శ్రీ మేధా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం

మీరు జన్మించిన తేది, సమయం, ప్రదేశం ఈ మూడు సమాచారములు మాకు తెలియచేసినచో మీ వ్రుత్తి,వ్యాపార,ఆరోగ్య,ఆర్ధిక పరిస్తితులు, దాంపత్యం, విద్య, ఉద్యోగ, వివాహ, కుటుంబవ్యవహారాలు, సంతానం, రాజకీయ వ్యవహారాలు,ప్రేమ వ్యవహారములు,కుజ దోషం, కాలసర్ప దోషం మరియు వివాహ, ఉపనయన, గృహప్రవేస, జప, హోమ, వ్రత, అన్నప్రసన, నామకరణం లకు ముహూర్తములు పెట్టబడును. P.V.RADHAKRISHNA CELL :+91 9966455872, Mail us : parakrijaya@gmail.com

29, అక్టోబర్ 2012, సోమవారం

గృహారంభము (శంకు స్థాపనం ) ప్రవేశం

గృహారంభము (శంకు స్థాపనం )

తదియ, పంచమి, సప్తమి, ఏకాదశి, పౌర్ణమి, తిథులు,
సోమ,బుధ,గురు,శుక్రవారము
లందును,
రోహిణి,మృగశిర,పుష్యమి,హస్త,చిత్త,స్వాతి,అనూరాధ,ఉత్తరాషాడ, శ్రవణం, ధనిష్ఠ, శతభిషం,  ఉత్తరాభాద్ర,రేవతి నక్షత్రములయం
దు


వృషభ, సింహ, వృశ్చిక, కుంభ లగ్నములు మంచివి.
మేష,కర్కాటక తుల,మకర లగ్నములు మధ్యమం
లగ్నమునకు చతుర్ద అష్టమ శుద్ధి వుండాలి.
ఉదయం 12 గంటల లోపునే శంకుస్థాపనకు మంచిది.
వృషభ,కలశ చక్ర శుద్దులు కా
వలయును
గృహప్రవేశం

విదియ, తదియ, పంచమి, సప్తమి, దశమి, ఏకాదశి, త్రయోదశి, పూర్ణిమ, తిథులు. బుధ, గురు, శుక్రవారములు
రోహిణి, మృగశిర, ఉత్తర, చిత్త, అనూరాధ, ఉత్తరాషాడ, ధనిష్ఠ, శతభిషం, ఉత్తరాభాద్ర, రేవతి నక్షత్రములు,


వృషభ, మిధున, కన్య, ధనుస్సు, మీన లగ్నములు మంచివి.
స్థిర లగ్నమైన అత్యంత బలీయం,
చతుర్ధ,అష్టమ శుద్ధి అవసరం. వృషభ,కలశచక్రశుద్ధి ఉండాలి


28, అక్టోబర్ 2012, ఆదివారం

ప్రయాణ శుభ శకునములు


ప్రయాణ శుభ శకునములు

        ప్రయాణమయివెళ్ళునప్పుడు వీణ, మద్దెల, సన్నాయి, తప్పెట, తాళములు, పుష్పములు, ముత్తయిదువలు, ఇద్దరు, నలుగురు బ్రాహ్మణులూ ,కర్ర పటుకోనిన శూద్రుడు, ఊరేగింపు, ఏనుగు, గుఱ్ఱము, ఏడ్చువారు లేక పీనుగ, ఆబోతు, అక్షతలు, బియ్యము, జొన్నలు, గోధుమలు, అన్నము , పిండివంటలు, కళ్ళు కావిళ్ళు,తేనే, గాజుల మలారము, పెరుగు, ఆహార పదార్దములు, మాంసము మొదలగు మంగళ ద్రవ్యములు కనిపించినచో ధనలాభము,  శుభము, కళ్యాణము, వ్యాపార జయము అందు లాభము ఉద్యోగ లాభము జయము కల్గును. ప్రయాణమయి పోవునపుడు గ్రద్ద నోట ఆహరముంచుకొని 'కృష్ణా' యని యరిచినచో సకల శుభములు,సౌఖ్యము కలుగును. శుభ కార్యములు చేయుటకు ప్రారంభించునపుడును, గొప్ప పనులను గూర్చి ఆలోచించునప్పుడును గాడిద కూసిన యెడల  శుభము కలుగును.


