శ్రీ మేధా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం

మీరు జన్మించిన తేది, సమయం, ప్రదేశం ఈ మూడు సమాచారములు మాకు తెలియచేసినచో మీ వ్రుత్తి,వ్యాపార,ఆరోగ్య,ఆర్ధిక పరిస్తితులు, దాంపత్యం, విద్య, ఉద్యోగ, వివాహ, కుటుంబవ్యవహారాలు, సంతానం, రాజకీయ వ్యవహారాలు,ప్రేమ వ్యవహారములు,కుజ దోషం, కాలసర్ప దోషం మరియు వివాహ, ఉపనయన, గృహప్రవేస, జప, హోమ, వ్రత, అన్నప్రసన, నామకరణం లకు ముహూర్తములు పెట్టబడును. P.V.RADHAKRISHNA CELL :+91 9966455872, Mail us : parakrijaya@gmail.com

9, ఫిబ్రవరి 2016, మంగళవారం

దినఫలితం


09-Feb-2016
ముహూర్తం: సూర్యోదయం: 6.49 గంటలకు
సూర్యాస్తమయం: 6.11 గంటలకు
శ్రీమన్మథనామ సంవత్సరం-మాఘమాసం
ఉత్తరాయణం-శిశిర రుతువు
శుక్లపక్షం
పాడ్యమి సాయంత్రం 5.34 వరకు
నక్షత్రం: ధనిష్ఠ మధ్యాహ్నం 3.13 వరకు
వర్జ్యం: రాత్రి 9.49 నుంచి 11.17 వరకు
దుర్ముహూర్తం: ఉదయం 9.05 నుంచి 9.51 వరకు
తిరిగి రాత్రి 11.14 నుంచి 12.04 వరకు
అమృతఘడియలు: ఉదయం 5.32 నుంచి 7.04 వరకు
రాహుకాలం: మధ్యాహ్నం 3.00 నుంచి 4.30 వరకు.

మేషం

స్త్రీలకు తల, మెడ, నడుము, నరాలకు సంబంధించిన చికాకులు ఎదుర్కొనక తప్పదు. రావలసిన ధనం సకాలంలో అందుట వలన పొదుపు దిశగా మీ ఆలోచనలుంటాయి. వాతావరణంలో మార్పు వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. వృత్తి వ్యాపారులకు శ్రమాధిక్యత మినహా ఆశించినంత పురోభివృద్ధి ఉండదు.

వృషభం

రాజకీయాల్లో వారి కార్యక్రమాలు వాయిదాపడుట వల్ల ఆందోళనకు గురవుతారు. మీ సరదాలు కోరికలు వాయిదావేసుకోవాల్సివస్తుంది భాగస్వామికుల మధ్య కొత్త విషయాలు చర్చకు వస్తాయి. ప్రముఖుల కలయిక వల్ల ఏమంత ప్రయోజనం ఉండదు. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన కలిగిస్తుంది.

మిథునం

ఉపాధ్యాయులకు విద్యార్థుల పట్ల ఓర్పు, నేర్పు వ్యవహరించవలసివస్తుంది. స్త్రీలకు వాహనం నడుపుతున్నప్పుడు ఏకాగ్రత అవసరం. సోదరీ సోదరుల మధ్య అవగాహన కుదురుతుంది. బంధువుల కోసం ధనం విరివిగా వ్యయం చేయవలసివస్తుంది. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు.

కర్కాటకం

విద్యార్ధులకు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. కోర్టు వ్యవహారాలు, మీ పాత సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి. స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి అందుకు తగిన ప్రోత్సహం లభిస్తాయి. బంధుమిత్రుల రాకపోకలు కుటుంబీకులతో ఉల్లాసంగా గడుస్తుంది.

సింహం

మొక్కుబడులు తీర్చుకోవాలనే మీ సంకల్పం నెరవేరుతుంది. రిప్రజెంటేటివ్‌లు, కొబ్బరి పండ్లు, పూలు కూరగాయలు, చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. బంధువుల నుండి ఒత్తిడి, మొహమాటాలు ఎదుర్కొంటారు. ఎదుటివారిని అతిగా విశ్వసించటం మంచిది కాదని గమనించండి.

