శ్రీ మేధా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం

మీరు జన్మించిన తేది, సమయం, ప్రదేశం ఈ మూడు సమాచారములు మాకు తెలియచేసినచో మీ వ్రుత్తి,వ్యాపార,ఆరోగ్య,ఆర్ధిక పరిస్తితులు, దాంపత్యం, విద్య, ఉద్యోగ, వివాహ, కుటుంబవ్యవహారాలు, సంతానం, రాజకీయ వ్యవహారాలు,ప్రేమ వ్యవహారములు,కుజ దోషం, కాలసర్ప దోషం మరియు వివాహ, ఉపనయన, గృహప్రవేస, జప, హోమ, వ్రత, అన్నప్రసన, నామకరణం లకు ముహూర్తములు పెట్టబడును. P.V.RADHAKRISHNA CELL :+91 9966455872, Mail us : parakrijaya@gmail.com

30, జూన్ 2016, గురువారం

ఇంటికి సింహద్వారం

Vastu Tips - 16
ఇంటికి సింహద్వారం
కాంపౌండ్‌వాల్‌కు నిర్మించుకున్న గేటు తర్వాత ఇంటికి ప్రధానమైన ద్వారానే సింహద్వారం అంటారు. ఇంట్లోకి ప్రధాన రాకపోకలను ఈ ద్వారం ద్వారానే జరుగుతాయి. 
సింహద్వారం నిర్మించుకునే సమయంలో వాస్తు నియమలు విధిగా నిర్మించుకోవాలి. 
1. సింహద్వారం......... ఇంట్లోని అన్ని ద్వారల కన్నా కొలతలలో పెద్దదిగా ఉండాలి. దీనికిఅమర్చే తలుపు కూడా బలిష్ఠంగా, దృఢంగా ఉండాలి. సింహద్వారం ఎట్టి పరిస్ధితిల్లో ఇంటికి ఉచ్ఛస్ధానంలో ఉండాలి. ఒకవేళ నిర్మాణ రీత్యా వీలుచిక్కక పోతేనే కనీసం మధ్యమ స్ధానంలో ఉండేలా జాగ్రత్త పడాలి. 
2. నార్త్‌ఫేసింగ్‌ హౌస్‌కు సింహద్వారం నార్త్‌ఈస్ట్‌లోనే ఉండాలి. ఎట్టి పరిస్ధితిల్లో వాయువ్యంలో ఉండకూడదు. 
3. సింహద్వారం మూలకు అమర్చకూడదు.మూల నుండి అడుగు, అడుగున్నర దూరంలో అమర్చకోవాలి. 
4. వెస్ట్‌ఫేసింగ్‌ హౌస్‌కు పశ్చిమ వాయువ్యంలో సింహద్వారం ఏర్పరచుకోవాలి. పశ్చిమ నైఋతిలో ఎట్టి పరిస్ధితిలో సింహద్వారం ఏర్పాటు చేసుకోకూడదు. 
5. సౌత్‌ ఫేసింగ్‌ ఇంటికి దక్షిణ ఆగ్నేయంలో సింహద్వారం అమర్చకోవాలి. దక్షిణ నైయుతిలో ఎట్టి పరిస్ధితిలో సింహద్వారం ఏర్పాటు చేసుకోకూడదు. 
6. ఈస్ట్‌ఫేసింగ్‌ హౌస్‌కు సింహద్వారం తూర్పు ఈశాన్యంలో ఉండాలి. తూర్పు ఆగ్నేయంలో ఉండకూడదు. 
7. సింహద్వారం ముందు ఎలాంటి అడ్డంకులు ఉండరాదు. కనీసం పూలకుండీలు కానీ, క్రీపర్స్‌ కానీ... సింహద్వారం ఎదురుగా ఉండకూడదు అలానే చెట్టు నీడలు కూడా సింహద్వారం పై పడకూడదు. 
8. సింహద్వారం ఎప్పుడూ రోడ్‌ లెవల్‌కు ఎత్తులో ఉండి తీరాలి. 
9. మెయిన్‌డోర్‌ వద్దకు చేరుకునేందుకు మెట్లు ఉన్నట్లయితే ఈ మెట్లు బేసి సంఖ్యలో ఉండాలి. 
10. మెయిన్‌డోర్‌కు ఎదురుగా పాడుబడిన, వాడకుండా వదిలి వేయబడిన గృహాలు లేకుండా చూసుకోవాలి. 
11. మన ఇంటి మెయిన్‌డోర్‌... ఎదుటి ఇంటి మెయిన్‌డోర్‌కు ఖచ్చితంగా ఆపోజిట్‌గా ఉండరాదు. 
12. సింహద్వారం ... కాంపౌండ్‌వాల్‌కు అమర్చిన గేటు ఒకే దిశలో ఉండడం వాస్తు రీత్యా మంచిది. 
13. సింహద్వారం యొక్క ఎత్తులో సగం వరకు వెడల్పు ఉండేలా సింహద్వారాన్ని తయారు చేసుకోవాలి. సింహద్వారం చెక్కతప్ప... ఇనుమువంటి లోహాలు వాడకూడదు. 
14. మెయిన్‌డోర్‌ పై భాగంలో బాత్రూమ్‌ లావేటరీ వచ్చేలా పై అంతస్తులో నిర్మాణాలు చేయకూడదు. 
15. సింహద్వారానికి స్లయిడింగ్‌ డోర్‌ వాడకూడదు. 
16. ఇల్లంతా ఊడ్చి సింహద్వారం దగ్గర పోగు పెట్టడం... డస్ట్‌బిన్‌ సింహద్వారం దగ్గరలో ఉంచటం, చీపుర్లు, బూజు ర్రలు సింహద్వారం వెనుక ఉంచడం వాస్తురీత్యా మంచిదికాదు. 
17. మెయిన్‌డోర్‌కు ఎదురుగా పాదరక్షలు విడువరాదు. 
18. సింహద్వారం... పగుళ్ళుచ్చినా... తీసివేసేటపుడు కిర్రు శబ్దాలు చేసినా అది ఆ గృహంలో నివసించే వారికి మంచిది కాద. 
19. మెయిన్‌డోర్‌కు సెల్ఫ్‌ క్లోజింగ్‌ సిస్టమ్‌ అమర్చకూడదు. 
20. మీ సింహద్వారం ఎదురుగా దేవాలయం ఉండకూడదు.