ప్రయాణమునకు  దుశ్శకునములు


  ప్రయనమాయిపోవునప్పుడు కర్ర,గొడుగు, పూల మూట జారిపదినాను, దెబ్బ తగిలినను, భోజనము చేసిపోవలయును, రేపు, పొండి నేను కూడా వచ్చెదనని అనుటయు, బహిష్టుయిన స్త్రీ యు, విధవ,కట్టెల మోపు,వట్టి కుండలు, కొత్త కుండలు, బొగ్గులు,పిల్లులు, బేసి సంఖ్య బ్రాహ్మణులూ, సరి సంఖ్య శూద్రులు, సాతానులు, జంగము, పెద్ద పొగ, మొండివాడు, కుష్టువాడు, ముక్కు లేని వాడు, గర్బిణీ స్త్రీ యార్తరవము, పెద్ద గాలి దుమ్ము,వాన చినుకులు, చమురు తలతో నున్నవాడు, ఎదురుగా తుమ్ముతున్నవాడు ఇత్యాదులు కనుపించిన ఆ ప్రయాణము మానుకొనుట మంచిది.



శుభ శకునములు


ఒక రాజు, ఇద్దరు బ్రాహ్మణులూ, వేశ్య స్త్రీ, పుత్రులతో స్త్రీ, కన్యకా, ఏనుగు, గోవు, ఎద్దు, దంపతులు, నూతన వస్త్రాలు, చాకళ్ళు, నిండు కుండలు, పాత్రలు, కల్లు, సారాయి లాంటి

మత్తు పదార్థాలు, మాంసం, చెరకు, వీణ, మద్దెల లాంటి వాయిద్యాలు, సామాన్లు, తెల్లని పూలు, తెల్లని ధాన్యం ఎదురు రావటం, మిత్ర వాక్యాలు పలకడం మంచిది.


దుశ్శకునములు:



పిచ్చివాడు, శత్రువు, రోగి, దిగంబరుడు, సన్యాసి, దొంగ, మలినుడు, జాతి బ్రష్టుడు, ఆయుధం, గర్బిని స్త్రీ, వంద్య స్త్రీ, నల్లని ఎద్దు, నపుంసకుడు, పిల్లి, సర్పం, పండి, తోడేలు, భస్మం, బొగ్గులు,
ఉప్పు, ఎముకలు, ఊక, నువ్వులు, మినుములు, మజ్జిగ, పొగ,అగ్ని, పత్తి, బెల్లం, ఎర్రని పుష్పాలు, కలశం, చెడు వార్తలు వినడం, ఎక్కడికి, ఎందుకు అని ప్రశ్నించడం, కొద్ది సేపు ఆగితే నేను 
వస్తా అనడం మంచిది కాదు. సేతు పిట్ట అరుపు దుశ్శకునమే.
దుశ్శకునము అని అనిపించినా వెళ్ళవలసి వస్తే, 
''వాసుదేవాయ మంగళం'' అని 108 సార్లు స్మరించడం మంచిది.

15, అక్టోబర్ 2012, సోమవారం

నవగ్రహ శాంతి విధానము.

