శ్రీ మేధా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం

మీరు జన్మించిన తేది, సమయం, ప్రదేశం ఈ మూడు సమాచారములు మాకు తెలియచేసినచో మీ వ్రుత్తి,వ్యాపార,ఆరోగ్య,ఆర్ధిక పరిస్తితులు, దాంపత్యం, విద్య, ఉద్యోగ, వివాహ, కుటుంబవ్యవహారాలు, సంతానం, రాజకీయ వ్యవహారాలు,ప్రేమ వ్యవహారములు,కుజ దోషం, కాలసర్ప దోషం మరియు వివాహ, ఉపనయన, గృహప్రవేస, జప, హోమ, వ్రత, అన్నప్రసన, నామకరణం లకు ముహూర్తములు పెట్టబడును. P.V.RADHAKRISHNA CELL :+91 9966455872, Mail us : parakrijaya@gmail.com

28, మార్చి 2017, మంగళవారం

శ్రీ హేవళంబి నామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణం - రాశి ఫలితాలు download








 Ugadi Rasi Phalalu/Raasi Phalalu Ugadi Predictions for the Year 2017 - 2018 Telugu New Year Sri Hevilambi Nama Samvatsara Rasi Phalalu and Telugu Astrology By Kavita Siromani,  Daiva±²a:  Pantula Venkata RadhaKrishna (Parakri) And Pantula Jaya Maheswari.

#teluguAstrology, #Mesham Rasiphalalu, #vrishabam Rasiphalalu, #mithunam Rasiphalalu, #karkatakam Rasiphalalu, #simha Rasiphalalu, #kanya Rasiphalalu, #tula Rasiphalalu, #vrischika Rasiphalalu, #dhanu Rasiphalalu, #makara Rasiphalalu, #kumba Rasiphalalu, #meena Rasiphalalu,

1, అక్టోబర్ 2016, శనివారం

నవదుర్గ అవతారాలు

                                            ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి దశమి వరకు సంప్రదాయ పద్ధతి ఆచరించే ఈ నవరాత్రులను దసరా అంటారు. ఈ రోజుల్లోనే అమ్మవారిని వివిధ అలంకారాలతో పూజించి నైవేద్యాలు సమర్పించడం పరిపాటి. వీటితోపాటు ఆదిపరాశక్తి తన అంశలతో భిన్న రూపాలను స్పృశించింది. అవి శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, స్కంధమాత, కాత్యాయిని, కాళరాత్రి, మహాగౌరి, సర్వసిద్ధిధాత్రి అనే నవ రూపాలు. వీటినే నవదుర్గలుగా కొలుస్తాం.   

       
      

నవదుర్గా స్తుతి
ప్రథమా శైలపుత్రీచ, ద్వితీయా బ్రహ్మచారిణీ
తృతీయా చంద్రఘండేతి కూష్మాండేతి చతుర్దశీ
పంచమస్కంధమాతేతీ, షష్ట్యా కాత్యాయనేతి చ
సప్తమా కాలరాత్రిశ్చ, అష్టమాచాతి భైరవీ
నవమా సర్వసిద్ధిశ్చేతి, నవదుర్గాఃప్రకీర్తితాః||


పాడ్యమి - శైలపుత్రి
వందేశాంఛిత లాభాయ చంద్రార్థాకృత శేఖరామ్‌|
వృషారూఢాంశూలాధరం శైలపుత్రీ యశస్వనామ్‌||

దుర్గామాత మొదటి స్వరూపం శైలపుత్రి. పర్వతరాజయిన హిమవంతుడి ఇంట పుత్రికగా అవతరించినందువల్ల శైలపుత్రి అయింది. వృషభ వాహనారూఢి అయిన ఈ తల్లి కుడిచేతిలో త్రిశూలం, ఎడమచేతిలో కమలాన్ని ధరిస్తుంది. ఈ తల్లి మహిమలు, శక్తులు అనంతం. మొదటి రోజున ఉపాసనద్వారా తమ మనసులను మూలాధార చక్రంలో స్థిరపరుస్తారు. యోగసాధనను ఆరంభిస్తారు. నైవేద్యంగా కట్టె పొంగలిని సమర్పించాలి.


విదియ - బ్రహ్మచారిణి
ధధానాకర పద్మాఖ్యామక్షమాలా కమండలా|
దేవీ ప్రసీదతుమయి బ్రహ్మచారిణ్యముత్తమా||

దుర్గామాత రెండవ స్వరూపం బ్రహ్మచారిణి. బ్రహ్మ అంటే తపస్సు. బ్రహ్మచారిణి అంటే తపస్సును ఆచరించేది అని అర్థం. 'వేదస్తత్వం తపోబ్రహ్మ'. బ్రహ్మ అనగా వేదం, తత్త్వం, తపస్సు. ఈ తల్లి తన కుడిచేతిలో జపమాలను, ఎడమ చేతిలో కమండలాన్ని ధరిస్తుంది. ఈ తల్లిని పూజించిన సర్వత్రా సిద్ధి, విజయం, సాధకుడికి మనస్సు స్వాధిష్టాన చక్రంలో స్థిరమవుతుంది. కఠిన ఆహార నియమాలు ఆచరించి అపర్ణ అయింది. నైవేద్యంగా పులిహోరను సమర్పించాలి.


