ర కారకుడు. శారీరక సుఖము, యౌవనము, సౌందర్యము, రాజసము, వినోదములు, రతిక్రీడలు, జలవిహారము, స్త్రీ, ఐశ్వర్యము, భూషణములు, నాటకము, మన్మధుడు, భరతనాట్యము, కామము, వీర్యము, కావ్యరచన, సంగీతం, వాహనములు, వస్త్రములు, శయినించు గది, వివాహం, గర్వం, తెల్లని వస్త్రములు, వాద్యముల సమ్మేళనం, సుగంధ ద్రవ్యములు, గౌరి, లక్ష్మీదేవి ఆలయములు, క్రీడాస్థలములు, పాలసరఫరా కేంద్రములు, పాలు, పాలకు సంబంధించిన వస్తువులు విక్రయించువారు, వస్త్రములను తయారు చేయు సంస్థలు, సౌందర్యసాధనములు, అలంకార ద్రవ్యములు, పరిమళద్రవ్యములు, వాటిని తయారు చేయు సంస్థలు, పెట్రోలు వాహనములు, వెండి, రత్నములను సూచించును. చెఱుకురసము, తీయని పానీయములు, బొబ్బర్లు, నిమ్మ, నారింజ, చింత మొదలగు వానిని సూచించును. అతిమూత్రవ్యాధి, చర్మవ్యాధి, కంటిరోగము గొంతుకు సంబంధించిన వ్యాధులు, సుఖవ్యాధులు, చర్మవ్యాధులును సూచించును.
శిల్పి, దర్జీ, స్త్రీ, బ్యుటీషియన్, స్వీట్లు తయారు చేయువారు, స్నేహితులు, బహుమతులు, హనీమూన్, విలాసాలు, వినోదాలు, శృంగారము, ప్రేమ, ఆభరణాలు, రెడీమేడ్ దుస్తులు, పంచదార, ఆనందమును అనుభవించుట, కాస్మెటిక్స్, పూలు, అలంకరణ, గృహాలంకరణ సాదనాలు, లౌక్యము, స్నేహము, లాభము, ఒప్పందము, ప్రేమ, అనురాగము, అమమ్కారము, లలితకళలు, అందము, ఆకర్షణ, కేశాలంకరణ, సంగీతము, సాంస్కృతిక కార్యక్రమాలు, దానములు, పొగడ్తలు, పెళ్ళి, తెలివితేటలను సూచించును.
శుక్రుడు సూచించు విద్యలు :
శుక్రుడు లలితకళలు, కావ్యములు, రసాయనశాస్త్రము, ఫొటోగ్రఫీ, సెక్స్ సైన్స్ లను సూచించును. గురుబుధులతో కలసి రేడియో, ట్రాన్సిస్టర్, టేపురికార్డర్, వైర్ లెస్ లు వాటికి సంబంధించిన కోర్సులు, టెక్స్ టైల్స్, సుగంధ ద్రవ్యములు, అలంకార సామాగ్రి, వాటి తయారీకి సంబంధించిన నైపుణ్యము, టైలరింగ్, పెయింటింగ్ లను సూచించును. శుక్రుడు, కుజుడు, బుధుడు, చంద్రుడు కలసి ఆటోమొబైల్ ఇంజినీరింగ్, గోల్డ్ స్మిత్ లను సూచించును.
శుక్రుడు సుచించు వ్యాధులు :
సుఖరోగాలు, కంటిజబ్బులు, మూత్రంలో అల్బుమిన్ పోవుట, స్త్రీలకు సంబంధించిన తెల్లబట్ట, పసుపుబట్ట, ఋతుక్రమం సరిగాలేకపోవుట, అండము అండాశయములకు కలిగే జబ్బులు మొదలగు అన్నిరకాల వ్యాధులను శుక్రుడు సూచించును. కుజునితో కలసి గొంతునొప్పి, గొంతువాపు, టాన్సిల్స్, గొంతు కాన్సర్ మొదలగు గొంతుకు సంబంధించిన వ్యాధులను, శనితో కలసి మితిమీరిన సంభోఅం వల్ల కలిగే వ్యాధులను, బుధునితో కలసి నపుంసకత్వం, కొజ్జాలతో సంభోగం, అసహజమైన శృంగార చేష్టలు, చర్మవ్యాధులు, మధుమేహం లను సూచించును. శుక్రుడు రాహువుతో కలసి సెక్స్ వలన కలిగే అంటురోగాలను, కేతువుతో కలసి అసహజమైన సెక్స్ వలన కలిగే ఇబ్బందులను నిస్సంతానాన్ని, శని, రాహువుతో కలసి ఎయిడ్స్ వ్యాధిని, గురువు, రాహువుతో కలసి యుటిరస్ కాన్సర్, సెర్విక్స్ కాన్సర్ ను సూచించును.
శుక్రుడు సూచించు వృత్తి వ్యాపారాలు :
సుగంధద్రవ్యములు, పట్టు వస్త్రములు అమ్మువారు, చాక్లెట్లు తయారు చేయువారు, హోటల్ వ్యాపారం, వాహనములు, పంచదార, ఉప్పులను అమ్మువారు, పాలు, నెయ్యి, రాగి, అభ్రకం, గాజు, ఫాన్సీవస్తువులు, గంధపునూనె, ర్టసాయనాలు, ప్లాస్టిక్, కలప, రబ్బరులతో కూడిన వ్యాపారాలు చేయ్వారిని శుక్రుడు సూచించును. సినిమా డైరెక్టర్, మేకప్ మేన్, నటులు, పాటలు పాడువారు, సంగీత విద్వాంసులు, చిత్రకారులు, ఫొటోగ్రాఫర్లు, నిర్మాతలను సూచించును. పెట్రోలు బంకు, కార్లు, విమానాలు, లారీలు, రైలు, టాక్సీ, ఆటోమొబైల్, సినిమా, పశువులు, ఆహారములకు సంబంధించిన సంస్థలను, వాటిలో పనిచేయువారిని సూచించును.
శుక్రునకు మిత్రులు : బుధ శని రాహు కేతు
శుక్రునకు శత్రువులు : సూర్య చంద్ర
శుక్రునకు సములు: మంగళ గురు