పంచాంగ విషయాలు 10 -ముహూర్తములు

ముహూర్తములు
 
             ముహూర్త బలాన్నే ' లగ్నం' అని అంటారు . ప్రముఖ పంచాంగ కర్తలు పేరు, నామ నక్షత్రముల నాదారముగా ప్రత్యేక సందర్భాలకు ముహూర్తం నిర్ణయిస్తారు.కొన్ని ముఖ్య ముహూర్తాలు తిధి వార నక్షత్ర సమయాలతో ముహూర్త లగ్న నామాలతో ఒక క్రమ పద్దతిలో ఈయబడినవి. సిద్దాంతులు అందుబాటులో లేని వారు వివరాలు పంపిన యెడల మా వద్ద నున్న అనుభవజ్ఞులైన పండితులచే ముహూర్తములు నిర్ణయించ గలము. గ్రహ స్థానములు వాని ఫలితములతో కూడిన లగ్న కుండలి మీరు కోరగనే లభ్యమగును.అనుభవజ్ఞులైన పంచాంగ కర్తలు చెప్పినట్లు ముహూర్తము నిర్ణ యించు నపుడు అతి చిన్న చిన్న దోషాలు తప్పవు.
* మీచే నిర్ణయించ బడిన ముహూర్తముల యుక్తా యుక్తములు కూడా మాచే వివరించ బడును. ముఖ్యమైన వివరాలతో ఆ ముహూర్తం తగియున్నదో లేదో మీకందించ గలము.
 
దోష రహిత ముహూర్త బలం అసాధ్యం కాని అట్టి చిన్న దోషాల నివారణార్ధం జపాలు, దానాలు (నవధాన్యాలు మొ|| )ఎట్లు చేయవలెనో మీకెప్పుడూ అందుబాటులో ఉంటాయి.

* మీరిచ్చే సమయ సందర్భాలను బట్టి మీరు కోరిన సమయాలను బట్టి మా పురోహితులు/సిద్దాంతులు మీకు అనుకూలముగా ముహూర్తములు నిర్ణయించగలరు.

12, అక్టోబర్ 2012, శుక్రవారం

పంచాంగ విషయాలు 9 స్వప్న ఫలితములు

స్వప్న ఫలితములు
 
శుభ స్వప్నములు

సూర్యోదయము, సంపూర్ణ చంద్రోదయము, కలలో కనిపించినచో ధనలాభము కలుగును. క్షేత్రదర్శనములు, గురువులు, పుణ్యపురుషులను పూజించినట్లు కలవచ్చిన యెడల సుఖము, సంపదలు కలుగును. నీటిమీద తిరిగివచ్చినట్లు కలవచ్చిన శుభము, పూలతోటలో తిరిగివచ్చినట్లు వచ్చిన స్త్రీ వలన లాభము, పచ్చనిపైరు కలలో వచ్చిన ధనలాభం కలుగును. మలము దేహమున పూసుకొనుచున్నట్లుగా, ఏనుగు మీద ప్రయాణము చేసినట్లును వచ్చిన అతిత్వరలో ధనలాభం కలుగును. వేశ్యనుగాని, వివాహము జరుగుటనుగాని చూచి, వారితో మాట్లాడినట్లు వచ్చిన శుభకార్యము ప్రాప్తించును. అన్నము, ఆవు, గుఱ్ఱము, ఏనుగు కలలో కనిపించిన పుత్రలాభము, శుభము జరుగును. శత్రువులను జయించునట్లు కనిపించిన విజయము, రక్తము, కల్లు త్రాగునట్లు, తెల్లని వస్త్రములు ధరించినట్లు, పూలు కనిపించిన విద్యాప్రాప్తి, ధనలాభము కలుగును.

అశుభ ఫలితములు  
 
తలగొరిగినవాడు గాని, విధవను గాని, చూచుట అశుభము. నూనెతో తలంటుకొనినట్లు, దూది, ఇనుము, కనిపించిన మరణము, ఆపదలు కలుగును. క్షీణ చంద్రుడు నక్షత్రము రాలుచున్నట్లు కనిపించిన దుఃఖము పర్వతము నెక్కునపుడు కాలు జారినట్లును, పడవప్రయాణములో మునిగినట్లును కలవచ్చిన మరణము, నిలువ ధనమునకు హాని, ఇంటిలో దొంగలు పడినట్లు కలవచ్చిన ధనం పోవును.