తదియ - చంద్రఘంట
పిండజ ప్రవరారూఢా- చండకోపాస్త్ర కైర్యుతా|
ప్రసాదం తనుతేమహ్యం చంద్ర ఘంటేతి విశ్రుతా|| 

దుర్గామాత మూడవ స్వరూపం చంద్రఘంట. ఈ తల్లి తన శిరసున అర్ధ చంద్రుడు ఘంటాకృతిలో ఉండటంవల్ల ఈ పేరు సార్థకమైనది. ఈమె తన పది చేతులలో ఖడ్గం, గద, త్రిశూలం, బాణం, ధనుస్సు, కమలం, జపమాల, కమండలం, అభయముద్ర ధరించి యుద్ధముద్రలో సర్వదా యుద్ధానికి సన్నద్ధమై ఉంటుంది. ఈమె ఘంట నుంచి వెలువడిన థ్వని భయంకరంగా ఉండికౄరులైన రాక్షసులకు భయాన్ని కలిగిస్తుంది. ఈ తల్లిని ఆశ్రయించిన సమస్త సంసారిక కష్టముల నుంచి విముక్తులు అవుతారు. ఇహలోకంలోనేకాక పరలోకంలో కూడా సద్గతి లభిస్తుంది. నైవేద్యం కొబ్బరి అన్నం.


చవితి - కూష్మాండ
దుర్గామాత నాల్గవ స్వరూపం  కూష్మాండం. దరహాసం చేస్తూ బ్రహ్మాండాన్ని అవలీలగా సృష్టిస్తుంది. కాబట్టి ఈ పేరు వచ్చింది. ఈమె సర్వమండలాంతర్వర్తిని. రవి మండలంలో నివశించే శక్తి సామర్థ్యాలు ఈ తల్లికే ఉన్నాయి. ఈమె ఎనిమిది భుజాలతో ఉంటుంది. తన ఏడు చేతుల్లోనూ కమండలం, ధనుస్సు, బాణం, కమలం, అమృతకలశం, చక్రం, గద ధరిస్తుంది. ఎనిమిదవ చేతిలో సర్వసిద్ధులనూ, నిధులనూ ప్రసాదించే జపమాలను ధరిస్తుంది. ఈమె సింహవాహనం అధిష్టిస్తుంది. సంస్కృతంలో కూష్మాండం అంటే గుమ్మడికాయ. ఈమెకు గుమ్మడికాయ అంటే ఎంతో ఇష్టం. ఈ దేవిని ఉపాసిస్తే మనసు అనాహతచక్రంలో స్థిరంగా ఉంటుంది. ఉపాసకులకు ఆయురారో గ్యాలను ప్రసాదించటమేగాక, వారి కష్టాలను కూడా పోగొడుతుంది. నైవేద్యంగా చిల్లులేని అల్లం గారెలను సమర్పించాలి.

పంచమి - స్కంధ మాత 
సింహాసనాగతా నిత్యం పద్మాశ్రిత కరద్వయా|
శుభదాస్తు సదాదేవి స్కంధమాతా యశస్వినీ||

దుర్గామాత ఐదవ స్వరూపం స్కంధమాత. స్కంధుడనగా కుమారస్వామి. శక్తిధరుడు. దేవసేనల అధిపతి. నెమలి వాహనుడు. ఈయనకు తల్లి కాబట్టి ఈమెకు 'స్కంధమాత' అనే పేరు వచ్చింది. ఈ తల్లి నాలుగు చేతులతో ఉంటుంది. స్కంధుడిని పట్టుకొని పద్మం ధరించి, ఎడమచేతిలో అభయముద్రను, కమలాన్ని ధరిస్తుంది. కమలవాసిని. శ్వేతవర్ణం కలిగి ఉంటుంది. సింహవాహనాన్ని అధిష్టిస్తుంది. ఈమెను ఉపాసించిన విశుద్ధచక్రంలో మనసు స్థిరమవుతుంది, భవసాగరాలనుంచి విముక్తులై మోక్షాన్ని సులభంగా పొందవచ్చును. నైవేద్యంగా పెరుగు అన్నం సమర్పించాలి.


