శ్రీ మేధా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం

మీరు జన్మించిన తేది, సమయం, ప్రదేశం ఈ మూడు సమాచారములు మాకు తెలియచేసినచో మీ వ్రుత్తి,వ్యాపార,ఆరోగ్య,ఆర్ధిక పరిస్తితులు, దాంపత్యం, విద్య, ఉద్యోగ, వివాహ, కుటుంబవ్యవహారాలు, సంతానం, రాజకీయ వ్యవహారాలు,ప్రేమ వ్యవహారములు,కుజ దోషం, కాలసర్ప దోషం మరియు వివాహ, ఉపనయన, గృహప్రవేస, జప, హోమ, వ్రత, అన్నప్రసన, నామకరణం లకు ముహూర్తములు పెట్టబడును. P.V.RADHAKRISHNA CELL :+91 9966455872, Mail us : parakrijaya@gmail.com

22, మార్చి 2013, శుక్రవారం

విశ్వనాధీయ స్వప్నశాస్త్రము - పంతుల విశ్వనాధం

గ్రహావస్థలు - శత్రువులు మిత్రులు సములు

గ్రహాలు శత్రువులు మిత్రులు సములు

గ్రహం మిత్రుడు శత్రువు సముడు
రవి చంద్రుడు, కుజుడు, గురువు శని,శుకృడు బుధుడు
చంద్రుడు రవి, బుధుడు శత్రువులు లేరు మిగిలిన వారు సములు
కుజుడు గురువు, చంద్రుడు, రవి బుధుడు శుక్రుడు, శని
బుధుడు శుకృడు, రవి చంద్రుడు కుజుడు, గురువు, శని
గురువు కుజుడు, చంద్రుడు బుధ, శుకృడు రవి, శని
శుకృడు శని, బుధుడు రవి, చంద్రుడు కుజుడు, గురువు
శని శుకృడు, బుధుడు రవి, చంద్రుడు, కుజుడు గురువు
రాహువు శని, శుకృడు రవి, చంద్రుడు, కుజుడు గురువు, బుధుడు
కేతువు రవి, చంద్రుడు, కుజుడు శని, శుకృడు బుధుడు, గురువు

జన్మలగ్నము

భూమి తనచుట్టూ తాను తిరిగే ఆత్మ ప్రదక్షిణ కాలంలో ప్రతి రెండు గంటలకు లగ్నం మారుతూ 24 గంటల సమాయాన్ని 12 రాశుల లగ్నాలుగా విభజిస్తూ జ్యోతిష్య గణన చేస్తారు. చైత్రమాసం పాడ్యమి సూర్యోదయం మేష లగ్నంతో ఆరంభం ఔతుంది. ఒక రోజుకు నాలుగు నిమిషాల కాలం ముందుకు జరుగుతూ చేర్చుకొని ఒక మాసకాలంలో 120 నిమిషాలు లగ్న కాలం మారుతూ వైశాఖమాస ప్రారంభం వృషభ లగ్నంతో ఉదయం ఆరంభం ఔతుంది. ఈ విధంగా లగ్న గణన చేస్తూ జాతకుడు పుట్టిన లగ్న నిర్ణయం చేస్తారు.

ఛాయాగ్రహాలు

జ్యోతిష్య శాస్రంలో రాహుకేతువులు ఛాయా గ్రహాలు. వీటికి జ్యోతిష్య శాస్రంలో ఇల్లు లేదు. రాహుకేతువులు అపసవ్య మార్గంలో ప్రయాణం చేస్తాయి. రాహువు కేతువుకు సరిగ్గా ఏడు రాశులు దూరంలో ప్రయాణం చేస్తాయి. కనుక ఈ రెండు గ్రాహాలు ప్రయాణకాలం సమమే. రాహువును కాలసర్పంగా వ్యవహరిస్తారు. రాశి చక్రంలో రాహువు కేతువుకు మద్యలో అన్ని గ్రహాలు ఉంటే దానిని కాలసర్ప దోషంగా నిర్ణయిస్తారు.