10, అక్టోబర్ 2012, బుధవారం

పంచాంగ విషయాలు 8 -పుట్టు మచ్చల ఫలితములు

పుట్టు మచ్చల ఫలితములు 
 
ముక్కు  మీద - కోపము,వ్యాపార దక్షిత,  కుడికన్ను -అనుకూల దాంపత్యము , ఎడమకన్ను -స్వార్జిత ధనార్జన ,నుదిటి మీద -మేధావి, ధనవంతులు,  గడ్డము- విశేష ధనయోగము, కంటము- ఆకస్మిక ధన లాభము, మెడమీద -భార్య ద్వారా ధన యోగము, మోచేయి -వ్యవసాయ రీత్యా ధన లబ్ది , కుడిచేయి మణికట్టు నందు - విశేష బంగారు ఆభరణాలు ధరించుట, పొట్ట మీద -భోజన ప్రియులు, పొట్టక్రింద -అనారోగ్యం ,కుడి తొడ - ధనవంతులు, ఎడమ తొడ -సంభోగము, ధనలాభములు, చేతిబ్రొ టనవ్రేలు -స్వతంత్ర విద్య, వ్యాపారము, కుడిచేయి చూపుడు వ్రేలు - ధన లాభము, కీర్తి, పాదముల మీద - ప్రయాణములు, మర్మ స్థానం - కష్ట సుఖములు సమానం.

9, అక్టోబర్ 2012, మంగళవారం

పంచాంగ విషయాలు 7 - బల్లి శాస్త్రము

బల్లి శాస్త్రము

బల్లి మరియు తొండ పడుట వలన కలుగు శుభా శుభములు
స్త్రీలకు: తలమీద - ప్రాణ భయము, కొప్పుపై - రోగ భయం, పిక్కలు -బంధు దర్శనం, ఎడమ కన్ను - భర్త ప్రేమ , కుడి కన్ను - మనోవ్యధ , వక్షమున - సుఖము, కుడి చెంప -పుత్ర లాభం, పై కుడి చెవి -ధన లాభము, పై పెదవి - విరోధము, క్రింద పెదవి - నూతన వస్తు లాభం, రెండు పెదవులు - కష్టం, స్తనములందు -అధిక దుఃఖం, వీపు యందు -మరణ వార్త, గోళ్ళపై -కలహము , చేతియందు - ధన నష్టం, కుడి చేయి -ధన లాభం , ఎడమ చేయి -మనోచలనం, వ్రేళ్ళపై - భూషణ ప్రాప్తి , తొడలు -వ్యభిచారం, మోకాళ్ళ యందు -బంధనం , చీలమండ యందు -కష్టము ,కుడికాలిపై - శత్రు నాశనం ,కాలి వ్రేళ్ళు - పుత్ర లాభం.
పురుషులకు : తలమీద  -కలహం, బ్రహ్మ రంద్రమున -మృతువు, ముఖము -ధన లాభము, ఎడమ కన్ను -శుభం , కుడి కన్ను - అపజయం, నుదురు బందు సన్యాసం, కుడి చెంప - దుఃఖం , ఎడమ చెవి-లాభం, పై పెదవి -కలహం, క్రింద పెదవి -ధన లాభం , రెండు పెదవులపై -మృత్యువు, నోటియందు - రోగ ప్రాప్తి , ఎడమ మూపు -జయం, కుడి మూపు - రాజ భయం, చేతి యందు -ధన నష్టం, మణి కట్టు యందు - అలంకార ప్రాప్తి, మోచేయి ధన నష్టం, వ్రేళ్ళపై - స్నేహితులు రాక , కుడిభుజం -కష్టం,  ఎడమ భుజం -అగౌరవం , తొడలపై - వస్త్ర నాశనం, మీసాలుపై - కష్టం , పాదములు - కష్టం, పాదముల వెనుక -ప్రయాణము , కాలి వ్రేళ్ళు - రోగ పీడలు.

