శ్రీ మేధా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం

మీరు జన్మించిన తేది, సమయం, ప్రదేశం ఈ మూడు సమాచారములు మాకు తెలియచేసినచో మీ వ్రుత్తి,వ్యాపార,ఆరోగ్య,ఆర్ధిక పరిస్తితులు, దాంపత్యం, విద్య, ఉద్యోగ, వివాహ, కుటుంబవ్యవహారాలు, సంతానం, రాజకీయ వ్యవహారాలు,ప్రేమ వ్యవహారములు,కుజ దోషం, కాలసర్ప దోషం మరియు వివాహ, ఉపనయన, గృహప్రవేస, జప, హోమ, వ్రత, అన్నప్రసన, నామకరణం లకు ముహూర్తములు పెట్టబడును. P.V.RADHAKRISHNA CELL :+91 9966455872, Mail us : parakrijaya@gmail.com

6, మార్చి 2013, బుధవారం

గ్రహముల గోచార ఫలములు

సూర్యడు:-
  • చంద్రలగ్నంలోనే ఉంటే జాతకుడు కుటుంబానికి దూరంగా ఉంటాడు. పనులకు ఆటంకాలు కలుగుతాయి. అనవసరశ్రమ, అనారోగ్యం కలుగుతుంది.
  • చంద్రలగ్నం లగాయతు రెండవరాశిలో ఉంటే అనవసరశ్రమ, అనారోగ్యం, అశాంతి కలుగుతాయి.
  • చంద్రలగ్నం లగాయతు మూడవరాశిలో ఉంటే మిత్రుల సహకారం, ఉద్యోగంలో అభివృద్ధి, ధనలాభం, సుఖశాంతులు లభిస్తాయి.
  • చంద్రలగ్నం లగాయతు నాలుగవరాశిలో ఉంటే కుటుంబంలో కలహాలు, ఋణబాధ కలుగుతాయి.
  • చంద్రలగ్నం లగాయతు అయిదవరాశిలో ఉంటే బంధువియోగం , దుఃఖము, అశాంతి కలుగును.
  • చంద్రలగ్నం లగాయతు ఆరవరాశిలో ఉంటే అనుకున్న పనులు నెరవేరుతాయి. ధనలాభం, కుటుంబంలో సుఖశాంతులు కలుగుతాయి. అనారోగ్యం కలుగుతుంది.
  • చంద్రలగ్నం లగాయతు ఏడవరాశిలో ఉంటే అధికప్రయాణాలు, అనారోగ్యం, దాంపత్యసుఖం లేకపోవుట, ఆందోళన కలుగుతుంది.
  • చంద్రలగ్నం లగాయతు ఎనిమిదవరాశిలో ఉంటే కుటుంబకలహాలు, అనారోగ్యం, అశాంతి, ధననష్టం కలుగుతాయి.
  • చంద్రలగ్నం లగాయతు తొమ్మిదవరాశిలో ఉంటే అనవసర కలహాలు, మనశ్శాంతి లేకపోవుట, ధనవ్యయం కలుగుతాయి.
  • చంద్రలగ్నం లగాయతు పదవరాశిలో ఉంటే అనుకున్న పనులు నెరవేరుతాయి. మిత్రులతో విందులు చేసుకుంటారు.
  • చంద్రలగ్నం లగాయతు పదకొండవరాశిలో ఉంటే వృత్తిలో అభివృద్ధి, కుటుంబంలో ఆనందం, ధనలాభం కలుగుతాయి.
  • చంద్రలగ్నం లగాయతు పన్నెండవరాశిలో ఉంటే మితులకు దూరంగా ఉంటారు. ఆందోళన, ధననష్టం కలుగుతుంది.
  • రవి శుభస్థానములు 3,6,10,11
  • రవి వేధాస్థానములు 9,12,4,3
  • శుభస్థానములలో ఉన్నగ్రహము, ఆగ్రహము యొక్క వేధా స్థానములలో ఏదైనా గ్రహము ఉంటే శుభఫలితాన్ని ఇవ్వలేదు. 
 చంద్రడు:-