డ్రైనేజీ - వాస్తు

డ్రైనేజీ - వాస్తు

డైనేజీ విషయంలో సైతం వాస్తు ఎన్నో నియమాలను వివరించింది. పాటించామా జీవితాంతం... ఆనంద ప్రమోదాలే. . నిర్లక్ష్యం చేశామా... పలురకాల బాధలు. 
1. ఇంల్లో అన్నిరకాల ఉపయోగించిన నీరు, వర్షపు నీరు, తూర్పు ఈశాన్యం నుంచి గానీ ఉత్తర ఈశాన్యం నుంచి గానీ బలయటకు వెళ్ళేలా ఏర్పాటు చేసుకోవాలి. డ్రైనేజీని ఏర్పాటు చేసే సమయంలో ఈ నియమాన్ని విధిగా పాటించి తీరాలి. 
2. పశ్చిమ నైఋతి ఉత్తర దిశ మీదుగా నీరు ఈశాన్యం పైపు నడిచి బయటకు వెళ్ళాలి. అలానే దక్షిణ నైఋతి నుండి దక్షిణం, తూర్పులగుండా ప్రవహించి ఈశాన్యం నుంచి బయటకు వెళ్లేలా డ్రైనేజీలు నిర్మించాలి. 
3. ఈ విధంగా నీరు ఫ్రీగా నడిచి ఈశాన్యానికి నడిచే రీతిగా కాలవలు నిర్మించాలి. నైఋతిలోని నీరు ఆగ్నేయానికి వాయువ్యాయానికి ఫ్రీగా నడిచేందుకు వీలుగా నైఋతి నుండి వాయువ్యానికి, ఆగ్నేయానికి వాటం ఉండేలా జాగ్రత్తపడాలి. 
4. వాయువ్యానికి చేరిన నీటిని ఈశాన్యం వైపు నడవాలంటే వాయువ్యం కన్న ఈశాన్యం పల్లంగా ఉండాలి. ఇదే రీతిగా ఆగ్నేయ మూలకన్న కలువ ఈశాన్యంలో పల్లంగా ఉండాలి. అప్పుడే నైఋతి నుండి ఆగ్నేయానికి చేరిన నీరు ఫ్రీగా ఈశాన్యానికి వెళ్తాయి. 
5. ఇంట్లో కాలకృత్యాలకు ఇతర ఇతర అవసరాలకు వినియోగించిన నీటిని ఎలా అయితే ఈశాన్యం గుండా బయటకు పంపామో అదే రీతిగా ఇంటి స్లాప్‌లు కూడా ఈశాన్యంలో పల్లంగా ఉండేలా జాగ్రత్త వహించి వర్షపు నీరు స్లాబ్‌ పై నిలువ ఉండకుండా ఈశాన్యంలో ఏర్పాటు చేసిన తూము ద్వారా బయటకు వెళ్ళేలా స్లాబ్‌ నిర్మాణం సమయంలో పూర్తి జాగ్రత్తలు పాటించాలి. లేని పక్షంలో స్లాబ్‌పైన వర్షపు నీరు నిలచి పోయి, స్లాబ్‌ లీక్‌ అయ్యే ప్రమాదం ఉంది. 
6. ఈశాన్యం గుండా డ్రైనైజ్‌ వాటర్‌ను బయటకు పంపడం కుదరని పక్షంలో... వాయువ్యం మీదుగా లేదా, ఆగ్నేయం గుండా డ్రైనేజీ వాటర్‌ను బయటకు పంపేలా ఏర్పాట్లు చేసుకోవాలి.