గ్రహస్థితి బలాబలాలు

జ్యోతిష శాస్త్రమున గ్రహములు దిగ్బలం, స్థానబలం, కాల బలం, చేష్టాబలం అను నాలుగు విధముల బలనిర్ణయం చేస్తారు , లగ్నంలో గురువు, బుధుడు ఉన్న బలవంతులు. నాలుగవ స్థానములో చంద్రుడు, శుక్రుడు ఉన్న బలవంతులు. పదవ స్థానమున సూర్యుడు, కుజుడు బలవంతులు. స్వ స్థానమున, ఉచ్ఛ స్థానమున, త్రికోణమున, మిత్ర స్థానమున, స్వ నవాంశ అందు ఉన్న గ్రహములు, శుభ దృష్టి గ్రహములు బలముకలిగి ఉంటాయి. స్త్రీ క్షేత్రములైన వృషభము, కటకము, కన్య, వృశ్చికము, మకరము, మీనములందు చంద్రుడు, శుక్రుడు బలవంతులు. పురుష రాశులైన మేషము, మిధునము, సింహము, తుల, ధనస్సు, కుంభములందు సూర్యుడు, కుజుడు, గురువు, బుధుడు, శని బలవంతులు. సూర్యుడు, కుజుడు, శుక్రుడు పగటి అందు బలవంతులు. రాత్రి అందు బుధుడు, శని, గురువు బలవంతులు. సర్వ కాలమందు బుధుడు బలవంతుడు. శుక్ల పక్షమున శుభగ్రహములు, కృష్ణ పక్షమున పాపగ్రహములు బలవంతులు. యుద్ధమున జయించిన వాడు, వక్రగతి కల వాడు, సూర్యుడికి దూరముగా ఉన్న వాడు చేష్టా బలం కలిగిన వాడు. అంటే ఉత్తరాయణమున కుజుడు, గురువు, సూర్యుడు, శుక్రుడు దక్షిణాయనమున చంద్రుడు, శని రెండు ఆయనముల అందు స్వక్షేత్రమున ఉన్న బుధుడు చేష్టా బలము కల వారు. స్త్రీ గ్రహములైన చంద్రుడు, శుక్రుడు రాశి మొదటి స్థానమున ఉన్న బలము కలిగి ఉంటారు. పురుష గ్రహములైన సూర్యుడు, కుజుడు, గురువు రాశి మధ్యమున ఉన్న బలము కలిగి ఉంటాయి. నపుంసక గ్రహములైన బుధుడు, శని రాశి అంతమున ఉన్నచేష్టా బలము కలిగి ఉంటాయి. రాత్రి అందు మొదటి భాగమున చంద్రుడు, అర్ధరాత్రి అందు శుక్రుడు, తెల్లవారు ఝామున కుజుడు, ఉదయకాలమున బుధుడు, మధ్యహ్న కాలమున సూర్యుడు, సాయం కాలమున శని సర్వ కాలమందు గురువు బలవంతులు. శనికంటే కుజుడు, కుజుని కంటే బుధుడు, బుధునికంటే గురువు, గురువుకంటే శుక్రుడు, శుక్రునికంటే చంద్రుడు, చంద్రునికంటే సూర్యుడు బలవంతులు.

గ్రహావస్థలు

గ్రహావస్థలు పది రకాలు. (1) స్వస్థము, (2) దీప్తము, (3) ముదితము, (4) శాంతము, (5) శక్తము, (6) పీడితము, (7) దీనము, (8) వికలము, (9) ఖల, (10) భీతము అనేవి ఆ అవస్థలు.
  1. స్వస్థము: స్వక్షేత్ర మందున్న గ్రహము స్వప్నావస్తను పొందును.
  2. దీప్తము: ఉచ్ఛక్షేత్ర మందున్న గ్రహము దీప్తావస్త నందుండును.
  3. ముదితము: మిత్ర క్షేత్ర మందున్న గ్రహము ముదితావస్తను పొందును.
  4. శాంతము: సమ క్షేత్ర మందున్న గ్రహము శాంతావస్తను పొందును.
  5. శక్తము: వక్రించి యున్న గ్రహము శక్త్యావస్తను పొందును.
  6. పీడితము: రాశి అంతమున 9 సక్షత్ర పాదములలో చివరి పాదము నందున్న గ్రహము పీడావస్థను పొందును.
  7. దీనము: శత్రు క్షేత్ర మందున్న గ్రహము దీనావస్థను పొందును.
  8. వికలము: అస్తంగత మయిన గ్రహము వికలావస్థను పొందును.
  9. ఖల: నీచ యందున్న గ్రహము ఖలావస్థను పొందును.
  10. భీతము: అతిచారము యందున్న గ్రహము భీత్యావస్థను పొందును.
ఉచ్ఛ స్థానమున ఉన్న దీప్తుడు, స్వక్షేత్రమున ఉన్న స్వస్థుడు, మిత్రక్షేత్రమున ఉన్న ముదితుడు, శుభవర్గమున ఉన్న శాంతుడు, సూర్యునకు దూరమున ఉన్న శక్తుడు, అస్తంగతుడైన వికలుడు, యుద్ధమున పరాజితుడైన పీడితుడు, పాప వర్గమున ఉన్న ఖలుడు, నీచ అందు ఉన్న భీతుడు అని అంటారు. అలాగే సూర్యుడి సామీప్యాన్ని ఆధారంగా చేసుకుని గ్రహగతులను నిర్ణయిస్తారు. సూర్యునితో చేరి ఉన్న గ్రహము అస్తంగత గ్రహం అంటారు.సూర్యునికి రెండవ స్థానంలో ఉన్నశీఘ్రగతిని పొందిన గ్రహం అంటారు. సూర్యుని నాల్గవ స్థానమున ఉన్న గ్రహాన్ని మందుడు అంటారు. సూర్యునికి అయిదు ఆరు రాశులలో ఉన్న గ్రహం వక్రగతిని పొందిన గ్రహం అంటారు. సూర్యునికి ఏడు ఎనిమిది స్థానాలలో ఉన్న గ్రహం అతి వక్రగతిని పొందిన గ్రహం అంటారు.సూర్యునికి తొమ్మిది, పది స్థానాలలో ఉన్న గ్రహం కుటిలగతి పొందిన గ్రహం అంటారు. సూర్యునికి పదకొండు, పన్నెండు స్థానాలలో ఉన్న గ్రహాన్ని అత్యంత శీఘ్రగతిన ఉన్న గ్రహం అంటారు.