సూచన ; కంచి పుణ్య క్షేత్రములో గల బంగారు, వెండి బల్లులను తాకిన వారికి పై దోషములు తీవ్రత కలుగదని పూర్వ జనుల అభిప్రాయము.

8, అక్టోబర్ 2012, సోమవారం

పంచాంగ విషయాలు - 6 వైద్య జ్యోతిషం

వైద్య జ్యోతిషం

మానవుని జీవితంలో రుగ్మతలు సర్వ సాధారణం . ఆ రుగ్మతలకు కూడా రాశులు , వాటి అధిపతులైన గ్రహాలూ కారణం అవుతాయి. రాసి తత్వాలు ,గ్రహకార కత్వాల ద్వారా రోగ నిర్ధారణకు ఉపకరించేదే వైద్య జ్యోతిషం . ఏ శరెర భాగాలకు రుగ్మతలు వస్తాయో రాశులు తెలుపుతాయి. ఎటువంటి రుగ్మతలు వస్తాయో గ్రహాల ద్వారా తెలుస్తుంది . ముందుగా రాశులు - వాటికి వర్తించే శరీర భాగాలు ఈ దిగువన వివరిస్తున్నాం.

రాశులు - శరీర భాగాలు
మేషం - శిరస్సు ,ముఖం, మెదడు , ముఖంలోని ఎముకలు, మెదడు లోని నరాలు.
వృషభం - గొంతు, మెడ, వాటిలోని నరాలు,ఎముకలు.
మిధునం - భుజాలు, చేతులు, వాటిలోని ఎముకలు, నరాలు, శ్వాస కోశం .
కర్కాటకం- రొమ్ము ,జీర్ణాశయం.
సింహం - గుండె , వెన్నెముక
కన్య - ఉదరం, ఉదరకోశం,పొత్తికడుపు
తుల - కటి భాగం, నాభి, మూత్ర పిండాలు.
వృశ్చికం - జననేంద్రియాలు, మూత్రకోశం .
ధనుస్సు - తొడలు, పిరుదులు, రక్త నాళాలు.
మకరం - మోకాళ్ళు, కీళ్ళు.
కుంభం - పిక్కలు, కాళ్ళు, రక్త ప్రసరణం.
మీనం - పాదాలు, వేళ్ళు, శరీరంలోని ద్రవ పదార్దాలు.
ఈ రాశులలో మేష, సింహ, ధనుస్సులు అగ్నితత్వానికి, వృషభ, కన్య, మకరాలు భూతత్వానికి, మిధున , తుల, కుంభ రాశులు వాయు తత్వానికి , కర్కాటక, వృశ్చిక, మీన రాశులు జల తత్వానికి చెందినవి. కావున ఈ తత్వానికి సంబందించిన రుగ్మతలు కూడా వచ్చే అవకాశం ఉంది.వీటితో పాటు గ్రహాలు కూడా కొన్ని రుగ్మతలకు కారణం అవుతాయి . గ్రహాలు ఆ కలుగ చేసే రుగ్మతల వివరాలు ఈ క్రింద పొందు పరచినాము.

6, అక్టోబర్ 2012, శనివారం

పంచాంగ విషయాలు 5 - రాశులు

రాశులు నక్షత్రములు, పాదములు, రాశులు, వాని ప్రతి నామములు, వాని ఘడియలు
 
1 అశ్వని (4 ) భరణి (4 ) కృత్తిక (1 ) -మేషము - మేక - 4 1 /4 ఘడియలు .

 
2 కృత్తిక  (3 ) రోహిణి (4 ) మృగశిర (2 ) - వృషభము - ఎద్దు - 4 3 /4 ఘడియలు .