కన్య

విందులు, దైవ పుణ్యకార్యాల్లో పాల్గొంటారు. ఉపాధ్యాయులకు సదవకాశాలు లభిస్తాయి. మీ కళత్ర ఆరోగ్యంలో అధికమైన జాగ్రత్త అవసరం. మీ సామర్థ్యానికి ఆశించినంత ప్రతిఫలం లభిస్తుంది. ఉద్యోగస్తులు విలువైన కానుకలు అందించి అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. స్త్రీలు దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

తుల

కొత్తగా చేపట్టిన వ్యాపారాలలో పోటీతత్వం ఆందోళన కలిగిస్తుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూల్లో ఏకాగ్రత ముఖ్యం. హోటల్, కేటరింగ్ రంగాలవారికి లాభదాయకంగా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో ఎదుటివారిని సలహా అడగడం మంచిదని గమనించండి. మీ జీవిత భాగస్వామి సలహా పాటించి లబ్ధి పొందుతారు.

వృశ్చికం

విద్యార్థులు ఉపాధ్యాయులతో ఏకీభవించలేకపోతారు. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. బంధు మిత్రులతో సఖ్యత నెలకొంటుంది. సోదరీ, సోదరులతో ఏకీభవించలేకపోతారు. పెద్దలను ప్రముఖులను కలుసుకుని వారికి బహుమతులు అందజేస్తారు. బ్యాంకు పనుల్లో ఏకాగ్రత వహించండి.

ధనస్సు

ప్రైవేటు సంస్థలలోని వారికి విదేశాలు వెళ్ళే అవకాశం లభిస్తుంది. స్తీలు విలువైన వస్తువులు చేజార్చుకునే ఆస్కారం ఉంది. ప్రముఖుల సహకారంతో మీ సమస్య పరిష్కారమవుతాయి. ఇళ్ల స్థలాలు పొలాల అమ్మకంలో పునరాలోచన మంచిది. ఏజెంట్లకు, బ్రోకర్లకు శ్రమాధిక్యత మినహా ఆర్థిక సంతృప్తిఉండదు.

మకరం

నూతన ప్రదేశ సందర్శనలు ఉల్లాసాన్నిస్తాయి. సాహసకృత్యాలకు, వాదోపవాదాలకు ఇది సమయం కాదని గమనించండి. ఉద్యోగస్తులు సమర్థంగా పనిచేసి అధికారులను మెప్పిస్తారు. వాతావరణంలో మార్పు రైతులకు ఆందోళన కలిగిస్తుంది. వ్యవసాయ, తోటల రంగాల వారికి వాతావరణం అనుకూలిస్తుంది.

కుంభం

భాగస్వాముల మధ్య కొత్త కొత్త విషయాలు చర్చకు వస్తాయి. చిన్నచూపు చూసిన వారే మీ ఔన్నత్యాన్ని గుర్తిస్తారు. రాజకీయనాయకులు సభలు, సమావేశాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. మీ సంతానం విద్య, ఆరోగ్య విషయాల పట్ల శ్రద్ధ కనబరుస్తారు. వృత్తి, వ్యాపార రంగాల వారికి సదవకాశాలు లభిస్తాయి.

మీనం

వ్యాపారాభివృద్ధికి అహర్ని‌శలు శ్రమిస్తారు. ఖర్చులు, చెల్లింపులలో ఏకాగ్రత వహించండి. అర్థాంతరంగా నిలిపి వేసిన పునఃప్రారంభమవుతాయి. ప్లీడర్లకు తమ క్లయింట్‌లు తీరు ఇబ్బందులకు గురిచేస్తుంది. వీలైనంత వరకు మీ పనులు మీరే చూసుకోవటం ఉత్తమం. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు.

ఈ బ్లాగును సెర్చ్ చేయండి



Related Posts Plugin for WordPress, Blogger...