షష్టి - కాత్యాయని
చంద్రహాసోజ్జ్వలకరా శార్దూల వరవాహనా|
కాత్యాయనీ శుభం దద్వాద్దేవీ దానవఘాతినీ||

పూర్వం 'కతి' అనే పేరుగల ఒక మహర్షి ఉండేవాడు. అతని కుమారుడు కాత్య మహర్షి. ఈ కాత్య గోత్రీకుడే కాత్యాయన మహర్షి. ఇతడు ఈ దేవి తనకు కుమార్తెగా జన్మించాలనే కోరికతో తపస్సు చేశాడు. తపస్సు ఫలించింది. మహిషాసురుడిని సంహరించటంకోసం బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తమ తేజస్సుల అంశతో దేవిని సృష్టించారు. మొదట కాత్యాయని మహర్షి తల్లిని పూజించాడు. కాబట్టే 'కాత్యాయని' అనే పేరు వచ్చింది. కాత్యాయని మహర్షి ఇంటిలో పుట్టింది. కాబట్టి కాత్యాయని అయింది అనే కథకూడా ఉంది. ఈమె చతుర్భుజి. ఎడమచేతిలో ఖడ్గం, పద్మాన్ని ధరిస్తుంది. కుడిచేయి అభయముద్రను, వరముద్రను కలిగి ఉంటుంది. ఉపాసించిన సాధకుడి మనసు ఆజ్ఞాచక్రంలో స్థిరమవుతుంది. తన సర్వస్వమునూ ఈ తల్లి చరణాలలో పరిపూర్ణంగా సమర్పించాలి. అప్పుడు ఆమె  అనుగ్రహించి రోగాలనూ, శోకాలనూ, భయాలనూ పోగొడుతుంది. ధర్మార్థకామమోక్షాలను ప్రసాదిస్తుంది. నైవేద్యంగా రవ్వ కేసరిని సమర్పించాలి.


సప్తమి - కాళరాత్రి
ఏకవేణీ జపాకర్ణపూరా నగ్నాఖరాస్థితా
లంబోష్టి కర్ణికాకర్ణితైలాభ్యక్త శరీరిణి|
వామపాదోల్ల సల్లోహ లతాకంటకభూషణా
వరమూర్థధ్వజాకృష్టా కాళరాత్రీర్భయంకరీ||

ఈ తల్లి శరీర వర్ణం గాఢాంధకారంవలె నల్లనిది. తలపై కేశాలు విరబోసుకొని, మెడలో హారం విద్యుత్‌కాంతితో వెలుగుతుంది. ఈమె నాసిక నుంచి భయంకరమైన అగ్నిజ్వాలలు వెలువడుతుంటాయి. ఈమె వాహనం గాడిద. కుడిచేతిలో అభయముద్ర, వరముద్ర కలిగి ఉంటుంది. ఎడమచేతిలో ముళ్ళ ఇనుప ఆయుధం, ఖడ్గం ధరిస్తుంది. చూడటానికి భయంకరంగా ఉన్నప్పటికీ భక్తులపాలిటి కల్పతరువు. ఈ తల్లిని గనక ఉపాసిస్తే మనస్సు సహస్రార చక్రంలో స్థిరంగా ఉంటుంది. సమస్త పాపాలు, విఘ్నాలు తొలగుతాయి. గ్రహబాధలు ఉండవు. అగ్ని, జల, జంతు, శత్రు, రాత్రి భయాలు ఉండవు. నైవేద్యంగా కూరగాయలతో అన్నాన్ని సమర్పించాలి.


అష్టమి - మహాగౌరి
శ్వేతేవృషే సమారూఢా శ్వేతాంబరధరాశుచిః|
మహాగౌరిశుభం దద్వాత్‌, మహాదేవ ప్రమోధరా||

ఈమె ధరించే వస్త్రాలు, ఆభరణాలు తెల్లని కాంతులతో మెరుస్తుంటాయి. ఈమె వృషభ వాహనంపై ఉంటుంది. చతుర్భుజి. కుడిచేతుల్లో  అభయముద్రను, త్రిశూలాన్ని ధరిస్తుంది. ఎడమచేతుల్లో  ఢమరుకాన్ని, వరముద్రనూ కలిగిఉంటుంది. శివుడిని పరిణయమాడాలని కఠోరంగా తపస్సు చేసింది. అందువల్ల ఈమె శరీరం నల్లగా అయిపోయింది. ఆమె తపస్సుకు సంతోషపడిన శివుడు ప్రసన్నుడై ఈమె శరీరాన్ని గంగాజలంతో పరిశుద్దంచేశాడు. ఆ కారణంగా ఈమె శ్వేతవర్ణశోభిత అయింది. మహాగౌరిగా విలసిల్లింది. ఈ మాతను ఉపాసిస్తే కల్మషాలన్నీ పోతాయి. సంచితపాపం నశిస్తుంది. భవిష్యత్తులో పాపాలు, ధైన్యాలు దరిచేరవు. ఈ తల్లిని ధ్యానించి, స్మరించి, పూజించి ఆరాధించినట్లయితే సర్వశుభాలు కలుగుతాయి. నైవేద్యంగా చక్కెర పొంగలి (గుడాన్నం) సమర్పించాలి.