  • చంద్రలగ్నంలోనే ఉంటే కుటుంబసౌఖ్యం, ఆరోగ్యం, గౌరవం కలుగుతుంది.
  • చంద్రలగ్నం లగాయతు రెండవరాశిలో ఉంటే ధనవ్యయం, కార్యహాని, అపనిందలు, ఇతరులతో విభేదాలు కలుగుతాయి.
  • చంద్రలగ్నం లగాయతు మూడవరాశిలో ఉంటే మిత్రుల సహకారమ్, ఉద్యోగంలో అభివృద్ధి, ధనలాభం, కుటుంబసౌఖ్యం కలుగుతాయి.
  • చంద్రలగ్నం లగాయతు నాలుగవరాశిలో ఉంటే బంధువులతో విభేదాలు, కార్యహాని, ఆందోళన కలుగుతాయి.
  • చంద్రలగ్నం లగాయతు అయిదవరాశిలో ఉంటే పనులు నెరవేరవు. అనారోగ్యము ఏర్పడుతుంది.
  • చంద్రలగ్నం లగాయతు ఆరవరాశిలో ఉంటే నూతన వస్తువులు సమకుర్చుకుంటారు. బంధుమిత్రులతో వినోద కాలక్షేపం చేస్తారు. స్త్రీ సాంగత్యం కలుగుతుంది.
  • చంద్రలగ్నం లగాయతు ఏడవరాశిలో ఉంటే బంధువుల సమాగమం, విలాస యాత్రలు చేయుట, స్త్రీసౌఖ్యం కలుగుతుంది.
  • చంద్రలగ్నం ఎనిమిదవరాశిలో ఉంటే మానసిక ఒత్తిడి, అనారోగ్యం కలుగుతాయి.
  • చంద్రలగ్నం తొమ్మిదవరాశిలో ఉంటే మానసిక ఆందోళన, నిరాశ, బలహీనత ఏర్పడుతాయి.
  • చంద్రలగ్నం లగాయతు పదవరాశిలో ఉంటే అధికారంలో అభివృద్ధి, కుటుంబంలో సుఖసంతోషాలు, ఆర్థికాభివృద్ధి కలుగుతాయి.
  • చంద్రలగ్నం లగాయతు పదకొండవరాశిలో ఉంటే నూతన వ్యక్తులతో పరిచయాలు, స్త్రీ సాంగత్యం, కుటుంబాభివృద్ధి కలుగుతాయి.
  • చంద్రలగ్నం లగాయతు పన్నెండవరాశిలో ఉంటే మిత్రులతో విభేదిస్తారు. పనులు నెరవేరవు.
  • చంద్రుడు శుభస్థానములు1,3,6,7,10,11
  • వేధాస్థానములు 5,9,12,2,4,8
  • శుభస్థానములలో ఉన్నగ్రహము, ఆగ్రహము యొక్క వేధా స్థానములలో ఏదైనా గ్రహము ఉంటే శుభఫలితాన్ని ఇవ్వలేదు.
కుజుడు:-
  • చంద్రలగ్నంలోనే ఉంటే బంధువులతో తగాదాలు, ధననష్టం, కార్యహాని, కలుగుతాయి.
  • చంద్రలగ్నం లగాయతు రెండవరాశిలో ఉంటే అధికారుల వలన భయం, అనవసరశ్రమ కలుగుతాయి.
  • చంద్రలగ్నం లగాయతు మూడవరాశిలో ఉంటే అనుకున్న పనులు నెరవేరుతాయి. సంతానసుఖము, ఆరోగ్యం, ఉద్యోగంలో అభివృద్ధి కలుగుతాయి.
  • చంద్రలగ్నం లగాయతు నాలుగవరాశిలో ఉంటే ఇతరులను నమ్మిమోసపోతాడు. అనారోగ్యం కలుగుతుంది.
  • చంద్రలగ్నం లగాయతు అయిదవరాశిలో ఉంటే కుమారునివలన మనశ్శాంతి కోల్పోవుదురు. కోపము, బలహీనత కలుగును.
  • చంద్రలగ్నం లగాయతు ఆరవరాశిలో ఉంటే కార్యసిద్ధి కలుగుతుంది. నూతన వస్తువులను సేకరిస్తారు.
  • చంద్రలగ్నం లగాయతు ఏడవరాశిలో ఉంటే బంధుమిత్రులతో విభేదాలు, అశాంతి కలుగుతుంది.
  • చంద్రలగ్నం ఎనిమిదవరాశిలో ఉంటే నిరాశ, అశాంతి, అనారోగ్యం కలుగుతాయి.
  • చంద్రలగ్నం తొమ్మిదవరాశిలో ఉంటే ప్రయాణాలు, ధననష్టం, అవమానము, ఆందోళన కలుగుతాయి.
  • చంద్రలగ్నం లగాయతు పదవరాశిలో ఉంటే ప్రయాణాలు, ధననష్టం, అవమానము, ఆందోళన కలుగుతాయి.
  • చంద్రలగ్నం లగాయతు పదకొండవరాశిలో ఉంటే అనుకున్న పనులు జరుగుతాయి. భూ, ధనలాభం, స్త్రీసౌఖ్యం పొందుతారు.
  • చంద్రలగ్నం లగాయతు పన్నెండవరాశిలో ఉంటే అధిక ధనవ్యయం, స్త్రీలతో వైఅరం కలుగుతాయి.
  • కుజుడు శుభస్థానములు 3,6,11
  • కుజుడు వేధాస్థానములు12,9,5
  • శుభస్థానములలో ఉన్నగ్రహము, ఆగ్రహము యొక్క వేధా స్థానములలో ఏదైనా గ్రహము ఉంటే శుభఫలితాన్ని ఇవ్వలేదు.
 బుధుడు:-
  • చంద్రలగ్నంలోనే ఉంటేనీచులతో స్నేహం, బంధువులతో విరోధం, ఆస్తినష్టం కలుగుతుంది.
  • చంద్రలగ్నం లగాయతు రెండవరాశిలో ఉంటే అనుకున్న పనులు నెరవేరుతాయి. ధనలాభం కలుగుతుంది. కాని అవమానం పొందుతారు.
  • చంద్రలగ్నం లగాయతు మూడవరాశిలో ఉంటే మిత్రుల సహకారం లభిస్తుంది. బంధువులతో, అధికారులతో విభేదాలు కలుగుతాయి. ధనవ్యయం జరుగుతుంది.
  • చంద్రలగ్నం లగాయతు నాలుగవరాశిలో ఉంటే బంధు, మిత్రుల సహకారం, దనము, సుఖము లభించును.
  • చంద్రలగ్నం లగాయతు అయిదవరాశిలో ఉంటే కుటుంబం లో కలహాలు, అశాంతి ఏర్పడుతాయి. సుఖసంతోషాలు లభిస్తాయి.
  • చంద్రలగ్నం లగాయతు ఆరవరాశిలో ఉంటే నాయకుడు అవుతాడు. ధనవృద్ధి కలుగుతుంది. సుఖ సంతోషాలు లభిస్తాయి.
  • చంద్రలగ్నం లగాయతు ఏడవరాశిలో ఉంటే కార్యహాని, కలహాలు, ధనవ్యయం, అశాంతి కలుగుతాయి.
  • చంద్రలగ్నం ఎనిమిదవరాశిలో ఉంటే అధికారుల అండ లభిస్తుంది. అనుకున్న పనులు నెరవేరును. ఆనందం పొందుతారు.
  • చంద్రలగ్నం తొమ్మిదవరాశిలో ఉంటే బద్దకం పెరుగుతుంది. నీచకార్యాలపై ఆసక్తి కలుగుతుంది.
  • చంద్రలగ్నం లగాయతు పదవరాశిలో ఉంటే ఉద్యోగాభివృద్ది, కీర్తి, ధనము లభిస్తాయి.
  • చంద్రలగ్నం లగాయతు పదకొండవరాశిలో ఉంటే నూతన వ్యక్తుల పరిచయం, సంఘం లో గౌరవం ఏర్పడుతాయి. అనుకున్న పనులు సాధిస్తారు.
  • చంద్రలగ్నం లగాయతు పన్నెండవరాశిలో ఉంటే కుటుంబంలో సమస్యలు, శత్రువుల వలన బాధలు, అపజయము కలుగుతాయి.
  • బుధుడు శుభస్థానములు 2,4,6,8,10,11
  • బుధుడు వేధాస్థానములు 5,3,9,1,7,12
  • శుభస్థానములలో ఉన్నగ్రహము, ఆగ్రహము యొక్క వేధా స్థానములలో ఏదైనా గ్రహము ఉంటే శుభఫలితాన్ని ఇవ్వలేదు. 
 గురుడు:-
  • చంద్రలగ్నంలోనే ఉంటే ప్రయాణాలు, ధనవ్యయం, ఆందోళన, బంధువులతో విభేదాలు కలుగుతాయి.
  • చంద్రలగ్నం లగాయతు రెండవరాశిలో ఉంటే స్త్రీసౌఖ్యం, అధికారం లభిస్తాయి. ధనార్జన ఉంటుంది.
  • చంద్రలగ్నం లగాయతు మూడవరాశిలో ఉంటే స్థానచలనము, పనులకు ఆటంకాలు ఏర్పడుతాయి
  • చంద్రలగ్నం లగాయతు నాలుగవరాశిలో ఉంటే ఉద్యోగంలో ఇబ్బందులు, అధికారం కోల్పోవుట, ఆందోళన కలుగుతాయి.
  • చంద్రలగ్నం లగాయతు అయిదవరాశిలో ఉంటే మిత్రుల సహకారం, ధనము, అదికారము లభించును. శుభకార్యములు నెరవేర్చుదురు.
  • చంద్రలగ్నం లగాయతు ఆరవరాశిలో వుంటే శ్రమపడినా ఫలితం దక్కదు. దాంపత్యసుఖం లభించదు.
  • చంద్రలగ్నం లగాయతు ఏడవరాశిలో ఉంటే సమాజంలో గౌరవం, కుటుంబ సుఖం, ధనలాభం కలుగుతాయి.
  • చంద్రలగ్నం ఎనిమిదవరాశిలో ఉంటే ప్రయాణాలు, అనవసర శ్రమ, ధననష్టం కలుగుతాయి.
  • చంద్రలగ్నం తొమ్మిదవరాశిలో ఉంటే అనుకున్న పనులు జరుగుతాయి. కుటుంబసఖము, అధికారము లభిస్తాయి.
  • చంద్రలగ్నం లగాయతు పదవరాశిలో ఉంటే వృత్తిపరంగా, కుటుంబపరంగా ఇబ్బందులు కలుగుతాయి.
  • చంద్రలగ్నం లగాయతు పదకొండవరాశిలో ఉంటే ఉద్యోగం, అధికారం, దనము, సుఖము లభిస్తాయి.
  • గురుడు శుభస్థానములు 2,5,7,9,11
  • గురుడు వేధాస్థానములు 12,4,3,10,8
  • శుభస్థానములలో ఉన్నగ్రహము, ఆగ్రహము యొక్క వేధా స్థానములలో ఏదైనా గ్రహము ఉంటే శుభఫలితాన్ని ఇవ్వలేదు.
 శుక్రుడు:-
  • చంద్రలగ్నంలోనే ఉంటే కుటుంబసుఖం, విద్యాభివృద్ధి, ఉద్యోగం లభిస్తాయి.
  • చంద్రలగ్నం లగాయతు రెండవరాశిలో ఉంటే కుటుంబంలో ఆనందం, ధనలాభం, సుఖశాంతులు లభిస్తాయి.
  • చంద్రలగ్నం లగాయతు మూడవరాశిలో ఉంటే నూతన పరిచయాలు, సంఘంలో గౌరవం కలుగుతాయి. అధికారం లభిస్తుంది.
  • చంద్రలగ్నం లగాయతు నాలుగవరాశిలో ఉంటే మిత్రులతో వినోదయాత్రలు చేస్తారు. ధాన్యలాభం, సుఖశాంతులు పొందుతారు.
  • చంద్రలగ్నం లగాయతు అయిదవరాశిలో ఉంటే మిత్రుల సహకారంతో అనుకున్న పనులు నెరవేరుతాయి.
  • చంద్రలగ్నం లగాయతు ఆరవరాశిలో ఉంటే ధనవ్యయము అవుతుంది. ఋణము చేస్తారు.
  • చంద్రలగ్నం లగాయతు ఏడవరాశిలో ఉంటే స్త్రీల వలన సమస్యలు, ఇబ్బందులు ఏర్పడుతాయి.
  • చంద్రలగ్నం ఎనిమిదవరాశిలో ఉంటే మిత్రుల కలయిక, ధనము, స్త్రీసౌఖ్యం, ఆరోగ్యం లభిస్తాయి.
  • చంద్రలగ్నం తొమ్మిదవరాశిలో ఉంటే మిత్రులు సహకరిస్తారు. అనుకున్న పనులు నెరవేరుతాయి. సుఖశాంతులు కలుగుతాయి.
  • చంద్రలగ్నం లగాయతు పదవరాశిలో ఉంటే మిత్రులు సహకరిస్తారు. ఉద్యోగరీత్యా శుభప్రదం. వ్యసనాల వలన అవమానాలు పొందుతారు.
  • చంద్రలగ్నం లగాయతు పదకొండవరాశిలో ఉంటే మిత్రులు సహకరిస్తారు. స్త్రీ సౌఖ్యం లభిస్తుంది.
  • చంద్రలగ్నం లగాయతు పన్నెండవరాశిలో ఉంటే స్త్రీలతో పరిచయాలు, అధికవ్యయం కలుగుతుంది. అనుకున్న పనులు జరగవు.
  • శుక్రుడు శుభస్థానములు 1,2,3,4,5,8,9,10,12
  • శుక్రుడు వేధాస్థానములు 8,7,1,10,9,5,11
  • శుభస్థానములలో ఉన్నగ్రహము, ఆగ్రహము యొక్క వేధా స్థానములలో ఏదైనా గ్రహము ఉంటే శుభఫలితాన్ని ఇవ్వలేదు.
 మందుడు(శని):-
  • చంద్రలగ్నంలోనే ఉంటే దూరప్రయాణాలు, అనారోగ్యం, పనులకు ఆటంకాలు కలుగుతాయి.
  • చంద్రలగ్నం లగాయతు రెండవరాశిలో ఉంటే ఆర్థికంగా ఇబ్బందులు, అనారోగ్యం, అశాంతి కలుగుతాయి.
  • చంద్రలగ్నం లగాయతు మూడవరాశిలో ఉంటే అనుకున్న పనులు నెరవేరుతాయి. ఇతరులవలన తన పనులు జరుగుతాయి. అనారోగ్యం కలుగుతుంది.
  • చంద్రలగ్నం లగాయతు నాలుగవరాశిలో ఉంటే పనులకు ఆటంకాలు ఏర్పడును. అనవసరంగా ధనవ్యయం జరుగును.
  • చంద్రలగ్నం లగాయతు అయిదవరాశిలో ఉంటే భార్యకు అనారోగ్యం కలుగుతుంది. అనవసరంగా ధనం వ్యయమవుతుంది.
  • చంద్రలగ్నం లగాయతు ఆరవరాశిలో ఉంటే ఆరోగ్యం, ధనలాభం, కుటుంబసౌఖ్యం కలుగుతుంది.
  • చంద్రలగ్నం లగాయతు ఏడవరాశిలో ఉంటే ప్రయాణాలు, అలసట, అనారోగ్యం కలుగుతాయి.
  • చంద్రలగ్నం ఎనిమిదవరాశిలో ఉంటే కుటుంబ సమస్యలు ఏర్పడుతాయి.
  • చంద్రలగ్నం తొమ్మిదవరాశిలో ఉంటే అధికారుల వలన బాధలు అనవసర ప్రయాణాలు, అనారోగ్యం కలుగుతుంది.
  • చంద్రలగ్నం లగాయతు పదవరాశిలో ఉంటే ఉద్యోగం లభిస్తుంది. నీచకార్యాలపై ఆసక్తి కలుగుతుంది.
  • చంద్రలగ్నం లగాయతు పదకొండవరాశిలో ఉంటే కుటుంబసుఖము, గౌరవము, ధనము లభిస్తాయి.
  • చంద్రలగ్నం లగాయతు పన్నెండవరాశిలో ఉంటే అనవసర శ్రమ, అనారోగ్యం, ధననష్టం కలుగుతాయి.
  • శని శుభస్థానములు 3,6,11
  • శని వేధాస్థానములు 12,9,5
  • శుభస్థానములలో ఉన్నగ్రహము, ఆగ్రహము యొక్క వేధా స్థానములలో ఏదైనా గ్రహము ఉంటే శుభఫలితాన్ని ఇవ్వలేదు.
రాహువు:-
  • చంద్రలగ్నంలోనే ఉంటే అనారోగ్యం, ప్రాణాపాయం కలుగుతాయి.
  • చంద్రలగ్నం లగాయతు రెండవరాశిలో ఉంటే ధననష్టం కలుగుతుంది.
  • చంద్రలగ్నం లగాయతు మూడవరాశిలో ఉంటే సుఖశాంతులు కలుగుతాయి.
  • చంద్రలగ్నం లగాయతు నాలుగవరాశిలో ఉంటే కష్టములు కలుగుతాయి.
  • చంద్రలగ్నం లగాయతు అయిదవరాశిలో ఉంటే ధననష్టము కలుగును.
  • చంద్రలగ్నం లగాయతు ఆరవరాశిలో వుంటే కుటుంబ సుఖము, సంతోషము కలుగుతాయి.
  • చంద్రలగ్నం లగాయతు ఏడవరాశిలో ఉంటే పనులు నెరవేరవు. ధననష్టం జరుగుతుంది.
  • చంద్రలగ్నం ఎనిమిదవరాశిలో ఉంటే అనారోగ్యం, ఆపద కలుగుతాయి.
  • చంద్రలగ్నం తొమ్మిదవరాశిలో ఉంటే పనులు నెరవేరవు. ధననష్టం కలుగుతుంది.
  • చంద్రలగ్నం లగాయతు పదవరాశిలో ఉంటే కార్యసిద్ధి కలుగుతుంది.
  • చంద్రలగ్నం లగాయతు పదకొండవరాశిలో ఉంటే కుటుంబసుఖము, స్త్రీ సాంగత్యం లభిస్తుంది.
  • చంద్రలగ్నం లగాయతు పన్నెండవరాశిలో ఉంటే పనులు నెరవేరవు. అనవసర శ్రమ, ధనవ్యయం కలుగుతాయి.
 కేతువు:-
  • చంద్రలగ్నం లగాయతు రెండవరాశిలో ఉంటే అనారోగ్యం కలుగుతుంది.
  • చంద్రలగ్నం లగాయతు మూడవరాశిలో ఉంటే అనారోగ్యము, ధనవ్యయము కలుగుతుంది.
  • చంద్రలగ్నం లగాయతు నాలుగవరాశిలో ఉంటే ధనము, సుఖము లభించును.
  • చంద్రలగ్నం లగాయతు అయిదవరాశిలో ఉంటే కుటుంబ సుఖము, ధనము, ఆరోగ్యము లభించును.
  • చంద్రలగ్నం లగాయతు ఆరవరాశిలో ఉంటే ధనవ్యయం కలుగును.
  • చంద్రలగ్నం లగాయతు ఏడవరాశిలో ఉంటే అనారోగ్యం, ఆపద కలుగుతాయి.
  • చంద్రలగ్నం లగాయతు ఎనిమిదవరాశిలో ఉంటే ధననష్టం కలుగుతుంది.
  • చంద్రలగ్నం లగాయతు తొమ్మిదవరాశిలో ఉంటే బంధుమిత్రులు సహకారం లభిస్తుంది.
  • చంద్రలగ్నం లగాయతు పదవరాశిలో ఉంటే ధనవ్యయం , బాధలు కలుగుతాయి.
  • చంద్రలగ్నం లగాయతు పదకొండవరాశిలో ఉంటే ఆర్ధిక ఇబ్బందులు కలుగుతాయి.
  • చంద్రలగ్నం లగాయతు పన్నెండవరాశిలో ఉంటే కుటుంబసుఖము, ధనార్జన ఉంటుంది.

