శ్రీ మేధా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం

మీరు జన్మించిన తేది, సమయం, ప్రదేశం ఈ మూడు సమాచారములు మాకు తెలియచేసినచో మీ వ్రుత్తి,వ్యాపార,ఆరోగ్య,ఆర్ధిక పరిస్తితులు, దాంపత్యం, విద్య, ఉద్యోగ, వివాహ, కుటుంబవ్యవహారాలు, సంతానం, రాజకీయ వ్యవహారాలు,ప్రేమ వ్యవహారములు,కుజ దోషం, కాలసర్ప దోషం మరియు వివాహ, ఉపనయన, గృహప్రవేస, జప, హోమ, వ్రత, అన్నప్రసన, నామకరణం లకు ముహూర్తములు పెట్టబడును. P.V.RADHAKRISHNA CELL :+91 9966455872, Mail us : parakrijaya@gmail.com

19, ఆగస్టు 2013, సోమవారం

ప్రధమ ఋతువు (రజస్వల)

 రాజోదర్శనము అనగా స్త్రీ రజస్వల అగుట. ప్రధమ రాజోదర్శనమునకు వాడుకలో సమర్థ, పుష్పవతి, పెదామనిషి అయినదని కూడా అంటారు. నెల నెల రాజోదర్శనమును బహిష్టు అంటారు. ప్రధమ రజస్వల ప్రాతః కాలమునుంచి మధ్యాహ్నములోపు అయిన శుభము. మిగిలిన కాలము అశుభము.

రజస్వలకు దుష్ట తిధులు: అమావాస్య, ఉభయ పాద్యమిలు, షష్టి, అష్టమి, ద్వాదశి తిదుల యందును పరిఘ యోగముల పూర్వార్ధమునండును, వ్యతీపాత, వైధృతి యోగాములండును, సంధ్యా కాలమునండును, ఉప్పెన, భూకంప మొదలైన వుపద్రవ కాలమండును భద్ర కారణమూ నందును మొదటిసారి రజస్వల అయిన శుభకరము కాదు.

వారఫలము: సోమ, బుధ, గురు, శుక్ర వారములందు ప్రధమ రజస్వల అయిన శుభ ఫలము, ఆది, మంగళ, శని వారములందు అశుభ ఫలము కలుగుతుంది.

శుభ నక్షత్రములు: అశ్విని, రోహిణి, మృగశిర, పుష్యమి, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనూరాధ, మూల, ఉత్తరాషాఢ , శ్రవణం, ధనిష్ఠ, శతభిషం, ఉత్తరాభాద్ర, రేవతి యీ నక్షత్రములందు ప్రధమ రజస్వల అయిన సౌభాగ్యము, సౌఖ్యము, సంతానము, ఆయువు, ధనము కలుగుతుంది. మిగిలిన నక్షత్రములు అశుభ ఫలములు ఇచ్చును. కావున శాంతి చేయాలి. రజస్వల కాకుండానే వివాహాలు జరిపించే పూర్వపు రోజుల ప్రకారము భర్త యొక్క జన్మ నక్షత్రమినాను హాని అని చెప్పబడినది.

దుష్ట నక్షత్రములందు ప్రధమముగా రజస్వల అయినపుడు హోమయుక్తమైన శాంతి జరిపించి దానాదులు నిర్వహించి తిరిగి షుహ నక్షత్రములో రజోదర్శనమైన తదుపరి శుభ ముహూర్త కాలమందు గర్భాదానము చేయాలి. ఆ విధంగా చేసిన యెడల సంతాన ప్రాప్తి కలుగుతుంది మరియు గ్రహణ సమయములందు, సంక్రాంతి యందు, అశుభమైన నిద్రా సమయములందు, అర్ధరాత్రి యందు ప్రధమ రజస్వల అయినచో యుక్తమైన శాంతులు నిర్వహించాలి.

శుభ తిధులు: తదియ, పంచమి, సప్తమి, దశమి, ఏకాదశి, త్రయోదశి, పౌర్ణమి తిధులు శుభము.

లగ్న గ్రహ ఫలము: ప్రదమ రాజోదర్శన సమయమున కేంద్ర, కోణ, లాభ స్థానములందు శుబ గ్రహములు, తృతీయ, షష్ట లాభ స్థానములందు క్రూర గ్రహములు శుభ ఫలములిస్తాయి. చంద్రుడు అష్టమ స్థానమునందు వుండిన పతి నాశనము కలుగ జేస్తాడు. కాని చంద్ర తారాబలములు సంపన్నమైనపుదు పుత్ర, ధన సంపత్తులు కలుగుతాయి. కుజుడైనాను లేక చంద్రుడైనాను లగ్నమునకు 3, 6, 10 స్తానములన్డున్నచో సంపంనులగు కుమారులు కలుగుతారు.

నక్షత్ర గ్రహ ఫలము: రజస్వలా సమయ నక్షత్రమందు గురుడుగాని, శనిగాని వున్నాను, యే గ్రహము లేకున్నను శుభము. రజస్వలా సమయ నక్షత్రము నందు కుజుడున్నను బుధ శుక్రులు కలిసి వున్నాను, రవి వున్నాను రాహు కేతువులున్నను అశుభము.