ఇంట్లో మెట్లు-వాస్తు నిబంధనలు

ఇంట్లో మెట్లు-వాస్తు నిబంధనలు

1. మెట్లు అంటేనే బరువుతో కూడినవి కనుక మెట్లను ఏర్పాటు చేసుకోనే సమయంలో బరువు 
వేయతగని ప్రాంతంలో మెట్లు నిర్మించకుండా ఎన్నో జాగ్రత్తలు వహించాలి. 
2. దక్షిణ దిశ,పడమర దిశలో మెట్లు ఏర్పాటు చేసుకోవడం వాస్తురీత్యా సముచితం. 
3. ఇంటి బయట ఏర్పాటు చేసుకోనే మెట్లు.... తూర్పున అయితే ఆగ్నేయంలో ఉత్తరంలో అయితే వాయువ్యంలో పడమర అయితే నైయుతిలో, దక్షిణంలో అయితే నైయుతిలో నిర్మించుకోవాలి. 
4. మెట్లు తూర్పు నుంచి పడమరకు ఎక్కేలా, ఉత్తరం నుంచి దక్షిణానికి ఎక్కేలా ఉండాలి. మధ్యలో లభించిన ఖాళీకి అనుగుణంగా మెట్లును వేరే దిశకు మళ్ళించవచ్చు. 
5. మెట్లు సంఖ్య ఎప్పుడు బేసి సంఖ్యలోనే ఉండాలి. సంఖ్య చివర జీరో వుండకూడదు. 
6. ఈశాన్యంలో ఇంటి మధ్యలో మెట్లు ఎట్టి పరిస్ధితిలో నిర్మించుకూడదు. ఆర్ధికంగా చాలా వేతలు పడాల్సి వస్తుంది. 
7. స్టెయిర్‌ కేస్‌ దిగువన.... కిచెన్‌,బాత్‌రూమ్‌,పూజ గది వంటివి నిర్మించుకోకుడదు. మెట్లు క్రింద భాగం స్లోరేజ్‌కు ఉపయోగించుకోవచ్చు. 
8. పై అంతస్తుకు వెళ్ళెందుకు దిగువ సెల్లార్‌కు కానీ బేస్‌మెంట్‌కు కానీ వెళ్ళేందుకు ఒకే స్టెయిర్‌ కేస్‌ను ఉపయోగించకండి.సెల్లార్‌కు వెళ్ళేందుకు వేర్‌ స్టెయిర్‌కేస్‌ ఏర్పాటు చేసుకోమని సూచిస్తుంది వాస్తు. 
9. స్టెయిర్‌ కేస్‌లో టర్నింగ్‌లు ఎప్పుడూ క్లాక్‌వైజ్‌ డైరెక్షన్‌లోనే ఉండాలి. యాంటీక్లాక్‌వైజ్‌ డైరెక్షన్‌లో మెట్లు టర్నింగ్‌లు ఉండడం వాస్తు విరుద్ధం. 
10. సాధ్యమైనంత వరకు స్పిరల్‌,సర్క్యులర్‌ కేస్‌లను ఏర్పాటు చేసుకోవద్దు. 
11. పై అంతస్తు లేదా టెర్రాస్‌ పైకి వెళ్ళే స్టెయిర్‌ కేసుకు రూఫ్‌ ఉండి తీరాలి. 
12. స్టెయిర్‌ కేస్‌కు డోర్స్‌ ఉంటే.... లోయర్‌ డోర్‌ కన్నా అప్పర్‌డోర్‌ 10 అంగుళాల వరకు తక్కువ ఎత్తులో ఉండాలి. 
13. స్టెయిర్‌ కేస్‌ దిగువన సేఫ్టీలాకర్స్‌,విలువైన సంపదతో కూడిన అల్‌మైరాలు ఉంచకూడదు. 
14. ఇంటి చుట్టూ తిరిగి వచ్చేలా స్టెయిరకేస్‌ను అమర్చడం బహుళ అంతస్తుల బిల్డింగ్స్‌లో చూస్తుంటాం. వాస్తు శాస్త్ర రీత్యా ఇవి ఎన్నో అనర్ధాలకు దారితీస్తుంది. 
15. దక్షిణం నుండి ఉత్తరానికి, పడమర నుండి తూర్పుకు మేడమెట్లు ఎక్కేలా ఏర్పాటు చేసుకోవడం శాస్త్ర విరుద్ధం. ఇలాంటి గృహంలో అభివృద్ధి లోపిస్తుంది. అనేక రకాల శారీరక మానసిక బాధలు చుట్టుముడతాయి. 
16. పడమర, దక్షిణ గోడలకు ఆనుకుని మెట్లు నిర్మించవచ్చు. తూర్పు, ఉత్తర గోడలకు దూరంగా ఉండేలా మెట్లు నిర్మించుకోవాలి. 
17. మెట్లు వాలు 30 నుండి 45 డిగ్రీల నడుమ ఉండాలి. అంతకు మించి ఉంటే మెట్లు ఎక్కడం శ్రమ అవుతుంది. మోకాళ్ళు నడుం నొప్పి వచ్చే అవకాశం కూడా ఉంది