5, మార్చి 2013, మంగళవారం

వివిధ - శని శాంతి మంత్రాలు - స్తుతి



(Shani Shanti Mantra Stuti)

ప్రతి శనివారం ఈ మంత్రాన్ని పఠిస్తే శని బాధ కలగదు. ఈ మంత్రం వెనుక ఉన్న పురాణ గాథ ఇలా ఉన్నది. నల మహారాజు రాజ్యభ్రష్టుడై బాధపడుతున్నప్పుడు అతనికి శనిదేవుడు కలలో కనిపించి ఈ మంత్రం ఉపదేశించాడు. ఈ మంత్రాన్ని పఠించిన నలమహారాజుకు తిరిగి పూర్వ వైభవం కలిగింది.

క్రోడం నీలాంజన ప్రఖ్యం నీలవర్ణసమస్రజమ్
ఛాయామార్తాండ సంభూతం నమస్యామి శనైశ్చరమ్
నమో అర్కపుత్రాయ శనైశ్చరాయ నీహార
వర్ణాంజనమేచకాయ శ్రుత్వా రహస్యం భవకామదశ్చ
ఫలప్రదో మే భవ సూర్యపుత్రం నమోస్తు ప్రేతరాజాయ
కృష్ణదేహాయ వై నమః శనైశ్చరాయ కౄరాయ
శుద్ధబుద్ధి ప్రదాయనే
య ఏభిర్నామభి: స్తౌతి తస్య తుష్టా భవామ్యహమ్
మదీయం తు భయం తస్య స్వప్నేపి న భవిష్యతి

నవగ్రహాల్లో శని దోషం ఎక్కువ అపకారం కలిగిస్తుంది. శని దోషం నుండి బయటపడేందుకు పైన ఉదహరించిన ''క్రోడం నీలాంజన ప్రఖ్యం..'' అనే శ్లోకాన్ని 11 సార్లు జపించి, తర్వాత కింది శ్లోకాన్ని 11 సార్లు జపించాలి.

శన్యారిష్టే తు సంప్రాప్తే
శనిపూజాంచ కారయేత్
శనిధ్యానం ప్రవక్ష్యామి
ప్రాణి పీడోపశాంతయే

ఈ రెండు శ్లోకాలను స్మరించడంతో బాటు, నవగ్రహాలకు తైలాభిషేకం చేయాలి.
ఇలా చేయడంవల్ల శని దోష బాధితులకు వెంటనే సత్ఫలితం కనిపిస్తుంది.



శని పత్నీ నామ స్తుతి

శని దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి అతని పత్ని నామాలను నిత్యం పారాయణ చేస్తుండాలి.
ద్వజనీ దామనీ చైవ కంకాళీ కలహప్రియ
కంటకీ కలహీ చాథ తురంగీ మహిషీ
అజాశ నేర్మామాని పత్నీనామేతాని
సజ్జపన్ పుమాన్ దు: ఖాని నాశ్యేత్యం

సౌభాగ్యం వర్ధతే సుఖమ్



శనికి సమర్పించవలసిన ద్రవ్యాలేమిటి ?