నవమి - సర్వసిద్ధి ధాత్రి
సిద్ధం గంథర్వయక్షాద్వైః అసురైరమరైరపి|
సేవ్యమానా సదా భూయాత్‌ సిద్ధిదా సిద్ధిదాయినీ||

మార్కండేయ పురాణంలో అణిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్య, మహిమ, ఈశిత్వ, వశిత్వ, సర్వకామావసాయిత, సర్వజ్ఞత, దూరశ్రవణ, పరకాయ ప్రవేశ, వాక్సిద్ధి, కల్పవృక్షత్వ, సృష్టిసంహరీకరణ, అమరత్వం, సర్వనాయకత్వం, భావసిద్ధి అని అష్టసిద్ధులు చెప్పబడ్డాయి.

ఈ తల్లి పరమశివుడితో కలసి అర్థనారీశ్వరుడిగా  అవతరించింది. చతుర్భుజి. సింహవాహనాన్ని అధిరోహించింది. కమలవాసిని. కుడిచేతుల్లో గదను, చక్రాన్ని, ఎడమచేతుల్లో శంఖాన్ని, కమలాన్ని ధరించింది. ఈ మాతను ఉపాసించిన వారికి సకల సిద్ధులు లభిస్తాయి. లౌకిక, పారలౌకిక మనోరథాలు నెరవేరతాయి. నైవేద్యంగా పాయసాన్నం సమర్పించాలి.


ఈ పండుగను పదిరోజులు చేసినా రాత్రులు మాత్రం తొమ్మిదే. దశమి రోజున అమ్మవారు  రాక్షససంహారం చేసింది. ఎంతో ప్రశాంతతతో, చిరునవ్వుతో  సకల విజయాలు ప్రసాదిస్తుంది. నైవేద్యంగా చిత్రాన్నం, లడ్డూలు సమర్పించాలి.

3, జులై 2016, ఆదివారం

గ్యారేజ్‌ విషయంలో వాస్తు ముగింపు వాక్యం

Vastu Tips - 19
గ్యారేజ్‌ విషయంలో వాస్తు
1.కార్‌ గ్యారేజ్‌ విషయంలో ఎంతో మంది వాస్తు నియమలను ఉల్లఘింస్తున్నారు. ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ గ్యారేజ్‌ నిర్మించుకోవడమో..... ఎక్కడ అనువుగా ఉంటే అక్కడ కార్‌ను ఉంచుకోవడమో చేస్తున్నారు. కార్‌ గ్యారేజ్‌ అనగా వాహనాలు నిలిపే విషయంలు కూడా వాస్తు ఎన్నో నియమలను సూచించింది. 
2. గ్యారేజ్‌ నిర్మాణానికి వాయువ్యం, ఆగ్నేయం, రెండు దిక్కులే ది బెస్ట్‌. 
3. గ్యారేజ్‌లో ఫ్లోరింగ్‌,ఈస్ట్‌, నార్త్‌ దిక్కులు పల్లంగా ఉండేలా చూసుకోవాలి. 
3. కార్‌ గ్యారేజ్‌లో పార్కింగ్‌ చేశాక....రెండు మూడూ అడుగులు మినిమంగా చుట్టూ ఖాళీ ఉండేలా గార్యేజ్‌ నిర్మాణం జరగాలి. 
4.కార్‌ షెడ్‌ ఎట్టి పరిస్ధితిలో కాంపౌండ్‌వాల్‌కు గానీ, మెయిన్‌ హౌస్‌కు కానీ తగలకుండా నిర్మించుకోవాలి. 
5. ఈశాన్యంలో కార్‌ పార్క్‌ చేయడం కానీ, గ్యారెజ్‌ నిర్మించుకోవడం కానీ చేయనే చేయకూడదు. 
6. ఒకవేళ బేస్‌మెంట్‌లో అయితే..... ఈశాన్యం మూలన కూడా కార్‌ పార్క్‌ చేసుకోవచ్చు. 
కార గ్యారేజ్‌ ఏర్పాటు చేసుకోవచ్చు. 
7. ఆగ్నేయంలో కార్‌ పార్క్‌ చేస్తే తరుచు కార్‌ రిపెయిర్‌ వస్తుంది.తక్కువగా తిరుగుతుంది. 
8. వాయువ్యంలో గార్యేజ్‌లో కార్‌ పార్క్‌ చేస్తే తిరుగుడు పుల్‌గా ఉంటుంది. అయితే రిపెయిర్స్‌ చాలా తక్కువగా ఉంటాయి. 
9. గ్యారేజ్‌కు యొక్క గేటు తూర్పు లేదా ఉత్తర దిక్కుకు తిరిగి ఉండాలి. 
10. గ్యారేజ్‌కు ఏర్పాటు చేసే గేటు.... ఇంటి సింహద్వారం కన్నా ఎత్తుగా ఉండకూడదు. అలాగే కాంపౌండ్‌ వాల్‌ కన్నా ఎత్తుగా ఉండకూడదు. 
11. గ్యారేజ్‌లో చెత్త చెదారం ఉంచకూడదు.త్వరగా ఫైర్‌ అయ్యే ఎలాంటి పదార్ధాలు గ్యారేజ్‌లో ఉంచకూడదు.