 
3 మృగశిర (2 ) ఆర్ద్ర ( 4 ) పునర్వసు (3 ) -మిధునము - దంపతులు - 5 1 /4 ఘడియలు .

 
4 పునర్వసు (1 )పుష్యమి (4 )ఆశ్లేష (4 ) - కర్కాటకము - పీత - 5 1 /2  ఘడియలు .

 
5 మఘ (4 ) పుబ్బ (4 ) ఉత్తర (1 ) - సింహము - సింగము -5 1 /4 ఘడియలు .

 
6 ఉత్తర (3 ) హస్త (4 ) చిత్త (2 ) -కన్య - పడుచు -5 ఘడియలు .

 
7 చిత్త (2 ) స్వాతి (4 ) విశాఖ (3 ) - తుల - త్రాసు -5  ఘడియలు .

 
8 విశాఖ (1 ) అనూరాధ (4 ) జ్యేష్ట (4 ) - వృశ్చికము - తేలు -5 1 /4 ఘడియలు .

 
9 మూల (4 ) పూర్వాషాడ (4 ) ఉత్తరాషాడ (1 ) - ధనుస్సు - విల్లు - 5 1 /2 ఘడియలు .

 
10 ఉత్తరాషాడ (3 ) శ్రవణము (4 ) ధనిష్ఠ (2 )- మకరము - మొసలి - 5 1 /4 ఘడియలు .

 
11 ధనిష్ఠ  (2 ) శతబిశం (4 ) పూర్వాబాద్ర (3 ) - కుంభము -కడవ -4 3 /4 ఘడియలు.

 
12 పూర్వాభాద్ర (1 ) ఉత్తరాబాద్ర (4 ) రేవతి (3 ) - మీనము - చేప - 4 1 / 4 ఘడియలు .

 
12 రాశులకు కలిపి మొత్తం 60 ఘడియలు (సావన 59 ఘ .50 విఘడియలు ). ఇచ్చట సాదారణముగా ఇవ్వబడింది . ఇవి ప్రతి అక్షాంశమునకు మారును.
 

నక్షత్రములు వాని ఆకారములు :
 
1 అశ్వని - గుఱ్ఱము ముఖమును చోలి 3 నక్షత్రములుండును
  భరణి - త్రిభుజము చోలిన 3 నక్షత్రములు దగ్గరగా నుండును .
  కృత్తిక - కొడవలి యాకారముగా 6 నక్షత్రములుండును
  రోహిణి - శకటము (బండి ) వలె 3 నక్షత్రములుండును
  మృగశిర - మృగము తల వలె 3 నక్షత్రములుండును
  ఆర్ద్ర  - పగడము పోలి ఒక నక్షత్రము చక్కగా నుండును.
  పునర్వసు - ధనుస్సు వంటి యాకారము పోలి 5 నక్షత్రములుండును
  ఆశ్లేష - పాము వలె మెలికలుగా 6 నక్షత్రములుండును
  మఘ - పల్లకి యాకారములో 5 నక్షత్రములుండును