శనైశ్వర స్తుతి
నమః కృష్ణాయ నీలాయ
శిశిఖండ నిభాయచః
నమో నీల మధూకాయ
నీలోత్పల నిభాయచ!!
కృష్ణ స్వరూపుడు నీలవర్ణుడు, నిప్పు తునకతో సమానుడు నల్లని ఇప్పపూవువంటివాడైన శనీశ్వరునికి మనస్కారం. త్వష్ట ప్రజాపతి తన కూతురు సంజ్ఞాదేవిని సూర్యునికిచ్చి వివాహం చేయగా, సూర్యుని కిరణాల వేడిమిని భరించలేక తన ఛాయ అనగా నీడకు ప్రాణం పోసి భర్త వద్ద వదిలి తాను తన తండ్రివద్దకు వెళ్ళిపోతుంది. ఈ ఛాయాదేవి, సూర్యు భగవానుల కుమారుడే శనీశ్వరుడు. ఈయన విభవ నామ సంవత్సరం, మాఘమాసం కృష్ణపక్ష చతుర్దశి తిథియందు ధనిష్టా నక్షత్రంలో జన్మించాడు. ఈయన కుడిచేతిలో దండం, ఎడమ చేతిలో కమండలాలు ఉంటాయి.
హరిశ్చంద్రుడు, నలుడు, పురుకుత్పుడు, పురూరవుడు, సాగరుడు, కార్త్య వీర్యార్జునుడు వీరంతా శని మహిమ వల్ల అనేక కష్టనష్టాలను పొంది చివరకు శని కృపాదృష్టితో ఆనందాన్ని పొందారు. శనీశ్వరుడు విష్ణుమూర్తికి తోడల్లుడు, సూర్యుని కుమారుడు, యమధర్మ రాజుకి, యమునా నదికి సోదరుడు. గ్రహాలకు యువరాజు వంటివాడు. ఆంధ్రప్రదేశ్ లోని మందపల్లి, మహారాష్ట్రలో శని శింగనాపూర్, తమిళనాడులో తిరునళ్ళార్ శని క్షేత్రములు. అయితే పూర్తి వాస్తుతో అతిశక్తివంతమైన 7వ శతాబ్దం నాటి క్షేత్రం పాండిచ్చేరిలోని తిరువళ్ళార్ లో వుంది. శని ప్రభావం వల్ల నల మహారాజు వస్త్రాలను పక్షి ఎగురవేసుకుపోయే దృశ్యాలు ఈ క్షేత్రంలో కన్పిస్తాయి. నలమహారాజు శని విముక్తి చేసే చిత్రాలు అక్కడ కన్పిస్తాయి. భక్తులు నూనెతో స్నానం చేసి ఆ తర్వాత అక్కడి చెరువులో స్నానం చేస్తే చాలు ఎంతమాత్రం జిడ్డు కనిపించదు. లక్షలాదిమంది స్నానం చేసే ఆ చెరువులో జిడ్డు కనిపించకపోవడమే అక్కడి విశేషం.
ఈ పవిత్ర క్షేత్రంలో బంగారు కాకిపై శనీశ్వర దేవునికి ఊరేగింపును చేస్తారు. ఈ స్వామి వారి భార్యల పేర్లు నీలాదేవి, మంగాదేవి. ఈ స్వామి పడమర దిక్కుగా వుంటాడు. శంగణాపూర్, మందవల్లి, నర్సింగ్ ల్ , విజయవాడ, జాల్నా, పాపగడ్, వైదీశ్వరన్ కోయిల్లలోని దేవాలయాలన్నీ శనీశ్వర దేవాలయాలలో ప్రఖ్యాతిగాంచినవి. శని త్రయోదశి పర్వదినాలలో మండవల్లిలోని శ్రీమందేశ్వర స్వామివారికి శని దోష పరిహారార్ధం తైలాభిషేకాలు చేసుకుంటే శని దేవుని వలన కలిగే సమస్త దోషాలు నివారించబడతాయని స్కంద పురాణంలో లిఖితమై ఉంది.
శనికి ఏం సమర్పించాలి ?
నల్ల వస్త్రం. నూనెదీపం, అగరవత్తులు, నువ్వులనూనె, స్వీట్లు, పండ్లు, దండ, జిల్లేడు ఆకులు, కర్పూరం, తమలపాకులు, వక్కలు, కొబ్బరికాయలు, గుర్రపు నాడా, చిన్న దిష్టిబొమ్మ. ఇవి సమర్పించలేనివారు పావు లేదా అరలీటరు నూనెతో తైలాభిషేకం చేయొచ్చు.
శని శింగణాపూర్:
జీవితంలో కష్టనష్టాలకు లోనై మరే దేవుడు రక్షించని తరుణంలో చివరగా గుర్తుకు వచ్చేది శని శింగణాపూర్ లోని శనీశ్వరుడు. ఇటీవల కాలంలో తిరుపతి వెళ్ళేవారు ఏ విధంగా కాణిపాకం విఘ్నేశ్వరస్వామిని దర్శించుకుంటున్నారో అదేవిధంగా షిర్డీ సాయి బాబాను దర్శించుకోవడానికి వెళ్ళినవారు శని శింగణాపూర్ క్షేత్రాన్ని దర్శిస్తున్నారు. మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లా నెవాసా తాలూకాకు చెందిన ఆ గ్రామం గిన్నీస్ బుక్ లో స్థానం సంపాదించింది. ఏ ఇంటికీ గుమ్మాలు లేకపోవడం ఆ గ్రామం ప్రత్యేకత. ప్రస్తుత జనాభా లెక్కల ప్రకారం ఆ గ్రామ జనాభా 3000 కాగా ఇళ్ళు దాదాపు 450 వరకూ ఉంటాయి, గ్రామ కట్టుబాటు, పూర్వపు ఆచారం నూతన గృహాలకు కూడా తలుపులు ఉండవు. గ్రామంలో పోలీస్ స్టేషన్ లేదు. పోలీసులకు దొంగతనాలు, ఇతర నేరాల గురించి ఫిర్యాదులు ఉండవు. ఇంటువంటి సమస్యలు గ్రామస్థాయిలోనే పరిష్కారమవుతాయి. అందుకే వారు ‘మాకు దేవుడు ఉన్నాడు కానీ మా దేవుడికి గుడిలేదు. ఎండకు ఎండుతాడు వానకు తడుస్తాడు. మాకు ఇళ్ళు ఉన్నాయి కాని వాటికి గుమ్మాలు, తలుపులు లేవు. మా సూర్యపుత్రుడు శనీశ్వరుడే మా ఇళ్ళకు రక్షగా ఉంటాడు’ అంటారు. సాధారణంగా అందరూ శని పేరు ఎత్తటానికి భయపడుతుంటారు. కాని ఆ గ్రామస్థులు శనీశ్వరుణ్ణి తమ ఆప్తదేవుడుగా నిత్యం కొలుస్తారు. అన్ని కార్యక్రమాలకు ఆయన్నే నమ్ముకుంటారు. ప్రతీదానికి వినాయకునితోపాటు శనీశ్వరుణ్ణి తలచుకుంటారు. ప్రతీ నెలా అమావాస్య మర్నాడు చంద్రోదయం రోజున లక్షలాదిమంది భక్తులు శనిదేవుని దర్శిస్తారు. శని త్రయోదశి సోమవారాలనాడు అధికసంఖ్యలో భక్తులు వస్తారు. సాధారణ రోజులలో కూడా భక్తుల సంఖ్య గణనీయంగానే ఉంటుంది. దేవాలయంలోకి అందరికీ ప్రవేశం ఉన్నా మగవారు మాత్రమే శనిదేవుని పూజాకార్యక్రమం నిర్వహించాలి. వారు విధిగా తలస్నానం చేసి కాషాయరంగు లుంగీ లేదా పంచె మాత్రమే ధరించాలి, ఈ వస్త్రాలు ఇక్కడ లభ్యమవుతాయి. పూజ తర్వాత వదిలివేయాలి. ముఖ్యమైన రోజులలో కాషాయవస్త్రధారులతో శని శింగణాపూర్ శోభాయమనంగా ఉంటుంది. ఆరోజు దృశ్యం చూడముచ్చటగా, ఆలయప్రాంగణం సుందరంగా ఉంటుంది. సదుపాయాలు. పెద్ద ఎత్తున విసృతపరుస్తున్నారు. ఇది కేవలం విరాళాలవల్లే సాధ్యపడుతోంది. గ్రామప్రవేశానికి రెండు రూపాయల పంచాయితీ ప్రత్యేక టోల్ ఫీజు మాత్రం వసూలు చేస్తున్నారు. ఈ దేవాలయానికి అనుబంధంగా మరొక పాఠశాలను, గోసంరక్షణ కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. వసతి ఏర్పాట్లు ఉన్నాయి. లగ్జరీ గదులతోపాటు సాధారణ గదులు కూడా అందుబాటులో ఉన్నాయి. ఆలయ నిర్వహణ ఆహ్లాదకరంగా ఉంది.
శని విగ్రహ ప్రత్యేకత
ఇక్కడ శని విగ్రహాన్ని 16 అడుగుల 16 అంగుళాల పొడవు, వెడల్పు గల 3 అడుగుల ఎత్తుగల సమచతుర్భుజ ప్లాట్ ఫాంపై ప్రతిష్టించారు. విగ్రహం శివలింగం ఆకారాన్ని పోలి ఉంటుంది. ఇనుములా తలపించే నల్లరాతి విగ్రహం ఎత్తు ఐదున్నర అడుగులు, వెడల్పు ఒకటిన్నర అడుగులు. శనిపీడితులు కాషాయ వస్త్రధారులై అర్చకుని సహాయంతో ఈ విగ్రహంపైనే తైలాభిషేకం చేసి దోషనివారణ పొందుతారు. ఈ ప్లాట్ ఫాంపై గల శనీశ్వరుణ్ణి అందరూ వీక్షీంచవచ్చు. అయితే ప్లాట్ ఫారాన్ని ఆడవాళ్ళు తాకరాదనే నియమం వుంది. 

నవ శని క్షేత్రాలు
మనం చెప్పుకుంటున్న శనిశింగణాపూర్ తో పాటు మరో ఎనిమిది క్షేత్రాలు ఉన్నాయి. వాటినే నవ శనిక్షేత్రాలు అంటారు.
1. మహారాష్ట్రలోని నాసిక్ సమీపానగల నందగావ్.
2. మధ్యప్రదేశ్ లో గ్వాలియర్ దగ్గర శనిబాధేశ్వర్
3. మధ్యప్రదేశ్ లో జబల్పూర్ దగ్గర పిపాల్ గావ్.
4. తమిళనాడులోని తరునల్లార్.
5. ఉత్తరప్రదేశ్ లోని మధుర సమీపాన కొకిల్వన్.
6. ఉత్తరప్రదేశ్ లోని నిర్లాపూర్ సమీపాన శనితీర్థ.
7. మహారాష్ట్రలోని ఔరంగబాద్ జిల్లాలో శనిభగవాన్ తీర్థం.
8. చత్తీస్ ఘట్ రాష్ట్రంలోని థమ్ ప్రాంతంలో శనిదేవక్షేత్రం. భరతఖండంలో గుజరాత్, సౌరాష్ట్రల్లో శని ఆవిర్భవించాడనే నమ్మకం ఉంది. ఇదీ శని కుటుంబం:
తండ్రి: సూర్యభగవానుడు
తల్లి: ఛాయాదేవి
సోదరుడు: యమధర్మరాజు
సోదరి: యమున
స్నేహితులు: హనుమాన్, కాలభైరవుడు
ఇతర పేర్లు: కృషాణు, శౌరి, బభ్రు, రోద్రాంతక, సూర్యపుత్ర
గోత్రం: కాశ్యపన.

4, మార్చి 2013, సోమవారం

వాస్తులో ప్రభావం చూపే రంగు బల్బులు

వాస్తులో ప్రభావం చూపే రంగు బల్బులు
Colour Bulbs Influence on Vastu


వాస్తులో ద్వారాలు, గోడలు, కిటికీలు, స్తంభాలు మాత్రమే కాదు, ఇంకా అనేక విషయాలు ఇమిడి ఉన్నాయి. వాస్తు మహా విస్తృతమైన శాస్త్రం. ఇంటిముందు పూలమొక్కలు, ఇంటి గోడలకు వేసే సున్నపు రంగులు మొదలైనవెన్నో వాస్తు పరిగణనలోకి వస్తాయి. ఆఖరికి ఇళ్ళలో లైట్లు కూడా వాస్తు కిందికి వస్తాయి. ఏ రకమైన లైట్లు వాడుతున్నామో, ఆ ప్రభావం ఉంటుందని గ్రహించుకోవాలి.


మార్కెట్లో వివిధ రంగుల బల్బులు దొరుకుతాయి. మనం సాధారణంగా తెల్లటి కాంతివంతమైన బల్బులు లేదా ట్యూబ్ లైట్లు ఉపయోగిస్తాం. లైట్ల రంగులను బట్టి వాస్తు ప్రభావం ఉంటుందని తెలిసింది కనుక ఇకపై ఆయా రంగుల లైట్లను అమర్చుకుందాం. ఇంటికి ఏ దిక్కునున్న గదుల్లో ఏ రంగుల బల్బులను ఉపయోగిస్తే మంచిదో ఇస్తున్నాం, చూడండి. 