సెప్టిక్‌ ట్యాంక్‌-వాస్తు నియమాలు
1. సెప్టిక్‌ ట్యాంక్‌ నిర్మాణంలో వాస్తు నియమాలు పాటించడం చాలా అవసరం. 
2. సెప్టిక్‌ ట్యాంక్‌ను ఈశాన్యం,నైఋతి, ఆగ్నేయ మూలల్లో ఏర్పాటు చేయకూడదు. 
3.ఉత్తరం గోడలను తొమ్మిది భాగాలు చేసి వాయువ్య మూల నుండి మూడవ భాగంలో సెప్టిక్‌ ట్యాంక్‌ను ఏర్పాటు చేసుకోవాలి. 
4. గృహం యెక్క ప్లింత్‌కు, కాపౌండ్‌వాల్‌కు టచ్‌ కాకుండా మినిమం 2 అడుగుల దూరంలో ఉండేలా సెప్టిక్‌ ట్యాంక్‌ను ఏర్పాటు చేసుకోవాలి. 
5. ఇంట్లో వున్న మరుగుదొడ్ల సంఖ్యకు అనుగుణంగా సెప్టిక్‌ ట్యాంక్‌ను ఏర్పాటుచేసుకోవాలి. 

6. సెప్టిక్‌ ట్యాంక్‌ నుంచి వెలువడే దుర్గంధం బయటకు పోవడానికి తప్పకుండా పైప్‌ ఏర్పాటు చేసుకోవచ్చు. 
7. స్ధలాభావం వలన సెప్టిక్‌ ట్యాంక్‌ ఉత్తరం దిక్కులోని 3వ భాగంలో పైన చెప్పినట్లు ఏర్పాటు చేసుకోలేకపోతే సెప్టిక్‌ ట్యాంక్‌ను వాయువ్య దిశలో కాంపౌండ్‌ వాల్‌కు ఇంటిప్లింత్‌కు దూరంగా ఉండేలా ఏర్పాటు చేసుకోవచ్చు.

వాస్తురీత్యా తలపులు-కిటికీలు
1. ఇంటిలో తలుపులు కానీ, కిటికీలు కానీ తూర్పు,ఉత్తర దిశలలో ఎక్కువగా, దక్షిణం,పడమర దిశలో తక్కువగాను ఉండేలా చూసుకోవాలి. 
2. తలుపులన్నింటి కన్నా సింహద్వారం తలుపు పెద్దదిగా ఉండాలి.మిగిలిన తలపులన్నీ ఒకే పరిమాణంలో ఉండాలి. ఒకవేళ కొన్ని తలపులు పెద్దదిగా ఏర్పాటు చేసుకోవాలినిపిస్తే.... ఇలాంటి పెద్ద తలుపులు,దక్షిణం-పడమరలలో మాత్రమే ఉండేలా ఉత్తరం,తూర్పు దిశలో ఉండకుండా జాగ్రత్త వహించాలి. 
3. తలుపులు,కిటికీలు ఎప్పూడూ సరిసంఖ్యలో మాత్రమే ఉండాలి. 
4. తలుపులు, కిటికీలు ఏర్పాటు చేసుకునే సమయంలో క్రాస్‌ వెంటిలేషన్‌ విషయంలో శ్రద్ధ తీసుకోవాలి.అంటే ఒకదానికొకటి ఎదురు బొదురుగా ఉండేలా జాగ్రత్తా వహించాలి. 
5. ఇంట్లో ఏ గదికైనా గుమ్మాలు.... ఉత్తర ఈశాన్యం,తూర్పు ఈశాన్యంలో ఉండేలా చూసుకోవాలి. ఇంట్లో ఏ గదికైనా..... ఉత్తర వాయువ్యం,తూర్పు ఆగ్నేయం, దక్షిణ నైఋతి,పడమర నైఋతిలో గుమ్మాలు ఉండకుండా గృహ నిర్మాణ సమయంలో జాగ్రత్తలు వహించాలి. 
6. సెయిర్‌ కేస్‌కం ప్రారంభంలో, ఎండింగ్‌లో డోర్స్‌ ఏర్పాటు చేసుకోవడం వాస్తురీత్యా మంచిది. 
7. కిటికీలు వెడల్పు విషయంలో తేడాలున్నా ఎత్తు విషయంలో ఒకేలా ఉండేలా జాగ్రత వహించాలి.