 పుబ్బ, ఉత్తర - రెండేసి చతురస్రాకారముగా 4 నక్షత్రములుండును
  హస్త -హస్తము లేక అరచేతి వలె 5 నక్షత్రములుండును
  చిత్త - ముత్యము వలె గుండ్రముగా ఒకటే నక్షత్రములుండును
  స్వాతి - మాణిక్యాకారముగా ఒకటే నక్షత్రములుండును
  విశాఖ - (సారిక ) కుమ్మరి చక్రము పోలి 5 నక్షత్రములుండును
  అనూరాధ , జ్యేష్ట - (చత్రాకారము) గొడుగును పోలి 6 నక్షత్రములుండును
  మూల - చెంబును పోలి 5 నక్షత్రములుండును
  పూర్వాషాడ ,ఉత్తరాషాడ - ఖేకము వలె 2 నక్షత్రములుండును
  శ్రవణము - ఒకే పంక్తిగా, వేణువు వలె 3 నక్షత్రములుండును
  ధనిష్ఠ - మద్దెల యాకారముగా నేర్పడి 3 నక్షత్రములుండును
  శతభిషం - చూచుటకు విందుగా, వరుస వరుసగా 100 నక్షత్రములుండును
  పూర్వాభాద్ర , ఉత్తరాభాద్ర - రెండేసి రెండేసి 4 నక్షత్రములుండును
  రేవతి - చేప వలె 3 నక్షత్రములుండును
ఏలినాటి శని : ప్రతి మానవుని జీవిత కాలమందు ముప్పది ఏండ్ల కోక మారు ఏలినాటి శని ప్రవేశించును. జన్మ రాశికి - నామ రాశికి - ద్వాదశమునందు - లగ్నము నందు , ద్వితీయము నందు - శని యున్నచో ఎల్నాటి శని యందురు. శని గ్రహము ఒక్కొక్క రాశి యందు 2 1/2 సంవత్సరముల కాలము సంచారము -మొత్తము కలిపి ఏడున్నర సంవత్సర కాలము ఎల్నాటి శనియున్నదన్నమాట .
ఫలితము: ద్వాదశ  రాశి యందున్నప్పుడు  -ధన వ్యయము , మానసిక భాద , అందోళనములు , కుటుంబ సమస్యలు, వ్యాపార, వృత్తులందు వ్యతిరేకములు కలుగును.
జన్మరాశి యందున్నప్పుడు - బంధు మిత్ర ద్వేషములు, ధన నష్టము - కుటుంబ స్థితి తారుమారుగా ఉండును. కొన్ని శుభ గ్రహ వీక్షణచే ప్తయత్న పూర్వక ధనాదాయము , మిశ్రమ ఫలితములు ఉండవచ్చును. కళత్ర పీడ, మతి బ్రమణం, దీర్ఘ వ్యాదులు కలుగ వచ్చును .
ద్వితీయము నందున్నప్పుడు - ఆశా జీవి యగును . నిందలు పడుట, నిత్య దు : ఖము కలుగును. మానసికముగా క్రుంగదీయును .పై కాలములందు మాస శివ రాత్రి రోజున శని పూజలు చేయుట మంచిది.
సం    నె    రో
ముఖము నందు         0  3  10 శరీర పీడ - ధన నష్టాదులు

దక్షిణ భుజము           1  1   00 ఉద్యోగ వృత్తులందు లాభాదులు
పాదములందు            1  8  10  అశాంతి - దిగులు - అవమానములు
హృదయస్థానము        1  4  20  ధన ప్రాప్తి - గౌరవము - కీర్తి
వామ భుజము           1  1  10  వ్యాధి పీడ - ధన వ్యయము
శిరో భాగము               1  10  00  సంతోషము -ధనాదాయము
కన్నులు                    0  6  20  మన్నన - కుటుంబ సంతోషము
గుదము                     0  6  20  ప్రమాద భరితములు - కీర్తి ధన నష్టము

శని బాధ పడుచున్నవారు నువ్వులు, బెల్లం, నూనె, నవధాన్యములు కలిపి 27 ప్రదక్షిణములు శనీశ్వరునకు చేసి శని విగ్రహము మీద పోస్తే శని దోష మంతయు తొలగి శుభాలు శీఘ్రముగా పొందవచ్చును. మృత్యుంజయ, నవగ్రహ హోమాలు, దానాలు చేస్తే త్వరగా శుబాలు పొందుతారు.
సూచన : దీక్ష  40 రోజులు చేయాలి .
రాహు కేతువులు 3 - 6 - 11 స్థానము లందున్నచో శత్రు జయము అప్రయత్న లాభములు, గౌరవము , పుణ్య క్షేత్ర సందర్శనములు, తీర్ద యాత్రము చేయుట శుభములు కలుగును, కార్య సిద్ది కల్గును.
సూచన : అన్ని గ్రహములు  1  - 8  - 12  స్థానములందున్నచో  కష్ట నష్టాదులు ఏర్పడును .