26, జూన్ 2016, ఆదివారం

లివింగ్‌ రూమ్‌

లివింగ్‌ రూమ్‌

ఇంటికి వచ్చిన అతిధులకు ముందుగా దర్శనమిచ్చేది లివింగ్‌రూమ్‌. లివింగ్‌రూమ్‌ను తూర్పు,ఉత్తర దిశలలో ఏర్పాటు చేసుకోవడం వాస్తురీత్యా శుభకరం. ఆగ్నేయ దిక్కున లివింగ్‌రూమ్‌ నిర్మాణం జరపరాదు. అయితే దక్షిణం 
ఫేసింగ్‌ ఇళ్లకు మాత్రం.... ఆగ్నేయంలో లివింగ్‌రూమ్‌ ఏర్పాటు చేసుకోవచ్చు. 
కుటుంబ సభ్యులంతా కల్సి కూర్చుని మాట్లాడుకునేందుకు, టి.వి, వీక్షించేందుకు, రిలాక్స్‌ అయ్యేందుకు ఈ లివింగ్‌రూమ్‌ ప్రధానంగా 
ఉపయోగపడుతుంది. సహజంగా షాండిలియర్స్‌, క్రిస్టల్‌ లాంప్స్‌ ఏర్పాటు చేస్తారు. లివింగ్‌రూమ్‌లో లైటింగ్‌ ఎప్పుడూ ప్రకాశవంతంగా ఉండేలా చూసుకోవాలి. డిమ్‌ లైటింగ్‌ ఉండకూడదు. అందమైన సోపాలు, టీపాయ్‌లు, టి.వి వంటివి అమర్చుకుంటాం కనుక... లివింగ్‌రూమ్‌ ఎంత పెద్దదిగా ఉంటే అంత బాగుంటుంది. 
1. వాస్తురీత్యా లివింగ్‌రూమ్‌లో లేవెట్రీ కానీ, బాత్‌రూమ్‌ కానీ హలుకు నైబుతీ మూల... పడమర, దక్షిణ గోడలకు ఆనుకుని ఉండేలా ఏర్పాటు చేసుకోవాలి.తూర్పు,ఉత్తర గోడలకు అనుకుని ఉండేలా ఏర్పాటు చేసుకోవాలి. తూర్పు, ఉత్తర గోడలకు ఆనుకొని ఉండకుండా గృహ నిర్మాణ సమయంలోనే జాగ్రత్తలు వహించాలి. 
2. లివింగ్‌రూమ్‌ ఇంటకిి ఉత్తర దిక్కుగా ఉండడం ఎంతో శుభప్రదం. 
3. వాయువ్యంలో కూడా లివింగ్‌రూమ్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు. 
4. ఉత్తరంలో లివింగ్‌రూమ్‌ ఉంటే ఆ ఇల్లు సుఖశాంతులతో అలరారుతుంది. 
5. నైఋతి దిశలో మాస్టర్‌ బెడ్‌రూమ్‌కు అనువైన స్ధలం. అయితే ఈ దిశలో కూడా లివింగ్‌రూమ్‌ నిర్మాణం వాస్తురీత్యా ఆమోద యోగ్యమే. 
6. లివింగ్‌రూమ్‌లో ఫ్లోరింగ్‌ ఉత్తరం వైపుకు, వాలు కల్గి ఉండాలి. అంటే నీరు పోస్తే... అవి ఉత్తరం, తూర్పు దిశలలో పారాలి తప్ప, పడమరకు, దక్షిణానికి పారకూడదు. 
7. లివింగ్‌రూమ్‌ ఏరియాలో నిర్మితమైన సీలింగ్‌ కూడా... తూర్పు, ఉత్తరాలకు కాస్త దిగి ఉండాలి. 
8. లివింగ్‌రూమ్‌కు డోర్‌ తూర్పు లేదా ఉత్తర దిక్కున ఏర్పారచుకోవడం వాస్తు నియమాల రీత్యా అదృష్ట ప్రదం. 
9. లివింగ్‌రూమ్‌కు పడమర వైపున ఎంట్రన్స్‌ ఉంటే.... మేథావులు, రీస్చెర్స్‌కు ఎంతో మేలు. 
10. దక్షిణ, ఉత్తర ఈశాన్యం, దక్షిణ ఆగ్నేయం ఎంట్రర్స్‌లు లివింగ్‌రూమ్‌కు ఉంటే... మంచిదే కానీ జరిగే చాలా లేట్‌గా జరుగుతుంది. 
11. లివింగ్‌రూమ్‌లో బరువైన ఫర్నిచర్‌ ఎప్పుడూ... దక్షిణ గోడలను ఆనుకుని, పడమర గోడలకు ఆనుకోని ఉండేలా తగు జాగ్రత్త వహించాలి. బరువైన సోఫాలు, దివాన్‌ సెట్స్‌ లాంటివి ఉత్తరపు గోడకు ఆనుకొని ఉండకుడదు. ఈ జాగ్రత్త లివింగ్‌రూమ్‌లో తప్పక పాటించాలి. 
12. లివింగ్‌రూమ్‌లో ఇంటి యజమాని ఎప్పుడూ... తూర్పు లేదా ఉత్తర వైపు తిరిగి కూర్చోవాలి. అప్పుడే కుటుంబంలో ఆయన ఆథిపత్యంకు గౌరవం లభిస్తుంది.
13. టివిని ఎట్టి పరిస్ధితిలో ఈశాన్యం మూల ఉంచరాదు. టివి ఎప్పుడూ ఆగ్నేయ మూల ఉండడం వాస్తురీత్యా సమజసం. 
14 నైఋతిలో టివి ఉంచితే దాని ప్రభావం గృహంలో నివశించే వారి మీదే కాదు.... టివి మీద కూడా ఉంటుంది. తరుచు అది రిపెరిగ్‌కు వస్తుంది. 
15. లివింరూమ్‌లో ఫోన్‌ను తూర్పు, ఉత్తరం, ఆగ్నేయంలో ఉండేలా చూడండి. 
16. ఎయిర్‌కూలర్‌, ఎయిర్‌ కండీషనర్లను లివింగ్‌రూమ్‌లలో పడమర, వాయువ్యం, తూర్పు దిశలలో ఏర్పాటు చేయండి. పొరపాటు కూడా ఆగ్నేయంలో ఉంచరాదు. 
17 లివింగ్‌రూమ్‌ ఈశాన్యం మూల దేవుని చిత్రాపటాలు హేంగ్‌ చేయండి. 
18. లివింగ్‌రూమ్‌లో వార్‌, క్త్రెమ్‌, బాథాకరమైన, మరణించిన పెద్దల పటాలను ఉంచరాదు. 
19. లివింగ్‌రూమ్‌లో రెడ్‌ కలర్‌ను వాల్స్‌కు వేయకండి. వైట్‌, లైట్‌ ఎల్లో, బ్లూ, గ్రీన్‌ రంగులు లివింగ్‌రూమ్‌లో వాల్స్‌కు వేసుకోవచ్చు. 
20. లివింగ్‌రూమ్‌లో చతురస్త్రకారం, దీర్ఘచతురస్రాకార ఫర్నిచర్సనే వాడండి.రౌండ్‌, ఓవల్‌ ఇతరత్రా ఏ షేప్‌ ఫర్నీచర్స వాడకండి. 
21. డూప్లేక్స్‌ అయితే మెట్లు హలు నుండి ఏర్పటు చేసుకోవలసి వస్తే దక్షణ దిశలో , పడమరలో నైఋతి మూలా ఏర్పటు చేసుకోవచ్చు. 
22. ఈశన్యం మూలన ఉన్న విండోస్‌కు ఎప్పూడు లైటు వెయాట్‌ కర్టన్స్‌ మాత్రమే వాడలి.డోర్‌ కర్టన్స్‌ విషయంలో కూడా ఈ నియమం పాటించండి.ఇతరత్ర ఏ విండో అయినా డోర్‌ అయినా హెవీ కర్టన్స్‌ వాడవచ్చు. 
23. లివింగ్‌రూమ్‌లో ఈశన్యం మూలన ఖాళీగా ఉంచండి. 
24. లివింగ్‌రూమ్‌లో ఆర్టిఫిషీయల్‌ ఫ్లవర్స్‌, ఎండిపోయిన పూలు, సూదులుగా ఉండే ఆకులు గల చెట్లు, బోనసాయ్‌గా పిలువబడే మరుగుఙూ మొక్కలు ఉంచకూడాదు. వాస్తూరీత్యా ఇది శుభకరం కాదు. 
25. లివింగ్‌రూమ్‌ ఏరియాలో ..పడమర లేదా, దక్షణంకు దగ్గరగా షాండీలియర్‌ వ్రేలాడ తీయవచ్చు.షాండిలియర్‌ను లివింగ్‌రూమ్‌ మధ్యలో వ్రేలాడ తీయకూడదు. 
24. లివింగ్‌రూమ్‌ ఉత్తర దిశలో వాటర్‌ ఫౌంటెయిన్‌ ఏర్పటు చేసూకోవాలి. 
25. ఉత్తరం, తూర్పు, ఈశన్య దిశలో అక్వేరియం ఉంచడం ఎంతో శుభదాయకం.