తూర్పు - ఎరుపు రంగు లైట్లు

పశ్చిమం - నీలం రంగు లైట్లు

ఉత్తరం - ఆకుపచ్చ బల్బు

దక్షిణం - డార్క్ రెడ్ లైట్లు

ఈశాన్యం - పసుపు రంగు బల్బులు

ఆగ్నేయం - టొమేటో రంగు బల్బులు

వాయువ్యం - తెలుపు రంగు లైట్లు

నైరుతి - తెలుపు రంగు బల్బులు

చూశారు కదండీ.. ఆయా దిక్కుల్లో ఉన్న గదుల్లో పైన చెప్పిన ప్రకారం అనుకూలమైన రంగుల బల్బులను అమర్చడం వలన సత్ఫలితాలు ఉంటాయి. ఆయా రంగుల బల్బులను మంచి కాంతివంతమైనవి అమర్చాలి. పడుకునే సమయంలో మాత్రమే జీరో వాట్ బల్బులను ఉపయోగించాలి. మెలకువగా ఉన్న సమయంలో ఎక్కువ వాట్స్ ఉన్న బల్బులను మాత్రమే ఉపయోగించాలి. ఇలా చేయడంవల్ల వృత్తి, ఉద్యోగాల్లో ఎంతో అభివృద్ధి ఉంటుంది. కుటుంబంలో అనారోగ్యాలు తలెత్తవు.

3, మార్చి 2013, ఆదివారం

దశరథ కృత శని స్తోత్రం

(Dasarathakruta Shani Stotram)

దశరథుడు రచించిన శని స్తోత్రం గురించి పురాణ గాథ ఇలా ఉన్నది. దశరథుని తపస్సుకు మెచ్చిన శనైశ్చరుడు దశరథుడు కోరిన వరం ప్రసాదించి, మరో వరం కోరుకోమన్నాడు. అప్పుడు దశరథుడు “శనిదేవా! నేటి నుండీ మానవులను ఎవ్వరినీ మీరు బాధించవద్దు” అని వరం కోరుకున్నాడు. అప్పుడు శనిదేవుడు ''అది సాధ్యం కాదు.. నువ్వు నన్ను స్తుతిస్తూ స్తోత్రం రచించు. అది పఠించినవారిని నేను బాధించను'' అని వరమిచ్చాడు. ఆ వరానికి అనుగుణంగా దశరథుడు రచించినదే ఈ శని స్తోత్రం.
కుడిచేతిలోకి నీరు అక్షింతలు తీసుకుని ఓం అస్యశ్రీ శనిస్తోత్ర మహామంత్రస్య నుండీ జపే వినియోగః వరకు చెప్పిన తర్వాత నీరు వదిలేయాలి.
అథః వినియోగ:
ఓం అస్య శ్రీ శనిస్తోత్ర మంత్రస్య కశ్యప ఋషిః త్రిచ్చంద్ర: సౌరిర్దేవతా, శం బీజమ్, ని: శక్తి: కృష్ణ వర్ణేతి కీలకమ్, ధర్మార్థ కామ మోక్షాత్మ కచతుర్విధ – పురుషార్ధసిద్ద్యర్ధం జపేవినియోగః
అథ కరన్యాసం:
ఈ న్యాసం చెప్పేటప్పుడు పేరును బట్టి ఆ వేళ్లను స్పృశించాలి.
శనైశ్చరాయ అంగుష్టాభ్యాసం నమః
మందగతయే తర్జనీభ్యాం నమః
అధోక్షజాయ మధ్యమాభ్యాం నమ: కృష్ణాంగాయ అనామికాభ్యాం నమః
శుశ్కోదరాయ కనిష్టాంగాయ అనామికాభ్యాం నమః
శుష్కోదరాయ కనిష్టకాభ్యాం నమః చాయాత్మజాయ
కరతల కరపృష్టాభ్యాం నమః. అథ హృదయాది న్యాసః
అస్త్రాయ ఫట్ అనేటప్పుడు ఎడమ అరచేతిపై కుడిచేతితో చప్పట్లు కొట్టి ఫట్ అనే ధ్వని చేయాలి.
శనైశ్చరాయ హృదయాయ నమః మందగతయే శిరసే స్వాహా
అథోజాయ శిఖాయై వషట్ కృష్ణాంగాయ కవచాయ హుమ్
శుష్కోదరాయ నేత్రత్రాయ వౌషట్ ఛాయాత్మజాయ
అస్త్రాయ ఫట్ అథ దిగ్భంధనమ్ ఓం భూర్భవ: స్వః
అంటూ నాలుగు వైపులా చిటికెలు వేయాలి.
అథః ధ్యానమ్ నీదు ద్యుతిమ్ శూలధరమ్ కిరీటినం
గ్రథస్థితం త్రాసకరం ధనుర్ధరమ్ చతుర్భుజం
సూర్యసుతం ప్రశాంతం వందే సదాభీష్టకరం
వరేణ్యమ్ శని స్తోత్ర్రం ప్రారంభం నమః
కృష్ణాయ నీలాయ శితికంఠనిభాయ చ నమః
కాలాగ్ని రూపాయ కృతాంతాయ చ వై నమః
నమో నిర్మాసదేహాయ దీర్ఘశ్మశ్రు జటాయ చ నమో విశాల నేత్రాయ
శుష్కోధర భయాకృతే నమః పుష్కలగాత్రాయ స్థూలరోమ్ణ్థ వై నమః
నమో దీర్ఘాయ శుష్కాయ కాలదంష్ట్ర నమోస్తుతే నమస్తే
కోట రక్షాయ దుర్నిరీక్ష్యాయ వై నమః నమో ఘోరాయ
రౌద్రాయ భీషణాయ కపాలినే నమస్తే సర్వభక్షాయ బలీముఖే నమోస్తుతే
సూర్య పుత్ర నమస్తేస్తు సంవర్తక నమోస్తుతే నమో మందగతే
తుభ్యం నిస్త్రీంశాయ నమోస్తుతే తపసా దగ్ధదేహాయ నిత్యం
యోగరతాయ చ నమో నిత్యం క్షుధార్తాయ అతృప్తాయ చ వై నమః
జ్ఞాన చక్షుర్నమస్తేస్తు కాశ్యపాత్మజసూనవే తుష్టో దదాసి వై రాజ్యం రుష్టో
హరసి తత్క్షణాత్ దేవాసుర మనుష్యాశ్చ సిద్ధ విధ్యాధరోరగా:
తవ్యా విలోకితా: సర్వే నాశం యాన్తి సమూలతః ప్రసాదం కురు
సౌరే వరదీ భవ భాస్కరే ఏవం స్తుతస్తదా సారిగ్రహరాజో మహాబలః
అవ్రవీచ్చ శనిర్వాక్యం హృష్టరోమా చ పార్దివః తుష్టోహం
తవ రాజేంద్ర స్తోత్రేనానేన సువ్రత ఏవం వరం ప్రదాస్యామి యన్తే మనసి వర్తతే
దశరథ ఉవాచ పసన్నో యది మే సౌరే వరం దేహి మమేప్సితమ్
అద్య ప్రభ్రుతిప్పింగాక్ష పీడా దేవా న కస్యచిత్ ప్రసాదం కురు మే సౌరే వరోయం
మే మహేప్సితః శని ఉవాచ అదేయస్తు వరౌస్మాకం తుష్టోకం చ
దదామి తే త్వచాప్రోక్తం చ మే స్తోత్రం యే పఠిష్యంతి మానవాః
దేవాసుర మనుష్యాశ్చ సిద్ద విద్యాధరోరగా న తేషా బాధతే పీడా మత్క్రుచా వై
కదావన మృత్యుస్థానే చతుర్థే వా జన్మ వ్యయ ద్వితీయగే గోచరే జన్మకాలే
వా దశాస్వన్తర్దశాసు చ యః పఠేత్ ద్వి త్రి సంధ్యం వా శుచిర్భూత్వా సమాహితః
న తస్య జాయతే పీడా కృత వై మమనిశ్చితమ్ శని శాంత మంత్ర స్తుతి