21, మార్చి 2013, గురువారం

గోచార ఫలదర్శన చక్రం

 గోచార ఫలదర్శన చక్రం

స్థానం రవి చంద్రుడు కుజుడు బుధుడు గురువు శుక్రడు శని రాహువు కేతువు
1 స్థానచలనం సౌజన్యం దు॰ఖం బంధనం గమనం ఆరోగ్యం విపత్తు భయం భయం
2 భయం వ్యయం వ్యయం లాభం ధనలాభం భాగ్యం హాని కలహం విరోధం
3 సంపత్తు లాభం లాభం వ్యయం విపత్తు సౌభాగ్యం సంపద సౌఖ్యం సుఖం
4 మానభంగం హాని రిపుభయం శుభం వ్యయం సుఖం రోగం మానహాని మానహాని
5 భయం కార్యనాశం రిపుభయం దరిద్రం సంపద పుత్రలాభం సుతక్షయం ధనవ్యయం క్లేశం
6 రిపుహాని శుభం ధనలాభం భూషణం దు॰ఖం వ్యయం సంపద సుఖం సంతోషం
7 దేహపీడ లాభం కలహం వ్యసనం ఆరోగ్యం క్లేశం రాజాగ్రహం భయం భీతి
8 రోగం వ్యయం భయం సంతోషం హాని భయం దు॰ఖం మృత్యువు హాని
9 భయం వ్యాకులం వ్యయం దు॰ఖం ధనాగమం ధనలాభం రోగం సంతానం కలహం
10 లాభం లాభం చలనం శుభం హాని సౌఖ్యం జాడ్యం కలహం విరోధం
11 ఆరోగ్యం శుభం లాభం సుఖం సంతోషం సౌఖ్యం లాభం లాభం ధనాగమం
12 వ్యయం దు॰ఖం రోగం వ్యయం పీడ లాభం క్లేశం హాని హాని

విశ్వనాధీయ ప్రశ్నశాస్త్రము - పంతుల విశ్వనాధం

19, మార్చి 2013, మంగళవారం

వాస్తు - వర్గులు


స్వవర్గు - ధన లాభం
ద్వితీయ వర్గు - స్వల్ప లాభం
తృతీయ వర్గు - శుభ ప్రదం
చతుర్థ వర్గు - వ్యాధులు
పంచమ వర్గు - శత్రు క్షేత్రం
షష్టమ వర్గు - కలహ ప్రదం (మతాంతరంలో లక్ష్మీ ప్రదం)
సప్తమ వర్గు - సర్వ సౌభాగ్యం
అష్టమ వర్గు - మరణ ప్రదం