బెడ్‌రూమ్‌- వాస్తు

బెడ్‌రూమ్‌- వాస్తు

1. బెడెరూమ్‌ విషయంలో వాస్తు చాలా నియమాలను తెలియఙేసింది.విధిగా ఈ నియమాలను బెడ్‌రూమ్‌ నిర్మాణ సమాయంలో పాటించారంటే...కుటుంబ వాతవరణం దంపతుల నడుమ ఆప్యాయతానురాగాలు బాగుంటాయి.బెడ్‌రూమ్‌లో నిర్మాణం విషయలలోనే కాకుండా బెడ్‌రూమ్‌ లోపల అరేంఙెమ్‌ంట్స్‌ విషయంలో కూడా ఎన్నో ఙాగ్రతలు తీసుకోవలి. 
2. ఇంటిలో ప్రధన బెడ్‌రూమ్‌ నైఋతీమూల ఏర్పటు చేసుకోవలి. 
3. బెడ్‌రూమ్‌లో బుక్‌ షెల్ఫలు, డ్రసింగ్‌ టేబుల్స్‌...బెడ్‌రూమ్‌లో పడమర వైపు లేదనైఋతి దిశలో అమర్చుకోవాలి. 
4. చతురస్ర, దీర్ఘచతురస్రాకార ఆకారంలోనే బెడ్‌రూమ్‌ల నిర్మాణం ఙరగాలి.అంతే తప్ప ఆడ్‌షేస్స్‌లో బెడ్‌రూమ్స్‌ నిర్మాణం ఙరకూడాదు. 
5. బెడ్‌రూమ్‌ డోర్‌ మినిమం 90 డిగ్రీలు అయినా తెరచుకునేలా ఏర్పాటు చుసుకోవాలి. 
6. బెడ్‌రూమ్‌లో మిర్రర్స్‌ లేకూండా ఉండడమే సముచితం.ఒకవేళ ఉన్నా మీ బెడ్‌కు ఎదురుగా గోడకు అమర్చకూడదు. 
7. బెడ్‌ క్రింద.. బెడ్‌కు ఉంటున్న పెద్ద షెల్ఫ్‌లో చెత్తా చెదారం, పాత వస్తూవులూ, పనికిరాని వస్తూవులు. పనికిరాని దూస్తూలను ఉంచకండి.అలానే పాత పనికిరాని సామన్లు అంత బెడ్‌రూమ్‌లో బెడ్‌ దిగువకు నెట్టడం చేస్తూంటారు.ఇదీ వాస్తూరీత్యా మంచిది కాదు.మీకు సరయిన నీద్ర రాకూండ చేస్తూంది. 
8. బెడ్‌రూమ్‌లో అక్వేరియాంను ఉంచకూడదు. 
9. బెడ్‌రూమ్‌లో నిద్ర లేవగానే చూడలానో,నమస్కరించుకోవలనే దేవత విగ్రహలను ఉంచుతుంటారు.ఇది ఏ మాత్రం వాస్తూనమ్మకం కాదు. 
10. ఇంట్లో నైఋతి దిక్కున ఏర్పటు చేసీన మాస్టర్‌ బెడ్‌రూమ్‌ను ఆ ఇంటి యఙమానులే వాడుకోవాలి తప్ప.. పిల్లలు, గెస్ట్‌లు, ఇతరత్రా మరెవరూ ఉపయోగించరాదు. 
11. మీరు నిద్రించే బెడ్‌పై భాగాన భీమ్‌లు ఉంచకూడదు.
12. బెడ్‌రూమ్‌లో బెడ్‌ ఎపూడు దక్షణం, పడమర గోడలకు ఆనుకునీ గానీ, లేదా పడమర గోడలకు అనూకోని గాని, లేదా వాటికి చేరువగా గాని ఆమర్చుకోవాలి. 
13. అలాగే అల్‌మైరాలు, ఇనుప బీరవలు... బెడ్‌రూమ్‌లో దక్షణం లేదా పడమర గోడకు ఆనుకుని ఉండేలా అమర్చుకోవాలి. 
14. బెడ్‌రూమ్‌లో ఎలాంటి ఎలక్ట్రనిక్‌ పరికరలు ఉంచరాదు.ఫోన్‌, టీ,విలను కూడా బెడ్‌రూమ్‌లో ఉంచకూడదు. 
15. బెడ్‌రూమ్‌ డోర్‌కు ఎదురుగా బెడ్‌రూమ్‌లో బెడ్‌ను ఉంచరాదు. 
16. డబల్‌ బెడ్‌ అయినప్పటికీ.. దానిపై సింగిల్‌ మేట్రెస్‌ మాత్రమే ఉండాలి. రెండు పరుపులు పెట్టి పరిస్థితిలోనూ ఉపయోగించకండి.