4, సెప్టెంబర్ 2012, మంగళవారం

నవగ్రహచార ఫలములు - గురుడు

గురు గ్రహము

గురుడు లక్షణములు :
గురుడు పురుష గ్రహము. ఇతను రుచులలో తీపిని, రంగులలో పసుపుపచ్చను సూచించును. ఇతను బ్రాహ్మణజాతికి చెందినవాడు. అధిదేవత బ్రహ్మ. గురుడు 30 సంవత్సరముల వయస్సు కలవారిని సూచించును. ఇతను స్థూలకాయులు, కపిల వర్ణపు వెంట్రుకలు,కండ్లు కలవారిని సూచించును. ఇతను కఫతత్త్వము కలవాడు. హేమంత ఋతువును సూచించును. ఆకాశతత్త్వము కలిగి ఈశాన్యదిశను సూచించును. లోహములలో బంగారమును, రత్నములలో పుష్యరాగమును సూచించును. ఈ గ్రహసంఖ్య 3. లగ్నములో దిగ్బలమును పొందును.
గోదావరి నుండి వింధ్యపర్వతం వరకు ఇతని దేశంగా జాతకపారిజాతం తెలుపుతున్నది. గురుడు పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర నక్షత్రములకు అధిపతి. శరీరావయవములలో కాలేయము, గాల్ బ్లాడర్, పేంక్రియాస్ లను సూచించును. గురుడు ధనస్సు, మీనరాశులకు అధిపతి. ఇతనికి ఉచ్ఛరాశి కర్కాటకం. నీచరాశి మకరం. కర్కాటకంలో 5వ డిగ్రీ పరమనీచ. ఇతనికి రవి, చంద్ర, కుజులు స్నేహితులు. బుధ, శుక్రులు శత్రువులు శని సముడు. గురుగ్రహదశ 16 సంవత్సరములు.
గురుడు ప్రభావం :
లావుకు తగ్గ పొడవును కలిగి మంచి ఆకారము కలిగినవారై వుంటారు. వీరికి ఆహారము, వస్త్రము, సౌఖ్యములకు కొదువ వుండదు. సంప్రదాయముల పట్ల నమ్మకము, దైవభక్తి వుంటాయి. పండితులు, చట్టము, ధర్మము అంటే గౌరవము. విద్యా సంస్థలతో సంబంధము కలిగియుంటారు. కంఠధ్వని చక్కగా వుంటుంది. విశాలమైన కనులు, నుదురు కలిగి యుంటారు.
అజీర్ణవ్యాధులు, శరీరము బరువుపెరుగుట వంటి అనారోగ్యములు కలుగవచ్చును.
దేవాలయములు, L.I.C బ్యాంకు, వంటి సంస్థలలో రాణిస్తారు. న్యాయశాస్త్రంలో ప్రవీణులు కాగలరు.
గురు కారకత్వములు :
గురుడు ధనకారకుడు, జ్యేష్ట సోదరుడు, పుత్రులు, సంతానం, ముత్తాత, విశేష బంధువులు, మంత్రి, యజ్ఞము, గౌరవము, దైవభక్తి, వేదములు, శాస్త్రములు, వేదాంతము, దానధర్మములు, బుద్ది, సత్యము, ఆచారము కలిగియుండుట, బంగారము, వైఢూర్యము సంస్కృత భాష, శబ్దములను సూచించును. బ్యాంకులు, ఖజానాలు, న్యాయస్థానములు, న్యాయమూర్తులు, దేవాలయములు, విద్యాలయములు, అధ్యాపకులు, బోధకులు, మతాధికారులు, మతసంస్థలు, ఆర్థికవ్యవహారములను సూచించును. కాలేయము, కాలేయమునకు సంబంధించిన వ్యాధులు, కాన్సర్ వ్యాధులను సూచించును. నెయ్యి, నూనె, క్రొవ్వు, వెన్న, శనగలు, దబ్బకాయలు, పనసకాయలను సూచించును. పావురము, హంసలు, గుర్రములు, ఏనుగులను సూచించును.