18, మార్చి 2013, సోమవారం

గ్రహముల గోచార ఫలములు

సూర్యడు:-
  • చంద్రలగ్నంలోనే ఉంటే జాతకుడు కుటుంబానికి దూరంగా ఉంటాడు. పనులకు ఆటంకాలు కలుగుతాయి. అనవసరశ్రమ, అనారోగ్యం కలుగుతుంది.
  • చంద్రలగ్నం లగాయతు రెండవరాశిలో ఉంటే అనవసరశ్రమ, అనారోగ్యం, అశాంతి కలుగుతాయి.
  • చంద్రలగ్నం లగాయతు మూడవరాశిలో ఉంటే మిత్రుల సహకారం, ఉద్యోగంలో అభివృద్ధి, ధనలాభం, సుఖశాంతులు లభిస్తాయి.
  • చంద్రలగ్నం లగాయతు నాలుగవరాశిలో ఉంటే కుటుంబంలో కలహాలు, ఋణబాధ కలుగుతాయి.
  • చంద్రలగ్నం లగాయతు అయిదవరాశిలో ఉంటే బంధువియోగం , దుఃఖము, అశాంతి కలుగును.
  • చంద్రలగ్నం లగాయతు ఆరవరాశిలో ఉంటే అనుకున్న పనులు నెరవేరుతాయి. ధనలాభం, కుటుంబంలో సుఖశాంతులు కలుగుతాయి. అనారోగ్యం కలుగుతుంది.
  • చంద్రలగ్నం లగాయతు ఏడవరాశిలో ఉంటే అధికప్రయాణాలు, అనారోగ్యం, దాంపత్యసుఖం లేకపోవుట, ఆందోళన కలుగుతుంది.
  • చంద్రలగ్నం లగాయతు ఎనిమిదవరాశిలో ఉంటే కుటుంబకలహాలు, అనారోగ్యం, అశాంతి, ధననష్టం కలుగుతాయి.
  • చంద్రలగ్నం లగాయతు తొమ్మిదవరాశిలో ఉంటే అనవసర కలహాలు, మనశ్శాంతి లేకపోవుట, ధనవ్యయం కలుగుతాయి.
  • చంద్రలగ్నం లగాయతు పదవరాశిలో ఉంటే అనుకున్న పనులు నెరవేరుతాయి. మిత్రులతో విందులు చేసుకుంటారు.
  • చంద్రలగ్నం లగాయతు పదకొండవరాశిలో ఉంటే వృత్తిలో అభివృద్ధి, కుటుంబంలో ఆనందం, ధనలాభం కలుగుతాయి.
  • చంద్రలగ్నం లగాయతు పన్నెండవరాశిలో ఉంటే మితులకు దూరంగా ఉంటారు. ఆందోళన, ధననష్టం కలుగుతుంది.
  • రవి శుభస్థానములు 3,6,10,11
  • రవి వేధాస్థానములు 9,12,4,3
  • శుభస్థానములలో ఉన్నగ్రహము, ఆగ్రహము యొక్క వేధా స్థానములలో ఏదైనా గ్రహము ఉంటే శుభఫలితాన్ని ఇవ్వలేదు. 
 చంద్రడు:-