కిచెన్‌ - వాస్తు

కిచెన్‌ - వాస్తు

కిచెన్‌ నిర్మాణ విషయంలో విధిగా వాస్త నియమాలను పాటించి తీరాలి. కిచెన్‌లో ఏర్పాట్లు ఎలా ఉండాలి.. ఈ విషయంలో వాస్తు ఏమి చెబుతుందో తెల్సుకుందాం. 
1. విధిగా కిచెన్‌ను అగ్నేయ ములనే ఏర్పాటు చేసుకోవాలి. వీలుకాని పక్షంలో వాయ్యుంలో మాత్రమే కిచెన్‌ను ఏర్పాటు చేసుకోవాలి. 
2. ఈశాన్యం, నార్త్‌ మధ్యలో, వెస్ట్‌ మధ్యలో, నైఋతిలో, దక్షిణం మధ్యలో, ఇంటికి నడుమ... ఎట్టి పరిస్ధితిలోనూ కిచెన్‌ నిర్మాణినికి అనువైనవి కావు. 
3. కిచెన్‌లో అమర్చుకునే కుకింగ్‌ ప్లాట్‌ఫాం ఎట్టి పరిస్ధిలో తూర్పు గోడను లేదా ఉత్తరపు గోడను తాకుతు ఉండరాదు. ఈ నియమేల్లంఘన ఎల్లెడలా జరుగుతూనే ఉంది. అగ్యేయంలో వంటగది అంటే... ఖచ్చితంగా కిచెన్‌ ప్లాట్‌ఫాం... ఇంటి తూర్పు గోడకు తాకుతూ ఉంటుంది. కనీసం అంగుళం అయినా ఈ ప్లాట్‌ఫాంకు ఇంటి తూర్పు గోడకు మధ్య ఖాళీ వుంచండి. ఇదే నియమాన్యి ఉత్తరపు గోడ విషయంలో కూడా వాయువ్యంలో కిచెన్‌ నిర్మించుకునే సమయంలో విధిగా పాటించాలి. 
4. వంట చేసే సమయంలో తూర్పు దిక్కును చూస్తూ ఉండేలా కిచెన్‌ ప్లాట్‌ఫామ్‌ ఏర్పాటు చేసుకోవాలి. 
. స్టవ్‌ అతి చేరువగా సింక్‌, టాప్స్‌ ఉండకూడదు. 
6. కిచెన్‌లో ఈశన్య మూల సింక్‌ ఏర్పటు చేసుకోవలి. 
7. డిష్‌ వాషర్‌ ఉన్నట్లాయితే దీన్ని కిచెన్‌లో నైఋతి మూలన ఉంచలి. 
8. త్రాగునీరు కిచెన్‌లో ఈశన్య దిశలో ఉంచలి. మైక్రో ఓవెన్‌,ఫ్రీఙె వంటి అప్లయెన్సెస్‌...కిచెన్‌లో నైఋతి మూల ఉండడం మంచిది. 
9. కిచెన్‌లో క్రస్‌ వెంటిలేషన్‌ విషయంలో వాస్తూ నియమాలు పాటించాలి.తూర్పు గోడకు పెద్ద సైజ్‌ కిటికిలు..దక్షణ గోడకు చిన్న సైజ్‌ కిటికిలు అమర్చుకోవలి. 
10. కిచెన్‌కు అనుకోని, కిచెన్‌ క్రింద భాగంలో ఎట్టి పరిస్ధీతులో నిర్మాణం చేయకూడదు. 
11. కిచెన్‌లో సరుకులు ఉంచుకునేందుకు వినియోగించే షెల్ఫలు అల్‌మరలు...దక్షణ , పడమర గోడలకు అమర్చుకోవాలి. 
12. అపార్టుమెంట్స్‌లో ప్రత్యేక పూఙగది నిర్మాణనికి స్ధలం చాలక పూజాగది కిచెన్‌లోనే ఓ మూలన ఏర్పాటు చేయడం ప్రస్తుతం జరుగుతుంది.పలు అపార్టుమెంట్సలో దీన్ని చూస్తూన్నాం.వాస్తుశాస్త్రరీత్య ఇది శాస్త్ర విరుద్ధమైన విషయం. 
13. కిచెన్‌లో డైనింగ్‌ టేబుల్‌ అమర్చుకోవడం శాస్త్ర విరుద్ధ విషయమే. కిచెన్‌ దోరకు ఎదురుగా గ్యాస్‌స్టవ్‌ ఉంచకూడదు.