రాజోదర్శన స్థాన ఫలితము: తన యింటి యందును, గోడల చావిదియండును, స్వగ్రామ మధ్యమందు, జల సమీపమున, ఇంటి ఆవరణ మధ్య ప్రధమ రజస్వల అయిన శుభము. గ్రామము బయట, ఇతర గ్రామములందు, నగ్నముగా వున్నపుడు ఇతరుల యిండ్లలోను ప్రదమ రజస్వల అయిన అశుభము.

వేళా విశేషములు: ప్రాతః కాలం చిర సౌభాగ్యం, ఉషః కాలం శోవ్భాగ్య లోపం, పూర్వాహ్నం పుణ్య క్షేత్ర దర్శనం, మధ్యాహ్నం ధనవతి, పుత్రవతి, సాయంత్రం జారగునం, సంధ్యలందు చేడుప్రవర్తన కలది, అర్ధరాత్రి బాల వైధవ్యం కలుగును.

రాత్రి వేళ నిర్ణయం: రాత్రి రజస్వల అయినచో రాత్రిని మూడు భాగాలుగా చేసి రెండు భాగముల కాలము పూర్వదినము, మూడవ భాగాకాలమున తదుపరి దినమునకు చెందుతుంది.

వస్త్రఫలము: తెల్లబాట్ట కట్టుకొని రజస్వల అయిన సౌభాగ్యవతి, గట్టి బట్ట కట్టుకొని రజస్వల అయిన పతివ్రతయు, దుకూల వస్త్ర దారియైన పట్టపురాణి యగును, నూతన వస్త్రము ధరించాగానే శుభ సంపన్నురాలగును, చిరిగినా బట్ట కట్టుకొనిన దౌర్భాగ్య రాలగును, యెర్రని బట్టకట్టుకోనిన వ్యాధి గ్రస్తురాలగును, నల్లని వస్త్రము ధరించినదైన దరిద్రురాలగును.

రజస్వలా శుద్ధి: రాజోవతి అయిన స్త్రీ మొదటి దినమునండు చండాల స్త్రీ సమానురాలు, రెండవ దినమందు పతితురాలితో సమానురాలు, మూడవ దినమునండు చాకలి స్త్రీతో సమానము, నాలుగవ దినమున కూడా శూద్ర స్త్రీ సమానురాలు, ప్రధమ రజస్వల అయిన స్త్రీ అయిదవ దినమందు దేవ పితృ కార్యములందు పరిశుద్దురాలూ అన్నారు. నాలుగవ దినమందు స్నాముచేత శుచి కాగలదు. బహిష్టు అయిన స్త్రీ మూడు రోజుల తరువాత శుద్ధి అవుతుంది. తిరిగి మల్లి పంతొమ్మిది రోజులలో బహిష్టు అయిన ఒక దినముతో శుద్ధి అట్లుగాక ఇరవై రోజుల అనంతరము ఎప్పుడైనా బహిష్టు అయిన మూడు రోజుల తరువాత శుద్ధి అగును.

ప్రధమ రజస్వల అయిన కన్యకు అక్షతలు తలపై వేసి ఆసనమేసి కూర్చుండ బెట్టాలి. దీపమున్న గదిలోనే కన్యను ఉంచాలి. సువాసినులకు శ్రీ గంధము, పుష్పములను, తమ్బూలములను లవణము, పెసలు మొదలగునవి ఇవ్వాలి. ప్రధమ రజస్వల అయిన వస్త్రముతోనే మూడు రోజులు ఉంచాలి. ఎవరిని తాకకుండా జాగ్రత్త గా, ప్రశాంతముగా, ఉండునట్లు చూడాలి. భోజన విషయంలో పులగము, నెయ్యి, పాలు వంటి సాత్విక ఆహారము ఉప్పు, పులుపు, కారము లేకుండా ఇచ్చుట మంచిది, నాలుగవ రోజు స్నానము చేయించి నూతన వస్త్రములు కట్టించాలి.

సర్వ ఋతువులకు సాధారణ నియమములు: మూడు దినములు ఎవరిని తాకకూడదు. అభ్యంగనము, కాటుక, స్నానము, పగలు నిద్రించుట , అగ్ని ముట్టుట, ప్రాసనము, సూర్యావలోకనము, భూమిపై గీతాలు గీయుట చేయుట చేయకూడదు. క్రింద పడుకోవాలి, ఆవుపాలు, పెరుగు, మజ్జిగ, తాంబూలము, గంధమాల్యములు ఉపయోగించరాదు. ఇవన్నీ ఆరోగ్యము కొరకు పాటించే నియమములు.

వస్త్రఫలము: తెల్లబాట్ట కట్టుకొని రజస్వల అయిన సౌభాగ్యవతి, గట్టి బట్ట కట్టుకొని రజస్వల అయిన పతివ్రతయు, దుకూల వస్త్ర దారియైన పట్టపురాణి యగును, నూతన వస్త్రము ధరించాగానే శుభ సంపన్నురాలగును, చిరిగినా బట్ట కట్టుకొనిన దౌర్భాగ్య రాలగును, యెర్రని బట్టకట్టుకోనిన వ్యాధి గ్రస్తురాలగును, నల్లని వస్త్రము ధరించినదైన దరిద్రురాలగును.

ఈ బ్లాగును సెర్చ్ చేయండి



Related Posts Plugin for WordPress, Blogger...