  • చంద్రలగ్నంలోనే ఉంటే కుటుంబసౌఖ్యం, ఆరోగ్యం, గౌరవం కలుగుతుంది.
  • చంద్రలగ్నం లగాయతు రెండవరాశిలో ఉంటే ధనవ్యయం, కార్యహాని, అపనిందలు, ఇతరులతో విభేదాలు కలుగుతాయి.
  • చంద్రలగ్నం లగాయతు మూడవరాశిలో ఉంటే మిత్రుల సహకారమ్, ఉద్యోగంలో అభివృద్ధి, ధనలాభం, కుటుంబసౌఖ్యం కలుగుతాయి.
  • చంద్రలగ్నం లగాయతు నాలుగవరాశిలో ఉంటే బంధువులతో విభేదాలు, కార్యహాని, ఆందోళన కలుగుతాయి.
  • చంద్రలగ్నం లగాయతు అయిదవరాశిలో ఉంటే పనులు నెరవేరవు. అనారోగ్యము ఏర్పడుతుంది.
  • చంద్రలగ్నం లగాయతు ఆరవరాశిలో ఉంటే నూతన వస్తువులు సమకుర్చుకుంటారు. బంధుమిత్రులతో వినోద కాలక్షేపం చేస్తారు. స్త్రీ సాంగత్యం కలుగుతుంది.
  • చంద్రలగ్నం లగాయతు ఏడవరాశిలో ఉంటే బంధువుల సమాగమం, విలాస యాత్రలు చేయుట, స్త్రీసౌఖ్యం కలుగుతుంది.
  • చంద్రలగ్నం ఎనిమిదవరాశిలో ఉంటే మానసిక ఒత్తిడి, అనారోగ్యం కలుగుతాయి.
  • చంద్రలగ్నం తొమ్మిదవరాశిలో ఉంటే మానసిక ఆందోళన, నిరాశ, బలహీనత ఏర్పడుతాయి.
  • చంద్రలగ్నం లగాయతు పదవరాశిలో ఉంటే అధికారంలో అభివృద్ధి, కుటుంబంలో సుఖసంతోషాలు, ఆర్థికాభివృద్ధి కలుగుతాయి.
  • చంద్రలగ్నం లగాయతు పదకొండవరాశిలో ఉంటే నూతన వ్యక్తులతో పరిచయాలు, స్త్రీ సాంగత్యం, కుటుంబాభివృద్ధి కలుగుతాయి.
  • చంద్రలగ్నం లగాయతు పన్నెండవరాశిలో ఉంటే మిత్రులతో విభేదిస్తారు. పనులు నెరవేరవు.
  • చంద్రుడు శుభస్థానములు1,3,6,7,10,11
  • వేధాస్థానములు 5,9,12,2,4,8
  • శుభస్థానములలో ఉన్నగ్రహము, ఆగ్రహము యొక్క వేధా స్థానములలో ఏదైనా గ్రహము ఉంటే శుభఫలితాన్ని ఇవ్వలేదు.
కుజుడు:-
  • చంద్రలగ్నంలోనే ఉంటే బంధువులతో తగాదాలు, ధననష్టం, కార్యహాని, కలుగుతాయి.
  • చంద్రలగ్నం లగాయతు రెండవరాశిలో ఉంటే అధికారుల వలన భయం, అనవసరశ్రమ కలుగుతాయి.
  • చంద్రలగ్నం లగాయతు మూడవరాశిలో ఉంటే అనుకున్న పనులు నెరవేరుతాయి. సంతానసుఖము, ఆరోగ్యం, ఉద్యోగంలో అభివృద్ధి కలుగుతాయి.
  • చంద్రలగ్నం లగాయతు నాలుగవరాశిలో ఉంటే ఇతరులను నమ్మిమోసపోతాడు. అనారోగ్యం కలుగుతుంది.
  • చంద్రలగ్నం లగాయతు అయిదవరాశిలో ఉంటే కుమారునివలన మనశ్శాంతి కోల్పోవుదురు. కోపము, బలహీనత కలుగును.
  • చంద్రలగ్నం లగాయతు ఆరవరాశిలో ఉంటే కార్యసిద్ధి కలుగుతుంది. నూతన వస్తువులను సేకరిస్తారు.
  • చంద్రలగ్నం లగాయతు ఏడవరాశిలో ఉంటే బంధుమిత్రులతో విభేదాలు, అశాంతి కలుగుతుంది.
  • చంద్రలగ్నం ఎనిమిదవరాశిలో ఉంటే నిరాశ, అశాంతి, అనారోగ్యం కలుగుతాయి.
  • చంద్రలగ్నం తొమ్మిదవరాశిలో ఉంటే ప్రయాణాలు, ధననష్టం, అవమానము, ఆందోళన కలుగుతాయి.
  • చంద్రలగ్నం లగాయతు పదవరాశిలో ఉంటే ప్రయాణాలు, ధననష్టం, అవమానము, ఆందోళన కలుగుతాయి.
  • చంద్రలగ్నం లగాయతు పదకొండవరాశిలో ఉంటే అనుకున్న పనులు జరుగుతాయి. భూ, ధనలాభం, స్త్రీసౌఖ్యం పొందుతారు.