2, మార్చి 2013, శనివారం

శని దోషం – పరిహారం – శాంతులు

                                             SANI JAPAM
 శనిగ్రహ దోషము క్రింది విధంగా కనిపిస్తుంది.
మేషంలో నీచపడితే, శత్రు క్షేత్రములో ఉంటే, గోచార రీత్యా లగ్న, షష్టాష్టములో సంచరించేటప్పుడు, జాతక చక్రంలో 1,2,3,4,5,6,7,8,9,10,11,12 ఉన్నా ఏలినాటి శని సమయంలో, శని మహర్దశ, అంతర్దశలలో శత్రుగ్రహాలైన రవి, చంద్ర, కుజలతో కలిసి ఉంటే శని మహర్దశ, అంతర్దశలలో గ్రహశాంతి చేయాలి.
శనిగ్రహ జపం
ఆవాహము
అస్యశ్రీ శనిగ్రహ మహా మంత్రస్య హిళింభి ఋషిః శనైశ్చర
గ్రహోదేవతా! ఉష్టిక్ చంధః! శనైశ్చర గ్రహ ప్రసాద సిద్దర్ధ్యే
శనిపీడా నివారణార్ధే శనిమంత్ర జపే వినియోగః
కరన్యాసం
ఓం శమగ్ని - అంగుష్టాభ్యాసం నమః
ఓం అగ్నిభిస్కరత్ - తర్జనీభ్యాం నమః
ఓం విష్ణుశంనస్తపతుసూర్యః - మధ్యమాభ్యాం నమః
ఓం శంవాతః - అనామికాభ్యాం నమః
ఓం వాత్వరపాః - కనిష్టికాభ్యాసం నమః
ఓం అపశ్రిధః - కరతల కరపృష్టాభ్యాసం నమః అంగన్యాసము:
ఓం శమగ్ని: - హృదయాయ నమః
ఓం అగ్నిభిస్కరత్ - శివసేస్వాహ
ఓం శంనస్తపతుసూర్యః - శిఖాయైవషట్
ఓం శంవాతః - కవచాయహు
ఓం వాత్వరపాః - నేత్రత్రయాయ వౌషట్
ఓం అపశ్రిధ్ర - అస్త్రాయఫట్
ఓం భూర్భువస్సువరోమితి దిగ్భంధం
ఆదిదేవతాః
ఇమం యమ ప్రస్తరమాహి సీదాంగి రోభి: పితృభిప్సం విదానః!
అత్వా మంత్రాః కవిసహస్త్వా వహ న్వైనారాజన్ హవిషామదయస్వ!!
ప్రత్యథి దేవతా: ప్రజాపతే సత్వ దేవతాన్యోన్యో విశ్వాజాతాని పరితాబభూవ!
యత్కామాస్తే జుహుమస్తన్నో అస్తువయగ్గౌ శ్యామ పతయోరయీణాం!!
వేదమంత్రం
ఓం శమగ్ని రాజ్ఞి భిస్క రచ్చన్న స్తపతు సూర్యః శం వాతో వాత్వరపా అపశ్రిధః
శని కవచ స్తోత్రము శనైశ్చరశ్శిరో రక్షేత్! ముఖం భక్తార్తి నాశనః కర్ణౌకృష్ణాంబరః పాతు!
నేత్రే సర్వ భయంకరః!! కృష్ణాంగో నాసికాం రక్షేత్! కర్ణౌ మేచ శిఖండిజ:! భుజౌమే సుభుజః పాతు!
హస్తా నీలోత్పల ప్రభః! పాతుమే హృదయం కృష్ణ:! కృక్షిం శుష్కోధర స్తధాః! కటిం మే వికటః పాతు!
ఊరూ మే ఘోర రూపవాన్! జానునీ పాతు దీర్ఘోమే! జంఘేమే మంగళ ప్రభః! గల్పౌ గణాకరః పాతు!
పాదౌ మే మంగుపాదకః! సర్వాణిచ మామాచంగాని! పాతు భాస్కరనందనః!
ఫలశ్రుతి:
య ఇదం కవచం దివ్యం సర్వ పీదాహరం ణాం పఠతి శ్రద్దయా యుక్తః! సర్వాన్ కామానవాప్నుయాత్!
శని మంగళాష్టకమ్ మందః కృష్ణవిభస్తు పశ్చిమ ముఖః సౌరాష్టవో కాస్యవః!
నక్రేశో ఘటన సుహృద్భుధ భ్రుగుర్వైరీంద్వ వక్ష్యాసుతః!! స్థానం పశ్చిమ దిక్ర్పజాపతిర్యమౌదేవౌ ధనస్త్వాసనం!
షట్రష్ట స్శుభకృచ్ఛమీ రవిసుతః కూర్యాత్సదా మంగళం!!
శన్యష్టోత్తర శతమామావళి ఓం శనైశ్చరాయ నమః ఓం శాంతాయ నమః
ఓం శరణ్యాయ నమః ఓం వరేణ్యాయ నమః ఓం సర్వేశాయ నమః
ఓం సౌమ్యాయ నమః ఓం సురవంద్యాయ నమః ఓం సురలోక విహారిణే నమః
ఓం సుఖాననోవిష్టాయ నమః ఓం సుందరాయ నమః ఓం ఘనాయ నమః
ఓం ఘనరూపాయ నమః ఓం ఘనాభరణధారిణే నమః ఓం ఘనసారవిలేపాయ నమః
ఓం ఖద్యోతాయ నమః ఓం మందాయ నమః ఓం మందచేష్టాయ నమః
ఓం మహనీయగుణాత్మనే నమః ఓం మర్త్యపావనపాదాయ నమః
ఓం మహేశాయ నమః ఓం ఛాయాపుత్త్రాయ నమః ఓం శర్వాయ నమః
ఓం శ్రతూణీరధారిణే నమః ఓం చరస్థిరస్వభావాయ నమః ఓం చంచలాయ నమః
ఓం నీలవర్ణాయ నమః ఓం నిత్యాయ నమః ఓం నీలాంబసనిభాయ నమః
ఓం నీలాంబరవిభూషాయ నమః ఓం నిశ్చలాయ నమః ఓం వేద్యాయ నమః
ఓం విధిరూపాయ నమః ఓం విరోధాధార భూమయే నమః
ఓం వేదాస్పదస్వాభావాయ నమః ఓం వజ్రదేహాయ నమః ఓం వైరాగ్యదాయ నమః
ఓం వీరాయ నమః ఓం వీతరోగభయాయ నమః ఓం విపత్పరంపరేశాయ నమః
ఓం విశ్వనంద్యాయ నమః ఓం గృద్రహహాయ నమః ఓం గుధాయ నమః
ఓం కూర్మాంగాయ నమః ఓం కురూపిణే నమః ఓం కుత్సితాయ నమః
ఓం గుణాధ్యాయ నమః ఓం గోచరాయ నమః ఓం అవిద్యామూలనాశాయ నమః
ఓం విద్యావిద్యాస్వరూపిణే నమః ఓం ఆయుష్యకారణాయ నమః ఓం ఆపదుద్దర్త్రే నమః
ఓం విష్ణుభక్తాయ నమః ఓం వశినే నమః ఓం వివిధాగమనేదినే నమః
ఓం విధిస్తుత్యాయ నమః ఓం వంద్యాయ నమః ఓం విరూపాక్షాయ నమః
ఓం వరిష్టాయ నమః ఓం వజ్రాంకుశధరాయ నమః ఓం వరదాయ నమః
ఓం అభయహస్తాయ నమః ఓం వామనాయ నమః ఓం జేష్టాపత్నీసమేతాయ నమః
ఓం శ్రేష్టాయ నమః ఓం అమితభాషిణే నమః ఓం కస్టౌఘనాశకాయ నమః
ఓం ఆర్యపుష్టిదాయ నమః ఓం స్తుత్యాయ నమః ఓం స్తోత్రగమ్యాయ నమః
ఓం భక్తివశ్యాయ నమః ఓం భానవే నమః ఓం భానుపుత్త్రాయ నమః
ఓం భావ్యాయ నమః ఓం పావనాయ నమః ఓం ధనుర్మందల సంస్థాయ నమః
ఓం ధనదాయ నమః ఓం ధనుష్మతే నమః ఓం తనుప్రకాశ దేహాయ నమః
ఓం తామసాయ నమః ఓం అశేషజనవంద్యాయ నమః ఓం విశేషఫలదాయినే నమః
ఓం వశీకృతజనిశాయ నమః ఓం పశూనాంపతయే నమః ఓం ఖేచరాయ నమః
ఓం ఖగేశాయ నమః ఓం ఘననీలాంబరాయ నమః ఓం కాఠిన్యమానసాయ నమః
ఓం అరణ్యగణస్తుత్యాయ నమః ఓం నీలచ్చత్రాయ నమః ఓం నిత్యాయ నమః
ఓం నిర్గుణాయ నమః ఓం గుణాత్మనే నమః ఓం నిరామయాయ నమః ఓం నింద్యాయ నమః
ఓం వందనీయాయ నమః ఓం ధీరాయ నమః ఓం దివ్యదేహాయ నమః ఓం దీనార్తి హరణాయ నమః
ఓం దైన్య నాశకరాయ నమః ఓం ఆర్యజనగణణ్యాయ నమః ఓం క్రూరాయ నమః
ఓం క్రూరచేష్టాయ నమః ఓం కామక్రోధకరాయ నమః ఓం కళత్రపుత్త్రశత్రుత్వ కారణాయ నమః
ఓం పరిపోషితభక్తాయ నమః ఓం భక్త సంఘమనోభీష్ట ఫలదాయ నమః ఓం శ్రీమచ్ఛనైశ్చరాయ నమః
శుక్రమహర్దశలో చేయవలసిన దానములు
1. శని మహర్దశలో శని అంతర్దశలో నువ్వులు దానము చేయండి.
2. శని మహర్దశలో రవి అంతర్దశలో గుమ్మడికాయపై యధాశక్తి బంగారంతో దానం చేయండి.
3. శని మహర్దశలోచంద్రుని అంతర్దశలో తెల్లని ఆవును దానము చేయండి.
4. శని మహర్దశలో కుజుడు అంతర్దశలో దున్నను దానము చేయండి.
5. శని మహర్దశలో బుధుడు అంతర్దశలో దున్నను దానము చేయండి.
6. శని మహర్దశలో గురుడు అంతర్దశలో బంగారు మేకను దానము చేయండి
7. శని మహర్దశలో శుక్రుడు అంతర్దశలో నల్ల మేక, నువ్వులు, ఇనుము, లవణం, నూనెను దానము చేయండి
8. శని మహర్దశలో రాహువు అంతర్దశలో సీసమును దానము చేయండి
9. శని మహర్దశలో కేతువు అంతర్దశలో బంగారం, నువ్వులు దానము చేయండి
వివిధ గ్రహాల శని అంతర్దశలో చేయవలసిన దానములు:
1. రవి మహర్దశలో మేకను దానం చేయండి.
2. చంద్రుని మహర్దశలో శని అంతర్దశలో దున్నను దానం చేయండి.
3. కుజుడు మహర్దశలో శని అంతర్దశలో నువ్వుల పిండిని దానం చేయండి.
4. బుధుని మహర్దశలో శని అంతర్దశలో దున్నను దానం చేయండి.
5. గురుని మహర్దశలో శని అంతర్దశలో నల్లమేకను దానం చేయండి.
6. శుక్రుని మహర్దశలో శని అంతర్దశలో దున్నను దానం చేయండి.
7. రాహువు మహర్దశలో శని అంతర్దశలో నల్లమేకను దానం చేయండి.
8. కేతు మహర్దశలో శని అంతర్దశలో యమప్రీతికు దున్నను దానం చేయండి. గమనిక: కొన్ని వస్తువులు దొరకనప్పుడు వాటికి మారుగా ధనమిచ్చుటకన్నా ఆ వస్తువు ఆకారంలో వెండితో ప్రతిమ చేయించి దక్షిణతో ధారపోయండి.