వాస్తు పరంగా గార్డెన్‌
1. గార్డెన్‌ ఏర్పాటులో మంచిగా వాస్తు నిబంధనలు పాటిస్తే... మానసికంగా ఆనందం, ప్రశాంతత, ఉల్లాసం లభిస్తాయి. 
2. గార్డెన్‌, లాన్‌, డెకరేటివ్‌ ప్లాంట్స్‌ ఎల్లప్పుడూ తూర్పుదిశలలో ఉండేలా చూసుకోండి. 
3. కుక్కలకు పెట్‌ హౌస్‌, పక్షుల కోసం ఏర్పాటు ఎప్పుడూ వాయువ్యంలోనే చేయాలి. 
4. గార్డెన్‌లో చెత్తా చెదారం లేకుండా ప్రతి రోజూ క్లీన్‌ అండ్‌ గ్రీన్‌లా చేసుకోవాలి. 
5. మెయిన్‌ గేట్‌ నుంచి ఇంటిలోకి వెళ్ళే దారిక ఇరువైపులా చిన్నచిన్న పూల మొక్కలు వంటివి పెంచుకోవచ్చు. 
6. గార్డెన్‌తో పాటు స్విమ్మింగ్‌ పూల్‌ నిర్మించుకోవాలంటే కేవలం ఈశాన్య దిశలో తప్ప.. మరే దిక్కులో స్విమ్మింగ్‌ఫూల్‌ నిర్మాణం చేయకూడదు. 
7. గార్డెన్‌లో ఫౌంటెయిన్స్‌, గార్డెన్‌ మధ్యలో ఏర్పాటు చేయకూడదు. ఈశాన్యంలోనే ఏర్పాటు చేసుకోవాలి. 
8. ఇంటిలోపల నిమ్మ, జీడిమామిడి, నేరేడు, తుమ్ము, ఈత, జిల్లేడు, కుంకుడు, మామిడి, మారేడు, చింత చెట్లు పెంచకూడదు. 
9. పనస, అశోక, వేప, కొబ్బరి, మర్రి, రావి, జామ, వంటి చెట్లను ఇంటిలో పెంచుకోవచ్చు.

ముగింపు వాక్యం
వాస్తులో ఫండ్‌మెంటల్స్‌ను ఇప్పటిదాకా అధ్యయనం చేశారు. 
పుస్తకాలు చదివి వాస్తు నిర్ణయాలు తీసుకొనే ముందు వాస్తు సిద్దాంతులను సంప్రదించడం మంచిది. ఇందులో కేవలం కొంత వరకు మాత్రమే శాస్త్రం ఇవ్వడం జరిగింది. ఈ ఆప్‌ ద్వారా సమాచారం అందించడమే మా లక్ష్యం. మీ నిర్ణయాలకు కష్ట నష్టాలకు మేము బాధ్యత వహించం అని వినయంగా మనవి చేసుకుంటున్నాము

బాత్‌రూమ్‌ - లావేట్రీ వాస్తు

Vastu Tips - 18
బాత్‌రూమ్‌ - లావేట్రీ వాస్తు
1. గతంలో స్నానాల గది లేవట్రీలను విడివిడిగా నిర్మించుకోవడం జరిగేది. ప్రస్తుత కాలంలో ఈ రెంటినీ కల్పి నిర్మించడమే అధిక శాతం జరుగుతోంది. సాధ్యమైనంత మేర బాత్‌రూమ్‌, లావెట్రీలు మరీ ఇరుకుగా ఉండకుండా చూసుకోవాలి. వెంటిలేషన్‌ ఉండేలా చూసుకోవాలి.
2. బాత్‌రూమ్‌, లేవెట్రీలు ఆగ్నేయం, నైఋతీలలో నిర్మించుకోవడం శ్రేష్ఠం. వాయువ్యంలో కూడా బాత్‌రూమ్‌, లేవెట్రీలను నిర్మించుకోవచ్చు. ఎట్టి పరిస్థితులలో ఇంటికి ఈశాన్య దిశలో బాత్‌రూమ్‌ లావెట్రీలు నిర్మించడం తగదు.
3. బయటవైపున బాత్‌రూమ్‌లు లేవెట్రీలు ఏర్పాటు చేసుకునే సమయంలో ఇవి ఉత్తరం, తూర్పు గోడల్ని తాకకుండా ఉండేలా జాగ్రత్త వహించాలి. పడమర, దక్షిణ గోడలకు ఆనించి బాత్‌రూమ్‌లు ఏర్పాటు చేసుకోవడం చేయవచ్చు.
4. బాత్‌రూమ్‌లో ఎగ్జాస్ట్‌ ఫ్యాన్స్‌ ఏర్పాటు చేసుకోవడం మంచి పద్ధతి. వెంటిలేటర్స్‌ ఉన్నా ఎగ్జాస్ట్‌లు బాగా పనిచేసి, బాత్‌రూమ్‌ లేవెట్రీలను దుర్వాసన రహితంగా ఉంచగుల్గుతాయి.
5. బాత్‌రూమ్‌ లేవెట్రీల విషయంలో వాస్తు నియమాలు పాటించకపోతే, ఆర్ధికంగా ఇబ్బందులు ఆరోగ్యపరంగా ఇబ్బందులు తప్పవని వాస్తు చెెబుతుంది.
6. దక్షి నైఋతి, పడమర నైఋతి బాత్‌రూమ్‌ లేవెట్రీల నిర్మాణానికి నెంబర్‌వన్‌ ప్లేస్‌. ఇక ఉత్తర వాయువ్యం, పడమర వాయువ్యంలు కూడా బాత్‌రూమ్‌ నిర్మాణానికి సెకండ్‌ బెస్ట్‌గా భావించాలి.