  • చంద్రలగ్నం లగాయతు పన్నెండవరాశిలో ఉంటే అధిక ధనవ్యయం, స్త్రీలతో వైఅరం కలుగుతాయి.
  • కుజుడు శుభస్థానములు 3,6,11
  • కుజుడు వేధాస్థానములు12,9,5
  • శుభస్థానములలో ఉన్నగ్రహము, ఆగ్రహము యొక్క వేధా స్థానములలో ఏదైనా గ్రహము ఉంటే శుభఫలితాన్ని ఇవ్వలేదు.
 బుధుడు:-
  • చంద్రలగ్నంలోనే ఉంటేనీచులతో స్నేహం, బంధువులతో విరోధం, ఆస్తినష్టం కలుగుతుంది.
  • చంద్రలగ్నం లగాయతు రెండవరాశిలో ఉంటే అనుకున్న పనులు నెరవేరుతాయి. ధనలాభం కలుగుతుంది. కాని అవమానం పొందుతారు.
  • చంద్రలగ్నం లగాయతు మూడవరాశిలో ఉంటే మిత్రుల సహకారం లభిస్తుంది. బంధువులతో, అధికారులతో విభేదాలు కలుగుతాయి. ధనవ్యయం జరుగుతుంది.
  • చంద్రలగ్నం లగాయతు నాలుగవరాశిలో ఉంటే బంధు, మిత్రుల సహకారం, దనము, సుఖము లభించును.
  • చంద్రలగ్నం లగాయతు అయిదవరాశిలో ఉంటే కుటుంబం లో కలహాలు, అశాంతి ఏర్పడుతాయి. సుఖసంతోషాలు లభిస్తాయి.
  • చంద్రలగ్నం లగాయతు ఆరవరాశిలో ఉంటే నాయకుడు అవుతాడు. ధనవృద్ధి కలుగుతుంది. సుఖ సంతోషాలు లభిస్తాయి.
  • చంద్రలగ్నం లగాయతు ఏడవరాశిలో ఉంటే కార్యహాని, కలహాలు, ధనవ్యయం, అశాంతి కలుగుతాయి.
  • చంద్రలగ్నం ఎనిమిదవరాశిలో ఉంటే అధికారుల అండ లభిస్తుంది. అనుకున్న పనులు నెరవేరును. ఆనందం పొందుతారు.
  • చంద్రలగ్నం తొమ్మిదవరాశిలో ఉంటే బద్దకం పెరుగుతుంది. నీచకార్యాలపై ఆసక్తి కలుగుతుంది.
  • చంద్రలగ్నం లగాయతు పదవరాశిలో ఉంటే ఉద్యోగాభివృద్ది, కీర్తి, ధనము లభిస్తాయి.
  • చంద్రలగ్నం లగాయతు పదకొండవరాశిలో ఉంటే నూతన వ్యక్తుల పరిచయం, సంఘం లో గౌరవం ఏర్పడుతాయి. అనుకున్న పనులు సాధిస్తారు.
  • చంద్రలగ్నం లగాయతు పన్నెండవరాశిలో ఉంటే కుటుంబంలో సమస్యలు, శత్రువుల వలన బాధలు, అపజయము కలుగుతాయి.
  • బుధుడు శుభస్థానములు 2,4,6,8,10,11
  • బుధుడు వేధాస్థానములు 5,3,9,1,7,12
  • శుభస్థానములలో ఉన్నగ్రహము, ఆగ్రహము యొక్క వేధా స్థానములలో ఏదైనా గ్రహము ఉంటే శుభఫలితాన్ని ఇవ్వలేదు. 
 గురుడు:-
  • చంద్రలగ్నంలోనే ఉంటే ప్రయాణాలు, ధనవ్యయం, ఆందోళన, బంధువులతో విభేదాలు కలుగుతాయి.
  • చంద్రలగ్నం లగాయతు రెండవరాశిలో ఉంటే స్త్రీసౌఖ్యం, అధికారం లభిస్తాయి. ధనార్జన ఉంటుంది.
  • చంద్రలగ్నం లగాయతు మూడవరాశిలో ఉంటే స్థానచలనము, పనులకు ఆటంకాలు ఏర్పడుతాయి
  • చంద్రలగ్నం లగాయతు నాలుగవరాశిలో ఉంటే ఉద్యోగంలో ఇబ్బందులు, అధికారం కోల్పోవుట, ఆందోళన కలుగుతాయి.
  • చంద్రలగ్నం లగాయతు అయిదవరాశిలో ఉంటే మిత్రుల సహకారం, ధనము, అదికారము లభించును. శుభకార్యములు నెరవేర్చుదురు.
  • చంద్రలగ్నం లగాయతు ఆరవరాశిలో వుంటే శ్రమపడినా ఫలితం దక్కదు. దాంపత్యసుఖం లభించదు.
  • చంద్రలగ్నం లగాయతు ఏడవరాశిలో ఉంటే సమాజంలో గౌరవం, కుటుంబ సుఖం, ధనలాభం కలుగుతాయి.
  • చంద్రలగ్నం ఎనిమిదవరాశిలో ఉంటే ప్రయాణాలు, అనవసర శ్రమ, ధననష్టం కలుగుతాయి.