పుస్తకములు, కళాశాలలు, వైద్యులు, లాయర్లు, బిషప్ లు, చర్చి, పదవి, కరుణ, సంతోషము, పెట్టుబడి, అభివృద్ధి, ఐశ్వర్యము, పూజారులు, ఉపాసన, విదేశీయులు, భవిష్యత్తు, బహుమతులు, ఆచారాలు, బ్యాంకులు, ధనుర్విద్య, రేసులు, టైటిల్స్, వేదాంతము, చెల్లింపులు, నిజాయితీ, క్రమబద్దము ఉన్మాదములను సూచించును.
గురుడు సూచించు విద్యలు :
గురుడు బోధించేవారిని అనగా ఉపాధ్యాయులనుండి ప్రొఫెసర్ల వరకు సూచించును. బ్యాంకులు, ఆర్థికశస్త్రము, ధనము, బంగారము, సంస్కృతభాష, పురాణాలు, నోట్లముద్రణ వేదాంతములను సూచించును.
గురుడు సూచించు వ్యాధులు :
మధుమేహవ్యాధి, కాలేయము, గాల్ బ్లాడర్ కు సంబంధించిన వ్యాధులు, బోదకాలు, శరీరంలో నీరు చేరుట, నిస్సంతానం, కాన్సర్ లను గురువు సూచించును. గురుడు చంద్రునితో కలసి గర్భాశయముకు సంబంధించిన ఇబ్బందులు, గర్భాశయ కాన్సర్ శుక్రునితో కలసి మధుమేహవ్యాధి, విచిత్రమైన సెక్సు కోరికలు, అసహజంగా పెరిగే శరీరాంగములను సూచించును. రవితో కలసి లుకేమియా, విపరీతంగా కొలొస్టరాల్ ఏర్పడుట, మూత్రపిండముల వ్యాధి, లివర్ కు సంబంధించిన వ్యాధులు, పచ్చకామెర్లు, కఫంచేయుట, అతిమూత్రవ్యాధిని సూచించును. విపరీతమైన ఆకలి, అజీర్ణము, అతికాయములను కూడ గురుడు సూచించును.
గురుడు సూచించు వృత్తి వ్యాపారాలు :
న్యాయవాదులు, న్యాయమూర్తులు, బోధకులు, ఉపాధ్యాయులు, సామాజిక రచయితలు, మతప్రవక్తలు, పురోహితులు, ప్రభుత్వోద్యోగులలో ఉన్నత స్థానంలో పేరు పొందువారు, మతప్రచారకులు, రవి లేదా చంద్రులతో కూడిన రాజకీయాలు, బ్యాంకు వ్యవహారములు, అధ్యక్షులు, మేయరు, కౌన్సిలర్, పార్లమెంటు మెంబరు, మేనేజరు, మేనేజింగ్ డైరెక్టర్ లను సూచించును. బుధునితో కలసి విదేశీభాషలు, ఎగుమతులు, దిగుమతులు, సివిల్ ఇంజినీరింగ్ లను సూచించును.
గురువు నకు మిత్రులు: సూర్య చంద్ర మంగళ
గురువు నకు శత్రువులు : బుధ శుక్ర
గురువు నకు సములు: శని రాహు కేతు