శని దోషం – పరిహారం – శాంతులు

1. ప్రతిరోజూ మధ్యాహ్నం కాకులకు బెల్లంతో కలిపిన నల్లనువ్వులు పెట్టాలి.
2. ఒక స్టీలు పాత్రలో నల్లనువ్వులు, ఉప్పు, మేకు, నల్లదారం ఉండ, నువ్వుల నూనె, నల్లబొగ్గు, నల్లని వస్త్రమును దానం చేయండి
3. శనిగ్రహ జపం చేయించి బ్రాహ్మణుకి శక్తిమేరకు దానం చేయండి.
4. జాతినీలంఎడమచేతి మధ్య వెలికి వెండితో చేయించి శనివారం ఉదయం 6 గంటలకు ధరించండి. 1.25కే.జీ ల నల్ల నువ్వులు దానం చేయండి
5. నవగ్రహములలో శని విగ్రహమునకు నువ్వుల నూనెతో తైలాభిషేకము చేసి స్టీలు ప్రమిదలో 19 నల్ల వత్తులతో దీపారాధన చేసి నలుపు వస్త్రములు దానం చేయండి.
6. 40 రోజులు నవగ్రహ ప్రదక్షిణాలు చేసి చివరి రోజున శని పూజ, తైలాభిషేకం చేసి స్తోత్ర పారాయణం చేయండి.
7. నీలమేఘ వర్ణం గల పుష్పములు, నల్ల వస్త్రములు సమర్పించి దానం చేయండి
8. మండలపూజ, అయ్యప్పదీక్ష (మకరజ్యోతి దర్శనం) ద్వారా శని అనుగ్రహ పాత్రులు కండి.
9. 19సార్లు శని తైలాభిషేకం చేయించి నువ్వులు దానం చేయండి ప్రతిరోజూ శని శ్లోకం 19 సార్లు పఠించండి.
10. శని ధ్యాన శ్లోకాన్ని రోజుకు' 190 మార్లు చొప్పున 190 రోజులు పారాయణ చేయండి.
11. శని గాయత్రి మంత్రంను 19 శనివారములు 190 మార్లు పారాయణం చేయండి.
12. శని గాయత్రి మంత్రంను 40 రోజులలో 19000 మార్లు జపం చేయండి.
13. 19 శనివారం నవగ్రహాలకు 190 ప్రదక్షిణాలు చేసి 1.25కే.జీ. నువ్వులు దానం చేయండి.
14. మందపల్లిలోని శనేశ్వరుని దేవస్థానంకు ఒక శనివారం లేదా శనిత్రయోదశి నాడు దర్శించి తైలాభిషేకం చేయించండి.
15. శనివారం రోజున నువుండలు, నువ్వూ జీడీలు పేదలకు సాధువులకు పంచి పెట్టండి.
16. 19 శనివారంలు ఉపవాసం ఉండి చివరి శనివారం ఈశ్వరునికి అభిషేకం మరియు శని అష్టోత్తర పూజ చేయవలెను
17. తమిళనాడులో తిరునళ్ళూరు దేవస్థానంను దర్శించి శని హోమం చేయండి.
18. షిర్డీ పుణ్యస్థలందగ్గరలో శని శింగణాపూర్ దర్శించి స్వయంగా తైలాభిషేకం చేయండి.
19. పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లులోని క్షీర రామలింగేశ్వరుని దేవాలయంలోని శని ప్రత్యేక దేవాలయం దర్శించితైలాభిషేకం చేయండి.

ఏలినాటి శనికి శాంతి మార్గములు 

1. శనీశ్వరుడు ప్రతి రాశిలో 2 ½ సంవత్సరాలు సంచరిస్తాడు, అలా మూడు రాసులలో శని గోచార రీత్యా 12, 1, 2 స్థానంలో 7 ½ సంవత్సరాలు సంచరించే కాలంను ఏలినాటి శని అంటారు. శని చతుర్ధ స్థానంలో గోచారరీత్యావున్నచో అర్దాష్టము శని అని, అష్టమ స్థానంలో వున్నచో అష్టమ శని అని అంటారు. ఒక వ్యక్తి జీవితంలో 7 ½ సంవత్సరాలు ఏలినాటి శని మూడుసార్లు వస్తుంది. మొదటి దానిని మంగు శని అని, రెండవది పొంగు శని అని, మూడవ దానిని మరణ శని అని అంటారు. 

1. షిర్డిలోని ద్వారకామాయి ధుని యందు నల్లనువ్వులు, కొబ్బరు కాయలు సమర్పించండి.
2. శనిదోష నివృత్తికి నలమహారాజు చరిత్రను పారాయణ చేయండి.
3. దగ్గరలో ఉన్న శ్రీసాయి దేవాలయానికి వెళ్ళి ధునిలోని నల్లనువ్వులు, నవధాన్యాలు వేసి 9 మార్లు ప్రదక్షిణాలు చేయండి. ఇలా 19 శనివారములు చేయండి.
4. శివపంచాక్షరీ మంత్రాన్ని జపించుటగాని, అభిషేకం కాని చేయండి.
5. శనివారం నాడు ఆంజనేయస్వామి, శివాలయం, శ్రీకృష్ణ ఆలయాల్లో ప్రసాదములు పంచిపెట్టండి. అన్నదానం చేయండి.
6. శనివారం నూనెలు, నూనె వస్తువులు కొనకూడదు. నల్ల ఆవులకు, నల్ల కుక్కలకు ఆహారం పెట్టినచో మంచిది.
7. శనిత్రయోదశి రోజున శనికి తైలాభిషేకం చేయండి.
8. ప్రతి శనివారం ఒంటికి నువ్వుల నూనె రాసుకుని, గంట తర్వాత తలస్నానం చేయండి.
9. ప్రవహించే నీటిలో నల్ల నువ్వుల నూనె, బొగ్గులు, మేకులు, నవధాన్యాలు కలపండి.
10. శనివారం ఉదయం అన్నం ముద్దలో నువ్వులనూనె కలిపి నైవేద్యం చేసి కొద్దిగా తిని, ఎవరూ తొక్కని ప్రదేశములో వదిలి వేయాలి. ఇలా శనివారాలు చేయాలి.
11. మయూరి నీలం కుడిచేతి మధ్య వేలుకి ధరించండి.
12. శనివారం 19 సంఖ్య వచ్చునట్లుగా దక్షిణ సమర్పించండి.
13. శ్రావణమాసంలో 19 రోజులు దీక్ష, శని తైలాభిషేకం చేస్తే చాలా మంచిది.
14. తీరికలేనివారు కనీసం శని శ్లోకం 19 మార్లుగాని శని మంత్రం 190మార్లు పారాయణ చేయండి.
15. మీ దగ్గరలో ఉన్న శివాలయం/ ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్ళి ప్రతి ఆదివారం ఉదయం 6 గంటలనుండి 7 గంటల వరకూ 190 ప్రదక్షిణలు చేయండి.
16. తూర్పుగోదావరి జిల్లాలోని పెద్దాపురం మరగిరి పాండవుల మెట్టపైన వున్న శనీశ్వర ఆలయం దర్శించి తైలాభిషేకం జరపండి. శనీశ్వర కళ్యాణం దర్శించుకుంటే మంచిది.

1, మార్చి 2013, శుక్రవారం

గురు గ్రహ దోషాలు - శాంతులు



(Guru Graha Dosha Remedies)

గురు గ్రహ దోషం ఉన్నవారు కింది సూచనలను పాటించి, శాంతి చేసుకోవాలి
ప్రతి గురువారం ఉదయం 6 గంటలనుండి ఉదయం 7 గంటల సమయంలో దగ్గరలో ఉన్న దత్తాత్రేయ దేవాలయానికి వెళ్ళి 160 ప్రదక్షిణలు చేయాలి.

  1. 16 గురువారాలు నవగ్రహములకు 160 ప్రదక్షిణలు చేసి, పసుపు వస్త్రంలో ఐదు పావుల శనగలు పోసి, మూత కట్టి, దాన్ని దానం చేయాలి.
  2. గుంటూరు జిల్లాలోని చేబ్రోలు వెళ్ళి బ్రహ్మ దేవాలయము దర్శించాలి.
  3. గురువారం రోజున ఉడికించిన శనగలు పేదలకు పంచిపెట్టాలి.
  4. గుంటూరు జిల్లా అమరావతిలో అమరలింగేశ్వరుని, తూర్పు గోదావరి జిల్లాలో మందపల్లిలోని బ్రహ్మేశ్వరస్వామిని , కోటిపల్లిలోని కోటి లింగేశ్వరుని దర్శించి శనగలు దానం చేయాలి.
  5. కుడిచేతిచూపుడు వేలుకి కనకపుష్యరాగం ఉన్న బంగారు ఉంగరాన్ని ధరించాలి.
  6. బ్రాహ్మణుడితో గురు గ్రహ జపం చేయించి శనగలు దానం చేయాలి.
  7. గురువారం నాడు గురుగ్రహం వద్ద 16 పసుపు రంగు వత్తులతో దీపారాధన చేసి పసుపు వస్త్రాన్ని దానం చేయాలి.
  8. 16 గురువారాలు ఉపవాసము ఉండి చివరి గురువారం దక్షిణామూర్తి పూజ, గురు అష్టోత్తర పూజ చేయాలి.
  9. తమిళనాడులోని అలంగుడి దేవాలయాన్ని దర్శించండి.
  10. శివ, సాయి, దత్త ఆలయాల్లో పేదలకు, సాధువులకు, ప్రసాదం పంచండి.
  11. ప్రతిరోజూ 160 మార్లు చొప్పున 160 రోజుల పాటు గురు ధ్యాన శ్లోకాన్ని పారాయణం చేయండి.
  12. 16 గురువారముల పాటు గురు గాయత్రి మంత్రాన్ని 160 సార్లు పారాయణ చేయాలి.
  13. ప్రతిరోజూ దత్త శ్లోకాన్ని పారాయణ చేస్తూ, 40 రోజుల్లో 16.000 సార్లు గురు మంత్రాన్ని జపించండి.
  14. తీరిక లేనివారు కనీసం గురుశ్లోకములు 16 సార్లు లేదా గురు మంత్రాన్ని 160 సార్లు కాని పారాయణ చేయాలి.
  15. గురు పౌర్ణమి పర్వదినమున 18 సార్లు స్తవం పారాయణ చేయాలి.