5, అక్టోబర్ 2012, శుక్రవారం

పంచాంగ విషయాలు 4-అవయవములు ఆదరుట వలన ఫలము



అవయవములు ఆదరుట వలన ఫలము
 
కుడి ప్రక్కన అదిరిన మేలు,ఎడమప్రక్కన మధ్యమ ఫలము. నడినెత్తిన మృష్టాన్నము , నొసలు మేలు, కుడి చంప రాజ భయం, ఎడమ చేయి ఉద్యోగము, స్త్రీలకు కుడి కన్ను కీడు, ఎడమ కన్ను మేలు, రెండు కన్నులు అదిరిన మేలు. ముక్కు రోగం . ముక్కు రోగం .పై పెదవి కలహము.క్రింద పెదవి భోజన సౌఖ్యము. గడ్డము లాభము. కుడి చెక్కిలి ధనము. ఎడమ చెక్కిలి దొంగల భయము. కుడి భుజము సంభోగము. ఎడమభుజము కీడు. రొమ్ము ధనము. చేతులు వాహన లాభం. అరచేయి సంతానం .కుడి తోడ రాజ జయము. మోకాళ్ళు జాడ్యము. మొగాళ్ళు దాన్యలాభము . అరికాళ్ళు సౌఖ్యము.ప్రక్క ఆభరణ ప్రాప్తి.

4, అక్టోబర్ 2012, గురువారం

పంచాంగ విషయాలు 3- శకున ఫలితములు

పంచాంగ విషయాలు - శకున ఫలితములు
శుభ శకునములు
కన్యలు, ముత్తైదువలు , పువ్వులు, భోగంసాని, పండ్లు ,కుంకుమ ,పసుపు, పాలు, మంగళ వాద్యములు, మండుచున్న కాగడా, గంటాద్వని, విజయ శబ్దములు, గాడిద అరుపు ,వేదనాదము, జంట బ్రాహ్మణులు ,చల్లటి గాలి,గుఱ్ఱములు, ఏనుగులు, ఆవులు, చేపలు, సంతోషవార్తలు, తెల్లని గొడుగు, నీళ్ళ బిందెలు, మద్దెలలు, వీణ, శంఖము, కర్ర పట్టుకొనినవాడు, నీళ్ళ బిందెలతో స్త్రీలు, అనుకూలమైన గాలి ఇవి ఎదురగుట మంచిది.
అశుభ శకునములు
ఎక్కడకు వెళ్తున్నావని అడుగుట , ఎందుకని అడుగుట, నేనూ వచ్చేదననుట , కొంతసేపు ఆగమనుట, ఒక్కడివీ వెల్ల వద్దనుట,భోజనం చేసి వెళ్ళమనుట , వంటివి వినుట మంచిది కాదు. తుమ్ములు వినుట, పొగతో ఉన్న నిప్పు ,గ్రుడ్డివాడు, విధవ, నూనె కుండ, ఆయుధము, గొడ్డళ్ళు, బోడివాడు , ఏడ్చు చున్నవారు, ఒంటి బ్రాహ్మణుడు, దిగంబరుడు , వాన, గాలి, రక్త దర్శనము, కష్టమైన మాటలు వినుట ,పిల్లి, కాకి, పాము, కోళ్ళు ,కోతులు  అడ్డుగా వచ్చుట అశుభ శకునములు.
అశుభ శకునములు ఎదురైన, వెళ్ళుట తప్పని సరియైనప్పుడు ' వాసు దేవాయ మంగళం' అని భగవంతుని స్మరిస్తూ బయలు దేరవలెను.

ఈ బ్లాగును సెర్చ్ చేయండి



Related Posts Plugin for WordPress, Blogger...