3, సెప్టెంబర్ 2012, సోమవారం

నవగ్రహచార ఫలములు - బుధుడు

బుధ గ్రహము

బుధు ని లక్షణాలు :
బుధుడు నపుంసక గ్రహము. ఇతను రుచుల మిశ్రమమును తెలియజేయును. రంగుఅలలో ఆకుపచ్చరంగును సూచించును. ఇతను వైశ్యజాతికి చెందినవాడు. అధిదేవత విష్ణువు. గుండ్ర్ని ఆకారం కలిగి, పొడవైన వారిని సూచించును. 20 సంవత్సరాలా వయసు వారిని సూచించును. ఇతను వాత, కఫ, పిత్తముల మిశ్రమ తత్త్వము కల్వాడు. హరదృతువును సూచించును. పృధ్వీతత్త్వము కలిగి ఉత్తరదిక్కును సూచించును. లోహములలో కంచు, ఇత్తడి ( మిశ్రమలోహములను ) సూచించును. రత్నములలో మరకతను ( పచ్చ ) ను సూచించును. సంఖ్య 5 . లగ్నములో దిగ్బలమును పొందు రజోగుణప్రధానమైన గ్రహము. వింధ్యపర్వతం నుండి గంగానది వరకు ఇతనిదేశంగా జాతక పారిజాతం చెపుతున్నది.
బుధుడు ఆశ్రేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రములకు అధిపతి శరీరావయవములలో మెదడు, చర్మము, నరములను సూచించును. బుధుడు మిధునము, కన్యారాశులకు అధిపతి. కన్యలో 15వడిగ్రీ నుండి 20వ డిగ్రీవరకు మూల త్రికోణము. ఇతనికి ఉచ్చరాశి కన్య. నీచరాశి మీనం. కన్యలో 15వ డిగ్రీ ఇతనికి పరమోచ్చ. అలాగే మీనంలో 15వడిగ్రీ ఇతనికి పరమనీచ. ఇతనికి రవి, శుక్రులు స్నేహితులు. చంద్రుడు శత్రువు. కుజ, గురు, శని సములు. బుధగ్రహదశ 17 సంవత్సరాలు.
బుధు ని ప్రభావం :
ఎల్లప్పుడు సంతోషంగా వుంటారు. వీరి పెదవులపై చిరునవ్వు మెదులుతూ వుంటుంది. పొట్టిగా వుంటారు. చురుకైనవారు. వృద్ధాప్యంలో కూడా యువకుల వలె వుంటారు. నాటకరచయితలు, నటులు, విషయజ్ఞానం ఎక్కువగానే వుంటుంది. దీర్ఘాలోచనా పరులు, సందేహపరులు.
తలనొప్పి, నరముల వ్యాధులు, అలసరువంటి వ్యాధులు రావచ్చు.
రేడియో, టి.వి., పత్రికారంగం, ప్రచురణరంగం, టెలిఫోన్ రంగాలలో రాణిస్తారు.
బుధు ని కారకత్వములు :
బుధుడు వాక్ కారకుడు, మేనమామ, మేనల్లుడు, మేనకోడలు మాతమహుడు, ఉపన్యాసములో నైపుణ్యం, లలితకళలు, గణితశాస్త్రం, వ్యాపార శాస్త్రం, అర్ధశాస్త్రం, జ్యోతిష్యం, ఖగోళశాస్త్రం, వాణిజ్యం, వ్యాకరణము, వివిదరకాల భాషలు, శిల్పి, మంత్రం, తంత్రం, వివేకం, పుస్తక ప్రచురణ, గ్రంథాలయం, విష్ణుభక్తి, విష్ణాలయం, వైష్ణవభక్తులు, మధ్యవర్తిత్వం, వైద్యులను సూచించును. నాభి, నరము, నాలుక, స్వరపేటిక, చర్మములను సూచించును. నరముల బలహీనత, మూర్ఛ, చెముడు, మెదడుకు సంబంధించిన వ్యాధులను సూచించును. అన్నిరకముల ఆకుకూరలు, కూరగాయలను సూచించును. ఉపాధ్యాయులు, ఉపన్యాసకులు, న్యాయవాదులు, యాంకరులను సూచించును.