ఓవర్‌ హెడ్‌ ట్యాంక్‌

ఓవర్‌ హెడ్‌ ట్యాంక్‌.....

గృహ నిర్మాణ సమయంలో మనం విధిగా పాటించవలసిన వాస్తు సూత్రాలు... ఒక్కొక్కటిగా చెప్పుకుందాం. మెదట ఓవర్‌హెడ్‌ ట్యాంక్‌ నిర్మాణం ఎలా చేయాలో తెల్సుకుందాం. 
1. ఓవర్‌హెడ్‌ ట్యాంక్‌.... పడమర వైపు లేదా, నైఋతి మూలన ఉండేలా చూసుకోవాలి. 
2. ఓవర్‌హెడ్‌ ట్యాంక్‌.... పై స్లాబ్‌కు రెండడుగుల ఎత్తులో నిర్మించుకోవాలి. పై స్లాబ్‌ను ఆనుకుని ఉండకూడదు. 
3. ఈశాన్యంలో వాటర్‌ ఉండటం వాస్తురీత్యా సమంజసమే అయినా.. ఓవర్‌హెడ్‌ ట్యాంక్‌ వంటి బరువుల్ని ఈశాన్యం వైపు ఉంచకూడదు. 
4. అగేయ దిక్కులో ఓవర్‌హెడ్‌ ట్యాంక్‌ను ఎట్టి పరిస్ధితిలో నిర్మించ తగదు. చాలా దుష్ప్రభావాలకు కారణం అవుతుంది. 
5. పడమరదిక్కున ఓవర్‌హెడ్‌ ట్యాంక్‌ను నిర్మించుకోవడం వాస్తు సమ్మతమే. 
6. వాయువ్య దిశలో ఓవర్‌హెడ్‌ ట్యాంక్‌ నిర్మాణం చేయకూడదు. 
7. బిల్డింగ్‌ పైన మధ్య భాగంలో ఓవర్‌హెడ్‌ ట్యాంక్‌ ఎట్టి పరిస్ధితుల్లో నిర్మించకూడదు.

ఇంటి చుట్టూ ఖాళీ ఎలా?

ఇంటి చుట్టూ ఖాళీ ఎలా?

స్ధలాల ఖరీదులు ఆకాశాన్నంటుతున్న ఈ రోజుల్లో ఇంటి చుట్టూ ఖాళీ వదలడానికి ఎక్కువ శాతం ఎవరూ అంగీకరించడం లేదు. స్ధలంలో వీలయినంత ఎక్కువగా గృహ నిర్మాణం కావించి, ఇంటిలోని అన్ని గదులూ పెద్దవిగా ఉండేలా ఆలోచిస్తురే తప్ప, ఇంటి చుట్టూ ఖాళీ స్ధలం వదలకపోతే గాలీ వెలుతురు కరువుతాయిని, ఆ కారణంగా ఆ ఇంట్లి నివశించే వారికి అరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందన్న దిశలో ఎవరూ అలోచించట్లేదు. అపార్టుమెంటు అయినా, గృహం అయినా నాలుగు దిక్కులా ఖాళీ అన్నది ఉత్తమం. అయితే అపార్టుమెంట్స్‌ ఇలా నిర్మాంచడం చాలా కష్టం. కనీసం వీలయినంత మేరకు అపార్టుమెంటులోకి గాలి, వెలుతురు వచ్చేలా నిర్మాణం చేయడం వాస్తు రీత్యా ఉత్తమం. 
దక్షిణం కన్నా ఉత్తరం రాస్త ఎక్కువ ఉంటే చాలు. పడమర కన్నా తూర్పు కాస్త అధికం ఉంటే చాలు... శాస్త్రానికేగా... అనవసరంగా స్ధలం వేస్టు చేయకండి అనే గృహ యజమనులు ఈ మధ్య పెరిగిపోతున్నారు. ఇంటి చుట్టూ ఖాళీ వదిలే సమయంలో వాస్తుశాస్త్ర నియమాలను విధిగా పాటించండి. 
ఆవరణంలో పడమర కన్నా కనీసం మూడురెట్లు ఆపైన అధికంగా తూర్పు దిశన ఖాళీ వదలి తీరాలి. ఇలా ఖాళీ వదిలి నిర్మితయమైన గృహం... సుఖశాంతుల నిలయం అవుతుంది. అలానే దక్షిణం వైపు కన్నా మూడు రెట్లు అంత కన్నా ఎక్కువ ఖాళీని ఉత్తర దిక్కులో వదలడం వలన ఆ ఇంట లక్ష్మీదేవి స్ధిరనివాసం ఏర్పరచుకుటుంది. స్ధిరాస్తుల రూపంలోనో, చరాస్తుల రూపంలోనో డబ్బుకు కొదవ లేకుండా ఉంటుంది. భవిష్యత్‌ విషయంలో దిగులు ఉండని అర్ధిక పరిస్ధితిలో ఆ కుటుంబం అలరారుతుంది.

ఎటువైపు స్థలం కల్పుకోవచ్చు

ఎటువైపు స్థలం కల్పుకోవచ్చు?