  • చంద్రలగ్నం తొమ్మిదవరాశిలో ఉంటే అనుకున్న పనులు జరుగుతాయి. కుటుంబసఖము, అధికారము లభిస్తాయి.
  • చంద్రలగ్నం లగాయతు పదవరాశిలో ఉంటే వృత్తిపరంగా, కుటుంబపరంగా ఇబ్బందులు కలుగుతాయి.
  • చంద్రలగ్నం లగాయతు పదకొండవరాశిలో ఉంటే ఉద్యోగం, అధికారం, దనము, సుఖము లభిస్తాయి.
  • గురుడు శుభస్థానములు 2,5,7,9,11
  • గురుడు వేధాస్థానములు 12,4,3,10,8
  • శుభస్థానములలో ఉన్నగ్రహము, ఆగ్రహము యొక్క వేధా స్థానములలో ఏదైనా గ్రహము ఉంటే శుభఫలితాన్ని ఇవ్వలేదు.
 శుక్రుడు:-
  • చంద్రలగ్నంలోనే ఉంటే కుటుంబసుఖం, విద్యాభివృద్ధి, ఉద్యోగం లభిస్తాయి.
  • చంద్రలగ్నం లగాయతు రెండవరాశిలో ఉంటే కుటుంబంలో ఆనందం, ధనలాభం, సుఖశాంతులు లభిస్తాయి.
  • చంద్రలగ్నం లగాయతు మూడవరాశిలో ఉంటే నూతన పరిచయాలు, సంఘంలో గౌరవం కలుగుతాయి. అధికారం లభిస్తుంది.
  • చంద్రలగ్నం లగాయతు నాలుగవరాశిలో ఉంటే మిత్రులతో వినోదయాత్రలు చేస్తారు. ధాన్యలాభం, సుఖశాంతులు పొందుతారు.
  • చంద్రలగ్నం లగాయతు అయిదవరాశిలో ఉంటే మిత్రుల సహకారంతో అనుకున్న పనులు నెరవేరుతాయి.
  • చంద్రలగ్నం లగాయతు ఆరవరాశిలో ఉంటే ధనవ్యయము అవుతుంది. ఋణము చేస్తారు.
  • చంద్రలగ్నం లగాయతు ఏడవరాశిలో ఉంటే స్త్రీల వలన సమస్యలు, ఇబ్బందులు ఏర్పడుతాయి.
  • చంద్రలగ్నం ఎనిమిదవరాశిలో ఉంటే మిత్రుల కలయిక, ధనము, స్త్రీసౌఖ్యం, ఆరోగ్యం లభిస్తాయి.
  • చంద్రలగ్నం తొమ్మిదవరాశిలో ఉంటే మిత్రులు సహకరిస్తారు. అనుకున్న పనులు నెరవేరుతాయి. సుఖశాంతులు కలుగుతాయి.
  • చంద్రలగ్నం లగాయతు పదవరాశిలో ఉంటే మిత్రులు సహకరిస్తారు. ఉద్యోగరీత్యా శుభప్రదం. వ్యసనాల వలన అవమానాలు పొందుతారు.
  • చంద్రలగ్నం లగాయతు పదకొండవరాశిలో ఉంటే మిత్రులు సహకరిస్తారు. స్త్రీ సౌఖ్యం లభిస్తుంది.
  • చంద్రలగ్నం లగాయతు పన్నెండవరాశిలో ఉంటే స్త్రీలతో పరిచయాలు, అధికవ్యయం కలుగుతుంది. అనుకున్న పనులు జరగవు.
  • శుక్రుడు శుభస్థానములు 1,2,3,4,5,8,9,10,12
  • శుక్రుడు వేధాస్థానములు 8,7,1,10,9,5,11
  • శుభస్థానములలో ఉన్నగ్రహము, ఆగ్రహము యొక్క వేధా స్థానములలో ఏదైనా గ్రహము ఉంటే శుభఫలితాన్ని ఇవ్వలేదు.
 మందుడు(శని):-
  • చంద్రలగ్నంలోనే ఉంటే దూరప్రయాణాలు, అనారోగ్యం, పనులకు ఆటంకాలు కలుగుతాయి.
  • చంద్రలగ్నం లగాయతు రెండవరాశిలో ఉంటే ఆర్థికంగా ఇబ్బందులు, అనారోగ్యం, అశాంతి కలుగుతాయి.
  • చంద్రలగ్నం లగాయతు మూడవరాశిలో ఉంటే అనుకున్న పనులు నెరవేరుతాయి. ఇతరులవలన తన పనులు జరుగుతాయి. అనారోగ్యం కలుగుతుంది.
  • చంద్రలగ్నం లగాయతు నాలుగవరాశిలో ఉంటే పనులకు ఆటంకాలు ఏర్పడును. అనవసరంగా ధనవ్యయం జరుగును.
  • చంద్రలగ్నం లగాయతు అయిదవరాశిలో ఉంటే భార్యకు అనారోగ్యం కలుగుతుంది. అనవసరంగా ధనం వ్యయమవుతుంది.
  • చంద్రలగ్నం లగాయతు ఆరవరాశిలో ఉంటే ఆరోగ్యం, ధనలాభం, కుటుంబసౌఖ్యం కలుగుతుంది.