తెలివైనవారు, పండితులు, చరిత్రకారులు, గుమాస్తాలు, పెయింటర్లు, ఎడిటర్లు, రాయబారులు, విద్య, ఖాతాలు, దస్తూరి, వ్యాసములు, నవలలు, కల్పితాలు సామెతలు, చిన్నపుస్తకములు, ధృవీకరణపత్రాలు, వదంతులు, ప్రకటనలు, సత్యములు, యువకులు, వ్యాపారము, కేబుల్స్, డైరీలు, సైకిళ్ళు, గుర్రపుబండ్లు, చేతులు, కేటలాగు, పదనిఘంటువులు, వాహనములను సూచించును.
బుధుడు సుచించు విద్యలు :
బుధుడు గణీతము, ఎకౌంట్లు, డిజైన్లు, ప్లానులు గీయుట, చిత్రలేఖనము, పుస్తకప్రచురణ, పుస్తకముల వ్యాపారం, రచన, తర్కములను సూచిమ్చును. శుక్రునితో కలసి సినిమా వ్యాపారం, జీవశాస్త్రం, రసాయనశాస్త్రం, వృక్షశాస్త్రం, ఖగోళశాస్త్రం, జ్యోతిష్యశాస్త్రం, జర్నలిజంలను సూచించును. గురునితో కలసి ఉపాధ్యాయులు, ప్రొఫెసర్లు, బోధకులను సూచించును.
బుధుడు సూచించు వ్యాధులు :
మూగతనము, చెముడు, చర్మవ్యాధులు, మెదడుకు సంబంధించిన వ్యాధులు, పోలియో, నరముల బలహీనత, నత్తి, మాటలు ఆలస్యంగా రావటం, మూర్ఛ, ఫిట్సులను సూచించును. బుధుడు చంద్రునితో కలసి తరచుగా స్పృహకోల్పోవుట, హిస్టీరియా, మానసికవ్యాధి, అధికముగా మాట్లాడుట, కోమాలను సూచించును. బుధ్డు గురునితో కలసి మెదడువాపు వ్యాధి, శనితో కలసి అకస్మాత్తుగా నిద్రపోవుట, కుజునితో కలసి బ్రెయిన్ కాన్సర్ అధికంగా ఆలోచించుట, నరాలు చిట్లిపోవుటను సూచించును. రాహువుతో కలసి విషప్రయోగం, మెదడు చెడిపొవుటను, కేతువుతో కలసి హింసించు స్వభావంను సూచించును.
బుధుడు సూచించు వృత్తి వ్యాపారాలు :
ఎడిటర్స్, ఉపాధ్యాయులు, టైపిస్టు, స్టెనోగ్రాఫర్, శిల్పి, రాయబారి, మధ్యవర్తి, ఇన్సూరెన్స్ ఏజెంట్, జ్యోతిష్యుడు, రైల్వేఉద్యోగి, తంతితపాలాశాఖలోని ఉద్యోగస్థులు, కవి, రచయిత, కాషియర్స్, ఆడిటర్, బ్యాంకు, ట్రెజరీ, రెవెన్యూ శాఖలలో ఉద్యోగస్థులు, ఆదాయశాఖ, వాణిజ్యశాఖ, ఇంజనీరింగ్ శాఖ, న్యాయశాఖలలో ఉద్యోగస్థులను సూచించును. ఫింగర్ ప్రింట్ లను పరిశీలించువారు, ఎకౌంటెంట్లు, జర్నలిస్టులను సూచించును. శుక్రునితో చూడబడుతుంటే సంగీతం, రేడియో, ఆభరణాలు, దుస్తుల తయారీలను సూచించును.
బుధునికి మిత్రులు: సూర్య శుక్ర
బుధునికి శత్రువు: చంద్ర
బుధునికి సములు: మంగళ గురు శని రాహు కేతు

ఈ బ్లాగును సెర్చ్ చేయండి



Related Posts Plugin for WordPress, Blogger...