పూజమందిరం వాస్తు

                                                                    Vastu Tips - 17
పూజమందిరం వాస్తు
పూజా మందిరం ఇంట్లో... ఈశాన్యంలో ఉండడమే ఉత్తమోత్తమం. కుదరని పక్షంలో ఉత్తరం, తూర్పు దిశలలో మాత్రమే పూజా మందిరాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఎట్టి పరిస్థితిలో పూజా మందిరం దక్షిణం వైపు ఉండరాదు. సాధ్యమైనంత వరకు విధిగా మీ పనూజా మందిరాన్ని మీ ఇంటో గ్రౌండ్‌ఫ్లోర్‌లోనే ఏర్పాటు చేసుకోవాలి తప్ప... పై ఫ్లోర్‌లో కాదు. 
1. పూజా మందిరంలోని దేవతా విగ్రహాలు దేవతా చిత్రపటాలు తూర్పు దిక్కును లేదా పడమర దిక్కును చూసేలా ఉండాలి తప్ప ఉత్తర దక్షిణాల వైపు చూససే విధంగా అమర్చుకోరాదు. 
2. పూజా గదిలో తూర్పు గోడకు ఆనించి దేవతా మూర్తుల్ని అమర్చుకోరాదు. తూర్పు గోడకు, దేవాతా మూర్తికి మినిమంగా అంగుళం గ్యాప్‌ అయినా ఉండాలి.
3. పూజామందిరానికి పై భాగంలో లేదా దిగువ భాగంలో టాయిలెట్స్‌ నిర్మాణం జరగకూడదు. పూజ గదిని దైవ సంబంధిత కార్యక్రమాలకు మినహా మరే ఇతర అవసరాలకు వినియోగించరాదు. మరణించిన ఆత్మీయుల ఫోటోగ్రాఫ్స్‌ కూడా పూజ మందిరంలో ఉంచరాదు. 
4. ఇంటి పూజ మందిరంలో బాగా వెయిట్‌ ఉన్న దేవతా మూర్తుల్నిఉంచకండి. ఎంత లైట్‌వెయిట్‌ అయితే అంత మంచిది. దేవాలయాల నుంచి, ప్రాచీన మందిరాల నుంచి తెచ్చుకున్న విగ్రహాలను పూజ మందిరంలో ఉంచకూడదు. 
5. పూజ గదిని ఏర్పాటు చేసుకోవడం కుదరని కొందరు... తూర్పున లేదా ఈశాన్యంలో ఓ అరుగు నిర్మించి దానిపై దేవతా మూర్తుల్ని ఉంచి పూజలు చేస్తుంటారు. అరుగు రూపంలో తూర్పుమీద బరువు పడుతుంది కనుక ఇదీ శాస్త్ర సమ్మతం కాదు. 
ఈశాన్యంలో, తూర్పున పూజామందిరం ఏర్పాటు చేయడానికి సౌలభ్యం లేనప్పుడు ఒక మాస్టర్‌ బెడ్‌రూమ్‌ను మినహాయించి వేరు గదుల్లో ఈశాన్యం మూలన దేవతా విగ్రహాలనుంచి పూజ చేసుకోవచ్చు