  • చంద్రలగ్నం లగాయతు ఏడవరాశిలో ఉంటే ప్రయాణాలు, అలసట, అనారోగ్యం కలుగుతాయి.
  • చంద్రలగ్నం ఎనిమిదవరాశిలో ఉంటే కుటుంబ సమస్యలు ఏర్పడుతాయి.
  • చంద్రలగ్నం తొమ్మిదవరాశిలో ఉంటే అధికారుల వలన బాధలు అనవసర ప్రయాణాలు, అనారోగ్యం కలుగుతుంది.
  • చంద్రలగ్నం లగాయతు పదవరాశిలో ఉంటే ఉద్యోగం లభిస్తుంది. నీచకార్యాలపై ఆసక్తి కలుగుతుంది.
  • చంద్రలగ్నం లగాయతు పదకొండవరాశిలో ఉంటే కుటుంబసుఖము, గౌరవము, ధనము లభిస్తాయి.
  • చంద్రలగ్నం లగాయతు పన్నెండవరాశిలో ఉంటే అనవసర శ్రమ, అనారోగ్యం, ధననష్టం కలుగుతాయి.
  • శని శుభస్థానములు 3,6,11
  • శని వేధాస్థానములు 12,9,5
  • శుభస్థానములలో ఉన్నగ్రహము, ఆగ్రహము యొక్క వేధా స్థానములలో ఏదైనా గ్రహము ఉంటే శుభఫలితాన్ని ఇవ్వలేదు.
రాహువు:-
  • చంద్రలగ్నంలోనే ఉంటే అనారోగ్యం, ప్రాణాపాయం కలుగుతాయి.
  • చంద్రలగ్నం లగాయతు రెండవరాశిలో ఉంటే ధననష్టం కలుగుతుంది.
  • చంద్రలగ్నం లగాయతు మూడవరాశిలో ఉంటే సుఖశాంతులు కలుగుతాయి.
  • చంద్రలగ్నం లగాయతు నాలుగవరాశిలో ఉంటే కష్టములు కలుగుతాయి.
  • చంద్రలగ్నం లగాయతు అయిదవరాశిలో ఉంటే ధననష్టము కలుగును.
  • చంద్రలగ్నం లగాయతు ఆరవరాశిలో వుంటే కుటుంబ సుఖము, సంతోషము కలుగుతాయి.
  • చంద్రలగ్నం లగాయతు ఏడవరాశిలో ఉంటే పనులు నెరవేరవు. ధననష్టం జరుగుతుంది.
  • చంద్రలగ్నం ఎనిమిదవరాశిలో ఉంటే అనారోగ్యం, ఆపద కలుగుతాయి.
  • చంద్రలగ్నం తొమ్మిదవరాశిలో ఉంటే పనులు నెరవేరవు. ధననష్టం కలుగుతుంది.
  • చంద్రలగ్నం లగాయతు పదవరాశిలో ఉంటే కార్యసిద్ధి కలుగుతుంది.
  • చంద్రలగ్నం లగాయతు పదకొండవరాశిలో ఉంటే కుటుంబసుఖము, స్త్రీ సాంగత్యం లభిస్తుంది.
  • చంద్రలగ్నం లగాయతు పన్నెండవరాశిలో ఉంటే పనులు నెరవేరవు. అనవసర శ్రమ, ధనవ్యయం కలుగుతాయి.
 కేతువు:-
  • చంద్రలగ్నం లగాయతు రెండవరాశిలో ఉంటే అనారోగ్యం కలుగుతుంది.
  • చంద్రలగ్నం లగాయతు మూడవరాశిలో ఉంటే అనారోగ్యము, ధనవ్యయము కలుగుతుంది.
  • చంద్రలగ్నం లగాయతు నాలుగవరాశిలో ఉంటే ధనము, సుఖము లభించును.
  • చంద్రలగ్నం లగాయతు అయిదవరాశిలో ఉంటే కుటుంబ సుఖము, ధనము, ఆరోగ్యము లభించును.
  • చంద్రలగ్నం లగాయతు ఆరవరాశిలో ఉంటే ధనవ్యయం కలుగును.
  • చంద్రలగ్నం లగాయతు ఏడవరాశిలో ఉంటే అనారోగ్యం, ఆపద కలుగుతాయి.
  • చంద్రలగ్నం లగాయతు ఎనిమిదవరాశిలో ఉంటే ధననష్టం కలుగుతుంది.
  • చంద్రలగ్నం లగాయతు తొమ్మిదవరాశిలో ఉంటే బంధుమిత్రులు సహకారం లభిస్తుంది.
  • చంద్రలగ్నం లగాయతు పదవరాశిలో ఉంటే ధనవ్యయం , బాధలు కలుగుతాయి.
  • చంద్రలగ్నం లగాయతు పదకొండవరాశిలో ఉంటే ఆర్ధిక ఇబ్బందులు కలుగుతాయి.
  • చంద్రలగ్నం లగాయతు పన్నెండవరాశిలో ఉంటే కుటుంబసుఖము, ధనార్జన ఉంటుంది.
******************************** © *******************

ఈ బ్లాగును సెర్చ్ చేయండి



Related Posts Plugin for WordPress, Blogger...