28, ఫిబ్రవరి 2013, గురువారం

కుజ జపం – పరిహారము – శాంతులు (సకాలములో వివాహము కాని కన్యలు చేయవలసిన విధులు)

కుజ జపం
స్కంద ఉవాచ :
ఋణగ్రస్తరాణాం తు – ఋణముక్తి: కథం భవేత్!
బ్రాహ్మోవాచః వక్ష్యే హం సర్వలోకానాం – హితార్థం హితకామదమ్
శ్రీమందగారస్తోత్రమహామంత్రస్య – గౌతమ ఋషిః అనుష్టమ్ ఛందః
అంగారకో దేవతా మమ ఋణవిమోచనార్ధే జపే వినియోగః
ధ్యానమ్
రక్తమాల్యాంబరధర : - శూలశక్తి గదాధరః
చతుర్భుజో మేషగతో వరదశ్చ ధరాసుతః
మంగళో భూమిపుత్రశ్చ – ఋణహర్తా ధనప్రదః
స్థిరాసనో మహాకాయః – సర్వకామఫలప్రదః
లోహితో లోహితాక్షశ్చ – సామగానం కృపకరః!
ధారాత్మజఃకుహోభౌమో – భూమిజో భూమినందనః
అంగారకో యమ శ్చైవ – సర్వరోగాపహారకః!
సృష్టే: కర్తా ఛ హర్తాచ – నిర్వదేవైశ్చ పూజితః
పితాని కుజ నామాని – నిత్యం యః ప్రయతః పఠేత్!
ఋణం చ జాయతే తస్య – ధనం ప్రాప్నో త్యసంశయమ్.
అంగారక! మహీపుత్ర! – భగవాన్ భక్తవత్సల నమోస్తుతే
మమాశేష – ఋణ మాశు వినాశయ రక్తగందైశ్చ పుష్పైశ్చ – దూమదీపైర్గుదోదకై:
మంగళం పూజయిత్యాతు – దీపం దత్వా తదంతికే ఋణరేఖాః
ప్రకర్తవ్యా – అంగారేణ తదగ్రతః! తాశ్చ ప్రమార్జయే త్సశ్చాత్ – వామపాదేన సంస్ప్రశన్.

మూలమంత్ర :
అంగారక మహీపుత్ర – భగవాన్ భక్తవత్సల!
నమోస్తుతే మమాశేష – ఋణ మాశు విమోచయ
ఏవం కృతే స సందేహో – ఋణం హీత్వాధనీ భవత్!
మహతీం శ్రియ మాప్నోతి – హ్యపరో ధనదో యథా ఆర్ఘ్యము:
అంగారక మహీపుత్ర! భగవాన్ భక్తవత్సల నమోస్తుతే
మమాశేష – ఋణ మాశు విమోచయ భూమిపుత్ర మహాతేజ – స్స్వేదోద్భవ పినాకినః
ఋణార్తస్త్వాం ప్రపన్నోస్మి – గృహాణార్ఘ్యం నమోస్తుతే ఇతి ఋణమోచాకాంగారక స్తోత్రమ్
కుజదోష నివృత్తి కొరకు నృసింహావతార స్తుతి హిరణ్యకశిపు చ్చేదనతో ప్రహ్లాదాభయ దాయన హేతో నరసింహాచ్యుత రూపనమో భక్తం పరిపాలయమామ్ రామస్మరణాదన్యోపాయం నహి పశ్యామో భవతరణే రామహరే క్రుష్ణహరే తవనామ వదామి సదాన్నహరే (దశావతారములలో నృసింహావతారము పరమాత్మంశ కుజగ్రహము) కుజ మహర్దశలో చేయవలసిన దానములు
1. కుజమహర్దశలో కుజ అంతర్ధశలో ఎద్దును దానమివ్వాలి.
2. కుజమహర్దశలో రాహువు అంతర్ధశలో నల్లని ఆవును దానమివ్వాలి.
3. కుజమర్దహశలో గురు అంతర్ధశలో బంగారమును దానమివ్వాలి.
4. కుజమర్దశలో శని అంతర్ధశలో నువ్వుల ముద్దను దానమివ్వాలి.
5. కుజమర్దహశలో బుధ అంతర్ధశలో గుఱ్ఱమును దానమివ్వాలి.
6. కుజమర్దహశలో కేతు అంతర్ధశలో మేకను దానమివ్వాలి.
7. కుజమర్దహశలో శుక్ర అంతర్ధశలో దుర్గా దానమివ్వాలి.
8. కుజమర్దహశలో రవి అంతర్ధశలో పద్మమును దానమివ్వాలి.
9. కుజమర్దహశలో చంద్ర అంతర్ధశలో ఎద్దును దానమివ్వాలి. గమనిక : కొన్ని వస్తువులు దొరకనప్పుడు వాటికి మారుగా ధనమిచ్చుట కంటెను ఆ వస్తువు ఆకారంలో వెండితో ప్రతిమ చేయించి దక్షిణతో ధారపోయవచ్చును.
కుజ దోష నివారణకు రామాయణ పారాయణ మరియు నైవేద్యాలు కుజ మహర్దశలో బాలకాండలో 36, 37 సర్గ పారాయణం చేయాలి. హనుమంతుని పూజించి, నైవేద్యంగా చెక్కర, పొంగలి సమర్పించాలి. కుజ మహర్దశలో కేతు అంతర్దశలో మేకను దానమివ్వాలి. కుజ మహర్ధశలో కుజ అంతర్దశలో ఉత్తరాకాండ 26 పారాయణ చేసి, నైవేద్యంగా బెల్లం మరియు కందిపప్పుతో పొంగలి సమర్పించాలి.
1. కుజ మహర్ధశలో కుజ అంతర్దశలో ఉత్తరాకాండ 59 పారాయణ చేసి, నైవేద్యంగా తేనె లేదా ఎండుమిర్చి సమర్పించాలి.
2. కుజ మహర్ధశలో గురు అంతర్దశలో సుందరకాండ 51 పారాయణ చేసి, నైవేద్యంగా అమృతపాణీలు లేదా చక్కరకేళీలు సమర్పించాలి.
3. కుజ మహర్ధశలో శని అంతర్దశలో సుందరకాండ 70 పారాయణ. నైవేద్యం: నేరేడు లేదా నల్లద్రాక్ష.
4. కుజ మహర్ధశలో బుధ అంతర్దశలో బాలకాండ 16వ సర్గ పారాయణ. నైవేద్యం: ఆకుపచ్చ ద్రాక్ష లేదా తాంబూలము.
5. కుజ మహర్ధశలో కేతు అంతర్దశలో యుద్దకాండ 116వ సర్గ పారాయణ. నైవేద్యం: ఖర్జూరము లేదా కొబ్బరికాయ.
6. కుజ మహర్ధశలో శుక్ర అంతర్దశలో సుందరకాండ 53వ సర్గ పారాయణ. నైవేద్యం: క్యారట్ పంచదార గుళికలు లేదా పటికబెల్లం.
7. కుజ మహర్ధశలో రవిఅంతర్దశలో బాలకాండ 23వ సర్గ పారాయణ. నైవేద్యం: క్యారెట్ లేదా చేమదుంపలు.
8. కుజ మహర్ధశలో చంద్ర అంతర్దశలో బాలకాండ 17వ సర్గ పారాయణ. నైవేద్యం: పాలు, పంచదారతో పాయసము. 

కుజదోషం – పరిహారము – శాంతులు (సకాలములో వివాహము కాని కన్యలు చేయవలసిన విధులు) 

1. మోపిదేవి, బిక్కవోలు, నాగులపాడు, పెదకూరపాడు, నవులూరు పుట్ట మొదలగు సుబ్రహ్మణ్య క్షేత్రములు దర్శించి కందులు దానము చేయాలి.
2. కనీసము 7 మంగళవారములు ఉదయం 6 గంటల నుంచి ఉదయం 7 లోపుగా దగ్గరలోని సుబ్రహ్మణ్య క్షేత్రములను దర్శించి 7 మార్లు సుబ్రహ్మణ్య అష్టకం పఠించి 7 – ప్రదక్షిణాలు చేసి 70 సార్లు కుజ శ్లోకమును ధ్యానము చేసి చివరి, అంటే 7వ మంగళవారము కందులు దానము చేయాలి.
3. తమిళనాడులో అనేక సుబ్రహ్మణ్య క్షేత్రములు ఉన్నాయి. అవకాశము ఉన్నవారు క్షేత్ర దర్శనముతో దోషనివృత్తి చేసుకొనగలరు. ఒక కృత్తిక నక్షత్రము రోజుకాని, షష్టి తిధి యండుకాని వైదీశ్వరన్ కోయిల్ దర్శించి అభిషేక అర్చనాదులు జరిపించుకొనగలరు.
4. మంగళవారము రోజున గోధుమరంగు కుక్కలకు పాలు, రొట్టెలు పెట్టండి.
5. మీ దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళి పూజలు జరుపుకొనవలెను. ఎర్రని ఫలములు, ఎర్రని వస్త్రములు దానము చేయండి. పేదలకు కందిపప్పు వంటకాలు దానం చేయండి.
6. పగడమును ఎడమచేతి ఉంగరపు వేలుకి వెండితో ధరించండి.
7. 7 మంగళవారములు ఏకభుక్తము చేసినచో మంచిది. అనగా ఉదయం భోజనము చేసి సాయంత్రం భోజనము చేయరాదు. సుబ్రహ్మణ్యస్వామికి 70 ప్రదక్షిణలు చేయండి.
8. ముఖ్యముగా స్త్రీలు పగడమాలను ధరించి, ఎరుపు రంగు కలిగిన వస్త్రములు ధరించి ఎరుపు గాజులు, కుంకుమ ధరించవలెను.
9. నవగ్రహములలో కుజ విగ్రహము వద్ద 7 ఎర్రరంగు వత్తులతో దీపారాధన చేసి ఎర్రని పుష్పము, ఎర్రని వస్త్రములు అలంకరించాలి.
10. 7మంగళవారములు 1.24కే.జీలు ధాన్యము, కందులు ఎర్రని వస్త్రములో పోసి దక్షిణ తాంబూలాదులతో దానము ఇవ్వవలెను.
11. కుజగ్రహమునకు జపము చేయించి కందులు దానము చేయాలి.
12. కుజ ధ్యాన శ్లోకము ప్రతిరోజూ 70 మార్లు చొప్పున పారాయణ చేయాలి.
13. కుజ గాయత్రీ మంత్రమును 7 మంగళవారములు 70 మార్లు పారాయణ చేయాలి.
14. కుజ మంత్రమును 40 రోజులలో 7000 మార్లు జపము చేయాలి, లేదా ప్రతిరోజూ సుబ్రహ్మణ్య అష్టకం పారాయణ చేయాలి.
15. తీరికలేనివారు కుజ శ్లోకమును 7 మార్లుకాని, కుజ మంత్రమును 70 మార్లుకాని పారాయణ చేయాలి.
16. సుబ్రహ్మణ్య షష్టి పర్వదినమున సుబ్రహ్మణ్య అష్టకం 7 మార్లు పారాయణచేయవలెను

ఈ బ్లాగును సెర్చ్ చేయండి



Related Posts Plugin for WordPress, Blogger...