ఆస్తులు కొనుక్కోవాలనుకున్నప్పుడు... ఉంటున్న చోటుకు దూరంగా పోయి కొనుక్కునే కన్నా.. ఆనుకుని ఉన్న ఇళ్ళు. స్థలాలు అమ్మకానికి వస్తే కొనేసుకుని తమ ఆస్తిలో కల్పుకుందా అనుకుంటారు. అలా కల్పుకునే సమయంలో ప్రధానంగా లే అవుట్లలో ఫ్లాట్లు కొన్నవారు ఎక్కువగా ఈ సమస్యలకు లోనవుతుంటారు. ఇలాంటివారు వాస్తు నియమ విరుద్ధంగా స్థలాలను కొని తమ స్థలంలో కల్పుకోకూడదు. ఆ నియమాలు ఏమిటో తెల్సుకుందాం. మీ స్థలానికి... మీ ఇంటికి తూర్పున, ఉత్తరాన ఉన్న స్థలాన్ని ఇంటిని ఆలోచించకుండా కొని మీ స్థలంతో, లేదా మీ ఇంటితో నిశ్చింతంగా కలుపుకోమంటుంది వాస్తు. ఇలా మీ ఆస్తిని ఉత్తరం వైపుకు తూర్పు వైపుకు పెంచుకోవడం వాస్తురీత్యా ఎంతో శుభకరం. ఆరోగ్యం, ఆయుష్షు, ధనం ఇబ్బడి ముబ్బడిగా పెరిగి నట్టింట 'సిరి' నాట్యం చేస్తుంది. జీవితం మూడు పిందెలు... మూడొందల కాయలు అన్నట్లు ఉంటుంది. 
ఇక దక్షిణక, పడమర దిశలో ఉన్న స్థలాలను కల్పుకోవడం లేదా ఇండ్లను కొనడం కానీ ఎట్టి పరిస్థితుల్లో చేయకండి. దక్షిణ దిశలో స్థలం అయితే ఉచితంగా వచ్చినా కల్పుకోరాదన్నది వాస్తు పండితులు చేస్తున్న హెచ్చరిక. 
అలానే ఆగ్నేయం మూలనున్న స్థలం, నైఋతి మూలనున్న స్థలం, వాయువ్యమూలనున్న స్థలం ఊడా ఆనుకుని ఉన్నాయి కదాని ఎట్టి పరిస్థితుల్లో కాని కల్పుకోకుడదు. కల్పుకున్నారంటే జీవితంలో అన్నీ అవాంతరాలే. ఎన్నో ఎదురు దెబ్బలు.. ప్రధానంగా నైఋతీ మూలనున్న స్థలం ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరకే వచ్చినా అంగుళం కూడా కల్పుకోకుడదు.

ఉచ్చస్థానాలు - నీచస్థానాలు

ఉచ్చస్థానాలు - నీచస్థానాలు

ఖాళీస్థలం, గృహం రెండింటికీ ఉచ్ఛనీచ స్థానాలు ఉంటాయి. గేట్లు, ద్వారాలు కూడా అటు ఇంటికి, ఇటు కాంపౌండ్‌ వాల్స్‌కు ఉచ్ఛస్థానాలలో ఉండాలి. అలా ఉంటే నడక ఉచ్ఛస్థానంలో ఉంటుంది. ఇలా ఉచ్ఛస్థానంలో నడక సాగించడం వలన ఆ గృహంలో నివశించే వారికి ఎంతో మేలు జరుగుతుంది. నీచస్థానంలో ద్వారాలు, గేట్లు, నడక ఉండడం ఏ మాత్రం వాస్తు రీత్యా మంచిది కాదు. ఈ ఇంట నివశించే వారి జీవితాలలో మంచికన్నా కీడు అధికంగా ఉంటుంది. 
కనుక ముందుగా గృహంలో, స్థలంలో ఉచ్ఛ నీచాలు ఏమిటన్నది వివరంగా తెల్సుకుందాం. కాంపౌండ్‌వాల్‌ను కానీ, ఇంటి గోడల్ని కానీ మూడు భాగాలుగా చేయండి. ఈ వివరాలు మరింత వివరంగా తెల్సుకుందాం. 
తూర్పు గోడను తీసుకుందాం. మూడు భాగాలు చేద్దాం. ఉత్తరానికి దగ్గరగా తూర్పు ఈశాన్యాన్ని తాకుతూ ఉండే భాగం ఉచ్ఛస్థానం. అలానే దక్షిణానికి దగ్గరగా తూర్పు ఆగ్నేయాన్ని తాకుతూ ఉండే స్థానం నీచస్థానం. 
ఉత్తరపు గోడ విషయానికొస్తే... దీన్ని మూడు భాగాలుగా చేయండి. ఉత్తర ఈశాన్యాన్ని తాకుతూ తూర్పు దిశగా ఉండే భాగం ఉచ్ఛస్థానం. ఉత్తర వాయువ్యాన్ని తాకుతూ పడమర దిక్కున ఉండే స్థానం నీచస్థానం. 
పడమర గోడ విషయానికొస్తే... మూడు భాగాలతో పడమర వాయువ్యాన్ని తాకుతూ... ఉత్తరంలో ఉండే భాగం ఉచ్ఛస్థానం. అలానే దక్షిణాన్ని తాకుతూ పడమర నైఋతిలో ఉండే భాగం నీచస్థానం. 
దక్షిణం గోడను కూడా ఇలానే మూడు భాగాలు చేయండి. ఈ గోడలో... పడమర దిక్కుగా దక్షిణ నైఋతిని తాకుతూ ఉండే భాగం నీచస్థానం. అలానే తూర్పు దిశగా దక్షిణ ఆగ్నేయాన్ని తాకే భాగం ఉచ్ఛస్థానం. ఈ కారణంగానే.. కాంపౌండ్‌వాల్‌ గేట్లయినా.. ఇంటి గుమ్మాలయినా ఉచ్ఛస్థానాలలో ఉండేలా జాగ్రత్త వహించమంటుంది వాస్తుశాస్త్రం

ఈ బ్లాగును సెర్చ్ చేయండి



Related Posts Plugin for WordPress, Blogger...