30, జూన్ 2016, గురువారం

ఇంటికి సింహద్వారం

Vastu Tips - 16
ఇంటికి సింహద్వారం
కాంపౌండ్‌వాల్‌కు నిర్మించుకున్న గేటు తర్వాత ఇంటికి ప్రధానమైన ద్వారానే సింహద్వారం అంటారు. ఇంట్లోకి ప్రధాన రాకపోకలను ఈ ద్వారం ద్వారానే జరుగుతాయి. 
సింహద్వారం నిర్మించుకునే సమయంలో వాస్తు నియమలు విధిగా నిర్మించుకోవాలి. 
1. సింహద్వారం......... ఇంట్లోని అన్ని ద్వారల కన్నా కొలతలలో పెద్దదిగా ఉండాలి. దీనికిఅమర్చే తలుపు కూడా బలిష్ఠంగా, దృఢంగా ఉండాలి. సింహద్వారం ఎట్టి పరిస్ధితిల్లో ఇంటికి ఉచ్ఛస్ధానంలో ఉండాలి. ఒకవేళ నిర్మాణ రీత్యా వీలుచిక్కక పోతేనే కనీసం మధ్యమ స్ధానంలో ఉండేలా జాగ్రత్త పడాలి. 
2. నార్త్‌ఫేసింగ్‌ హౌస్‌కు సింహద్వారం నార్త్‌ఈస్ట్‌లోనే ఉండాలి. ఎట్టి పరిస్ధితిల్లో వాయువ్యంలో ఉండకూడదు. 
3. సింహద్వారం మూలకు అమర్చకూడదు.మూల నుండి అడుగు, అడుగున్నర దూరంలో అమర్చకోవాలి. 
4. వెస్ట్‌ఫేసింగ్‌ హౌస్‌కు పశ్చిమ వాయువ్యంలో సింహద్వారం ఏర్పరచుకోవాలి. పశ్చిమ నైఋతిలో ఎట్టి పరిస్ధితిలో సింహద్వారం ఏర్పాటు చేసుకోకూడదు. 
5. సౌత్‌ ఫేసింగ్‌ ఇంటికి దక్షిణ ఆగ్నేయంలో సింహద్వారం అమర్చకోవాలి. దక్షిణ నైయుతిలో ఎట్టి పరిస్ధితిలో సింహద్వారం ఏర్పాటు చేసుకోకూడదు. 
6. ఈస్ట్‌ఫేసింగ్‌ హౌస్‌కు సింహద్వారం తూర్పు ఈశాన్యంలో ఉండాలి. తూర్పు ఆగ్నేయంలో ఉండకూడదు. 
7. సింహద్వారం ముందు ఎలాంటి అడ్డంకులు ఉండరాదు. కనీసం పూలకుండీలు కానీ, క్రీపర్స్‌ కానీ... సింహద్వారం ఎదురుగా ఉండకూడదు అలానే చెట్టు నీడలు కూడా సింహద్వారం పై పడకూడదు. 
8. సింహద్వారం ఎప్పుడూ రోడ్‌ లెవల్‌కు ఎత్తులో ఉండి తీరాలి. 
9. మెయిన్‌డోర్‌ వద్దకు చేరుకునేందుకు మెట్లు ఉన్నట్లయితే ఈ మెట్లు బేసి సంఖ్యలో ఉండాలి. 
10. మెయిన్‌డోర్‌కు ఎదురుగా పాడుబడిన, వాడకుండా వదిలి వేయబడిన గృహాలు లేకుండా చూసుకోవాలి. 
11. మన ఇంటి మెయిన్‌డోర్‌... ఎదుటి ఇంటి మెయిన్‌డోర్‌కు ఖచ్చితంగా ఆపోజిట్‌గా ఉండరాదు. 
12. సింహద్వారం ... కాంపౌండ్‌వాల్‌కు అమర్చిన గేటు ఒకే దిశలో ఉండడం వాస్తు రీత్యా మంచిది. 
13. సింహద్వారం యొక్క ఎత్తులో సగం వరకు వెడల్పు ఉండేలా సింహద్వారాన్ని తయారు చేసుకోవాలి. సింహద్వారం చెక్కతప్ప... ఇనుమువంటి లోహాలు వాడకూడదు. 
14. మెయిన్‌డోర్‌ పై భాగంలో బాత్రూమ్‌ లావేటరీ వచ్చేలా పై అంతస్తులో నిర్మాణాలు చేయకూడదు. 
15. సింహద్వారానికి స్లయిడింగ్‌ డోర్‌ వాడకూడదు. 
16. ఇల్లంతా ఊడ్చి సింహద్వారం దగ్గర పోగు పెట్టడం... డస్ట్‌బిన్‌ సింహద్వారం దగ్గరలో ఉంచటం, చీపుర్లు, బూజు ర్రలు సింహద్వారం వెనుక ఉంచడం వాస్తురీత్యా మంచిదికాదు. 
17. మెయిన్‌డోర్‌కు ఎదురుగా పాదరక్షలు విడువరాదు. 
18. సింహద్వారం... పగుళ్ళుచ్చినా... తీసివేసేటపుడు కిర్రు శబ్దాలు చేసినా అది ఆ గృహంలో నివసించే వారికి మంచిది కాద. 
19. మెయిన్‌డోర్‌కు సెల్ఫ్‌ క్లోజింగ్‌ సిస్టమ్‌ అమర్చకూడదు. 
20. మీ సింహద్వారం ఎదురుగా దేవాలయం ఉండకూడదు.

ఈ బ్లాగును సెర్చ్ చేయండి



Related Posts Plugin for WordPress, Blogger...